Wednesday, October 28, 2020

ఆత్మ విచారం

💦🌺🌻🌸💦🌺🌻🌸💦🌺

🌹 ఆత్మ విచారం 🌹

👌 పుణ్యపురుషులు ఇతరుల కోసం జీవిస్తారు. జ్ఞానీ ఇతరుల కోసం తనను తానే అర్పించుకుంటాడు. ఇతరులకు ఉపకారం చేయడం వల్లే మనకుమేలుకలుగుతుంది. ఇంతకన్నా వేరే మార్గం లేదు.

సమాజంలో చాలా మంది.. లోకం ఏమనుకుంటుందో.... ఆ నలుగురు ఏమనుకుంటారో..అనే బెంగతోనే, అలోచించి అనేకమంది తమ కార్యాలను నిర్దేశించుకుంటున్నారు.తప్ప సత్యానికి, వాస్తవికతకు, స్వకీయ అభిరుచికి, ఆసక్తికి, సామర్థ్యలను అంచనా వేసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు.

ఈ సమాజ భావన నేడు మన స్వేచ్ఛను పూర్తిగా హరించడమే కాకుండా ప్రతి దాంట్లో కృత్రిమ పోటీనీ పెంచి జీవితాన్ని పెను ఒత్తిడికి గురి చేస్తున్నది.

ఏ పని చేయడానికైనా ముందు నేను ఈ పనిచేస్తే సమాజం ఎలా భావిస్తుంది...? సమాజంలో నా గౌరవం ఇనుమడిస్తుందా... ? అని అలోచించి ముందుకెళ్లడం నైజాంమైంది.

మిత్రమా...ముందు నీవు ఏమనుకోకుండా చూసుకో... నీవు చేసే పని ధర్మ బద్దమైనదా కదా అనేది నీవు ముందు విశ్లేసుకో...అది ఎంత చిన్న పనైనా ధైర్యంగా నిర్వర్తించు. ఈ.. సమాజం ఎలా ఉన్నా, నివ్ ఎలా బ్రతిన. నీలోని తప్పులను వెతుకుతూనే ఉంటుంది. అందికే.... అందుకే...సమాజం కోసం కాకుండా నీ కోసం బ్రతుకు..

ఈ రోజు నిన్ను తప్పని హేళన చేసిన ఈ.. సమాజమే.. నిన్ను నెత్తిన బెట్టుకొని ఉరేగిస్తుంది. ధర్మ బద్దంగా, న్యాయంగా, నీకు, నీ మనస్సుకు, బుద్ధికి మంచి అనిపించే ఏ పనైనా న్యూనతాభావజాలాన్ని వదిలి కార్యరంగం లో.. దూసుకోపో... జీవితం నీది... నీ జీవితం నీ వెళ్లే దారిని బట్టే...నిన్ను శాసిస్తుంది గుర్తుంచుకో.

మనం గమనించడం లేదు కానీ, ఇలాంటి పరిణామం వలన మనలోని సృజనాత్మకత కూడా పూర్తిగా మరుగున పడే ప్రమాదం ఉంటుంది. మనం ఎంత ఎక్కువ విలక్షణంగా ఆలోచిస్తే అంత వైవిధ్యభరిత కార్యాలను సాధిస్తాం.

ప్రతిదానికి సమాజం అనుకుంటూ భయపడితే...చివరకు మిగిలేది దుఃఖమే. అసలు నిజానికి మనం భయపడుతున్న సమాజం ఎక్కడున్నది....?

ఈ సమాజ భావన కేవలం మన ఊహ మాత్రమే. సమాజం అంటే వ్యక్తుల సమూహం. వ్యక్తి వ్యక్తి కలిస్తేనే సమాజం. వ్యక్తి ఆలోచనే సమాజపు ఆలోచన కదా ! అలాంటప్పుడు మనం వినూత్నంగా ఆలోచించడానికి ఎందుకు భయపడుతున్నాం... ?

అందుకనే నలుగురు ఏమనుకుంటారో అన్న భావనను కొంత పక్కన పెడితే మనం స్వేచ్ఛగా ఆలోచించగలుగుతాం, యధార్థ పరిస్థితులకు దగ్గర జీవించ గలుగుతాం.🙏

🌹 ఆత్మీయ మిత్రులకు దసరా శుభాకాంక్షలు 🌹



💫

💦🌺🌻🌸💦🌺🌻🌸💦🌺

Source - Whatsapp Message

నేటి ఆత్మ విచారం

💦🌺🌻🌸💦🌺🌻🌸💦🌺

🌹నేటి ఆత్మ విచారం 🌹

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనం దాన్ని చూసే గుణముండాలి, అభినందించే మంచి మనసు కలిగి ఉండాలి.

జీవితంలో ఏది సులభం కాదు. ప్రయత్నిస్తే ఏది కష్టము కాదు.

డబ్బుతోను, అధికారంతోను కొనలేనిది పల్లె వాతావరణంలో మాత్రమే దొరుకుతుంది మిత్రమా....పచ్చని పంట పొలాలు, లేలేత సూర్యకిరణాలు ఇలా... చెప్పుకుంటూ... పొతే.. ఆ పల్లెల్లో అద్భుతాలు ఎన్నో... ఎన్నోన్నో... కాదు...

జీతం ఇచ్చిన వాడి మాట వినకపోతే కేవలం జీతం మాత్రమే పోతుంది. కానీ, జీవితం ఇచ్చిన తల్లిదండ్రుల మాట వినకపోతే... మాత్రం జీవితమే పోతుంది.

ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే....ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.

కరిదైనా వస్త్రం ధరించిన కూడా దాన్ని విడువక తప్పదు. ఎంత పంచభక్షపరమ్మన్నాం తిన్న విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారులో ఎక్కినా దాన్ని దిగి నడవక తప్పదు. ఎంత ఎత్తుపైకి వెళ్లిన తిరిగి నేలపైకి రాక తప్పదు. ఎంత గొప్ప ప్రదేశాలు తిరిగిన తిరిగి నీ గూటికి రాక తప్పదు.

ఎంత గొప్ప అనుభూతిని నీవు పొందిన కూడా... తిరిగి మాములు స్థితికి రాక తప్పదు... ఇదే....ఇదే.... జీవితం.

అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈ రోజు నీకు బాగానే ఉంటాయి. కానీ, అవి రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి.

మిత్రమా... మనః శాంతి మాత్రమే మనకు రక్ష. మంచివాడు మొదట కష్టపడతాడు కానీ, ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడతాడు కానీ, ఓడిపోతాడు.

డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు కావాలి. అంతేగాని కొమ్ములు మాత్రం రాకూడదు. 👍





💦🌺🌻🌸💦🌺🌻🌸💦🌺

Source - Whatsapp Message

రుణం worth reading story

రుణం
worth reading

‘‘ఏమండీ, రాత్రి మామయ్యగారు ఫోన్‌ చేశారు- మీరెప్పుడొస్తారని. మీరేమో నా సెల్‌ నంబరు ఇచ్చారు. వాళ్ళు నాకే చేస్తున్నారు. మీ నంబరివ్వచ్చు కదా’’ హాల్లో కూర్చుని పేపర్‌ చదువుతున్న మాధవ దగ్గరకు కాఫీ తీసుకుని వస్తూ అంది రజని.

ఆమె దగ్గర నుండి కప్పు అందుకుని మళ్ళీ పేపర్‌లో తల దూర్చిన భర్తతో ‘‘ఏంటండీ, ఏం మాట్లాడరు... ఏమాలోచించారు, వాళ్ళ విషయం గురించి. ఇలా మీరేమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజూ ఫోన్‌ చేస్తూనే ఉంటారు. వూరికే నాన్చక ఏదో ఒకటి తేల్చండి’’ అంది.

ఇవాళ ఆదివారం. ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేరయి ఉంది తను. పేపర్‌లో నుంచి తల పైకెత్తి ‘‘ఇందులో తేల్చేదేముందోయ్‌, అమ్మా నాన్నా ‘ఇక ఆ పల్లెటూళ్ళొ ఒంటరిగా ఉండలేం, ఇక్కడకు వచ్చేస్తా’మంటున్నారు, అంతేకదా! పెద్ద వయసయ్యాక కొడుకు దగ్గరే కదా ఉండాలి. వాళ్ళేదో అడగకూడని విషయమేదో అడిగినట్లు మాట్లాడతావేంటీ’’ అన్నాడు.

అతని మాటలు విని అక్కడే సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న పిల్లలు ‘‘ఏంటీ, తాతయ్య, నానమ్మ ఇక్కడకే వచ్చేస్తున్నారా, భలేభలే! తాతయ్య కథలు చాలా బాగా చెపుతాడు. నానమ్మయితే మాకు స్నానం చేయిస్తుంది, అన్నం తినిపిస్తుంది. ఇంక రోజూ మేం తాతయ్యా నానమ్మ దగ్గరే పడుకుంటాం. తొందరగా రమ్మనండి డాడీ’’ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

పిల్లలు కూడా అలా అనటంతో కోపం వచ్చింది రజనికి. ‘‘చాల్లే నోరు ముయ్యండి, వాళ్ళ దగ్గరైతే మీ వేషాలన్నీ సాగుతాయని మీ సంతోషం’’ అని భర్త వైపు తిరిగి, ‘‘ఏంటండీ రానిచ్చేది, ఇక్కడ మనమెలా ఉంటున్నాం, మీ అమ్మా నాన్నా ఎలా ఉంటారు? ఆ పల్లెటూరి మాటలూ, చేతలూ ఎలా ఉంటాయో మీకు తెలుసుగా! మనింటికి పెద్దపెద్ద వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు. పోయినసారి మనింట్లో ఫంక్షన్‌కి వచ్చినప్పుడు మీ అమ్మని చూసి మీ మేనేజరుగారి భార్య ఏమందో తెలుసా... ‘ఈవిడ మీ అత్తగారా! నేను మీ వంటమనిషనుకున్నాను’ అంది. నాకు తల కొట్టేసినట్లయింది. కావాలంటే ఆ పల్లెటూళ్ళొనే ఉండమనండి. కావాల్సినంతమంది పనివాళ్ళని పెడదాం. లేదూ ఇక్కడికే వస్తామంటే ఏ ఓల్డేజ్‌హోమ్‌లోనైనా చేర్పించండి. డబ్బెంతైనా కట్టగల స్తోమత మనకుందిగా. అంతేకానీ, ఇక్కడకు మాత్రం తీసుకొస్తానని అనకండి’’ అంది.

ఆమె మాటలు పూర్తి అయ్యీ కాకముందే ‘‘ఇక ఆపుతావా నీ గోల. ఏంటీ, మాట్లాడితే మా అమ్మానాన్నలను పల్లెటూరివాళ్ళంటావు. అలాగైతే నేనూ పల్లెటూరివాణ్ణేగా, నువ్వు మాత్రం పల్లెటూరిదానివి కాదా? కాకపోతే సిటీలో మీ బాబాయి ఉండటంతో నువ్వూ మీ అన్నా అక్కడ చదువు వెలగబెట్టారు. మీ అమ్మానాన్నా పల్లెటూరివాళ్ళు కాదా? మన పెళ్ళప్పుడు వాళ్ళుమాత్రం ఎలా ఉన్నారు? మీ అన్నయ్యకు ఉద్యోగమొచ్చి పెళ్ళయ్యాక వాళ్ళని తనతో తీసుకెళ్ళటంతో కొంచెం సిటీలైఫ్‌ వాళ్ళకి అలవాటైంది. నేనే ఇన్ని రోజులూ అశ్రద్ధ చేశాను. మావాళ్ళని కూడా అప్పుడే తెచ్చుంటే బాగానే ఉండేది. మా అమ్మేదో మొహమాటానికి ‘ఇప్పుడే మీ దగ్గరకెందుకులేరా! రేపు చేసుకోగలిగే ఓపిక లేనిరోజున ఎలాగూ మీ దగ్గరికే రావాలిగా’ అన్నదని, ‘ఔను అత్తయ్యగారూ, మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు- తొందరేముందీ! పైగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఉండే మీరు, ఆ సిటీలో ఇరుకు అద్దె ఇళ్ళలో ఉండలేరు. మీ అబ్బాయి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారు కూడా! మన సొంతిల్లయితే ఏ సమస్యా ఉండదు’ అంటూ వాళ్ళని రానీకుండా అడ్డుపుల్ల వేశావు. ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండి వస్తామంటుంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు. ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా! అన్నిటికీ పనివాళ్ళు ఉన్నారు. నువ్వేదో వాళ్ళకి బండచాకిరి చేయాలన్నట్లు మాట్లాడుతున్నావు. పైగా ఓల్డేజ్‌హోమ్‌లో చేర్చమని ఉచిత సలహాలు ఇస్తున్నావా? నేను వాళ్ళ కన్నకొడుకును. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి, ఉంటారు కూడా. రేపు ముసలిదానివయ్యాక నువ్వు ఉందువుగానీలే ఓల్డేజ్‌హోమ్‌లో’’ అంటూ లేచి వెళ్ళి షర్ట్‌ వేసుకుని బయటికెళ్ళిపోయాడు కోపంగా.

భర్త తన మాట కాదనటంతో ఏం చేయాలో అర్థంకాలేదామెకి. ఇక ఏ విధంగా చెప్పినా అతన్ని మార్చటం కుదరదని తేలిపోయింది. పైగా పిల్లలు కూడా తండ్రినే సపోర్ట్‌ చేయటంతో తన మాటనెలా నెగ్గించుకోవాలో తోచలేదు. అత్తగారూ, మామగారూ మంచివాళ్ళే కానీ, కలిసుంటే తప్పక తేడాలొస్తాయనీ తగవులౌతాయనీ భయం. తన క్లోజ్‌ఫ్రెండ్‌ సుభద్ర అలా జరిగే, గొడవలు తీవ్రమై ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ భయమింకా బలపడింది. చివరికి పల్లెటూరివాళ్ళని ఏదో వంక చెప్పి వాళ్ళను రాకుండా చేద్దామన్నా కుదరలేదు.

పైగా భర్తకి కూడా అమ్మానాన్నలంటే ఒకింత ప్రేమ ఎక్కువే. కొడుకు ఇల్లు కట్టేటప్పుడూ ఇతరత్రా అవసరాలపుడూ అతను అడగకుండానే డబ్బులూ బంగారం అంతా ఇచ్చేశారు. అప్పుడప్పుడూ వచ్చి నాల్రోజులుండి వెళ్ళేవాళ్ళు. ఇక ఇప్పుడు పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఆలోచించుకుంటూనే వంట ప్రయత్నంలో పడింది. మధ్యాహ్నం భోజనాల దగ్గర కానీ రాత్రికి కానీ ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. తెల్లారిపొద్దున లేచి తయారవుతున్న భర్తను ‘ఎక్కడికి’ అని అడుగుదామనిపించి కూడా అహం అడ్డొచ్చి ‘ఆయనే చెపుతార్లే’ అనుకుని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది.

కాఫీ అందుకుని ‘‘రజనీ, నేను వీరాపురం వెళ్తున్నాను. పొలం కౌలు, ఇంటి గురించీ మాట్లాడి అన్నీ సర్దుకుని అమ్మానాన్నలను తీసుకుని సాయంత్రానికల్లా వస్తాను’’ అంటూ, ఆమె సమాధానం చెప్పేలోపునే కారు దగ్గరకెళ్ళిపోయాడు.

ఆమెకు అతన్ని ఆపలేకపోయానని ఉక్రోషం ఎక్కువై దుఃఖంగా మారింది. కాసేపటికి తన బాధనెవరితోనైనా పంచుకోవాలనిపించింది. వెంటనే సెల్‌ తీసుకుని అన్నకు ఫోన్‌ చేసింది. ఆమె అన్న వినోద్‌ నాలుగైదు సిటీలలో జాబ్‌ చేసి, చివరికి ఢిల్లీలో స్థిరపడ్డాడు. వెళ్ళి సంవత్సరమైంది. పెద్ద ఇంజినీర్‌గా బాగా సంపాదిస్తున్నాడు. తమని రమ్మని చాలాసార్లు ఫోన్‌ చేశాడు కానీ వెళ్ళటానికి కుదరలేదు. అమ్మానాన్నలను చూడటానికైనా ఈ సమ్మర్‌లో వెళ్ళాలని అనుకుంటోంది. ఫోన్‌ రింగ్‌ మొత్తం అయిపోయింది- వినోద్‌ ఫోన్‌ తీయలేదు. అమ్మావాళ్ళకి చేద్దామంటే వాళ్ళకి ఫోన్‌ లేదు. అన్నయ్య ఫోన్‌లోనుండే మాట్లాడతారు. ‘ఒక ఫోన్‌ తీసుకోవచ్చు కదమ్మా’ అంటే, ‘అదంతా మాకు తెలియదమ్మా. ఇక్కడ అంతా హిందీ కదా... అన్నయ్య ఉన్నాడుగా అంటుంది.’

ఇంతలో ఫోన్‌ మోగింది. చూస్తే అన్నయ్యే! ఫోనెత్తగానే ‘‘రజనీ, నేను వేరేచోట మీటింగ్‌లో ఉన్నారా. సాయంత్రం నేనే ఫోన్‌ చేస్తాను. ఉంటాను’’ అంటూ హడావుడిగా పెట్టేశాడు. ‘అయ్యో, అన్నయ్యతో మాట్లాడటానికి కూడా కుదరలేదే’ అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూలుకి తయారుచేయటానికి లేచింది.

సాయంత్రమయింది. పిల్లలు స్కూలు నుంచి వచ్చాక, వాళ్ళకి స్నాక్స్‌ పెట్టి, పాలు ఇచ్చి, టీవీ దగ్గర కూర్చుంది. రాత్రి ఎనిమిది గంటలైంది. మాధవవాళ్ళు వచ్చేసరికి ఎదురెళ్ళి అత్తగారి చేతిలోని బ్యాగు తీసుకుని ‘‘బాగున్నారా అత్తయ్యగారూ, ఆరోగ్యం బాగుందా మామయ్యగారూ’’ అంది రజని- తన మనసులోని భావం ముఖంలో కనపడనీయకుండా.

పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘తాతయ్యా, నానమ్మా’’ అంటూ వాళ్ళని వాటేసుకున్నారు.

అమ్మా నాన్నా వచ్చినపుడు భార్య ‘ఏ మూడ్‌లో, ఎలా ఉంటుందో’ అని భయపడుతున్న మాధవ తేలికగా వూపిరి పీల్చుకున్నాడు. స్నానం చేసి వస్తానని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాడు.

అత్తమామలకు వాళ్ళ రూమ్‌ చూపించి బాత్‌రూమ్‌లో గీజర్‌ ఆన్‌ చేసింది. ‘‘అత్తయ్యగారూ, మీరూ మామయ్యగారూ స్నానం చేసి రండి. ఈలోపు నేను భోజనాలు రెడీ చెస్తాను’’ అంది.

‘‘అలాగేనమ్మా. మేము వస్తాములే, నువ్వెళ్ళి పనిచూసుకో’’ అంది మాధవ తల్లి సీతమ్మ.

అందరూ మాట్లాడుకుంటూ భోంచేసి, పడుకునేసరికి పదకొండయింది.

తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కాలింగ్‌బెల్‌ అదే పనిగా మోగుతోంది. ‘ఈ టైములో ఎవరై ఉంటారబ్బా’ అనుకుంటూ నిద్రకళ్ళతో వచ్చి తలుపు తీసింది.

ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే, ఆమె నిద్రమత్తంతా ఎగిరిపోయింది. ఆమె వెనుకే వచ్చిన మాధవ ఆశ్చర్యపోయినా ‘‘బాగున్నారా మామయ్యగారూ, అత్తయ్యగారూ’’ అంటూ వారిని పలకరించి, ‘‘ముందు లోపలికి రండి, చలిగా ఉంది’’ అని, ‘‘ఏంటలాగే నిలబడిపోయావు రజనీ, ముందు త్వరగా వెళ్ళి మీ అమ్మకీ నాన్నగారికీ కాఫీ కలిపి తీసుకురా త్వరగా’’ అన్నాడు.

‘‘రా అమ్మా, రండి నాన్నా’’ అంటూ వాళ్ళ దగ్గర బ్యాగులు తీసుకుని పక్కనపెట్టి, తలుపులు మూసి కిచెన్‌లోకి వెళ్ళింది. పెందలాడే లేచే అలవాటున్న మాధవ తల్లిదండ్రులు కూడా కాలింగ్‌బెల్‌ మోతకి లేచి హాల్లోకి వచ్చారు. అందరి పలకరింపులయ్యేసరికి రజని అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది.

‘వీళ్ళేంటి ఇంత సడెన్‌గా వచ్చారు. మా అమ్మా నాన్నా విషయం గురించి ఏమైనా మాట్లాడటానికి రజనీనే ఫోన్‌చేసి పిలిపించి ఉంటుందా?’- అని ఒక నిమిషం సందేహపడ్డాడు మాధవ. కానీ ఆమె ముఖం చూస్తే ఆమెకు కూడా వాళ్ళ రాక గురించి తెలియదని అర్థమైంది. మౌనంగా కాఫీ తాగుతున్న అత్తమామలను గమనించాడు. కొంచెం తేడాగా కనిపించారతనికి.

ఇదివరకున్న సంతోషం, కళా, కాంతి వాళ్ళ ముఖాల్లో కనిపించటంలేదు. అతనికన్నా ముందుగానే, తల్లిదండ్రులను చూసిన మరునిమిషంలోనే వాళ్ళ ముఖాల్లోని తేడాని గమనించేసింది రజని. ఎంతైనా కూతురు గదా!

‘‘వదినగారూ, అంత దూరంనుండి మీ ఇద్దరే వచ్చారా!’’ అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ.

‘‘లేదొదినగారూ, మాతో వినోద్‌ వచ్చాడు. వాడికి బెంగళూరులో ఏవో మీటింగులు ఉన్నాయట. వెళ్తున్నానన్నాడు. ‘మేమూ వస్తాంరా, అమ్మాయి దగ్గరికి’ అంటే తీసుకొచ్చాడు. మమ్మల్ని ఆటో ఎక్కించి, వాడు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాడు’’ అంది.

‘‘అన్నయ్య వచ్చాడా... అయితే ఇక్కడకి రాడటనా?’’ కోపంగా అంది రజని.

‘‘లేదమ్మా, ఎల్లుండి వస్తాడు. ఆరోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతాం ముగ్గురమూ’’ అంది రజని తల్లి సావిత్రమ్మ.

‘‘అదేంటమ్మా, అంత దూరం నుండి వచ్చి ఒక్క పదిరోజులైనా ఉండకుండా ఎలా వెళ్తారు? మళ్ళీ మీరెప్పుడో వస్తారు. అదేం కుదరదు, అన్నయ్యను రానీ, నేనడుగుతాను’’ అంది.

‘‘వద్దమ్మా, అడగొద్దు. అన్నయ్య తోడు లేకుండా మేం ఒక్కళ్ళమూ మళ్ళీ అంత దూరం వెళ్ళలేంగా... అందుకని వెళతాంలే’’ అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి, ఏదో జరిగిందని అర్థమైంది రజనీకి.

మాధవ, పిల్లలు వెళ్ళిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది.

అందరూ వెళ్ళిపోయాక తల్లి గదిలోకి వెళ్ళింది. అక్కడే అత్తమామలు కూడా ఉండేసరికి, కాసేపు మాట్లాడి వచ్చేసింది.

ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడూ తరవాత కూడా వాళ్ళ నలుగురూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలా రాత్రి వరకూ కుదరలేదు.

రాత్రి భోజనాలయిన తరవాత మాధవ, పిల్లలు- అత్తమామల గదిలోకెళ్ళారు. అప్పుడు తల్లిదండ్రుల గదిలోకెళ్ళింది.

తల్లి ఒక్కతే ఉంది. ‘‘నాన్న ఏరమ్మా?’’ అంది.

‘‘మీ అత్తయ్యగారి గదిలోకెళ్ళారమ్మా. అబ్బాయీ పిల్లలూ కూడా అక్కడే ఉన్నారుగా- మాట్లాడుతున్నారు.’’

సరే, నాన్న లేకపోయినా ఫరవాలేదులే అనుకుని ‘‘అమ్మా, నువ్వూ నాన్నా అలా ఉన్నారేంటి? ఉదయం నుండీ ఈ విషయం అడగాలని ఎంత తపనపడ్డా మాట్లాడటానికి కుదరలేదు. ఏం జరిగిందమ్మా, చెప్పవా’’ అంది.

కూతురలా అడిగేసరికి ఆ తల్లికి దుఃఖం ఆగలేదు. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు రజనీకి. తన కళ్ళవెంట నీళ్ళొచ్చేశాయి.

కొంతసేపటికి ‘‘ఏం చెప్పను తల్లీ, మీ వదిన చాలా మారిపోయింది ఢిల్లీ వెళ్ళాక. ఇప్పుడు, ఇన్నాళ్ళకి- మీ వదినకి మేమూ మా మాటలూ చేతలూ నచ్చటం లేదు. ఇంటికి పెద్దపెద్ద ఆఫీసర్లూ కలెక్టర్లూ వస్తారట. పార్టీలు జరుగుతాయట. వాళ్ళల్లో మేముంటే బాగోదట. ఏం చెప్పిందో, ఏం చేసిందో వాడిని కూడా మార్చేసింది. ఆరునెలలక్రితం మమ్మల్ని ఓల్డేజ్‌హోమ్‌లో చేర్పించారు. అప్పటి నుండి అక్కడే ఉంటున్నాం. నిన్ను చూడాలని ఉందని ఎప్పటినుంచో అడుగుతుంటే, ఇప్పుడు వాడు పనిమీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకొచ్చాడు. రేపు వెళ్ళేటపుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని హోమ్‌లో వదిలేసి, వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ జన్మలో ఏ పాపం చేశామోనమ్మా, దేవుడు మా నుదుటన ఇలా రాశాడు. చూడమ్మా రజనీ, ఎంతో ఆశతో బిడ్డల్ని కనీ, మరెంతో ప్రేమతో వాళ్ళని పెంచీ పెద్దచేసి, చదివించి, వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు. పెళ్ళిచేసి వాళ్ళ పిల్లా పాపలతో ఆడుకుంటూ, కొడుకు దగ్గరే కన్ను మూయాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులయినా. కానీ, కొడుక్కి పెళ్ళిచేసి, కొడుకుని కోడలి చేతికప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి, తమను నిరాదరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధా వేదనా ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుంది. వాళ్ళ దుఃఖాన్నెవరూ తీర్చలేరు. ‘మీరు మాకు వద్దు, మా దగ్గర ఉండద్దు, మా ఇంటికి రావద్దు’ అంటే మేమే కాదు, ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులయినా ఎలా తట్టుకోగలరు’’ అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. ‘‘మీ అన్నలాగా డబ్బున్నవాళ్ళు వృద్ధాశ్రమాలలో పడేసి పోతున్నారు. డబ్బులేని వాళ్ళు ముసలివాళ్ళని వాళ్ళ ఖర్మానికి రోడ్లమీద వదిలేసి పోతున్నారు. పని చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎలాగోలా పనిచేసుకుని బతుకీడుస్తున్నారు. పని చేయగలిగే శక్తి లేనివాళ్ళు పనిచేయలేక, తిండిలేక, అడుక్కోవటానికి ముఖం చెల్లక, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా జరగటానికి కారణమేంటో తెలుసా తల్లీ! కొంతమంది, కొంతమందేంటి... చాలామంది కోడళ్ళు ‘అత్తమామలు కూడా తమ తల్లిదండ్రుల లాంటివారే కదా’ అని అనుకోకపోవటమే. అందుకే, ఇప్పుడు వృద్ధాశ్రమాలకి ఆదరణ ఎక్కువైంది. అక్కడ మేం బతికున్నాం అంటే, ఉన్నాం అంతే! మా మనసులెంత కుమిలిపోతున్నాయో నీ అన్నావదినలకు అక్కరలేదు. మాకు ఈ శిక్ష ఎందుకుపడిందో తెలీదు కానీ, మేమనుభవిస్తున్న ఈ వ్యధ ఇంకెవరికీ రాకూడదమ్మా’’ అంటూ, మళ్ళీ దుఃఖం ఉప్పెనలాగా ముంచుకురాగా కూతుర్ని కౌగిలించుకుని భోరుమంది ఆ తల్లి. తల్లి మాటలకు రజనీకి చెంపమీద ఛెళ్ళున చరిచినట్లనిపించింది అంత బాధలోనూ.

‘‘వూరుకోమ్మా, వూరుకో... అన్నయ్యిలా చేయడమేమిటి? వాడొచ్చాక నేను మాట్లాడతాను’’ అంది ఏడుస్తూ.

తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురైంది. దుఃఖం నుండి తేరుకున్న సావిత్రమ్మ, ‘‘మీ అత్తయ్యగారు వాళ్ళు రాత్రేనటగా వచ్చింది. వాడి పెంపకం విషయంలో మేమేదైనా పొరపాటు చేశామేమోగానీ, నీ విషయంలో మాకు చాలా తృప్తిగా ఉంది. నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. మీరైనా ఆనందంగా ఉండండి, అది చాలు’’ అంది.

తల్లి మాటలకు గిల్టీగా ఫీలయింది రజని. ఇంకానయం, తను అన్నతోగానీ, తల్లితోగానీ మాట్లాడకపోవటమే మంచిదయిందనుకుంది. అంతలో మాధవ పిలవటంతో, ‘‘సరే, పడుకోండమ్మా, పొద్దుపోయింది’’ అంటూ వెళ్ళిపోయింది.

మూడోరోజు ఉదయం వినోద్‌ వచ్చాడు. అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గటం గమనించింది. అన్నతో మాట్లాడాలన్నా అందరూ అతని చుట్టూ ఉన్నారు. సాయంత్రం వరకూ అలాగే జరిగిపోయింది.

సాయంత్రం అందరూ టీ తాగటం అయ్యాక, వినోద్‌- తల్లితో ‘‘అమ్మా, ఇక బయలుదేరుదాం. ఎనిమిది గంటలకు ట్రైన్‌ ఉంది’’ అన్నాడు.

అందరూ ఉన్నా అక్కడ ఒక క్షణం నిశ్శబ్దం ఆవరించింది.

అంతలో మాధవ గొంతు సవరించుకుని ‘‘చూడు వినోద్‌, ఇకనుండి అత్తయ్యగారూ మామయ్యగారూ మా ఇంట్లో, మా దగ్గరే ఉంటారు’’ అన్నాడు.

అతని మాటకు వినోద్‌, రజనీ, అత్తమామలూ విస్తుపోయి చూశారు. అది వాళ్ళకి వూహించని పరిణామం.

‘‘అదికాదు బావా!’’ అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్‌.

‘‘ఇంకేం చెప్పకు, నీవక్కడకు తీసుకెళ్ళినా, హోమ్‌లోనే కదా వాళ్ళుండేది. ఇక్కడుంటే కూతురి దగ్గరున్నామన్న సంతోషమైనా ఉంటుంది వాళ్ళకి. ఇంటికి పెద్దదిక్కు ఎంత అవసరమో నీకు తెలీదు వినోద్‌. అమ్మానాన్నలంటే మనమెప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం. పెద్దవారితో కలిసి ఉండాలి, వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి. అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి, సుఖం, సంతోషం ఉంటాయి. ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకి కలిగించాలి. ఇప్పుడు నువ్వు మీ అమ్మానాన్నలని చేసినట్లే, రేపు నీ కొడుకులు నిన్ను చేయరా! దూరంగా ఉంచితే పెద్దవాళ్ళు పడే బాధ నీకప్పుడే అర్థంకాదులే. నేనేమీ కోపంగా చెప్పటం లేదు వినోద్‌. వాళ్ళిక్కడుంటే వాళ్ళకీ మనశ్శాంతిగా ఉంటుంది. మాకూ ఇంకో అమ్మానాన్నలకి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇక నువ్వేం ఆలోచించక బయల్దేరు’’ అన్నాడు.

వినోద్‌ తల దించుకుని వెళ్ళిపోయాడు.

మాధవ వైపు చూడటానికి ముఖం చెల్లలేదు రజనీకి. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. గదిలోకి వెళ్ళటంతోనే మాధవ పాదాలమీద వాలిపోయింది రజని. ‘‘ఏయ్‌ ఏంటిదీ, లే, లే...’’ అంటున్న అతనితో-

‘‘ఇన్నాళ్ళూ మీతో కలిసి కాపురంచేసి కూడా మీ మనసు అర్థంచేసుకోలేకపోయానండీ. అత్తయ్యా వాళ్ళవిషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను. నన్ను క్షమించండి. మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మానాన్నలకు ఆశ్రయం ఇచ్చారు. మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను’’ అంది ఏడుస్తూ.

‘‘పిచ్చి రజనీ, నాకు మా అమ్మానాన్నా, మీ అమ్మానాన్నా వేరుకాదు. ఆరోజు మీ అమ్మ నీతో చెప్పినపుడే మీ నాన్నగారు మాకు చెప్పారు. అప్పుడే అమ్మానాన్నా నేనూ ఇలా నిర్ణయించుకున్నాం. నిన్ను సర్‌ప్రైజ్‌ చేద్దామని నీకు చెప్పలేదు. ఏదో చిరాకులో మాట్లాడతావుగానీ నీ మనసెలాంటిదో నాకు తెలీదా’’ అన్నాడు.

అతనికి తనపైగల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీలైంది. హాల్లోకొచ్చిన రజనీకి అత్తమామలు దేవతల్లాగా కనిపించారు. వెళ్ళి వాళ్ళ పాదాలకి దణ్ణం పెట్టుకుంది. తరవాత తల్లికీ తండ్రికీ కూడా.

‘‘ఇదేంటమ్మా, ఇప్పుడెందుకూ...’’ అని అడిగిన వాళ్ళకు, ఇవాళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని ‘ఈటీవీ శుభమస్తు’లో చెప్పారండీ’’ అంది.

‘మా కోడలెంత బంగారం’ అని అత్తమామలూ, ‘కూతురెంత పద్ధతికలదో’ అని తల్లిదండ్రులూ మురిసిపోతుంటే, గదిలోనుండి అది చూసిన మాధవ- రజని తెలివికి నవ్వుకున్నాడు..@@@
ఇప్పుడు మనం ఏదయితే చేస్తామో అదే చివరకి మనకి జరుగుతోంది..దయచేసి అర్థం చేసుకోగలరు.మన ఉమ్మడి కుటుంబాలను మనం కాపాడుకుందాం..మన పిల్లలకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తునిదాం..👍

Source - Whatsapp Message

రవీంద్రనాధ్టా గూర్ రాసిన చిలుక కథ ఇది ఇప్పటి కార్పోరేట్ విద్యాసంస్థలకు సరిగా సరిపోతుంది

🦜 ఒక చిలుక ఉండేది.చక్కగా పాడేది. స్వేచ్ఛగా ఎగిరేది. కానీ చదవలేకపోయేది.అది రాజు గారి తోటలోని చిలుక. ఒకరోజు అది రాజు గారి కంట్లో పడింది. వెంటనే మంత్రిని పిలిచి 'ఎడ్యుకేట్ ఇట్' అని ఆదేశించాడు. దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజు గారి మేనల్లుడి మీద ఉంచాడు మంత్రి.
ఎలా ఆ చిలుకను ఎడ్యుకేట్ చేయటం? విద్యావేత్త లు కూర్చుని తీవ్రంగా ఆలోచించారు. చిలక్కి చదువు చెప్పాలంటే... మొదట అది కుదురుగా ఉండాలి. అంటే.... అది ఎగురకూడదు.వెంటనే ఒక మంచి పంజరం చేయించారు. చిలుకను అందులో కూర్చోబెట్టారు. కోచింగ్ ఇవ్వటానికి ఒక పండితుడు వచ్చాడు. చిలుకను చూశాడు. ' ఈ చిలక్కి ఒక పుస్తకం సరిపోదు' అన్నాడు.గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చేశాయి గంటల కొద్దీ చదువు మొదలైంది.
పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్లేవరూ ' అబ్బా... భలే చిలుక' అనటం లేదు. ' అబ్బా... ఏం పంజరం!' అంటున్నారు. లేదంటే ' అబ్బా ... ఎంత చదువు!' అంటున్నారు. రాజు గారిని మెచ్చుకుంటున్నారు.మంత్రిగారిని ప్రశంసిస్తున్నారు.రాజుగారి మేనల్లుడిని, పంజరం తయారుచేసిన కంసాలిని, చదువు చెప్పటానికి వచ్చిన పండితుడిని ' ఆహా... ఓహో ' అని కీర్తిస్తున్నారు.
రాజు గారు మంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పారు... ఎన్ని లక్షల వరహాలు ఖర్చైన పర్వాలేదు. చిలక్కి బాగా చదువు రావాలని. మంచి మేనర్స్ కూడా రావాలని.
' అలాగే ' అని లక్షల వరహాలు దఫా దఫాలుగా కోశాగారం నుంచి తెప్పించారు మంత్రిగారు. సెమిస్టర్లు గడుస్తున్నాయి.
ఓ రోజు రాజుగారికి చిలకెలా చదువుతుందో చూడాలనిపించింది. వెంటనే ఏర్పాట్లు జరిగాయి. 'చిలుకను చూడడానికి రాజుగారు వస్తున్నారహో ' అని తప్పెట్లు, తాళాలు ,పెద్ద పెద్ద శబ్దాలు చేసే బూరలతో ఒకటే హోరు. రాజు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలుక దగ్గరికి చేరిపోయింది. అయితే పంజరం లోని చిలుకను ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరూ దాని వైపు చూడటం లేదు.పండితుడు ఒక్కడే చూస్తున్నాడు. ఆయనైనా చిలుక సరిగా చదువుతుందా లేదా అని చూస్తున్నాడు తప్ప , చిలకెలా ఉందో చూడటం లేదు. చిలుక బాగా నీరసించి పోయింది. మానసికంగా బాగా నలిగిపోయి ఉంది. ఆ రోజైతే .... రాజుగారి సందర్శన ధ్వనులకు చిలక సగం చచ్చిపోయింది. తర్వాత కొద్దిరోజులకే పూర్తి ప్రాణం విడిచింది ! ఆ సంగతి ఎవరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్పలేదు. ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు.
రాజుగారు మళ్ళీ మేనల్లుడిని పిలిచి, ' చిలుక ఎలా చదువుతోంది? ' అని అడిగాడు.
' చిలుక స్టడీస్ కంప్లీట్ అయ్యాయి' అన్నాడు మేనల్లుడు.
రాజుగారు సంతోషించారు. తన కృషి ఫలించిందన్నమాట.
' ఇప్పటికి అల్లరి చిల్లర గానే ఎగురుతోందా?'
' ఎగరరదు'
' ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా? '
'పాడదు'
' సరే, చిలుకను ఒకసారి నా దగ్గరికి తీసుకురా'
తీసుకొచ్చాడు మేనల్లుడు. చిలుక నోరు తెరవడం లేదు.ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.చిలుక కడుపు ఉబ్బెత్తుగా ఉంది. చిలుక అసలు కదలనే కదలటం లేదు.
" ఆ కడుపులోనిది ఏమిటి!" అని అడిగారు రాజు గారు.
' జ్ఞానం మామయ్య ' అని చెప్పాడు మేనల్లుడు.
' చిలుక చనిపోయినట్లు ఉంది కదా ' అన్నారు రాజుగారు.
చిలుక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత. చచ్చిందా బతికిందా అని కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనల్లుడు.
.....................
నూరేళ్ళ క్రితం విశ్వకవి రవీంద్రనాధ్టా గూర్ రాసిన చిలుక కథ ఇది
ఇప్పటి కార్పోరేట్ విద్యాసంస్థలకు సరిగా సరిపోతుంది కదా సోదరులారా.....!



Source - Whatsapp Message

ఆధ్యాత్మిక ఆదర్శం

🙏 ఆధ్యాత్మిక ఆదర్శం 🙏


🍃🌹ప్రతి మనిషికీ ఒక జీవిత ఆదర్శం ఉండితీరాలి. ఆదర్శం అంటే జీవితాన్ని ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దుకునే ఆలోచన, ఆచరణ. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుకుంటే, సునాయాసంగా అభివృద్ధి సోపానాలు అధిరోహించవచ్చు. తల్లిదండ్రుల పోరు పడలేక చదవాల్సి వస్తోంది అనుకుంటూ మొక్కుబడిగా చదివితే, ముక్కునపట్టిన విద్య తుమ్మగానే జారిపోతుంది.

🍃🌹విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం చదివే చదువు కాదు. అక్షరంలోనే అనంతజ్ఞానం, అద్భుతశక్తి దాగి ఉన్నాయి. అక్షర తపస్సు చేసినప్పుడే శక్తి లభించి, జ్ఞానఫలాలు దక్కుతాయి. మహామంత్రాలన్నీ బీజాక్షర సంపుటాలే.

🍃🌹తెలుగులో ఉండేవి యాభైఆరు అక్షరాలే. కానీ, అవి వివిధ మేళవింపుల్లో కథలు, కావ్యాలు, గీతాలు, సంగీతాలుగా మారిపోతాయి. ఆ విధంగా వాటిని రూపకల్పన చేయగల నైపుణ్యం కోసమే అక్షరాన్ని ఆత్మగా చేసుకుని అధ్యయనం చెయ్యాలి.

🍃🌹బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతిరూపమే ఓంకారమని వేదాలు చెబుతున్నాయి. ఇటీవల సూర్య దేవుడి నుంచి వెలువడే ధ్వనితరంగాలు ‘ఓం’కార శబ్దంగా పరిశోధనలు వెల్లడించాయి. మనిషి అజ్ఞానం ఎలా ఉంటుందంటే- తనకు తెలిసిందే జ్ఞానం, తెలియనివన్నీ శూన్యం అనుకుంటాడు. మన నేత్రాలు చూడలేనివి ఎన్నో ఉన్నాయి.

🍃🌹మన మేధకు అందనివీ మరెన్నో ఉన్నాయి. ఆ విషయం మనకు అర్థం కానంతవరకూ మనమే ఘనులమనే భ్రమలో బతుకుతుంటాం.
చక్రవర్తి తనను తాను భగవంతుడితో సమం అనుకుంటాడు. మేధావి తానే మహాజ్ఞాని అనుకుంటాడు.

🍃🌹మహాధనికుడు తానే అపర కుబేరుడిననుకుంటాడు. సౌందర్యవతి తానే అప్సరసను అనుకుంటుంది. ఇలా ఎవరికి వారు తామే అధికులమని విర్రవీగుతుంటారు.
వారి అహంకారాన్ని కాలం అనాయాసంగా తుడిచిపెట్టేస్తుంది. వారి పరిమితులు ఆయువు తీరేవరకేనని తేటతెల్లం చేస్తుంది.

🍃🌹దైవం ఉన్నాడా లేడా, స్వర్గ నరకాలు నిజమా అబద్ధమా, పాపపుణ్యాలను నమ్మాలా వద్దా... ఇలాంటి తర్క వితర్కాల మద్య జీవితం చివరి మజిలీకి చేరువైపోతుంది. అప్పుడు నోరు తెరుచుకుని కొండచిలువలా మనకోసం ఎదురు చూస్తున్న మృత్యువుకు ఆహారం కాక తప్పదు.

🍃🌹ప్రాపంచిక ఆదర్శాలన్నీ ధనకనక వస్తు వాహనాల ఆర్జన, హోదా, అధికారం, సుఖసౌఖ్యాలకు సంబంధించినవే. ఇందుకు పూర్తి భిన్నమైనది ఆధ్యాత్మిక ఆదర్శం. దీంట్లో పెట్టుబడి స్వల్పం. ఫలితం అనంతం.

🍃🌹శ్రద్ధ, భక్తి- వీటితో పోల్చదగిన ఆధ్యాత్మిక ఆదర్శం మరొకటి లేదు. విశ్వాసం ఈ రెండింటికీ ఇరుసు. భక్తుడు-భగవంతుడు మధ్య అవిశ్వాసం, అతి బద్ధకం, అత్యాశల వంటి అడ్డుగోడలుంటాయి. వీటిని నిర్మలభక్తితో అధిగమించాలి.

🍃🌹మనం నిజాయతీగా ప్రయత్నిస్తే, ఆప్యాయంగా ఆయన చేతులుచాచి మనల్ని తనవైపు లాక్కుంటాడు. మన ఆలోచనకు శబ్దం ఉండదు. కానీ, అది అంతర్యామికి ఆ క్షణంలోనే అర్థమైపోతుంది. మన ఆచరణకు సాక్షులు ఉండకపోవచ్చు.

🍃🌹కానీ, ఆయన అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఈ ఎరుక మనకు ఉండి తీరాలి. అది లేనంత వరకు మనకు అంతర్యామి అర్థం కాడు. ఎంత ప్రయత్నించినా అగుపించడు.

🍃🌹ఆధ్యాత్మిక ఆదర్శం అంటే- భక్తి నటించకపోవడం, భగవంతుడికి పరీక్షలు పెట్టకపోవడం, మన సర్వశక్తులు ఏకీకృతం చేసి అంతర్యామిని అర్చించడమే.



🥀🌸🥀🌸🥀🌸🥀🌸🥀🌸🥀🌸

Source - Whatsapp Message

రమణాశ్రమ లేఖలు

అరుణాచల శివ 🙏


రమణాశ్రమ లేఖలు

ఒక దినం కొత్తగా ఆశ్రమానికి వచ్చిన ఆంధ్రులొకరు, నడివయస్సు వారు, భగవానుని సమీపించి “స్వామీ! నేను రామనామం నియమంగా ఉదయం ఒక గంటా, సాయంత్రం ఒక గంటా జపిస్తూంటే, కొంచెం సేపటికే తలపులు ఒకటొకటిగా బయలుదేరి, అంతకంతకు అధికమై, ఎప్పటికో మనం చేసే జపం మరచి పోయామే అని తోస్తుంది. ఏం చేసేదీ?” అన్నాడు.

“ఆ, అప్పుడు మళ్ళీ ఆ నామాన్ని పట్టుకోండి” అన్నారు భగవాన్.

అందరికీ నవ్వు వచ్చింది. పాపం, ఆయన ఖిన్నుడై “ఈ అంతరాయాలు రావటానికి కారణం సంసారం గదా. అందువల్ల సంసారం వదలివేద్దామా, అని యోచిస్తున్నా” నన్నాడు.

“ఓహో! అలాగా! అసలు సంసారమంటే ఏమి? అది లోపల ఉన్నదా? బయట ఉన్నదా?” అన్నారు భగవాన్.

“భార్యా, పిల్లలూ ఇత్యాదులండీ” అన్నాడాయన

. “అదేనా సంసారం? వారేం చేసారండీ? అసలు సంసారమంటే ఏదో తెలుసుకోండి ముందు. ఆ తరువాత విడవటం మాట యోచిద్దాం” అన్నారు భగవాన్.

ఆయన నిరుత్తరుడై తలవంచి ఊరుకున్నాడు.

భగవాన్ హృదయం జాలితో నిండిపోయింది.

కరుణాపూర్ణ దృష్టితో చూస్తూ “భార్యా పిల్లలను వదలి వస్తారనుకోండి, ఇక్కడుంటే ఇదొక విధమైన సంసారం అవుతుంది. సన్న్యసిస్తారనుకోండి. కఱ్ఱ, కమండలం ఇత్యాదులతో అదొకరకపు సంసారంగా పరిణమిస్తుంది. ఎందుకదీ?

సంసారమంటే మనస్సంసారమే.

ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడున్నా ఒకటే, ఏదీ బాధించదు” అన్నారు భగవాన్.

పాపం ఆయనకి ఇంచుక ధైర్యం వచ్చి “ఆ, అదే స్వామీ, ఆ మనస్సంసారం ఎలా విడవటం?” అన్నాడు.

“అదేనండీ, రామనామం జపం చేస్తున్నా నన్నారు కదా. తలపుల ఒరవడిలో అప్పుడప్పుడు 'అరే! మనం చేసే జపం మరచినామే’ అన్న జ్ఞప్తి వస్తున్నది కదా. ఆ జ్ఞప్తినే వృద్ధిపరచుకొని, ఆ నామాన్నే పట్టుకొంటూ ఉండండి. క్రమంగా తలపుల బలం తగ్గుతుంది.

నామ జపానికిన్నీ క్రమానుసారం అంతరాంతరాలు చెప్పే ఉన్నవి.

పెద్దగా జపించడంకన్న పెదిమ కదిలీ కదలనట్లు జపించడం లెస్స. అంతకన్న చిత్తజపం, దానికన్న ధ్యానం ఉత్తమం” అన్నారు భగవాన్.

ఉత్తమస్త దుచ్చమందతః
చిత్తజం జపధ్యానముత్తమం||

-----భగవాన్ రమణ మహర్షి ఉపదేశసారం నుండి...

అందరూ రమణుల ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ....🙏

Source - Whatsapp Message

ప్రారబ్ధానుభవం తప్పేది కాదు

🥀 ప్రారబ్ధానుభవం తప్పేది కాదు 🥀

ఈ సృష్టిలో గల 84 లక్షల జీవరాశులలో భగవంతుడు మానవుని అగ్రభాగాన ఉంచాడు. ఏ ఇతర ప్రాణికీ లేనన్ని శక్తియుక్తులను, తెలివితేటలను ఇచ్చాడు. ప్రకృతిని అర్థం చేసుకోవడమేగాక.. కొంతవరకూ తన నియంత్రణలో ఉంచుకోగల్గిన సామర్థ్యాన్ని ఇచ్చాడు. ‘నీ ఇష్టానుసారం జీవితాన్ని గడపవచ్చు’ అంటూనే ఒక కఠినమైన, దాటలేని గీటు గీశాడు. ఏమిటా గీత అంటే.. కర్మ ఫలం. ‘‘నీవు మంచి చెయ్యి, చెడు చెయ్యి, అది నీ ఇష్టం. కానీ.. ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని గ్రహించడానికి నీకు విచక్షణ జ్ఞానం ఇస్తున్నా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకో. మంచి పని చేస్తే మంచి ఫలితం. చెడ్డ పని చేస్తే చెడ్డఫలితం’’ అని దైవశాసనం. ఒక్క మనిషికే ఈ నియమం. పశు పక్ష్యాదులకు, మృగాలకు, కీటక జాతులకు ఈ నియమం వర్తించదు. విచక్షణ జ్ఞానం సంతరించుకోని చిన్న పిల్లలకు కూడా ఈ నియమం వర్తించదంటారు ధర్మవేత్తలు.

ఉదాహరణకు ఒక ఆవును స్వేచ్ఛగా వదిలేస్తే తనకు ఇష్టమైన చోట, అనుకూలంగా ఉన్న చోట మేత మేస్తుంది. ‘ఇక్కడ మేయవచ్చా? ఇది నా యజమానిదా? పరాయి వారిదా’.. ఇవేవీ దానికి తెలియవు. ఇతరుల పంటపొలాలలో పడి తింటే దానికి స్వేచ్ఛనిచ్చిన యజమానిదే తప్పవుతుంది గానీ, పైరును మేసిన పశువుదిగాదు. అలాగే.. వేటాడి, ఇతర జంతువులను వధించి కడుపు నింపుకోవడం మృగజాతి లక్షణం. కనుక వాటికి పాప పుణ్యాల ఫలితాలు వర్తించవు.

‘పని’కి కర్మ అనే పేరుంది. పని చేయడమంటే కర్మ చేయడమని అర్థం. అందుకే.. పని ఫలితం అనకుండా ‘కర్మ ఫలం’ అంటున్నాం. మనం ఏ కర్మ చేసినా అంతే మోతాదులో కర్మ ఫలం అనుభవించవలసి ఉంటుంది. ఒక రకంగా ఆధునిక సాంకేతిక శాస్త్ర సూత్రాలు కూడా ఈ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నాయి. భౌతిక శాస్త్రంలో న్యూటన్‌ సూత్రాలు మూడు ఉంటాయి. వాటిలో.. ‘మనం చేసే ప్రతి చర్యకూ దానికి సమానమైన, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది’ అనే సూత్రం కర్మఫలానికి అతికినట్టు సరిపోతుంది. కర్మసిద్ధాంతంలో దీనినే మన పెద్దలు ‘ప్రారబ్ధం’ అని చెబుతారు.

సైన్స్‌లో.. చర్యకు ప్రతిచర్య వెంటనే ఉంటుంది. కానీ, కర్మ సిద్ధాంతంలో మనం చేసే కర్మ తాలూకూ ఫలితం వెంటనే అనుభవంలోకి రావచ్చు. లేదా కొంతకాలానికి రావచ్చు. లేదా మరు జన్మలో, ఆపై జన్మలోనైనా అనుభవానికి రావచ్చు. అనుభవించడం మాత్రం తథ్యం. అది ఎప్పుడు ఎట్లా అనేది దైవ నిర్ణయం. ‘జనని గర్భము నుండి జనియించినప్పుడు.. కంఠమాలలేవి కానరావు.. మంచి ముత్యపుసరుల్‌ మచ్చుకైననులేవు- మేల్మి బంగరు దండలు మెడకులేవు కాని, కలదోకమాల మీ కంఠమందు, అదియే మీ కర్మలన్నియు చేర్చిన కంఠమాల - ప్రారబ్ధమనియెడి చద్దిమూట’ అంటారు సత్యసాయిబాబా.

మన ప్రయాణం ఆరంభించినపుడు మధ్యలో తినడానికి ఎలాంటి పదార్థాలను మూట కట్టుకున్నామో.. ప్రయాణంలో అవే తినాలి కదా! వేరే పదార్థాలు ఎట్లావస్తాయి. ప్రారబ్ధమూ అంతే. అనుభవించక తప్పదు. కాబట్టి, ఎల్లప్పుడూ మంచి పనులే చేస్తే అంతా మంచే జరుగుతుంది. ఆ మంచి ఫలితాన్ని కూడా తీసుకోకుండా దేవుడికి అర్పిస్తే.. పాప, పుణ్యాలు లేక, మరుజన్మ ఎత్తే బాధ తప్పుతుంది. అదే మోక్షం.
🌷

Source - Whatsapp Message

అన్ని అర్థం చేసుకోవాలనే ఆరాటం,ఉన్నవాళ్లు మాత్రమే గొప్పవారిగా కనిపిస్తున్నారు.

🌹 ఎవరైతే మీ ముఖంలో సంతోషం చూడటానికోసం,
ఓటమిని ఒప్పుకుంటారో...
వారితో మీరు ఎన్నడూ గెలవలేరు?
ఎందుకంటే వారి వద్ద గెలుపోటములకి,
అతీతమైన అద్భుత హృదయం ఉంది కనుక...!!
నిజాయితీగా ఉండడానికి,
నిజాయితీని ప్రదర్శించడానికి చాలా తేడా ఉంది..
నిజాయితీ అనేది,
మన నడవడికలో ఒక భాగంగా ఉండాలి.!

ఎవరి మెప్పు కోసమో,
నిన్ను నువ్వు మార్చుకోనవసరం లేదు.!
ఒక్కసారి మార్చుకోవటం అలవాటైతే,
నీ పెంపుడు కుక్క కూడా,
నిన్ను చూసి మొరగడం ఆరంభిస్తుంది..
ప్రత్యేకమైన గొప్పతనం అంటూ,
ఏ మనిషిలోనూ విడివిడిగా ఉండదు...?
ప్రతి ఒక్కటి నేర్చుకోవాలన్న తపన,
అన్ని అర్థం చేసుకోవాలనే ఆరాటం,
ఉన్నవాళ్లు మాత్రమే గొప్పవారిగా కనిపిస్తున్నారు.!🤔



Source - Whatsapp Message

అప్పుడే మీరు కోరుకున్నది జరుగుతుంది.

🙏 కొంతకాలం కిందట ఒక సత్సంగంలో నన్ను ఎవరో ఇలా అడిగారు, “నేనెందరో ఆధ్యాత్మిక గురువుల్ని చూశాను. కానీ, మీరు ఆకర్షించినంతగా నన్నెవరూ ఆకర్షించలేదు. మీలో ఏముంది?” దానికి

సద్గురు :- నేను, “మీలో లేనిది, నాలో ప్రత్యేకంగా ఏమీలేదు. అనంతమైన సంభావ్యత ఉన్న ఒక బీజాన్ని మనందరికీ ఇచ్చారు. మీరు చాలా మంచివాళ్లు, జాగ్రత్త పరులు, ఆ బీజాన్ని భద్రంగా ఉంచుకున్నారు. నేను ఆ బీజాన్ని నాశనం చేసి, దాన్ని ఓ చెట్టుగా మలచుకున్నాను.” అని చెప్పను.

మీరు విత్తనాన్ని ఓ చెట్టుగా చేయాలంటే, విత్తనం విత్తనంగా మిగిలి ఉండలేదు.. కదా…! విత్తనాన్ని విత్తనం గానే ఉంచడం మూర్ఖత్వం. కాని మిమ్మల్ని మీరుగానే భద్రపరచుకోవడం ఇవ్వాళ సమాజంలో గొప్పవిషయంగా భావింపబడుతూ ఉంది. మిమ్మల్ని మీరు ధ్వంసం చేసుకోవడం, ఒక వ్యక్తి పరిమిత సంభావ్యతను నాశనం చేయడం గొప్ప విషయమనుకోవడం లేదు. అందువల్ల మీరు చాలా తెలివైనవాళ్లు, ఎంత తెలివైనవాళ్లంటే మీరు జీవితాన్నే మోసం చేస్తున్నారు.

కలుపుతీసే ప్రక్రియ

మనందరం ఒకే విత్తనంతో వచ్చాం. అంటే ప్రతి విత్తన్నానికీ ఒకే విధమైన సంభావ్యత ఉంది. విత్తనం నుండి చెట్టుగా మారడానికి ఒక ప్రయాణం ఉంది. మీరు విత్తనం చెట్టుగా తయ్యారవ్వాలనుకుంటే, మీరు దాన్ని పోషించాలి, రక్షించాలి; మీరు కలుపు మొక్కలను తొలగించాలి – చాలా ఉంటాయి కలుపు మొక్కలు. అవే పిచ్చి కలుపుమొక్కలు. లక్షలాది సంవత్సరాలుగా మనవజాతిని ఇబ్బంది పెడుతున్నాయి. వాటినెలా తొలగించుకోవాలో మనుషులింకా తెలుకోలేదు. క్రోధం, అసహ్యం, అసూయ, భయం, సందేహం వంటి మామూలు విషయాలు – ఇవే పిచ్చి కలుపు మొక్కలు దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి, వాటిని ప్రత్యేకంగా పోషించవలసిన అవసరంకాని, కాపాడవలసిన అవసరంకాని లేదు – అవి వాటంతటవే పెరుగుతాయి. కాని ఒక పవిత్రబీజం మొలకెత్తి, వృద్ధి చెందాలంటే, మీరు కలుపుతీయాలి, నీళ్లు పెట్టాలి, ఎరువు వేయాలి, తగినంతగా సూర్యకిరణాలు తగిలేట్లు ఏర్పాటుచేయాలి. మీరు ఎండవేడి తగులుతుందేమో నని భయపడి, సూర్య కిరణాలను తప్పించుకోవాలనుకుంటే జీవితానికి ఆధారభూతమైన వెచ్చదనాన్ని కూడా కోల్పోతారు.

క్రోధం, అసహ్యం, అసూయ, భయం, సందేహం వంటి మామూలు విషయాలు – ఇవే పిచ్చి కలుపు మొక్కలు దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి

ప్రాణానికి ఏది ఆధారమో, అదే ప్రాణాంతకం కూడా. నిప్పు రొట్టెను కాల్చేడానికి ఉపయోగ పడుతుంది. అదే ఎక్కువైతే దాన్ని మాడుస్తుంది కూడా. మీకు వంటచేయడం బాగా చేతనైతే, రొట్టెను చక్కగా కాలుస్తారు; లేకపోతే దాన్ని మాడుస్తారు. మీరు ఎండకు భయపడి తప్పించుకోవడానికి నీడలోకి పారిపోతే, ప్రాణపోషకమైన వెచ్చదనాన్ని కూడా కోల్పోతారు. రొట్టె కాల్చడం చాలా మామూలు విషయమే, కాని దానికి నేర్పు కావాలి. అది తెలిసిన వాడు, దాన్ని తేలికగా కాలుస్తాడు. అదే, తెలియనివాడు మాడ్చి బొగ్గు చేస్తాడు. ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా ఇంతే. మీరు ఈ ప్రక్రియకు అనుకూలంగా ఉంటే ఆధ్యాత్మిక ప్రక్రియ మీకు పనిచేసేట్లు చేయడం చాలా తేలిక. కానీ ఈ సాధారణ ప్రక్రియకు మీరు అడ్డుపడుతూ, సంఘర్షిస్తూ ఉంటే, అది చాలా కష్టం.

లక్షలాది సంవత్సరాలుగా మనుషులు చేస్తున్న పిచ్చిపనులే చేస్తూ మీ కాలాన్ని వృథా చేసుకోకండి. కనీసం ఏదైనా కొత్త పిచ్చిపని నైనా చేయాలి కదా! అవే అర్థరహితమైన పనులు: ఈ క్షణంలో ఇది వాస్తవం అనుకుంటారు, మరుక్షణంలో కాదు అనుకుంటారు; ఈ క్షణంలో ఇది చాలా గొప్పది అనుకుంటారు , మరుక్షణంలో కాదు అనుకుంటారు. “నువ్వు అద్భుతమైన మనిషివనుకున్నాను, కాని నువ్వు ఘోరమైన మనిషివి.” అంటారు. ఈ క్షణంలో ఇదే సరైంది అని అంటారు. మరుక్షణంలో మీలో సందేహం. మిమ్మల్ని మీరు ఇలా తయారుచేసుకోకండి. మీరేదో, మీకొక్కరికే ప్రత్యేకమైన పిచ్చి పని చేస్తున్నారంటే సరే,మంచిది. కాని ఇవి అవే పిచ్చి కలుపుమొక్కలు. కొత్త కలుపుమొక్కలేవీ లేవు – ప్రజలు ఇదంతా చేసిందే. కలుపు పెంచడమనే పని చాలామామూలు ప్రక్రియ. ఏ మూర్ఖుడైనా చేయవచ్చు.

వృద్ధికి మూడు ‘ఐ’ లు

అమెరికాలో మనకు ‘ఈశా ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్నర్ సైన్సెస్’ ఉంది. దీని సంక్షిప్త రూపం ‘ఐఐఐ’. ఈ మూడు ‘ఐ’ లు మూడు మాటల్ని సూచిస్తాయి. మొదటిది ‘ఇన్‌స్ట్రక్షన్ – బోధన’, రెండవది ‘ఇంటిగ్రిటీ – సమగ్రత ’, మూడవది ‘ఇంటెన్సిటీ అఫ్ పర్పస్ -ప్రయోజన గాఢత ’.

‘ఇన్‌స్ట్రక్షన్’ అంటే బోధన, సూచన. దాన్ని జాగ్రత్తగా తెలుసుకోండి. చెప్పింది చెప్పినట్లుగా కచ్చితంగా పాటించండి. ‘ఇంటిగ్రిటీ’ అంటే సమగ్రత. ఇక్కడ మీకు భోదిస్తున్న ఆధ్యాత్మిక ప్రక్రియలన్నీ, అన్నిటినీ సమగ్రంగా ఐక్యత తో చుసేట్లు చేసేవే . మిమ్మల్ని మీరు ప్రత్యేకమైన వారు అనుకున్నట్లయితే అది మీకు కలుపుకొనే లక్షణం లేకపోవడం. అందరూ వదలుతున్న గాలినే మీరూ పీల్చుకొంటున్నారు. “ఇది నాకిష్టంలేదు. ఈ భూగోళం మీద మరో ప్రాణి పీల్చుకున్న గాలిని నేను పీల్చను” అని మీరు భీష్మించుకున్నారనుకోండి. మీ జీవితం అక్కడితో ముగుస్తుంది. అందువల్ల మీరు ఇక్కడ జీవించాలనుకుంటే, మీకు అన్నిటితో ఈ సమగ్ర భావం ఉండాలి. నిజానికి, భౌతికంగా మీరు అన్నిటితోనూ ఎల్లప్పుడూ సమగ్రంగానే ఉన్నారు. కేవలం, మానసికంగా మాత్రమే మీరు ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటున్నారు. ఇదే సమగ్రత లేకపోవడం అంటే.

మూడో ‘ఐ’ ఇంటెన్సిటీ అఫ్ పర్పస్. ప్రయోజన గాఢత. ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా మిమ్మల్ని పెద్ద మనిషిగానో, గొప్ప మనిషిగానో చేయడం గురించి కాదు. మిమ్మల్ని శూన్యంలో కరిగిపోయేట్టు చేయడానికి. మీరు కోరుతున్నది హద్దులులేని అనంతత్వమే తప్ప పెద్దరికం కాదు. ‘పెద్ద’ అన్నంత మాత్రాన హద్దులు చెరగిపోవు. ఈ ‘పెద్ద’ అనేదానికి సరిహద్దులున్నాయి. మీరు శూన్యం అయినప్పుడు మాత్రమే మీరు హద్దులులేని వారవుతారు. కాబట్టి దీన్ని మీరు గొప్పవారు కావడానికి వినియోగించుకోవద్దు. దీన్ని లయ మవ్వడానికి ఒక ప్రక్రియగా ఉపయోగించండి.

మీరు ఈ మూడు ‘ఐ’ లు పాటిస్తే ఆధ్యాత్మిక ప్రక్రియ మీకు అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ప్రతిరోజూ ఇది గమనించి చూడాలి. “ఔను, నాకది తెలుసు” అనుకుంటే, అది పనిచేయదు. మీ క్రియకు ముందు చేసే పని కాదిది. మీరు ఉదయం లేవగానే దీన్ని పరీక్షించుకోండి-

“నేనివ్వాళ ఇలాగే ఉన్నానా?” అని. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం మీరు ఏదో కోరుకున్నందువల్ల అది జరిగిపోదు. మీరు ఆ కోరిక నెరవేరడానికి సరైన పనులు చేయాలి. అప్పుడే మీరు కోరుకున్నది జరుగుతుంది.

మీరిలా కొనసాగితే, ఈ మొత్తం ప్రక్రియ, మిమ్మల్ని సృష్టి తో ఐక్యం అయ్యే స్థితికి తీసికొని వెళుతుంది. అది మీ గురించి నా కోరిక కాని, ఆలోచనకాని కాదు. అది సృష్టికర్త విధానం.🙏



Source - Whatsapp Message

కొంతకాలం కిందట ఒక సత్సంగంలో నన్ను ఎవరో ఇలా అడిగారు, “నేనెందరో ఆధ్యాత్మిక గురువుల్ని చూశాను. కానీ, మీరు ఆకర్షించినంతగా నన్నెవరూ ఆకర్షించలేదు. మీలో ఏముంది?” దానికి సద్గురు...

🙏 కొంతకాలం కిందట ఒక సత్సంగంలో నన్ను ఎవరో ఇలా అడిగారు, “నేనెందరో ఆధ్యాత్మిక గురువుల్ని చూశాను. కానీ, మీరు ఆకర్షించినంతగా నన్నెవరూ ఆకర్షించలేదు. మీలో ఏముంది?” దానికి

సద్గురు :- నేను, “మీలో లేనిది, నాలో ప్రత్యేకంగా ఏమీలేదు. అనంతమైన సంభావ్యత ఉన్న ఒక బీజాన్ని మనందరికీ ఇచ్చారు. మీరు చాలా మంచివాళ్లు, జాగ్రత్త పరులు, ఆ బీజాన్ని భద్రంగా ఉంచుకున్నారు. నేను ఆ బీజాన్ని నాశనం చేసి, దాన్ని ఓ చెట్టుగా మలచుకున్నాను.” అని చెప్పను.

మీరు విత్తనాన్ని ఓ చెట్టుగా చేయాలంటే, విత్తనం విత్తనంగా మిగిలి ఉండలేదు.. కదా…! విత్తనాన్ని విత్తనం గానే ఉంచడం మూర్ఖత్వం. కాని మిమ్మల్ని మీరుగానే భద్రపరచుకోవడం ఇవ్వాళ సమాజంలో గొప్పవిషయంగా భావింపబడుతూ ఉంది. మిమ్మల్ని మీరు ధ్వంసం చేసుకోవడం, ఒక వ్యక్తి పరిమిత సంభావ్యతను నాశనం చేయడం గొప్ప విషయమనుకోవడం లేదు. అందువల్ల మీరు చాలా తెలివైనవాళ్లు, ఎంత తెలివైనవాళ్లంటే మీరు జీవితాన్నే మోసం చేస్తున్నారు.

కలుపుతీసే ప్రక్రియ

మనందరం ఒకే విత్తనంతో వచ్చాం. అంటే ప్రతి విత్తన్నానికీ ఒకే విధమైన సంభావ్యత ఉంది. విత్తనం నుండి చెట్టుగా మారడానికి ఒక ప్రయాణం ఉంది. మీరు విత్తనం చెట్టుగా తయ్యారవ్వాలనుకుంటే, మీరు దాన్ని పోషించాలి, రక్షించాలి; మీరు కలుపు మొక్కలను తొలగించాలి – చాలా ఉంటాయి కలుపు మొక్కలు. అవే పిచ్చి కలుపుమొక్కలు. లక్షలాది సంవత్సరాలుగా మనవజాతిని ఇబ్బంది పెడుతున్నాయి. వాటినెలా తొలగించుకోవాలో మనుషులింకా తెలుకోలేదు. క్రోధం, అసహ్యం, అసూయ, భయం, సందేహం వంటి మామూలు విషయాలు – ఇవే పిచ్చి కలుపు మొక్కలు దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి, వాటిని ప్రత్యేకంగా పోషించవలసిన అవసరంకాని, కాపాడవలసిన అవసరంకాని లేదు – అవి వాటంతటవే పెరుగుతాయి. కాని ఒక పవిత్రబీజం మొలకెత్తి, వృద్ధి చెందాలంటే, మీరు కలుపుతీయాలి, నీళ్లు పెట్టాలి, ఎరువు వేయాలి, తగినంతగా సూర్యకిరణాలు తగిలేట్లు ఏర్పాటుచేయాలి. మీరు ఎండవేడి తగులుతుందేమో నని భయపడి, సూర్య కిరణాలను తప్పించుకోవాలనుకుంటే జీవితానికి ఆధారభూతమైన వెచ్చదనాన్ని కూడా కోల్పోతారు.

క్రోధం, అసహ్యం, అసూయ, భయం, సందేహం వంటి మామూలు విషయాలు – ఇవే పిచ్చి కలుపు మొక్కలు దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి

ప్రాణానికి ఏది ఆధారమో, అదే ప్రాణాంతకం కూడా. నిప్పు రొట్టెను కాల్చేడానికి ఉపయోగ పడుతుంది. అదే ఎక్కువైతే దాన్ని మాడుస్తుంది కూడా. మీకు వంటచేయడం బాగా చేతనైతే, రొట్టెను చక్కగా కాలుస్తారు; లేకపోతే దాన్ని మాడుస్తారు. మీరు ఎండకు భయపడి తప్పించుకోవడానికి నీడలోకి పారిపోతే, ప్రాణపోషకమైన వెచ్చదనాన్ని కూడా కోల్పోతారు. రొట్టె కాల్చడం చాలా మామూలు విషయమే, కాని దానికి నేర్పు కావాలి. అది తెలిసిన వాడు, దాన్ని తేలికగా కాలుస్తాడు. అదే, తెలియనివాడు మాడ్చి బొగ్గు చేస్తాడు. ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా ఇంతే. మీరు ఈ ప్రక్రియకు అనుకూలంగా ఉంటే ఆధ్యాత్మిక ప్రక్రియ మీకు పనిచేసేట్లు చేయడం చాలా తేలిక. కానీ ఈ సాధారణ ప్రక్రియకు మీరు అడ్డుపడుతూ, సంఘర్షిస్తూ ఉంటే, అది చాలా కష్టం.

లక్షలాది సంవత్సరాలుగా మనుషులు చేస్తున్న పిచ్చిపనులే చేస్తూ మీ కాలాన్ని వృథా చేసుకోకండి. కనీసం ఏదైనా కొత్త పిచ్చిపని నైనా చేయాలి కదా! అవే అర్థరహితమైన పనులు: ఈ క్షణంలో ఇది వాస్తవం అనుకుంటారు, మరుక్షణంలో కాదు అనుకుంటారు; ఈ క్షణంలో ఇది చాలా గొప్పది అనుకుంటారు , మరుక్షణంలో కాదు అనుకుంటారు. “నువ్వు అద్భుతమైన మనిషివనుకున్నాను, కాని నువ్వు ఘోరమైన మనిషివి.” అంటారు. ఈ క్షణంలో ఇదే సరైంది అని అంటారు. మరుక్షణంలో మీలో సందేహం. మిమ్మల్ని మీరు ఇలా తయారుచేసుకోకండి. మీరేదో, మీకొక్కరికే ప్రత్యేకమైన పిచ్చి పని చేస్తున్నారంటే సరే,మంచిది. కాని ఇవి అవే పిచ్చి కలుపుమొక్కలు. కొత్త కలుపుమొక్కలేవీ లేవు – ప్రజలు ఇదంతా చేసిందే. కలుపు పెంచడమనే పని చాలామామూలు ప్రక్రియ. ఏ మూర్ఖుడైనా చేయవచ్చు.

వృద్ధికి మూడు ‘ఐ’ లు

అమెరికాలో మనకు ‘ఈశా ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్నర్ సైన్సెస్’ ఉంది. దీని సంక్షిప్త రూపం ‘ఐఐఐ’. ఈ మూడు ‘ఐ’ లు మూడు మాటల్ని సూచిస్తాయి. మొదటిది ‘ఇన్‌స్ట్రక్షన్ – బోధన’, రెండవది ‘ఇంటిగ్రిటీ – సమగ్రత ’, మూడవది ‘ఇంటెన్సిటీ అఫ్ పర్పస్ -ప్రయోజన గాఢత ’.

‘ఇన్‌స్ట్రక్షన్’ అంటే బోధన, సూచన. దాన్ని జాగ్రత్తగా తెలుసుకోండి. చెప్పింది చెప్పినట్లుగా కచ్చితంగా పాటించండి. ‘ఇంటిగ్రిటీ’ అంటే సమగ్రత. ఇక్కడ మీకు భోదిస్తున్న ఆధ్యాత్మిక ప్రక్రియలన్నీ, అన్నిటినీ సమగ్రంగా ఐక్యత తో చుసేట్లు చేసేవే . మిమ్మల్ని మీరు ప్రత్యేకమైన వారు అనుకున్నట్లయితే అది మీకు కలుపుకొనే లక్షణం లేకపోవడం. అందరూ వదలుతున్న గాలినే మీరూ పీల్చుకొంటున్నారు. “ఇది నాకిష్టంలేదు. ఈ భూగోళం మీద మరో ప్రాణి పీల్చుకున్న గాలిని నేను పీల్చను” అని మీరు భీష్మించుకున్నారనుకోండి. మీ జీవితం అక్కడితో ముగుస్తుంది. అందువల్ల మీరు ఇక్కడ జీవించాలనుకుంటే, మీకు అన్నిటితో ఈ సమగ్ర భావం ఉండాలి. నిజానికి, భౌతికంగా మీరు అన్నిటితోనూ ఎల్లప్పుడూ సమగ్రంగానే ఉన్నారు. కేవలం, మానసికంగా మాత్రమే మీరు ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటున్నారు. ఇదే సమగ్రత లేకపోవడం అంటే.

మూడో ‘ఐ’ ఇంటెన్సిటీ అఫ్ పర్పస్. ప్రయోజన గాఢత. ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా మిమ్మల్ని పెద్ద మనిషిగానో, గొప్ప మనిషిగానో చేయడం గురించి కాదు. మిమ్మల్ని శూన్యంలో కరిగిపోయేట్టు చేయడానికి. మీరు కోరుతున్నది హద్దులులేని అనంతత్వమే తప్ప పెద్దరికం కాదు. ‘పెద్ద’ అన్నంత మాత్రాన హద్దులు చెరగిపోవు. ఈ ‘పెద్ద’ అనేదానికి సరిహద్దులున్నాయి. మీరు శూన్యం అయినప్పుడు మాత్రమే మీరు హద్దులులేని వారవుతారు. కాబట్టి దీన్ని మీరు గొప్పవారు కావడానికి వినియోగించుకోవద్దు. దీన్ని లయ మవ్వడానికి ఒక ప్రక్రియగా ఉపయోగించండి.

మీరు ఈ మూడు ‘ఐ’ లు పాటిస్తే ఆధ్యాత్మిక ప్రక్రియ మీకు అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ప్రతిరోజూ ఇది గమనించి చూడాలి. “ఔను, నాకది తెలుసు” అనుకుంటే, అది పనిచేయదు. మీ క్రియకు ముందు చేసే పని కాదిది. మీరు ఉదయం లేవగానే దీన్ని పరీక్షించుకోండి-

“నేనివ్వాళ ఇలాగే ఉన్నానా?” అని. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం మీరు ఏదో కోరుకున్నందువల్ల అది జరిగిపోదు. మీరు ఆ కోరిక నెరవేరడానికి సరైన పనులు చేయాలి. అప్పుడే మీరు కోరుకున్నది జరుగుతుంది.

మీరిలా కొనసాగితే, ఈ మొత్తం ప్రక్రియ, మిమ్మల్ని సృష్టి తో ఐక్యం అయ్యే స్థితికి తీసికొని వెళుతుంది. అది మీ గురించి నా కోరిక కాని, ఆలోచనకాని కాదు. అది సృష్టికర్త విధానం.🙏



Source - Whatsapp Message

హిందూ సంప్రదాయం లో వివాహం లో ముఖ్యమైన విషయాలు

హిందూ సంప్రదాయం లో వివాహం లో ముఖ్యమైన విషయాలు గురించి మన పూర్వికులు ఎందుకు ఆ ఆచారాలు పెట్టారో వాటి యొక్క విశిష్టత ఎటో తెల్సుకుందాం

👫🏼 భారతీయ హిందూ వ్యవస్తలో సంప్రదాయ వివాహం (పెళ్లి) ఎంతో గొప్పది. వివాహం జరుగుతున్నప్పుడు బ్రాహ్మణోత్తములు వధూవరులచేత కొన్ని సాంప్రదాయ పద్దతులను ఆచరింప చేస్తారు. అలా ఎందుకు చేస్తారు? వాటి పరమార్ధం ఏమిటి? కాబోయే నూతన వధూవరులు వాటిగురించి సూక్షమంగా తెలుసుకొనుట మంచిది.

పెళ్లంటే నూరేళ్లు.. తాళాలు, తప్పట్లు, పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, మూడు ముళ్లు, బంధువుల సందడి ఇది భారతీయ హిందూ సంప్రదాయ పెళ్లి. ఇల్లంతా పచ్చటి తోరణాలు, చుట్టాల ముచ్చట్లు, ఆడవాళ్ల ఆభరణాలు, పట్టుచీరల సోయగాలు, పిల్లల కోలాహలంతో.. పెళ్లి ఇంటి సందడే సందడి. ఇక మూడు ముళ్లతో ఒక్కటయ్యే జంట సంగతి చెప్పనక్కరలేదు. చిలిపి ఆలోచనలు, సిగ్గు తెరలు, ముసిముసి నవ్వులు, అందమైన అలంకరణలో మెరిసిపోతుంటారు వధువు, వరుడు.

పవిత్రంగా భావించే హిందూ సంప్రదాయ పెళ్లిలో చాలా విశిష్టతలున్నాయి. చాలా ఆచారాలు, సందప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం వెలుతులో కొత్తజీవితాన్ని ఆహ్వానిస్తున్న వధూవరులు.. పెళ్లికి పరమార్థం చెప్పే వేదమంత్రాలు.. శ్రావ్యంగా వినిపించే మంగళవాయిద్యాలు.. మనస్పూర్తీగా దీవించే పెద్దలు.. అందరికీ ఆహ్వానం పలికే పచ్చటి పందిరి.. ఘుమఘుమల సువాసనలతో నోరూరించే విందు భోజనం.. అన్నింటి మేళవించే..
తెలుగింటి పెళ్లి వైభోగం.

అయితే పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్ధానం వెనక చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది. హిందూ సంప్రదాయానికి అద్దంపట్టే తెలుగు పెళ్లిలోని విశేషాలు, వాటి విశిష్టతలు ఏంటో ఒక్కసారి గుర్తుచేసుకుందాం.

బాసికం
బాసికం పెళ్లి అంటే ముందుగా వధూవరుల అలంకరణకు ఖచ్చితంగా ఉపయోగించేది బాసికం. వధూవరుల నుదుటిపై కాంతులీనే ఆభరణమే బాసికం. దీన్ని పూలతో, బియ్యపు గింజల కూర్పుతో, ముత్యాలతో తయారు చేస్తారు. దీన్ని పెళ్లి సమయంలో ఖచ్చితంగా వధూవరులు కట్టుకోవాలి. ఎందుకనే డౌట్ అందరికీ ఉంటుంది. దృషి దోష నివారణకు బాసికాన్ని కడతారు. సున్నిత భాగాలపై దృష్టి దోషం తగలకుండా ఉండటానికి బాసికాన్ని కడతారు.

జీలకర్ర, బెల్లం
జీలకర్ర, బెల్లం జీలకర్ర, బెల్లం కలిపితే ధన విద్యుత్ ఉత్పన్నమై వస్తువులను ఆకర్షించే శక్తి కలుగుతుందని సైన్స్ చెబుతోంది. జీలకర్ర, బెల్లం పెట్టడం వల్ల తలపై ఉండే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. అలాగే జీలకర్ర, బెల్లం మిశ్రమం బాగా కలిసిపోతుంది. అలా వధూవరులు కూడా కలిసిపోవాలని పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.

వధూవరుల మధ్యలో తెర

వధూవరుల మధ్యలో తెర మధ్యలో ఉంచే తెరకు కూడా అర్థం ఉంది. వధువును జీవాత్మగా, వరుడిని పరమాత్మగా భావిస్తే మధ్యలో ఉండే తెర మాయ. జీవాత్మకు పరమాత్మ దర్శనం కావాలంటే మాయను తొలిసారి తలపై చేతులు ఉండగా భ్రూమధ్య స్థానంలోనే చూస్తారు. ఇలా వాళ్ల బంధం బలపడుతుందని అర్థం.

కన్యాదానం
కన్యాదానం దానం చేస్తే ఆ వస్తువుతో మనకు అన్ని సంబంధాలు తెగిపోతాయి. కానీ పెళ్లిలో మాత్రం అలా కాదు. దానాలలో అతి శ్రేష్టమైనది కన్యాదానం. పెళ్లికూతురి తండ్రి తన కూతురిని వరుడికి దానం ఇస్తారు. పంచ భూతాల సాక్షిగా, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురిని ధర్మ, అర్థ, కామ, మోక్షాలకై అల్లుడికి దానమిస్తాడు వధువు తండ్రి. ఈ దానం వల్ల తనకు బ్రహ్మలోక ప్రాప్తి కావాలని కోరుకున్నట్లు.

బ్రహ్మముడి
బ్రహ్మముడి వధువ చీర అంచును, వరుడి ఉత్తరీయం చివరలను కలిపి ముడి వేయటం అంటే జీవితాంతం ఆశీస్సులను, బ్రాహ్మణాశీర్వచనాలను దంపతుల కొంగులతో ముడివేయటమే. వధూవరుల బంధం శాశ్వతంగా, స్థిరంగా ఉండాలని ఈ ముడి వేయిస్తారు.

ఉంగరాలు తీయటం
పెళ్లిలో ఉంగరాలు తీసే కార్యక్రమం వధూవరులతో పాటు.. చుట్టూ ఉన్న వాళ్లందరికీ చాలా సరదా. చూడటానికి చాలా సరదాగా కనిపించే తంతు ఇది. పోటీ పడి గెలవాలనే పట్టుదలని, అంతలోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనని చిగురింపజేస్తుంది

మంగళ సూత్రం
సూత్రం అంటే దారం. మంగళప్రదమైంది కనుగ మంగళ సూత్రం. ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొలగిస్తుందని నమ్మకం. ఈ మాంగల్యాన్ని వరుడు, వధువు మెడలో వేసి మూడుసార్లు ముడి వేస్తాడు.

మూడు ముళ్లే ఎందుకు ?
మనకు మూడుతో విడదీయరాని సంబంధం ఉంది. త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు, ఇలా ఏది చూసినా మూడే ఉంటాయి. అలా మూడుకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి ముడులు కూడా మూడు ఉన్నాయి. అలాగే మనకు స్థూల, సూక్ష్మ, కారణ అని మూడు శరీరాలు ఉన్నాయి. ఆ మూడు శరీరాలకు మూడు ముళ్లు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి స్థూల శరీరం ఉన్నా, లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది అందులోని పరమార్థం.

మాంగళ్య ధారణ సమయంలో మంత్రం
మాంగళ్యధారణ సమయంలో చదివే మంత్రానికి చాలా విశిష్టత ఉంది. మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా, కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాం శతమ్. అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో నేనే నీ మెడలో మాంగళ్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను. నీ మెడలోని మాంగల్యంతో నీవు శత వసంతాలు జీవించాలి. నీ మాంగళ్యమే నాకు రక్ష. నా జీవితం, నా జీవనగమనం ఈ మాంగళ్యంపైనే ఆధారపడి ఉందని అర్థం.

తలంబ్రాలు
తలంబ్రాలు వివాహంలో ముఖ్య ఘట్టం. వధూవరుల భావి జీవితం మంగళమయం కావటానికి మంగళ ద్రవ్యాలచే చేయించే పవిత్ర కర్మ ఈ తలంబ్రాలు. వీటికి వాడేవి అక్షతలు. అక్షత అంటే విరిగిపోనివి అని అర్థం. ఇక దానికి బియ్యాన్నే ఎందుకు ఉపయోగిస్తారంటే బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలని, గృహస్థు ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలని వాడతారు.

పాణిగ్రహణం
కన్యచేతిని వరుడు గ్రహించటమే పాణిగ్రహణం. వరుడు తన కుడి చేతితో వధువు కుడిచేతిని పట్టుకోవటాన్ని పాణిగ్రహణం అంటారు. ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తానని సూచించటానికి, పురుషుని కుడి చేయి బోర్లించి, స్త్రీ కుడి చేయిపైకి ఉండేలా చేయి పట్టుకోవాలి. దీనికి అర్థం ఇంటి యజమానురాలిగా, ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా ఇంటికి రమ్మని ఆహ్వానించటం.

హోమం
పవిత్రమైన అగ్ని మనిషికి, దేవునికి వారధిగా ఉంటుంది. హోమం చుట్టూ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్టు అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఏడు సార్లు తిరుగుతారు

ఏడు అడుగుల పరమార్థం
భార్యా భర్తలు ఇద్దరు కలిసి వేసే ఏడు అడుగుల్లో ప్రతి అడుగుకి అర్థం ఉంది. ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని, ఇద్దరం ధైర్యంతో, శక్తితో అన్ని అవసరాలని తీర్చుకుంటామని, ఇద్దరం కలిసి కుటుంబం సుఖ సంతోషాల కోసం పాటుపడతామని, కష్టసుఖాలలో కలిసి ఉంటామని, ఇద్దరు కలిసి పిల్లల్ని మంచిదారిలో పెంచుతామని, ఇద్దరం కలిసి సుఖ, శాంతి కోసం పాటుపడతామని, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామని, జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటామని చెబుతారు.

నల్ల పూసలు ధరించేది ఎందుకు?
మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.

భార్య, భర్తకు ఏ వైపు
ఎలాంటి కార్యాలలోనైనా భర్తకు భార్య ఎడమ వైపునే ఉండాలన్నది నియమం. పూజలు, దానాలు, ధర్మాలు చేసేటప్పుడు భార్య, భర్తకు ఎడమవైపునే ఉండాలి. కన్యాదానం, విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడి వైపున ఉండాలి.

కాలితో బియ్యం నెట్టడం ఎందుకు ?
కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో కాలుపెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోనికి వస్తుంది. లక్ష్మీ నివాసముండే వరి బియ్యం లేదా బియ్యంతో నిండిన కలశంను గడపపై ఉంచుతారు. ఇలా దీన్ని ఇంట్లోకి నెట్టుతూ లోపలికి పెళ్లికూతురు వస్తే లక్ష్మీదేవినే ఆ ఇంట్లోకి తీసుకొచ్చినట్టు అవుతుందని అర్థం.
ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం వస్తుందని నమ్మకం🙏



Source - Whatsapp Message

అన్నీ ఉచితం ! అంతా ఉచితం !

అన్నీ ఉచితం ! అంతా ఉచితం !
✍🏻
45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి,

45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను.

ఇంక జీవితంలో లేదు టెన్షన్,
.
ఆకలేస్తే అన్న క్యాంటిన్

రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు

నిద్దరొస్తే సర్కారిచ్చిన ఇల్లు,

చుట్టాలొస్తే రూపాయికిలోసన్నబియ్యపువిందు !

పండగొస్తే 2 gas సిలిండర్లు,పండుగ కానుకగా ఒక సంచిలో 5 ఐటమ్స్.
.
అంతా బాగానే ఉన్నది !
భూతల స్వర్గం మన రాష్ట్రం !

కానీ
.
అన్న క్యాంటిన్ లో వంట ఎవరు చేస్తారు ? ఎందుకు చేస్తారు ?

రోగానికి మందిచ్చి సేవచేయటానికి ఎవరుముందుకొస్తారు ?

ఇంటినిర్మాణానికి రాళ్ళెత్తే కూలీవస్తాడా ?
.
వ్యవస్థ ,సమాజం ఛిన్నాభిన్నం కాదా ! అసలు మన నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ, మనలోని ఆత్మ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.

5 రూపాయల భోజనం ప్రజలు అడిగారా??

పండుగలకు బహుమతి అడిగారా??

లేదు

నాణ్యమైన జీవితం కావాలని అడిగారు.

రోడ్లు అడిగారు, కరెంటు,నీరు,విద్య , ఉద్యొగ కల్పన అడిగారు.

కానీ

అవి కాకుండా ఇదేమి విచిత్రం.

అసలు మనం ఎటు పోతున్నాం.

అసలు సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా ?

Is it worth living ???
.
ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే "సంఘర్షణ"

ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధాని పీఠం దాకా రావాలంటే "సంఘర్షణ "

తన కలలు పండించుకోవడానికి ఒక "అబ్దుల్ కలామ్ " పడ్డది "సంఘర్షణ "

మనిషి ఎదగాలంటే కావాల్సింది సంఘర్షణ!
.
పథకం చూడటానికి గొప్పదే
.
ఇప్పటికే ప్రతి రంగం లోను పని చేసేవారు లేక కుదేలయిపోయింది !
.
వ్యవసాయానికి కూలీలేడు
కొట్లోకి గుమాస్తా దొరకడు !

పనికి రమ్మంటే ఒక్కడూ రాడు ! వచ్చినా సరిగా పని చేయడు.
.
మనిషిని పనికి పురికొల్పేది అతని ఆకలే ! ఆకలి తీర్చాలి !

కానీ ఉచితంగా కాదు ! అది తీరేమార్గం చూపించాలి !

ఒక సామెత ఇలా ఉంది : ఆకలితో ఉన్నవాడికి చేపలు పట్టడం నేర్పండి చేపను మనమే పట్టి దానిని వండి వాడి నోట్లో పెడితే వాడు ఎప్పుటికీ చేపను పట్టటం నేర్చుకోలేడు అప్పుడు అతను సోమరి కాక ఇంకేమవంతాడు
అతనికి ఎప్పుడు ఆకలేసిన, ఆకలి తీరుతుంది.

అన్ని ఉచితంగా ఇస్తాను. అంటే ఏమిటిది ???

.
ఎవరికి ఉచితమివ్వాలి?

పని చేసుకోలేని వారికి ,వృద్ధులకు ,అనాధపిల్లలకు, వికలాంగులకు, అభాగ్యులకు.
వారికి చేయూతనిచ్చే వ్యవస్థ ను రూపొందించండి.
.
అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు ! 🙏🙏

పనిచేయని వాడికీ, పని చేసే వాడికీ కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తే, చివరకి పని చేసే వాడు కూడా పని చేయడం మానేస్తాడు. వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది,
యువత తల్లి తండ్రుల మాట వినరు, కాలమంతా హృదా చేసుకుని చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకునే రోజు వస్తుంది. ఉచితాల విషయంలో ప్రభుత్వం కొంచెం ఆలోచించి అటు బిలో ఏవరేజ్ మరియు మధ్యతరగతి సగటు కుటుంబాలకు ఉపయోగకరమైన మంచి పధకాలు అంటే ఉచితంగా విద్య, వైద్యం, గూడు ఇవి అందరకు కల్పించగలిగితే రాష్ట్రం అభివృద్ది లో ముందుకు పరుగు పెడుతుంది, అప్పుడు అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందు వరుసలో ఉంటుంది అనటానికి సందేహించనవసరములేదు.
ఒకప్పటి రష్యా పరిస్థితి ఇంతే కదా! 👋
మాకు ఏది ఉచితంగా ఇవ్వకండి ! మాకు పని కల్పించండి !!
ప్లీజ్ షేర్ లు ఎక్కువ చెయ్యండి.

Source - Whatsapp Message

మనస్సును అదుపులో పెట్టుకొనుట ఎలా..!

💫 మనస్సును అదుపులో పెట్టుకొనుట ఎలా..!

[శ్రీరమణమహర్షి ఇచ్చిన సూచనలు ]

భక్తుడు :
స్వామి, కళ్ళు మూసి ఉంచి ధ్యానములో కూర్చుంటే పర్వాలేదు కాని, అదే కళ్ళు తెరిచి కూర్చుంటే బాహ్య ప్రపంచపు ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి. ఏమి చెయ్యమంటారు ?

శ్రీరమణమహర్షి :
కళ్ళు తెరచి ఉంచినంత మాత్రాన ఏమి అవుతుంది ? ఎలాగైతే నీవు ఇంట్లో కిటికీలు తెరచుకుని నిద్రపోతావో అలాగే మనసును నిద్ర పోయేలా చెయ్యగలిగితే కళ్ళు తెరచి ఉంచినా ఇబ్బంది ఉండదు.

భక్తుడు :
మనస్సును బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా, దానిని నియంత్రించుట మాకు సాధ్యపడడం లేదు స్వామి.

శ్రీరమణమహర్షి :
అవును అది నిజమే. ఎలాగయితే చిన్న పిల్లవాడు తన నీడను తానూ పట్టుకోవాలని పరిగెడుతూ, పట్టుకోలేక ఏడుస్తుంటే తల్లి వచ్చి వాడిని ఆ పని చెయ్యకుండా అడ్డుకుంటుందో, అదే విధముగా మనము కూడా మన మనస్సు ఎటూ వెళ్ళకుండా అడ్డుకోవాలి.

భక్తుడు :
ఎలా అడ్డుకోగలం స్వామి ?

శ్రీరమణమహర్షి :
వేదాంతమును వినుట మరియు దానిపై ధ్యానము చేయుట ద్వారా మనస్సును అదుపులో పెట్టవచ్చు.

భక్తుడు :
అంటే మనము బాహ్య సుఖాలను వదిలి పెట్టి , ఆత్మానందమును అనుభవించాలి అనా స్వామి ?

శ్రీరమణమహర్షి : ఆనందము ఎల్లప్పుడూ ఉంటుంది. మనము చేయవలసిందల్లా బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుండి దూరంగా ఉండాలి. అప్పుడు మిగిలేది ఆనందమే. ఆనందము మన స్వభావము. దాని కోసము మనము ఎక్కడ వెతకక్కరలేదు.

భక్తుడు :
అది అంతా సరే స్వామి, కాని మేము ఎంత కృషి చేసినా మా మనస్సును అదుపులో పెట్టడం మా వాళ్ళ కావటం లేదు. ఏమి చెయ్యమంటారు ?

శ్రీరమణమహర్షి : నవ్వుతూ... తన చేతి వేలిని కంటిపై పెట్టుకుని, "చూడండి, ఈ చిన్న చేతి వేలు కంటికి అడ్డుగా ఉండి ఈ ప్రపంచాన్నే కనపడ కుండా చేస్తోంది. అలాగే ఈ చిన్ని మనస్సు ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించి ఆత్మ జ్ఞానమునకు అడ్డు పడుతుంది. చూడండి అది ఎంత శక్తివంతమైనదో !" 🙏

Source - Whatsapp Message

అన్యోన్య దాంపత్యం - అన్యోన్యంగా వుండటం అంటే సర్దుకుపోవటమే చక్కటి బంధానికి నిర్వచనం...

అన్యోన్య దాంపత్యం
🕉️🌞🌎🏵️🌼🚩

అన్యోన్యంగా వుండటం అంటే సర్దుకుపోవటమే చక్కటి బంధానికి నిర్వచనం...

పెళ్ళికి ముందు ప్రతి ఒక్కరూ తనకు రాబొయే జీవిత భాగస్వామి ఇలా ఉండాలి.......
ఇలా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటూ ఉంటారు. కానీ పెళ్ళి అయిన తరువాత
జీవితం వేరేగా ఉంటుంది. మన కలలకు అనుగుణంగా లేకపోయే సరికి నిరుత్సాహ
పడిపోతుంటారు. కానీ ప్రతీ ఒక్కరిలోనూ సుగుణాలు ఉంటాయి. లేకపోతే మన ప్రేమతో మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.........
పెళ్ళి అయిన తరువాత తన జీవిత భాగస్వామిలో తాను కోరుకున్న అంశాలు
కనపడక ఒకరినొకరు సర్ధుకొనక చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి.
కొన్ని మంచి గుణాలైనా తప్పక ఉంటాయి. కాబట్టి మిగతావాటిని కూడా
మీ మంచి తనంతో....నడవడికతో ఎదుటివారిలో మార్పు తీసుకునిరావచ్చు,
నచ్చిన మనిషికి నచ్చిన పనులే చేసి మంచిమార్పును ఎదురు చూడవలసిన
పనిలేదు. నచ్చిన మనిషికి నచ్చని పనులు చేయకుండా తనను అనుసరిస్తూ
కూడా మార్పును తీసుకురావచ్చు......అదే నిజమైన జీవితానికి అర్థం......
సర్ధుకునే స్వభావం ఇద్దరిలో ఉంటేనే ఆ సంసారం ఆనందమయం అవుతుంది.
ఎదుటివారిలోపాలను ప్రేమతోనే సరిదిద్ధవచ్చు. ....

🕉️🌞🌎🏵️🌼🚩

Source - Whatsapp Message

మనం చేసే పనులను బట్టి దైవం దర్శనమిస్తాడు

🦚ఒక ఊరిలో ఒక వ్యాపారికి రోజు రాత్రుళ్ళు దయ్యాలు కనిపించి భయపెడుతూ ఉంటాయి

పాపం ఆ వ్యాపారి రాను రాను కొంత కాలానికి భయం తో రాత్రుళ్ళు నిద్ర పోవడమే మానేస్తాడు

ఈ దయ్యలను వదిలించు కోవడం కోసం తాను సంపాదించిన సంపాదన అంతా కూడా

భూత,ప్రేత, పిశాచ మాంత్రికుల దగ్గరకు మోహిని, శాకిని, డాకిని లను కూడ అటాడించే
అఘోరాల దగ్గరకు

ఎన్నో ఏళ్లుగా శక్తివంతంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయాలకు, దర్గాలకు తిరిగి తిరిగి అలసి పోతాడు

ఇలా కాదని విజ్ఞాన పరంగా వైద్యం అందిస్తున్న సైకియాట్రిస్ట్ ల దగ్గరకు కూడ వెళ్లి

వారిచ్చిన మందులు ప్రారంభిస్తాడు వారిచ్చిన ఆ మందులతో
పగటి పూట కూడ నిద్ర వచ్చి
నిద్రపోతే అప్పుడు కూడ ఆ దయ్యాలు వ్యాపారిని భయపెడుతూ ఉంటాయి

ఇంకా తన దగ్గర ఉన్న సంపాదన అంత కర్చు అయిపోయి ఇంకా అప్పులు కూడా పెరిగి పోతాయి
ఇంకా లాభం లేదనుకొని ఆత్మహత్యే శరణ్యం అనుకొని తను ఆత్మహత్య కు
సిద్ధపడతాడు

ఇంతలో తన సమస్య తెలిసిన
ఒక స్నేహితుడు అతని దగ్గరకు వచ్చి ఇలా అంటాడు నీకు వచ్చిన సమస్యకు మన ఊరి చివర ఉన్నకొండ దగ్గరి గుడి ముందు ఒక పకీరు ఉన్నాడంట

అతని దగ్గరకు వెళితే నయం అవుతుందని విన్నాను ఒక సారి వెళ్దామా అంటాడు

ఆ వ్యాపారికి మనసులో నమ్మకం లేకున్నా
ఎలాగు చనిపోదమని అనుకుంటున్న కదా ఒక సారి చూస్తే పోలే అని చిన్న ఆశతో
తన మిత్రునితో కలసి పకీర్ దగ్గరకు వెళతాడు

ఆ పకిరుతో తనకున్న సమస్య
అంతా కూడ వివరిస్తాడు
అది విన్న పకిరు
నీవు ఏ వృత్తిలో జీవనం సాగిస్తు ఉన్నావు అని అడుగు తాడు

దానికి బదులుగా వ్యాపారి
నేను మన ఊరి మధ్యలో వున్న
ఐదు అంతస్థుల భవనం అద్దెకు తీసుకొని హోటల్ నడుపుతున్నాను అంటాడు

అప్పుడు పకీర్ నీ హోటల్లో ఏమేం ఏమేం ఉంటాయి అని అడుగుతాడు

దానికి వ్యాపారి నా హోటల్లో
దేశ విదేశాలకు సంబంధించిన
మాంసాహార శాకాహార వంటకాలు ఇంకా అనేక రకాల భోజనాలు ఉంటాయి స్వామి
నా దగ్గర యాభై మంది పని వాళ్ళు కూడ వున్నారు అంటాడు

అబ్బో చాల పెద్ద వ్యాపారమే
కానీ ఇప్పుడు నీకు ఉన్న సమస్యకు ఇంత ఇబ్బంది తో కూడుకున్న వ్యాపారం సరి కాదు నువ్వు ఇప్పుడు నడుపుతున్న వ్యాపారాన్ని అపేసి
కొన్ని రోజులు చిన్న వ్యాపారం చేసుకో అంటాడు

దానికి వ్యాపారి చిన్న వ్యాపారం అంటే ఏ వ్యాపారం
చేయమంటారు స్వామి అని అడుగుతాడు

దానికి పకీరు బదులుగా కూరగాయలు లేదా పండ్లు అలాంటి వ్యాపారాలు అని చెప్పి తన దగ్గర ఉన్న తావిజుని వ్యాపారి మెడలో వేసి మళ్లీ కొంత కాలానికి వచ్చి
ఎలావుందో చెప్పు నాయన అంటాడు

అక్కడినుండి వెళ్ళిన వ్యాపారి
తన పాత వ్యాపారాన్ని నిలిపివేసి కొత్తగా పండ్ల వ్యాపారాన్ని ప్రారంభించి కొంత కాలానికి ఎంతో సంతోషం తో
ఫకీర్ దగ్గరకు వెళతాడు

అప్పుడు పకీరు ఎలా ఉంది నాయన ఇప్పుడు అని అడుగుతాడు

వ్యాపారి తమరి దయవల్ల ఇప్పుడు నా జీవితం ఎంతో ఆనందం తో చాలా బావుంది నేను మీకు ఎప్పుడు రుణ పడి ఉంటాను స్వామి

ఇప్పుడు నాకు రాత్రుళ్ళు దయ్యాలు కనిపించట్లేదు దయ్యాలు కనిపించక పోగ తమరి తాయత్తు మహిమతో

నాకు కలలో అప్పుడప్పుడు దేవుళ్ళు కూడ నాకు దర్శనం ఇస్తున్నారు స్వామి అంటాడు

దానికి పకిరు చూడు నాయన నా దగ్గర కాని నేనిచ్చిన తావిజు దగ్గర కాని ఎటువంటి మహిమల్లేవు

నీకు వచ్చిన సమస్య నీ నుండే వచ్చింది నీ నుండే పోయింది
గతంలో నువ్వు హింసతో కూడుకున్న వ్యాపారం చేశావు
నువ్వు చేసిన ఆ వ్యాపారం ఎంతో జీవ హింస తో కూడుకొని ఉన్నది

అందువల్ల ఆ భగవంతుడే రోజు నీకు కలలో దయ్యాల రూపంలో
భయపెట్టాడు ఇప్పుడు నువ్వు
ఏ హింస లేని వ్యాపారం చేస్తున్నందున ఇప్పుడు నీకు దేవతలు గా కనిపిస్తున్నాడు

నిజానికి దయ్యం ఎక్కడ లేదు అంతా దైవమే ఒక నాణానికి రెండు రూపాలు ఎట్లనో
మనం చేసే పనులను బట్టి దైవం దర్శనమిస్తాడు

మనం చేసే వృత్తి సరైనద కాద అని మనమే నిర్ధారించుకొని
మన వృత్తిలో మనం ముందుకు సాగాలి

సత్యవాణి

Source - Whatsapp Message

కాలం విలువ

🌹 కాలం విలువ* 🌹

😃 ఒక వ్యక్తి జీవిత కాలం శ్రమించి కోట్లు సంపాదించాడు.
ఒకనాడు పోగయిన సంపదను లెక్కిస్తూ తన జీవితంలోకి😔 తొంగి చూసుకున్నాడు.
🏃🏻‍♂️సంపాదన వెంట పరుగులు తీసే క్రమంలో,
తాను ఆ సంపదను అనుభవించ లేదని,
☝️ఒక్కరోజు కూడా ఆనందంగా లేనని గ్రహించాడు.
😃 ఆనందం విలువ తెలిసి ఇక పరివారంతో ఆనందించాలి అనుకున్నాడు.
🙃 కానీ ఆ రాత్రి యమధర్మరాజు వచ్చాడు🏃🏻‍♂️. ☝️గంట జీవితం కోసం మొత్తం సంపదను ఇస్తానని ప్రాధేయపడినా, యముడు ఒప్పుకోలేదు.
😩 జీవితకాలం సంపాదించిన సంపదను వదలి, అతను వట్టి చేతులతో యముని వెంట వెళ్లాల్సి🏃🏻‍♂️ వచ్చింది.
🌹 కాబట్టి దేనికోసం దేనిని విడిచి పెట్టాలో,
🌹 ఏ కాలంలో ఏ పని చేయాలో,
🌹 తెలిసి ఆ పని చేయడమే కాలాన్ని అవగాహన చేసుకోవడం.
🌹 కనుక కాలం విలువ తెలుసుకుని శ్రమిస్తే విజయం తథ్యం .

🌺🙏సర్వేజనా సుఖినోభవంతు🙏🌺

🌴 సేకరణ
🌴VRMS/TRR/TG
🌴🌴🌴🌴🌴🌴🌴🌴
🌴TIME IS MONEY🌴🌴🌴🌴

Source - Whatsapp Message

బంధాలు, అనుబంధాలు

🌹బంధాలు, అనుబంధాలు🌹

💥నాన్న అప్పటికి హాస్పిటల్‌లో జాయినై వారంరోజులైంది. లివర్‌ పూర్తిగా పాడైపోయింది. మరో రెండు మూడు రోజులు మించి బతకరని డార్టర్లు తేల్చేశారు.

మొదటి రెండురోజులు ఆ ఐసీయూ గదిలోకి వెళ్ళడానికి నాకు ఇబ్బందిగా అనిపించలేదు. కానీ, నాన్నకు నేను ప్రామిస్‌ చేశాక, ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళాలంటే మాత్రం భయమేస్తోంది. కానీ తప్పదు. మెల్లగా ఆ గదిలోకి వెళ్ళాను.

ఆ స్థితిలోనూ నాన్న నావంక బేలగా చూశారు. ఆయన కళ్ళల్లో ఒక్కటే ప్రశ్న- ‘నువ్వు చేయగలవా?’

పెదవులు బిగబట్టాను. ‘మాట ఇచ్చినప్పుడు చాలా సులభం అనిపించింది... ప్రయత్నం ప్రారంభించగానే ఎంత కష్టమో అర్థమైపోయింది...చేయగలనన్న నమ్మకం నాకు మెల్లగా తగ్గిపోతోంది.’

‘మరో రోజో... రెండురోజులో..! నేనెంతో ఇష్టపడే నాన్న- నన్ను... వూహు... ఈ లోకమే వదిలి వెళ్ళిపోతారు.’

డాక్టర్లు ఆ విషయం తేల్చి చెప్పేశారు.

నాన్న నాకు జీవితంలో అన్నీ సమకూర్చి ఇచ్చారు. కానీ, ఏనాడూ ఏదీ అడగలేదు. చనిపోతానని తెలిశాక ఒక్క కోరిక... ఒకే ఒక్క కోరిక కోరారు.

‘‘ఏరా నవీన్‌, నేను చనిపోతే నా శవాన్ని, మీ అమ్మ సమాధి పక్కనే ఖననం చేయగలవా?’’

అది ఆయన కోరినప్పుడు చాలా చిన్న కోరికలా అనిపించింది. అందుకే దానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా ‘‘అలా అనకు నాన్నా... మీకేం కాదు’’ అంటూ తనకు బతుకు మీద భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాను.

‘‘నాకు ఇప్పుడేమవుతుందో, రేపేమవుతుందోనన్న భయం లేదురా... ఎప్పుడు, ఎలా జరిగినా చివరికి అక్కడికి చేరుకోవాలనే కోరిక మాత్రమే మిగిలింది. నేను వెళ్ళిపోయాక నాకేం కావాలో నిన్నడుగుతున్నాను... నాకు కావలసింది చేయగలవా?’’

‘‘తప్పకుండా చేస్తాను నాన్నా.’’

మూడురోజుల క్రితం నాన్నకు మాటిచ్చాను.

మర్నాటి నుంచీ ఆయన నన్ను మరింత పరిశీలనగా చూడటం మొదలుపెట్టారు. రెండోరోజు నా ముఖంలో నిరాశ కదలాడటం ఆయన గమనించినట్టున్నారు. అందుకే అడిగేశారు ‘‘నేను అడిగింది చేయగలవా?’’

‘‘ఆ ప్రయత్నంలోనే ఉన్నాను నాన్నా.’’

ఆయనకు విషయం కొంతవరకూ అర్థమైనట్టుంది. మౌనంగా ఉండిపోయారు. కానీ, నాకేసి ఆర్తిగా చూడటం మానలేదు.

ఒకవైపు ప్రాణాలు పోబోతున్నాయని తెలుస్తూనే ఉంది. మనిషి అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్ళి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ, కాసింత తెలివి వచ్చినా, నాకేసి అలా ప్రశ్నకు జవాబు కోసమే ఎదురుచూస్తున్నారు.

ఐసీయూలో నుంచి నెమ్మదిగా బయటకు నడిచాను. కారిడార్‌లో నా కోసమే ఎదురుచూస్తున్న ప్రమద.. నా ముఖం చూసి అడిగింది ‘‘ఏంటీ, ఆయన అడిగినదాని గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నారా?’’

అవూనూ కాదూల మధ్య తలాడించాను.

ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందన్నట్టు ఆమె అంది... ‘‘చేస్తానన్నారు కదా... చేస్తాననే చెప్పండి. అదే భ్రమలో ఆయనను పోనివ్వండి. పోయాక ఏం జరింగిందన్నది ఆయనకు తెలియదు కదా! మనం ఆ దహన సంస్కారాలేవో ఇక్కడే చేద్దాం.’’

నేను మా ఆవిడకేసి నిరాభావంగా చూశాను. మనుషుల్ని మోసం చేయడం అలవాటైపోయింది. చివరికి శవాలను కూడా మోసం చేయడం!?

నేనేం మాట్లాడకపోయేసరికి తను కాస్త ఈసడింపుగా తల పక్కకు తిప్పుకుని తన పిల్లల దగ్గరకెళ్ళి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది.

నిన్నటి నుంచీ చేసిన నా ప్రయత్నాలను గుర్తుచేసుకుంటూ అలా నిలబడిపోయాను.

విన్నప్పుడు చాలా చిన్న విషయంలా అనిపించింది... శవాన్ని ఓ పల్లెకు చేర్చి ఆయన కోరుకున్న చోట పూడ్చిపెట్టడం!

అది నాన్న మాస్టారుగా ఉద్యోగం చేసిన వూరు. నేను పుట్టి పెరిగిందీ ఆ పల్లెలోనే! ఆరేళ్ళక్రితం వరకూ నాన్న, అమ్మతో కలసి ఆ వూళ్ళొనే ఉండేవారు. అమ్మ చనిపోయాక తనను ఒంటరిగా ఉంచడం ఇష్టంలేక హైదరాబాద్‌ తీసుకొచ్చేశాను.

ఆ వూరు సిటీకి ఆరువందల కిలోమీటర్ల దూరంలో ఉంది. అంబులెన్స్‌లో ఆ వూరికి శవాన్ని తీసుకెళ్ళడం పెద్ద కష్టం కాదు. కానీ, శవాన్ని తిన్నగా స్మశానానికి తీసుకెళ్ళలేం. అలా చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఏదో ఇంట్లో దించి అక్కడినుండి వూరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్ళాలి.

ఒకప్పుడు ఆ వూళ్ళొ మాకు బంధుమిత్రులు ఎక్కువగానే ఉండేవారు. కానీ నేను హైదరాబాద్‌ వచ్చేశాక వాళ్ళతో రిలేషన్స్‌ మెయిన్‌టైన్‌ చేయలేకపోయాను. అందులోనూ దూరపు వరసైనా... పెదనాన్న, పిన్ని అంటూ వరుసలు కలిపి ఆప్యాయంగా మాట్లాడుకున్న ఆ తరంవాళ్ళు వెళ్లిపోయారు. ఇప్పుడు పొరుగింటితో కూడా సంబంధం అవసరంలేదనుకుని టీవీ, మొబైల్‌ ఫోన్‌లతో గడిపే మనుషులు ఎక్కువైపోయారు. ఇలాంటి పరిస్థితిలో శవాన్ని తమ ఇంటినుండి సాగనంపేవాళ్ళెవరు!?

ఆ వూళ్ళొ నాకున్న బంధుమిత్రులను గుర్తుచేసుకున్నాను. వాళ్ళలో నాకు మొదటగా గుర్తొచ్చింది... మా బాబాయి కొడుకు వీరమోహన్‌.

ఈమధ్య కాలంలో వాడికి కనీసం ఫోన్‌ కూడా చేయలేదు. రెండేళ్ళక్రితం వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పిలవడానికి వచ్చాడు. బాగా బిజీగా ఉండటంతో పెళ్ళికి వెళ్ళలేకపోయాను. బిజీ... మనుషులతో అనుబంధాలను కాపాడుకోవడంకన్నా ఇతరత్రా బిజీలు మనిషికి ఎక్కువైపోయాయి. నేనూ అందుకు అతీతుణ్ణి కాను.

అందుకే వాడికి ఫోన్‌ చేయాలంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ తప్పదు కాబట్టి చేశాను. ‘‘నాన్న ఒకే ఒక ఆఖరి కోరిక చెప్పి తన మరణానంతరం అక్కడికి తీసుకొస్తానన్నాను. మీ ఇంటి నుంచి నాన్నను సాగనంపుదాం’’ అని అడిగాను.

‘‘ఒక అరగంట ఆగి ఫోన్‌ చెయ్యి’’ అన్నాడు వాడు.

అరగంటాగి ఫోన్‌ చేశాక, అప్పటికే కుటుంబసభ్యులతో మాట్లాడాడేమో, విషయం వివరించాడు. ‘‘సారీ అన్నయ్యా, ఈ వారంలోనే మా పెద్దమ్మాయీ, అల్లుడూ ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం అంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు. అందులోనూ అమ్మాయికి సంవత్సరం బాబు... ఏమనుకోకు’’ అన్నాడు.

జీవితంలో ఏ విషయంలోనూ తిరస్కారం భరించలేనిస్థితి నాదని నా ఉద్దేశం. నన్ను నేను కంట్రోల్‌ చేసుకుంటూ దీర్ఘంగా విశ్వసించాను.

తిరస్కారం తాలూకు అవమానాన్ని మించిన భయం మొదటిసారి కలిగింది. నేను సులభంగా చేయగలననుకున్నది చేయడం చాలా కష్టమా? ఆ వూళ్ళొ వాడొక్కడే కాదు...నేను పుట్టి పెరిగిన వూళ్ళొ నాన్నను తమ ఇంటినుంచి స్మశానానికి సాగనంపడానికి నాకంటూ ఎవరూ లేరా? ఆలోచించసాగాను... ఇలా ఆలోచించవలసిన అవసరం చాలామందికి రాదేమో! ఒక్కసారి ఆలోచిస్తే, అంచనా వేస్తే మనకంటూ ఎవరైనా మిగిలి ఉన్నారో లేదో అర్థమవుతుంది.

అలా ఆలోచిస్తుంటే నాకు నా ఫ్రెండ్‌ రఘు గుర్తుకొచ్చాడు.

మా నాన్నను వాడి ఇంటినుంచి స్మశానానికి సాగనంపడానికి వాడు ఒప్పుకుంటాడనే అనుకున్నాను.

వాడికి ఫోన్‌ చేసి విషయం చెప్పాను.

వాడు ‘సారీ’ అంటూ, అలా అనడానికి గల కారణాలు వివరించాడు- ‘‘ఒక ఇంటినుంచి శవాన్ని తరలిస్తే ఆ ఇంటికి అంటిన మైల శుద్ధి చేయాలి. పంతులుగారి చేత శాంతిపూజలు చేయించాలి. అంతేకాదు, శవాన్ని తరలించేటప్పుడు వెలిగించిన దీపం పెద్దకర్మ వరకూ వెలుగుతుండాలి. పెద్దకర్మ కూడా ఆ ఇంటిలోనే చేయాలి. ఇదంతా చాలా కష్టం నవీన్‌.’’

సాటిజీవిని ఇష్టంగానైనా, కష్టంగానైనా భరించగలిగే మనిషి, పార్థివదేహాన్ని ఏవిధంగానూ భరించలేడన్న నిజం నాకర్థమయింది.

చాలా బాధగా అనిపించింది. బాధకన్నా కర్తవ్యం నన్ను భయపెట్టసాగింది.

ఎలా..? ఎలా..?

ఆయన బేలచూపులే నాకు గుర్తుకొస్తున్నాయి.

ఎంతో గొప్ప స్థితిలో ఉన్నాననుకున్న నేను, నాన్న కోరిన ఆఖరి "చిన్న" కోరికను తీర్చలేకపోవడమా?... బాధగా ఉంది...భయమేస్తోంది... నామీద నాకే జాలి కలుగుతోంది.

అలా ఆలోచిస్తుంటే రామ్మోహన్‌ గుర్తుకొచ్చాడు. తను నాకు క్లాస్‌మేటేగానీ ఎప్పుడూ అంత క్లోజ్‌గా ఉండలేదు. కాకపోతే తను సేవా కార్యక్రమాలలో చురుగ్గా ఉంటాడని తెలుసు.

రామ్మోహన్‌కి ఫోన్‌ చేశాను. ఒక విధంగా అతడిని బ్రతిమలాడుకుంటున్నట్టుగా మాట్లాడాను. ‘‘ఇది నాన్నగారి ఒకే ఒక కోరిక రామ్మోహన్‌! చాలా చిన్న కోరికే అనుకున్నాను. కానీ, అది చాలా పెద్ద కోరిక అనీ, నా శక్తికి మించినదనీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మర్చిపోయిన పుట్టిన వూరి మట్టిలో కలవడం ఎంత కష్టమో అర్థమవుతోంది. ఇందులో నాన్న తప్పేంలేదు. నేనే బలవంతంగా ఆ వూరితో ఆయనకు సంబంధాలు తెంచేశాను. ఇల్లు అమ్మొద్దన్నా, ‘మనం ఆ వూరు వెళ్తామా ఏంటి?’ అంటూ అవసరంలేకున్నా ఇంటిని అమ్మేశాను. కొత్త రిలేషన్స్‌ మధ్య పాత బంధుమిత్రులను పట్టించుకోవటం మానేశాను. ఇప్పుడు ఆ పల్లె జ్ఞాపకాలే తప్ప ఏవిధమైన బంధం లేకపోయింది. చివరికి నాన్నను సంప్రదాయబద్ధంగా సాగనంపడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.’’

నా మాటకు వాడు కదిలిపోయినట్టున్నాడు. ‘‘సరే, ఓ పని చేస్తాను. వూరి ప్రెసిడెంట్‌ని అడిగి కాసేపు శవాన్ని పంచాయితీ ఆఫీసులో ఉంచుదాం. అక్కడినుంచి లాంఛనాలతో... అదే పాడె కట్టి వూరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్దాం.’’

అంతకుమించి మరోమార్గం లేదు. ప్రముఖ నాయకులను పార్టీ కార్యాలయంలో కాసేపు ఉంచినట్టు... అలా ఆయనను సాగనంపాలి.

తను కోరుకున్న చోటుకు చేరబోతున్నానని ఎలా తెలిసిందో... అరగంట తర్వాత డాక్టర్‌ మా దగ్గరకు వచ్చి డెత్‌ కన్‌ఫర్మ్‌ చేశాడు.

అంబులెన్స్‌ పల్లెను సమీపిస్తోంది.
వెనుకే కారులో నా కుటుంబంతో నేను ఫాలో అవుతున్నాను.

హైదరాబాద్‌లో ఉన్న నా సర్కిల్‌ నుంచి ఫోన్స్‌ వస్తూనే ఉన్నాయి.

‘‘ఇప్పుడే విషయం తెలిసింది... ఎలా జరిగింది? సారీ, అంత దూరం రాలేకపోతున్నాను. ఇక్కడికి రాగానే ఇంటికొచ్చి కలుస్తాను.’’

కమ్యూనికేషన్‌ పెరిగిన ఈ కాలంలో ఈ తరహా ఓదార్పుకు మించి ఎక్కువ ఆశించడం అత్యాశే!

అంబులెన్స్‌ పంచాయితీ ఆఫీసు సమీపించింది. అప్పటికే అక్కడ నేను ఎప్పుడూ పట్టించుకోని బంధుమిత్రులు పదిమంది వరకూ ఉన్నారు.

వాళ్ళలో ఒకరిద్దరు అంబులెన్స్‌ దగ్గరకొచ్చి ఫ్రీజర్‌ని కిందికి దించడానికి ప్రయత్నిస్తున్నారు.

అప్పుడు...అప్పుడు ముందుకొచ్చాడు...రమేష్‌!

‘‘ఆగండి...’’

అందరం అతడికేసి చూశాం.

‘‘మాస్టార్ని ఇక్కడ దించొద్దు.’’

‘‘ఎ... ఎందుకని?’’ నా గొంతు వణికింది.

‘‘ఏ పార్థివ దేహమైనా ఇంటినుంచి లాంఛనాలతో శ్మశానం చేరుకోవాలి. కేవలం అనాధశవాలు మాత్రమే మార్చురీ నుంచో, పంచాయితీ ఆఫీసుల నుంచో శ్మశానానికి చేరుకుంటాయి.’’

నాలో... భయం, బాధ, దుఃఖం, కోపం కలగలిసిన నిస్సహాయత. ‘మా నాన్న దగ్గర చదువుకున్న వీడు... చివరికి ఆయనను అనాధశవంలా కూడా సాగనంపకుండా అడ్డుపడుతున్నాడా?’

నేనేదో అనబోయేంతలో రామ్మోహన్‌ వాడిని అడిగాడు ‘‘అయితే ఇప్పుడేమంటావ్‌?’’

‘‘ఆయన నాకు చదువు చెప్పారు. ‘తల్లీ తండ్రీ గురువూ దైవం’ అన్నారు. తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యత ఉంటుందో, గురువు పట్ల కూడా అంత బాధ్యత చూపించడం ధర్మం. అందుకే ఆయన పార్థివ దేహాన్ని మా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను.’’

అక్కడున్న వాళ్ళందరూ వాడికేసి నమ్మలేనట్టు చూశారు.

నాకు మాత్రం అదో అద్భుతంలాగే అనిపించింది. అంతకుమించి ‘మనిషి మరణించలేదు’ అనుకున్నాను. ఎందుకంటే, ఏ రక్త సంబంధమూ లేకుండా శవాన్ని తన ఇంటినుంచి సాగనంపే మానవత్వం ఎందరికుంటుంది.

శవం రమేష్‌ ఇంటికి చేరుకుంది.

అప్పటివరకూ పట్టుమని పదిమంది లేరు. కానీ, శవం శ్మశానానికి బయలుదేరగానే వూరు వూరంతా వెనుక నడిచొచ్చింది.

నా స్థితీ, హోదాల కారణంగా వారెవరూ రాలేదు.

అది మా నాన్న చేసుకున్న పుణ్యం! ఎందుకంటే ఆయన "టీచర్" కాబట్టి. ఆ ఊరిలో వేలమందికి ఆయన జ్ఞానభిక్ష పెట్టారు కాబట్టి.

మనిషి బతికుండగా ఇష్టమైన ప్రదేశాలు చూడాలని యాత్రలు చేస్తాడు. కానీ, మరణం సమీపించాక తనకిష్టమైన చోటే తనువు ఆగిపోవాలని ఆశిస్తాడు. అయితే చాలా కొద్దిమందికే ఆ కోరిక తీరుతుంది, తనకత్యంత ఇష్టమైనచోట శాశ్వత విశ్రాంతి తీసుకునే అవకాశం లభిస్తుంది.

మా నాన్న ఆ విధంగా అదృష్టవంతుడు!

కర్మకాండలన్నీ పూర్తిచేసుకుని హైదరాబాద్‌ తిరిగొచ్చాం.

ఆ రాత్రి ప్రమద నా భుజంమీద తల వాల్చి, గుండెల మీద చెయ్యేసింది. ఆ చేతి స్పర్శలో మునుపెన్నడూ లేనంత ఆప్యాయత కనిపించింది.

‘‘ఏమండీ...’’

‘‘వూ...’’

‘‘నేను చనిపోతే మీరు నన్ను వదిలి వెళ్ళిపోరుగా! అత్తయ్యగారి పక్కన మామయ్య ఉన్నట్టు మీరూ నా పక్కనే ఉంటారుగా...’’

ఒక సంఘటన ఎందరికో ఉత్తేజాన్నిస్తుంది. ‘నాన్న శవాన్ని అమ్మ దగ్గరకు చేర్చనవసరంలేదన్న’ ఆమె, మరణించాక కూడా నాతో కలసి గడపాలనుకుంటోంది.

నేను తనచుట్టూ చేతులేసి ‘‘అలాగే’’ అన్నాను.



ఆ రాత్రి నాకో కల వచ్చింది...

అమ్మ నిద్ర లేచింది. పక్కనే పడుకుని ఉన్న నాన్నను నిద్ర లేపుతోంది. ‘‘ఏమండీ... ఏమండీ...’’

నాన్నకు మెలకువ వచ్చింది. ‘‘సారీ జానకీ, శాశ్వత నిద్ర కదా...త్వరగా మెలకువ రాలేదు.’’

‘‘ఫరవాలేదులెండి... ఏదో పక్కనే ఉన్నారు కనుక మిమ్మల్ని పిలవగలిగాను... అదే ఎక్కడో దూరంగా ఉంటే ఏం చేసేదాన్ని. ఏదో మన పుణ్యం కొద్దీ ఇద్దరం ఒక్కచోటే ఉండే అదృష్టం దక్కింది.’’

‘‘మనిద్దరం కలిసే ఇకపై మన పిల్లల్ని దీవించొచ్చు’’ నాన్న ఆనందంగా అన్నాడు.

వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోసాగారు.

నాకు మెలకువ వచ్చింది. మనసంతా ఏదో తెలియని ఆనందం.

అరవై ఏళ్ళు కలసి జీవించి ఆరేళ్ళుగా దూరమైన ఆ తనువులు... ఒకేచోట మట్టిలో కలసిపోవడం... బిడ్డలు తలచుకుంటే సాధ్యమేనేమో!

ఎవరికి ఏది ప్రాప్తమో... ఎవరికి తెలుసు.?

🌹సర్వేజనా సుఖినోభవంతు🌹

🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

ధ్యానం ద్వారా మనసును పవిత్రంగా మార్చుకోవచ్చునా !?

ధ్యానం ద్వారా మనసును పవిత్రంగా మార్చుకోవచ్చునా !?

"ధ్యానం అంటే మిగిలిన విషయాలను ఆలోచనలో నుండి తీసేయ్యడం. ఏకాగ్రత అంటే ఒక విషయంపై మనసు నిలపటం. ధ్యానం పేరుతో ఒక విషయంపై మనం మనసు నిలిపే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మిగిలిన ఆలోచనలన్నింటినీ రాకుండా చేయడం. అయితే ఇష్టమైన విషయాల్లో మనసు ఇప్పటికే దీన్ని సహజంగా చేస్తూనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇష్టపడే విషయాలకన్నా ఉన్నతమైన, పవిత్రమైన వాటిమీద మనసు లగ్నం చేయాలనేది మన ప్రయత్నం. దాని ద్వారా మనసును ఉన్నతంగా, పవిత్రంగా చేయాలన్నది మన ఆలోచన. కానీ మన మనసు ఇప్పటికే ఎంతో పవిత్రంగా ఉంది. అది ఆత్మయొక్క కిరణం. దానికి ఏ అపవిత్రత లేదు. పవిత్ర, అపవిత్ర జీవనంలోనే ఉన్నాయి. కాబట్టి మనం కోరుకున్న పవిత్రమైన మనసు కావాలంటే, మన జీవనాన్ని పవిత్రంగా మార్చుకోవాలి. అలాగే అనేక పనులు, ఆలోచనలతో మనసుగా మారిన ఆత్మ అప్పటికే సిద్ధంగా ఉంది. "ఆలోచనలు, పనులను సంస్కరించుకోవటమే" మనం చేయాల్సింది. ఆత్మకిరణమైన మనసును మనం మంచిగా మార్చేదేమీ ఉండదు

"నేను, నా మనసు ఒకటేనా వేర్వేరా ? ఆధ్యాత్మిక సాధన ఎందుకు అంత కఠినతరంగా ఉంటోంది !?"

మనం 'నేను' అని చెప్తున్నదే మనసు. మనలోని ద్వంద్వ ప్రవృత్తివల్లనే ఆధ్యాత్మిక సాధన గంభీరమైన విషయంగా కనిపిస్తుంది. ఆత్మ లేదా దైవం అనేది మనకు దూరంగా ఉన్న వస్తువుగా భావించి, దాన్ని తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకు తెలియని ఆత్మ, దైవం విషయంలోనే కాదు, మనకు నిత్యం అనుభవంలోనే ఉన్న మనసు విషయంలో కూడా మనం అలాగే ఆలోచిస్తాము. ఏదైనా ఒక పని చేయాలనిపించగానే చేసేస్తాం. అక్కడ నా మనసు చెప్తుంది కాబట్టి నేను చేస్తున్నాను అని అనుకోము. చేసిన పనిని ఎవరైనా తప్పు పడితే అప్పుడు మాత్రం 'ఎందుకో నా మనసు నన్ను అలా ప్రేరేపించిందని' చెప్తాం. అనుభవించేటప్పుడు మనమే మనసుగా ఉంటూ, విశ్లేషించేటప్పుడు మాత్రం మనసును మన నుండి వేరుచేసి ఆలోచిస్తాం. మనం 'నేను' అని చెప్తున్నదే మనసు. మనసులేని వ్యక్తికి మాటలు, క్రియలు ఉండవు. మనసంటూ ఒకటి లేకుండా తాను ఉండటం కుదరదు. కానీ ఆలోచనల్లో కూడా అదే జరుగుతుంది. ఆధ్యాత్మిక సాధన సాగాలంటే మనకున్న ఈ ద్వంద్వ వైఖరిని విడనాడాలి !


"మనసును చేజిక్కించు కోవాలి అంటారు, చేజిక్కించు కునేది కూడా మనసే కాదా !?"

ఆలోచనలో ఉంటే దాన్ని మనసని, ఆలోచన లైనప్పుడు ఆత్మ అని అంటున్నాం. రూపంలేని ఆత్మను ధ్యానించలేం కనుక అనుభవంలో ఉన్న మనసును చేజిక్కించుకోమని భగవాన్ శ్రీరమణమహర్షి చెప్పారు. మనసును చేజిక్కించు కోవటమంటే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం. ఆలోచనలతో ఉన్నప్పుడు, లేనప్పుడు ఉన్నది ఒక్కటే మనసు. ఆత్మ, మనసు దాని పేరు మారింది గానీ స్వరూపం మారలేదు. ఇది తెలుసుకునేందుకే ధ్యానం అవసరం. అయితే ధ్యానంతో మనసును బాగు చేసేది ఏమీ ఉండదు. మనసే ఆలోచన, మాటలు, చేతల రూపంలో వ్యక్తమవుతుంది. అంతకుమించి మనసుకు మరొక ఉనికి లేదు. మనసును సంస్కరించడం అంటే ఆలోచన, మాటలు, చేతలను సంస్కరించడమే ! అది జీవనంలోనే చేసుకోవాలి గాని ధ్యాన ప్రక్రియతో చేసుకునేది కాదు. మనసుకు ఉన్న పవిత్రత, శాంతిని ధ్యానం తెలియజేస్తుందే గాని ఆయా ప్రక్రియల వల్ల 'పవిత్రత-శాంతి' సమకూరడం లేదని తెలుసుకోవాలి !*_

Source - Whatsapp Message

ఏ వస్తువునైనా దాని పరిధి నుండి కాకుండా దాని కేంద్రం నుండి తెలుసుకోవడమే జ్ఞానమంటే.

శుభోదయం.

అజ్ఞానముతో మనం ఏదైతే తెలుసుకుంటామో అది సంసారం. జ్ఞానంతో తెలుసుకునేది పరమాత్మ. ధర్మం అనేది ఒక లో వెలుగు. ఎవరి లోపల సందేహం లేదో, వారు సాక్ష్యాలను ప్రోగు చేసుకోవలసిన అవసరం ఉండదు.

ద్వంద్వాలు అనేవి మనలో కూడా ఉంటాయి. ఒక విషయం మనకి ఒప్పుకోవాలి అని ఉంటుంది, అలాగే ఒప్పుకోకూడదు అని కూడా ఉంటుంది. ఒక పనిని చేయాలని ఉంటుంది. చేయకూడదు అని కూడా ఉంటుంది. ఈ జఠిలతని ఎవరు అర్ధం చేసుకోకుండా తమ గమనాన్ని సాగిస్తూ ఉంటారో, వారు దాని నుండి ఎప్పటికీ బయట పడలేరు. తాను ఎవరు? అనేది యదార్ధంగా తెలుసుకునే సాహసం ఎవరు చేస్తారో, వారి విషయంలో ధార్మిక జీవనం ప్రారంభమవుతుంది. అతను తాను ఎలా ఉన్నాడో, తనని అలా స్వీకరించగలుగుతాడు. ఏ వస్తువునైనా దాని పరిధి నుండి కాకుండా దాని కేంద్రం నుండి తెలుసుకోవడమే జ్ఞానమంటే.

Source - Whatsapp Message

పాత్రత రచన: సద్గురు ఇ. కృష్ణమాచార్యులు

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 60,61 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు

🌻. పాత్రత 🌻

🌻తగినవాడు‌ కనిపించినపుడు దానము‌ చేయుము, తగని వారితో కూడా ప్రియముగనే మాట్లాడుము. అంత మాత్రమున అసత్యము మాట్లాడకుము.

ఎవరికిని నీ‌ వలన బాధ కలుగరాదను ప్రయత్నము నిత్యము కలిగియుండుము. ఈ మార్గమున జీవించినచో నరుడు స్వర్గానికి చేరుదురని నా మతము.

పాత్రునకు దానము చేయుట‌ అనగా బీదవారికిచ్చుట ఒక్కటే కాదు. మనము చేయలేని పని ఇంకొకడు చేయగలవాడు కనిపించినచో మన సహకారము, మన దగ్గరున్న సాధన సంపత్తి వానికి ఇచ్చునట్టి బుద్ధి యండవలెను.

అది లేక పోవుట చేతనే ఉత్తమ ప్రభుత్వము స్థాపించ వలెనను బుద్ధితో ప్రజలు వర్గములై చిలిపోయి క్షుద్రులుగా ప్రవర్తించుట జరుగుచున్నది.

అది లేకపోవుట చేతనే మహానుభావులైన స్వాముల వార్లు ఆశ్రమములను స్థాపించి హిందూ మతోద్ధరణకై ఎవనికి వాడుగా వేరుగా ప్రయత్నించుట, ఇంకొకని పొడగొట్టకుండుట, చీలిపోవుట జరుగుచున్నది.

దేశమునకు ఉపయోగించు మహానీయునకు ఆరోగ్యము చెడినప్పుడు స్వయముగా పోయి మందిచ్చుట, అతని క్షేమము గూర్చి బాధ్యత స్వీకరించుట పాత్ర దానమగును.

తనకన్నా తక్కువ వాని యందు జాలి, దానబుద్ధి చాలమందికి ఉండును. తనతో‌ సమానుడు, తాను చేయలేని పనులు సాధించువాడు కనిపించునపుడు తాను సహకరించునట్టి దాన బుద్ధి నిజమైన పాత్రత.

దానిని‌ సాధింపవలెనన్నచో ఈర్ష్య మొదలగునవి దాటవలెను...

ప్రియముగా పలుకుట అనగా మన సంభాషణ వలన ఎదుటివాడు సంతోషించునట్లు పలుకుట.

సామాన్యముగా దానము చేసినవాడు దానము పొందిన వాని‌ కన్నా గొప్పవాడను భ్రాంతి ఉండును కనుక నిర్లక్ష్యముగా దానము చేయుట, అమర్యాదగా మాట్లాడుట, తనతో సమానముగా చూడలేకుండుట మానవ లక్షణములైన దౌర్బల్యములు. వానిని దాటగల్గినపుడు మాత్రమే ప్రియవాక్యములతో దానము మున్నగునవి చేయవలెను.

మన కన్నా బలవంతుడు, ధనవంతుడు అగు వాని యెడల పలికిన ప్రియవాక్యములు లెక్కలోనివి కావు. అవి తప్పనిసరి కనుక సదభ్యాసములుగా లెక్కపెట్టరాదు.

ఉద్యోగమిచ్చినవాని ఎదుట చేతులు జోడించి నిలబడి మాట్లాడుట భక్తియోగము అనవచ్చునా? కనుక ప్రియవచనములు అనగా మన‌ కన్నా చిన్న వారు తక్కువ వారు కనిపించినపుడు పలికిన ప్రియవచనములు మాత్రమే ఆత్మసాధనకు పనికి వచ్చును.

ప్రియముగా మాట్లాడవలెనని సత్యమును మెలిద్రిప్పరాదు. ఎదుటివాని అభిప్రాయము మనకు నచ్చనప్పుడు నచ్చినట్లు తియ్యగా మాట్లాడుట సత్యభంగము కనుక ఎదుటివానికిని మనకును త్రిప్పలు తెచ్చును. కనుక ప్రియవాక్కు కన్న సత్యవాక్కు ముఖ్యము. సత్యమును అయినను అప్రియముగా పలుకుటలో హింస ఉండును.

కనుకనే మనువు "సత్యమునే పలుకవలెను, ప్రియముగా మాత్రమే పలుకవలెను, సత్యమును అప్రియముగా పలుకరాదు, ప్రియము కదా అని అసత్యము పలుకారాదు" అని శాసించెను.

పై మూడింటికి ముఖ్యోద్దేశము ఒక్కటే. తనకు గాని ఎదుటి వారికి గాని బాధ లేకుండుట. దానినే అహింస అందురు. ఈ సంకల్పము మనస్సున ఉన్నచో మిగిలిన మూడును నిర్వర్తించుట చేతనగును....
మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹



Source - Whatsapp Message

నిత్యజీవితంలో ధ్యానం

🧘🏼‍♀️ నిత్యజీవితంలో ధ్యానం
💓 ఉద్వేగ చాలా అవసరం

🔺 మీరు బుద్ధుణ్ణి కాదు అడాల్ఫ్ హిట్లర్ ని చూస్తారు. కాన్సంట్రేషన్ క్యాంపుల్ని చూస్తారు. సహజంగానే ఇదంతా భరించలేనిది. బయట ఉండడమే మేలు అనుకుంటారు. మీ గాయాలతో మీరు ఎందుకు ఆడుకుంటున్నారు? పైగా అవి మిమ్మల్ని బాధ పెడతాయి. వాటిలో పడి కొట్టుకోవడం అసహ్యంగా ఉంటుంది.

🔺 కానీ ఉద్వేగ ప్రక్షాళన ఉపకరిస్తుంది. మీరు క్షాళన ప్రారంభిస్తే, ప్రక్షాళన ధ్యాన పద్ధతిలో కి వెళ్తే ఈ మేఘాలన్నింటినీ బయటకు తరిమేస్తారు. ఈ చీకటిని బయటకు తరిమేస్తారు, అప్పుడు మనసులోకి మనం సులభంగా ప్రవేశించగలం.

🔺 ఉద్వేగ ప్రక్షాళన ధ్యాన మార్గాలను నేను నొక్కి చెప్పడం అందుకే. తరువాత నిశ్శబ్ద ధ్యానాలు. మొదట చలనశీల ధ్యానాలు, తర్వాత నిశ్శబ్ద ధ్యానాలు. మీలో చెత్తాచెదారం శుభ్రమైన తర్వాత నిశ్శబ్ద ధ్యానం చేయాలి. కోపాన్ని విసిరి కొట్టాలి, ఈర్ష్య నీ విసిరి కొట్టాలి. పొరలుపొరలుగా పేరుకున్న వాటిని విసిరి వేయాలి. అవన్నీ అక్కడ ఉంటాయి. ఒకసారి వాటిని వదిలించుకుంటే మీరు అందులోకి సులభంగా జారుతారు. అక్కడ అంతా స్పష్టమవుతుంది.

🔺 అక్కడ హఠాత్తుగా బుద్ధుని భూమికి సంబంధించిన కాంతి వెలుగుతుంది. హఠాత్తుగా మీరు మరో లోకంలో ఉంటారు. న్యాయ పద్మం పరిమళించే ప్రపంచంలో ధర్మ లోకంలో తాఓ లోకంలో ఉంటారు.
🔺🔊♥️🔊♥️🔊♥️🔊🔺

Source - Whatsapp Message

భగవంతుడు ఎందుకు కనిపించడు

🌷భగవంతుడు ఎందుకు కనిపించడు🌷
🌴🌴🌴🌹🌴🌴🌴
" నా వెనకాల రండి ..
మిమ్మల్నందర్నీ భగవంతుని దగ్గరికి తీసుకుని వెడతాను"
అని అన్నాడు ఒక స్వామీజీ. ఆయనను నమ్మి చాలామంది ఆయన వెనకాల వెళ్ళసాగారు.

" నేను చేయలేని కార్యం ఏదీ లేదు. నేను చాలాసార్లు
తపస్సు చేశాను. చాలా సిధ్ధులు పొందాను.మీ కష్టాలన్నీ చిటికెలో తీరుస్తాను. "అంటూ స్వామి పామరజనాలను ఆకర్షించసాగాడు.

ఇవన్నీ వీక్షిస్తున్న భగవంతుడు కూడా స్వామీజీ దగ్గరకు వచ్చాడు.

ఒక సన్యాసి రూపంలో వచ్చిన
భగవంతుడు స్వామీజీ
ముందు నిలబడ్డాడు.
" స్వామీ ! మీరు పలు సిధ్ధులు సాధించారని విన్నాను. అందుకే
మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. అని వినయంగా చెప్పాడు.
స్వామీజీ పొంగిపోయాడు.
" నా గురించి ఊరందరికీ తెలుసు....రండి ఇలా కూర్చోండి మీకు ఏం కావాలి? అని గొప్పలుపోతూ అడిగాడు స్వామీజీ.

" అదుగో.. ఏనుగు ఒకటి
నడుచుకుంటూ పోతున్నది చూశారు కదా ! ఆ ఏనుగుని చంపగలరా?.. అని సన్యాసి రూపంలో వున్న
భగవంతుడు అడిగాడు.
" అది ఎంతసేపు..
ఇప్పుడు చూడు.." అంటూ పిడికెడు మట్టిని
తీసుకుని , ఏదో మంత్రం
పఠించి , ఏనుగు వెడుతున్న దిశగా విసిరాడు. ఏనుగు బాధతో క్రింద పడిపోయింది.
" అరె..తమకు ఇంత శక్తి
వున్నదా.. అని స్వామీజీని పొగిడిన సన్యాసి , " స్వామీ! మరల ఏనుగుకి ప్రాణాలు పోయగలరా?" అని అడిగాడు.
" ఓ ..ధారాళంగా చూడండి" అని స్వామీజీ,
మళ్ళీ మట్టిని తీసుకుని
మంత్రాన్ని, పఠించి ఏనుగు వున్న వైపుకి విసిరాడు.
ఏనుగు కదులుతూ లేచి నిలబడినది.
ఇది చూసిన సన్యాసి ,
" మీరు చాలాశక్తి కలవారే. సందేహం లేదు . ఆఖరుగా
నాదొక ప్రశ్న .. " అన్నాడు
సన్యాసి. వెంటనే " మీ సందేహం తీర్చడానికే
నేనువున్నది .అడగండి"
అన్నాడు స్వామీజీ. కళ్ళుమూసుకుని తదేకంగా సన్యాసి చెప్పినది వినసాగాడు.
" మీరు మీ శక్తితో ఇప్పుడు ఒక ఏనుగుని చంపారు.దానికి మళ్ళీ ప్రాణం పోశారు. ఈ రెండు కార్యాల వలన మీరు సాధించినది ఏమిటి? ఏ విధమైన ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగలిగారు?
మీరు భగవంతుని దర్శించడానికి మీరు చూపిన విద్యలు ఏ విధంగా ఉపయోగ పడుతున్నాయి అని మీరు అనుకుంటున్నారు ?"
స్వామీజీ ఆలోచిస్తూకనులు తెరచి చూశాడు. ఎదురుగా కూర్చున్న
సన్యాసి కనిపించలేదు.

గురువు అనేవాడు గుంపును చేర్చు కునేందుకు కాదు.. సన్మార్గచింతనకు , మోక్షసాధనకు
మార్గదర్శకత్వం వహించాలి.
ఈనాడు భక్తులనిపించుకోవడానికి అనేకమంది ఏదో ఒక గురువుకి వెనుక చేరడానికే
ఇష్టపడుతున్నారు.
నిజమైన ఆధ్యాత్మికతమీద వారిలో ఏ కోరిక లేదు.
అలాటి వారికి ఏనాడూ భగవంతుడు కనపడడు. 🌹🙏🙏🙏🙏🌹

Source - Whatsapp Message

అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?

అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?

వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం.. మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ... ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది.🌹

ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే... శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.🌹

బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.🌹

పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని
(డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు.
ఎందుకంటే.. శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద.. తన వాళ్ళ మీద.. ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే... ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే.. అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ... తిరిగి మొదటి నుండి లెక్కించాలి.🌹

శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే... కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో... నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే.. ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.🌹

హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన ఖర్మ...
ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే...
ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను
కానీ.. ఎందుకు చేస్తున్నానో తెలియదు.🌹

దయచేసి భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో కూడా అర్థం దాగి ఉంటుంది🌹🌹మీ వీరభధ్ర 🌹🕉️

Source - Whatsapp Message

దైవం - దెయ్యం..

🍀🌸💖💚🧚‍♀️💚💖🌸🍀

🌸 దైవం - దెయ్యం.. 🌸

🌸 దైవం అంటే ఏమిటి...? దెయ్యం అంటే ఏమిటి...? ఈ ప్రశ్నలు చిన్నపిల్లలకు ఎక్కువగా వస్తాయి.. ఎందుకంటే ఆ పదాలకు అర్ధం వ్యక్తులా, బావాల, విగ్రహాల అనేది వారికి తెలియదు కాబట్టి.. కానీ చాలా మందికి తెలిసిన ఇప్పటి సమాజంలో ఉన్న సంప్రదాయాలకు వ్యతిరేకంగా చెప్పటం లేదా చుపిచటం అనేది ఘర్షణకు దారి తీస్తుంది అని దాటవేయటం జరుగుతుంది...
కానీ నిజంగా ఉన్నాయా అని అడిగితే దైవం లేదా దెయ్యం గుణగణాలు చెప్పగలం కానీ చూపించలేము...

🌸 దైవం అంటే పరమానందస్తితి.. అంటే ప్రపంచంలో ఎన్ని రకాలైన ఆనందాలు ఉన్నాయో అన్ని కలిపి తనలో ఇముడ్చుకునే స్తితి... దైవం అంటే... మరి దెయ్యం అంటే అన్ని రకాల ఆనందాలలో పైచాచికానందం ఒకటి అందులో ఆగిపోయిన వారి స్తితి.. ఇక్కడ అన్ని అతిగా చేస్తూ దాని ఫలితాలు పొగుచేసుకుంటు దానిలోనుంచి బయటపడటం కోసం చేసే ప్రయత్నం... ఇది కూడా పరమానందం వైపు తీసుకెళుతుంది ఎప్పుడైతే ఆ స్తితిని పూర్తి చేస్తామో అప్పుడు.. అంటే ఒక విషయం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అందులో ఎన్ని అవాంతరాలు వచ్చిన లక్ష్యం మాత్రమే చూస్తూ నడక సాగించేవారు.. ఒకరకంగా వీరిని కార్యసాధకులు అంటాం కాని.. వారిలో ఉన్నగుణం మాత్రం దెయ్యమే...

🌸 దీనిని బట్టి అర్ధమైంది ఏమిటంటే మనలో ఉన్న గుణాల వల్ల మన వ్యక్తీకరణ జరుగుతుంది... అది ఆ క్షణనా దైవమా దెయ్యమా అనేది... మనల్ని గమనించే వారికి అర్ధమౌతుంది.. మనకు తర్వాత తెలుస్తుంది... అన్ని మనలోనే ఉన్నాయి అనడానికి నిదర్శనం మన జీవితమే... కానీ జ్ఞానార్జన చేసే సమయంలో ప్రతిదీ మనకు అవసరమే అనిపిస్తుంది... మన స్తితి దాటినవారికి అది అవసరం లేదు అని తెలుసు వారు చెప్పిన వినం మనం... ఈ స్తితి మనం వెళ్లే వేగానికి పరాకాష్ట.. ఇక్కడినుండి నిదానంగా నిదానిస్తూ అన్ని పునరాలోచిస్తూ మనం తెలుసుకున్న విషయం లో ముఖ్యమైనవి గ్రహిస్తూ మనలో మనం లయమవ్వడమే దైవత్వం వైపు నడక...

🌸 దైవాలుగా ఉన్నా మనం మళ్ళీ దైవాలుగా మరే ప్రక్రియ మన ప్రయాణం..

Thank you...🌸🌸🌸

🍀🌸💖💚🧚‍♀️💚💖🌸🍀

Source - Whatsapp Message

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

27-10-2020

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

👉"మనం ప్రతిరోజు చేసే ఆలోచనలు అంటే, మన కోరికలు, మన ఆకర్షణ వీక్షణలు, మన ఇష్టాయిష్టాల ద్వారా మన విధిని మనమే సృష్టించుకుంటాం

👉మీలో ప్రేమను పెంపొందించుకున్న తరువాత, మీ ఆలోచనను ఒకే లక్ష్యంపై పూర్తి అనుబంధముతో స్థిరపరచు కొన్నప్పుడు గాఢమైన ధ్యానం సంభవిస్తుంది.

👉ప్రార్థన, గాఢమైన ధ్యానస్థితిని నిశ్చయ పరిచే అభిలాషను, తపనను సృష్టిస్తుంది.

👉పుచ్చుకోవడం కంటే, ఇవ్వడం ద్వారా ప్రేమను పెంచుకోవడం నేర్చుకో!

👉ఒక వ్యక్తి గమ్యం చేరడానికి పరిగెడితే మరొకరు నడుచుకుంటూ గమ్యాన్ని చేరుతాడు, భేదం ఏమిటి ? ఒకరు సమయాన్ని ఆదా చేస్తే
మరొకరు సమయాన్ని ఖర్చు చేసారు."

👉సమతుల్యం కాని మనస్సు తన సూచిక (రాడార్లు, దిశను కోల్పోతుంది."

👉కోపం నుండి విముక్తులైతే తప్ప, మితత్వాన్ని పొందలేరు. "

👉మనలను నొప్పించేది ఉదయించే ఆలోచనలు కావు, మనం వాటి పట్ల చూపించే అతి శ్రద్ధ. అదే మనలను వాటితో ప్రత్యక్ష సంఘర్షణకు దారితీసేలా చేస్తుంది. ఆ చర్య వల్ల ఆలోచనలు మరింత శక్తివంతమవడమే, సమస్య అధికమవుతుంది."


🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message