Wednesday, April 27, 2022

ప్రశాంత్ కిషోర్ !

ప్రశాంత్ కిషోర్ !

అందరికీ ఈ పేరు ఇప్పుడు సుపరిచితమే !

అనేక రాజకీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకొన్నాయి .. నియమించుకొంటున్నాయి .. నియమించుకొంటాయి .

ఇప్పుడు ఇలాగే మరో వ్యూహకర్త సునీల్ .

వీరి వ్యూహాలు ,
వాటి వల్ల సమాజానికి జరిగే లాభం ఎంత ?నష్టం ఎంత ? ప్రజాస్వామ్యానికి ఇది మంచి చేస్తుందా?
లేక చెడా?
ఈ చర్చ వేరు .
ఈ పోస్ట్ దాని పై కాదు .

ప్రశాంత కిషోర్ ఆదాయం ఎంత ఉంటుంది ? బహుశా వందల కోట్లు .

ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ఇంత సంపాదన . సంపాదనకు మించి పేరు ప్రతిష్టలు . పలుకుబడి ? ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ముఖ్య మంత్రులను నేరుగా కలిసే అవకాశం ఉంటుంది ?

ఇక్కడేమో ముఖ్య మంత్రులే ప్రశాంత్ కిషోర్ లాంటి వారి కోసం ఎదురు చూసే స్థితి .

పదేళ్ల క్రితం ఇలాంటి ఒక వృత్తి ఉంటుందని ఎవరైనా ఊహించారా ?

ప్రపంచం లో ఏదైనా యూనివర్సిటీ ఇలాంటి కోర్స్ ను డిజైన్ చేసిందా ?
లేదు కదా .

మరి ప్రశాంత్ కిషోర్ కు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది ?

దీన్నే లాటరల్ థింకింగ్ అంటారు . భిన్న కోణం లో ఆలోచించడం

మీరు టాక్సీ ఓనర్ కావాలంటే ?
లోన్ తీసుకోవాలి .
కారు కొనాలి .
డ్రైవర్ ను పెట్టుకోవాలి . దానికొక ఆఫీస్ .
ఇలా చేస్తే ఎన్ని కారులకు ఓనర్ అవుతారు ?

ఒక్క కారు కూడా కొనకుండా ,
ఒక్క డ్రైవర్ కు కూడా జీతం ఇవ్వకుండా ప్రపంచం లో అతి పెద్ద కారు రెంటల్ కంపనీస్ వచ్చాయి .

ఉబెర్ .. ఓలా..

జస్ట్ ఒక ఐడియా తో.. భిన్నంగా ఆలోచించడం వల్ల

ఇదే విధంగా రెస్టారెంట్ లు ..

ఒక్క బిల్డింగ్ కూడా లేకుండా ఒక్క కుక్ ను కూడా నియమించుకోకుండా ప్రపంచ రెస్టారెంట్ సామ్రాజ్యం ..

ఒక్క ఐడియా తో .. జొమాటో .. స్విగ్గీ

చికెన్ ఫ్రై ఎంత పెద్ద బిజినెస్ ?

రోడ్డుపైన ఎక్కడో వైన్ షాప్ ముందు పెట్టుకొంటే ..

రోజంతా కస్టపడి పని చేస్తే అయిదు వందల లాభం .

కానీ వాడు భిన్నంగా ఆలోచించాడు .
ప్రపంచ చికెన్ సామ్రాజ్యం .. అదే kfc

ఇది ప్రారంభం మాత్రమే . రానున్నది రోబో యుగం .

ఇప్పుడున్న ఉద్యోగాల్లో సగానికి పైగా ఉద్యోగాలను రోబో లు ఎత్తుకొని పోతాయి .

ఇప్పటికి మనం ఊహించని ఉద్యోగాలు .. అంటే ఇంకా పేరు పెట్టని ఉద్యోగాలు .. అవకాశాలు వస్తాయి .

వాటికి ఫలానా కోర్స్ అంటూ లేదు .

బాబాయ్ హోటల్ ఓనర్ ఏ యూనివర్సిటీ లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసాడు ?

పుల్లా రెడ్డి గారు ? kfc ఓనర్ ? ప్రశాంత్ కిషోర్ కు ఎన్నికల టక్కు టమారాలు నేర్పిన కాలేజీ ఏది ?
ఉబెర్ ఓనర్ చదివిన యూనివర్సిటీ ఏది ?

రానున్నది కొత్త ప్రపంచం

నువ్వు ఎక్కడ చదివావు అనేది కాదు .
ఎన్ని మార్కులు వచ్చాయి ?
రాంక్ ఎంత అనేది అసలే కాదు .

సరి కొత్త గా ఆలోచించగలవా ?

నీలో భ్యవిష్యత్తు నైపుణ్యాలు...
అంటే...
కాగినీటివ్ ఫ్లెక్సిబిలిటీ , లాటరల్ థింకింగ్ , క్రిటికల్ థింకింగ్ ,
సోషల్ ఇంటలిజెన్స్ , ఎమోషనల్ ఇంటలిజెన్స్,
క్రియేటివిటీ లాంటి స్కిల్స్ ఉన్నాయా ? లేవా ? అనేదే ప్రశ్న .

చదువంటే బట్టి కొట్టి మార్కులు సాధించడం కాదు .

అది వ్యక్తి జ్ఞాపక శక్తికి పరీక్ష .

నీకంటే మిలియన్ రెట్లు ఎక్కువ సమాచారాన్ని నిక్షిప్తం చేసి ప్రాసెస్ చేయగల రోబో లు, కృత్రిమ మేథ ఒక పక్క ఉంటే,

జ్ఞాపక శక్తి తో ప్రపంచం లో రాణించాలంటే, మూడవ ప్రపంచ యుద్ధాన్ని విల్లంబులతో జయించాలని ప్రయత్నం చేయడం లాంటిది .

ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ ఏంటి ?

వాటిని బాల్యం నుంచే నేటి తరానికి ఎలా నేర్పాలి ?

సృజనాత్మతక అనేది భవిష్యత్తు లోఅతి కీలక నైపుణ్యం అవుతుంది .

సృజనాత్మకత పుట్టుకతో రావాలి కదా ?

దాన్ని నేర్పడం సాధ్యమా ?

సృజనాత్మకత అనేది ఇది పుట్టుకతో 80% వస్తే ఉన్నదాన్ని ఖచ్చితంగా 20 శాతం అభివృద్ధి చెందిచవచ్చు అంటే ఒక వ్యక్తి 60 శాతం సృజనాత్మకత కలిగి జన్మిస్తే అతని 20 మెరుగుపరచవచ్చు అలాగే 80 ఉన్నవాని 100 చేయవచ్చు కానీ మనం అలాంట బోధన అభ్యసన ప్రక్రియలను చేపట్టవలసి ఉంటుంది
మన విద్యా విధానం వ్యక్తిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి అభివృద్ధి చేసేదిగా ఉండాలి.

మనం చదువుకున్న చదువులు వేరు. ఇపుడు నడుస్తున్న, రాబోయే తరాల విద్యార్ధులు మల్టీ టాలెంటడ్ స్కిల్స్ కలిగి ఉంటే తప్ప కెరీర్ లో రాణించలేరు. Bookish knowledge తో పాటుగా Soft skills like presentation skills, communication skills, decision making, planning and execution skills, time management, positive thinking లతో పాటుగా creativity తో routine కి భిన్నంగా వినూత్న ఆలోచనా విధానం భవిష్యత్తులో కీలకం కానుంది. పిల్లలందరినీ ఆ విధంగా తీర్చిదిద్దాలి.

సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment