Thursday, July 9, 2020

ప్రారబ్ద కర్మ

ప్రారబ్ద కర్మ

మానవుడు మాధవుడి మరొక రూపం అని అంటారు మహనీయులు. అందుకే మనసులో మనషి ఏదైనా గట్టిగా కోరుకుంటే అది నెరవేరుతుంది అంటా!

అది నిజమో! కాదో? జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు మనం గమనిద్దాం.

రావణ సంహారం జరిగిన తర్వాత సీతా సమేతంగా అయోధ్య చేరాడు శ్రీరాముడు.
ఒకరోజు సీతాదేవి శ్రీరామచంద్రమూర్తి తో ఇలా అన్నదట స్వామి నాకు ఆ అడవులను, వనల లోని ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూడాలని మునీశ్వరుల ను
సేవించాలని, మనసులో ఏంతో ఉబలాటం గా ఉంది స్వామి అన్నదట! ఆ మాట వినగానే శ్రీరామచంద్రమూర్తి ఉల్కి పడ్డాడట! దేవి నిన్న మొన్నటి వరకు అడవుల్లో పడినటువంటి కష్టాలు సరిపోవు మళ్లీ అడవులకు వెళ్లి అంటున్నావ్ అని ఒకింత బాధ పడ్డాడట!

అనుకున్నట్లే చాకలి వాడు నింద వేయడం.శ్రీరామచంద్రమూర్తి చాకలి వాడు అన్నా మాటకు బాధపడి సీతాదేవి ని అడువుల లో వదలి రమన్ని లక్ష్మణుడు ని ఆదేశించడం జరిగింది. సీతాదేవి అడవుల్లో వాల్మీకి ఆశ్రమంలో తన జీవితాన్ని కొనసాగించ వలసి వచ్చింది.

అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకుని
వస్తూ ఉండగా, ద్రౌపది విరాది వీరులైన పాండవులను చూసి ఈ ఐదుగురు నాకు భర్తలు అయితే ఎంత బాగుంటుందో
అనుకుందట!

ద్రౌపది ని తీసుకొని ఇంటికి వచ్చిన పాండవులు గుమ్మం బయట నుంచి తల్లి అయిన కుంతిదేవి తో, అమ్మ మేము ఒక మధురమైన ఫలాన్ని తీసుకుని వచ్చాము ఏం చేయమంటారు అని అడగగా అందరూ సమానంగా పంచుకోండి అని సెలవిచ్చింది అటా!

వీరాధివీరులు తన భర్త లు అయ్యారని మురిసి పోయిందట! ప్రపంచం వారిని వీరాధివీరులు గా గుర్తించడానికి కురుక్షేత్ర మహా సంగ్రామం జరగవలసి వచ్చింది.

ఒకరోజు సత్యహరిశ్చంద్రుడు రాజ్యసభలో ఉండి తన మంత్రులతో ఇలా అన్నాడట! సత్యం పలకడం కంటే ఈ రాజ్య పాలన చేయడమే బహు కష్టం గా ఉంది. ఏవరు ఏవరో వస్తారు ఏమేమో కావలంటారు. దీనికంటే
కాటికాపరి పాలనే మంచిది అని అన్నాడట!

ఆ తరువాత విశ్వామిత్రుడు తాను యజ్ఞం చేస్తున్నానని దానికి థన సహాయం కావాలని అడగగా, ఎంత కావాలని హరిశ్చంద్రుడు అడిగాడు.

ఏనుగుపైన ఒక మనషి నిలబడి నాణ్యము ఎగరేస్తే ఎంత ఎత్తుకు వెళుతుందో అంత అవసరమా అని చెప్పడం జరిగింది.

విశ్వామిత్రుడు యజ్ఞానికి ధన సమకూర్చడం కొరకు తన రాజ్యాన్ని భార్యా బిడ్డలను పోగొట్టుకోవడం మేకాక చివరికి తను కాశీలో కాటికాపరిగా పని చేయవలసి వచ్చింది.

ఒక తప్ప సంపన్నుడు శివుని కొరకు తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా, తాను మనసులో ఏది అనుకుంటే అది నెరవేరాలని వరం కోరుకున్నాడు. అతని తో పరమేశ్వరుడు మరొక్కసారి ఆలోచించి ఇది సరైన వరం కాదు, దిని వల్లన చాలా అనర్థాలు సంభవిస్తాయి. అని నచ్చ చెప్పగా కుదరదు నేను అడిగిన వరమే నాకు కావలెను అని గట్టిగా వాదించడం జరిగినది, సరే నీ మాట నేను ఎందుకు కాదు అనాలి అలాగే కానిమ్ము, అని వరమం ఇవ్వడం జరిగినది.

ఆ తరువాత అతడు తనకు ఒక అందమైన భవంతి కావాలని,సువర్ణ నిధులు కావలెనని, తను అత్యంత గొప్ప ధనవంతుడు కావాలని ఇలా ఏవేవో కోరుకున్నాడు కోరికలన్నీ కూడా నెరవేరాయి తను జీవతం అదృష్టవశాత్తు
హాయిగా సాగిపోతున్నాది.

అయితే అతనికి ఒక అనుమానం కలిగింది తన ఆయువు ఎంత వరకు ఉన్నది తనకు తెలియదు. ఒకవేళ పొరపాటున ఏదైనా బ్రహ్మరాక్షసి ఇటువైపు వచ్చి నన్ను తినేస్తే నో అని అనుకున్నాడు అంతే తడువు
పెద్ద బ్రహ్మరాక్షసి వచ్చి తనను తన వారందరినీ నమిలి మింగేస్తుంది.

ఈ కథలో నీతి ఏమిటంటే భగవంతుడు ఎవరికి ఏమివ్వాలో అది సమకూర్చి
ఉంటాడు కానీ వారి ప్రారబ్ద కర్మ దానితో సంతృప్తి పడనీయక,
ఇంకా ఏదో కావాలని మయమెహం వారకి ఏదో
ఆశ చూపి దానిని సాధించడం
కొరకు ప్రయత్నం చేయమని ప్రేరేపించి పాప కూపంలోకి మానవులను నెట్టివేస్తుంది.

ఉన్నదానితో సంతృప్తి చెందితే ఏవరి కి ఎటువంటి సమస్యలు రావు కానీ అలా ఏ మానవుడు ఎప్పటికీ చేయడు, చేయలేడు, అదే ప్రారబ్ధకర్మ. ఏంత వారైన అనుభవించి తీరవలసిందే, ఆదిదేవుడైన, మానవుడైనా, ఈ భూమి పైకి వస్తే మాయ మోహం నుండి ఎవరైనా తప్పించుకోలేరు.

Source - Whatsapp message

No comments:

Post a Comment