శిక్ష!
---------
ఈ రాత్రి
ఓ గదిలో ఎవరో
తన నేస్తం కోసం
దిండు తడిపేస్తూ దుఃఖిస్తారు!
అదే ఈ రాత్రి
వారికోసం
ఇంకెవరో వీధుల్లో
పిచ్చివాళ్ళై తిరుగుతుంటారు!
వాళ్ళకి దుఃఖపడాలని
శిక్ష విధించబడింది!
వాళ్ళకి
మనసిచ్చినందుకు గాను
ఈ శిక్ష విధించబడింది!!
చేతులు కోసుకుంటారు
చేతులు కాల్చుకుంటారు
రాత్రుళ్ళను కాల్చివేస్తారు!
గుండె పగిలిపోతారు
కంట పొగిలిపోతారు
మోకాళ్లపై వాలి విలపిస్తారు!
దిళ్లు తడుస్తాయి
కాళ్ళు చీలిపోతాయి
కళ్ళు సెలయేళ్లవుతాయి!
వాళ్ళు దుఃఖిస్తారు
వాళ్ళా శిక్ష భరిస్తారు
సహిస్తారు
తపిస్తారు
తరిస్తారు
వాళ్ళు ప్రేమిస్తారు
--- దండమూడి శ్రీచరణ్
9866188266
నా చూపు కొలనులో దూకి
వెన్నెల తుంపులుగా భళ్లుమన్నది!
నీ రూపు నా కళ్ళలో చిక్కి
వేకువ ఝాములా తెల్లవారింది!!
--- _*దండమూడి శ్రీచరణ్*_
9866188266
ప్రేమ...
ఆనందాన్ని పంచుతుంది
మనసుకు గాయాన్ని చేస్తుంది
కన్నీళ్ళను పరిచయం చేస్తుంది
అందరిలో ఉన్నా ఒంటరిగా
మిగులుస్తుంది..
పోయే ప్రాణాన్ని సైతం
బ్రతికిస్తుంది..
ప్రేమకున్న శక్తి చాలా అద్భుతం
సేకరణ
---------
ఈ రాత్రి
ఓ గదిలో ఎవరో
తన నేస్తం కోసం
దిండు తడిపేస్తూ దుఃఖిస్తారు!
అదే ఈ రాత్రి
వారికోసం
ఇంకెవరో వీధుల్లో
పిచ్చివాళ్ళై తిరుగుతుంటారు!
వాళ్ళకి దుఃఖపడాలని
శిక్ష విధించబడింది!
వాళ్ళకి
మనసిచ్చినందుకు గాను
ఈ శిక్ష విధించబడింది!!
చేతులు కోసుకుంటారు
చేతులు కాల్చుకుంటారు
రాత్రుళ్ళను కాల్చివేస్తారు!
గుండె పగిలిపోతారు
కంట పొగిలిపోతారు
మోకాళ్లపై వాలి విలపిస్తారు!
దిళ్లు తడుస్తాయి
కాళ్ళు చీలిపోతాయి
కళ్ళు సెలయేళ్లవుతాయి!
వాళ్ళు దుఃఖిస్తారు
వాళ్ళా శిక్ష భరిస్తారు
సహిస్తారు
తపిస్తారు
తరిస్తారు
వాళ్ళు ప్రేమిస్తారు
--- దండమూడి శ్రీచరణ్
9866188266
నా చూపు కొలనులో దూకి
వెన్నెల తుంపులుగా భళ్లుమన్నది!
నీ రూపు నా కళ్ళలో చిక్కి
వేకువ ఝాములా తెల్లవారింది!!
--- _*దండమూడి శ్రీచరణ్*_
9866188266
ప్రేమ...
ఆనందాన్ని పంచుతుంది
మనసుకు గాయాన్ని చేస్తుంది
కన్నీళ్ళను పరిచయం చేస్తుంది
అందరిలో ఉన్నా ఒంటరిగా
మిగులుస్తుంది..
పోయే ప్రాణాన్ని సైతం
బ్రతికిస్తుంది..
ప్రేమకున్న శక్తి చాలా అద్భుతం
సేకరణ
No comments:
Post a Comment