Monday, October 25, 2021

చక్కని చిన్ని కథ.

చక్కని చిన్ని కథ.

ఒక వూర్లో ఒక గొల్లవాడు వుండేవాడు.వాడికి 100 గొర్రెలు వుండేవి.ఊరిలోని మోతుబరి పొలం లో
ఇవ్వాళ పొద్దున్నుంచీ మరుదినం పొద్దున్న వరకూ ఆ వంద గొర్రెల్నీపొలంలోనే వుంచాలి..అవి వేసిన పెంట పొలానికి ఎరువుగా ఉపయోగ పడుతుంది.దానికి గొల్ల వాడికి కొంత ధనము లేక ధాన్యము యిచ్చేవాడు.మోతుబరి.ఆ రోజు పగలంతా గొల్లవాడు గొర్రెలను ఆ పొలం లో వుంచి కాపలా కాసి అలసి పోయాడు.అతను తన కొడుకు 10 ఏళ్ళ వాడిని రాత్రి పొలం లోనే వుండి కాపలా కాయమన్నాడు.రాత్రి
గొర్రెలు పడుకుంటాయి.నీవు పడుకోకుండా ఈ దీపం పెట్టుకొని చూస్తూ వుండు.రాత్రి పులిగాడో గిలిగాడో వచ్చి గొర్రెల్ని తినిపోయేను.అని కొడుకును హెచ్చరించి యింటికి వెళ్ళిపోయాడు.అక్కడికి దగ్గర పొదలో ఒక పులి కాచుకొని
వుండింది అది అప్పుడే అడవిలో ఒక జింకను తిని వచ్చింది.కడుపు నిండుగా వుంది.రాత్రి పొద్దు పోయాక పిలావాడు పడుకున్నాక
రెండు గొర్రెలను అడవిలోకి యీడ్చుకొని పోవచ్చు. అనుకుంది కానీ తండ్రి గొల్లవాడు పులిగాడో గిలిగాడో వస్తాడు జాగ్రత్త అని చెప్పాడే పులిగాడైతే నేను కానీ ఈ గిలిగాడెవడు??నా కంటే బలవంతుడా?రాత్రి యిక్కడే ఈ గొర్రెల మధ్య పడుకొని చూస్తాను ఆ గిలిగాడేవడో.అనుకుని గొర్రెల మధ్యలో పడుకుంది.మధ్యరాత్రి లో ఆ గొల్ల పిల్లవాడికి నిద్ర వచ్చింది.వాడు తన తండ్రి చెప్పిన మాటలు మర్చిపోయి ఏదయినా మెత్తని గొర్రెని చూసుకొని దానిమీద మెత్తగా పడుకుందామని తడుముకుంటూ వచ్చి ఆపులి మెత్తగా వుంటే దాని మీద పడుకున్నాడు. పులి ఉలిక్కి పడింది. పడింది.అమ్మో గిలిగాడు వచ్చినట్టున్నాడు నా పైనే పడుకున్నాడు.నా చెవులే పట్టుకున్నాడు ఈ గిలిగాడికి నేనంటే భయం లేదు అనుకుంది .అని భయపడి లేచి నిలుచుకుంది పులి. పిల్లవాడు భయపడి దాని చెవులు రెండూ గట్టిగా పట్టుకున్నాడు.

అది పరుగు తీసింది.గొర్రె ఎందుకు పరుగెత్తు తూందో వాడికి అర్థం కాలేదు. ఆ పిల్లవాడు పడిపోతానేమో నని దాని చెవులను యింకా గట్టిగా పట్టుకున్నాడు.పులి యింకా భయపడి పోయింది.అది అలా రాత్రంతా పరుగు తీసింది.కాసేపటికి తెల్లవారింది వెలుగు రాగానే వాడు తాను కూర్చున్నది ఒక పులి మీద అని చూశాడు.వాడి గుండె గుభేలుమంది.అది పరుగెత్తుతుంటే దోవలో మర్రి వూడలు క్రిందికి వేలాడు తున్నాయి.ఆ పిల్లవాడు ఒక లావు ఊడను గట్ట్టిగా పట్టుకొని కాళ్ళు వదిలేశాడు.అమ్మయ్య ఈ గిలిగాడు నన్ను వదిలాడు అని పులి అడవిలోకి పరుగు తీసింది.ఆ గొల్ల పిల్లవాడు క్రిందికి దిగి మరీ పులి తిరిగి వస్తుందేమో నని భయపడి దగ్గరలో నున్నపాడు బడ్డ గుడిలోపలికి వెళ్లి గర్భ గుడి లోకి వెళ్లి తలుపు వేసి కర్ర అడ్డ గడియ వేశాడు.(పూర్వం అలా కర్రతో అడ్డగడియలు వుండేవి)ఆ పులి అలా చాలా దూరం పరిగెత్తి అలిసిపోయి వెనక్కి తిరిగి చూసింది గిలిగాడేమైనా వస్తున్నా డేమో నని .వాడు కనపడకపోయేసరికి ఊపిరి పీల్చుకుంది.

అప్పుడే పక్క పొదలో నుండి నక్క ఒకటి వచ్చి అదేమిటి పులిబావా అలా పరిగెత్తుకొస్తున్నావు?ఏమయింది అని అడిగింది ఆ పులి భయంగా ఆ వచ్చిన దారివైపే చూస్తూ భయంగా ఉండవయ్యా బాబూ!రాత్రంతా ఆ
గిలిగాడిని మోసి మోసి అలిసిపోయ్యాను.అంది పులి. గిలిగాడెవడు బావా అనడిగింది నక్క .రాత్రి జరిగినదంతా వివరంగా చెప్పింది పులి.నక్క పెద్దగా నవ్వి ఓ ! పిరికి బావా నీవు బాగా మోసపోయావు.గిలిగాడంటూ అసలు ఎవరైనా వుంటే కదా ఎవరో మనిషే నిన్ను బాగా మోసగించాడు.పద వెళ్లి చూసి వద్దాం అంది పులి భయపడి అమ్మోనేను రాను అంది.ఏమీ పరవాలేదు లే నేనున్నాగా అంటూ పులిని వెంట బెట్టుకొని వచ్చ్చినదారినే వాసన చూసుకుంటూ వెళ్ళాయి రెండూ.చాలా దూరం వెళ్ళాక ఆ గుడి దగ్గరికి వచ్చి వాసన చూస్తూ చూశావా నర
వాసన వస్తూంది.అని గుడి లోపలి పులిని పిలుచుకొని వెళ్ళింది.గర్భగుడి లోనుంచే వాసన వస్తూంది లోపల వున్నట్టున్నాడు.అని తలుపు తోసింది రాలేదు. గడియ వేసినట్టున్నాడు అని తలుపుకున్న కంతలో తన కుచ్చు తోక పెట్టి గడియ తీయడానికి ప్రయత్నిస్తూ తన శరీరం తో తలుపును తోస్తూంది.లోపల గొల్లవాడికి భయమేసింది.పాత గడియ ఊడి వస్తుందేమో అని నక్క తోకను గట్టిగా పట్టుకున్నాడు.నక్క బయటికి లాగను,వాడు లోపలి లాగను.వాడు చాలా బలంగా దాని తోకను రెండు చేతులతో పట్టుకొని లాగుతున్నాడు.చివరకు సగం తోక తెగి ఆ విసురుకు నక్క అంత దూరం విసురుకొని పోయి పడింది. బాగా దెబ్బ తగిలి ఎముకలు విరిగినట్టయింది..లోపల వాడుకూడా పడ్డాడు కానీ స్థలం ఎక్కువగా లేదు కాబట్టి అక్కడి గోడకు తగులుకొని నిలబడ్డాడు.బయట నక్క తన తోక తెగి రక్తం కారుతుండడం భయపడి పోయి పరిగెత్తుతూ వీడెవడో పులిగాడు కాదు , గిలిగాడు కాదు తోక పీకుడు గాడున్నట్టున్నాడు బావా అని బయటికి పరిగెత్తింది.నక్క దాని వెనకే పులి కూడా పరిగెత్తింది. రెండూ అడవిలోకి వెళ్లి పోయాయి. కాసేపటి తర్వాత ఆ గొల్ల పిల్లవాడు తలుపు తీసుకొని బయటికి వచ్చి బ్రతుకు జీవుడా అని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఈ కథను పిల్లలు చాలా సరదాగా వింటారు కదూ!

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment