Friday, October 15, 2021

ఒక సాధారణ దొంగకూ రాజకీయ దొంగకూ మధ్య ఉండే తేడా ఏమిటి...?

ఒక సాధారణ దొంగకూ రాజకీయ దొంగకూ మధ్య ఉండే తేడా ఏమిటి...?

1. సాధారణ దొంగ:
మీ డబ్బు దోచుకుంటాడు,పర్సు, చేతి గడియారం, బంగారు గొలుసు మొదలైనవి దోచుకుంటాడు...

రాజకీయ దొంగ:
మీ భవిష్యత్తునూ, మీ జీవితాన్నీ, విద్యారోగ్యాలనూ, ఆరోగ్యాన్ని,వ్యాపారాన్నీ దోచుకుంటాడు...

2.చిత్రమేమిటంటే...
సాధారణ దొంగ ఎవరిని దోచుకోవాలో తానే ఎంచుకుంటాడు...

నిన్ను దోచుకునే రాజకీయ దొంగను నువ్వే ఎంచుకుంటావు...

3. సాధారణ దొంగను:
పోలీసులు తరిమి తరిమి పట్టుకుంటారు...

రాజకీయ దొంగకు ఏ హాని కలుగకుండా పోలీసులే కాపాడుతుంటారు...

మన సమాజం ఉన్న విచిత్ర పరిస్థితి ఇది...

మేం గుడ్డివాళ్ళం కాదని మనం గుడ్డిగా అంటాం...

4. వ్యవహారమంతటిలోనూ మహా మూర్ఖపు విషయం ఏమిటంటే...
మనం సాధారణ దొంగను అసహ్యించుకుంటాం, చావగొడతాం...

రాజకీయ దొంగను ప్రేమిస్తాం,
వాడి కోసం మనం పరస్పరం కొట్టుకుచస్తాం...

ఇది నేటి సమాజం...✍️

సేకరణ

No comments:

Post a Comment