నేటి జీవిత సత్యం. త్యాగభావం
త్యాగం వల్లనే అమృతత్వం లభిస్తుందని శైవల్యోపనిషత్తు భోదించింది. మనిషి గుణాల్లో త్యాగం మహోన్నతమైనదని చెబుతారు పండితులు త్యాగం ధైర్యాన్ని ఇస్తుంది. చీర శాంతిని కలిగిస్తుంది. మనిషిని మనిషిగా మారుస్తుంది. త్యాగ ఉన్నదానితో అనుబంధం పెంచుకోడు. లేనిదాన్ని కోరడు. అందుకే 'త్యాగిని కా' అని గీత చెబుతోంది.
అనుభవించేవారికి భోగభాగ్యాలు ఆనందాన్ని కలిగిస్తాయి. త్యాగగుణం లోకానికే సంతోషాన్ని ఇస్తుంది. ఎన్నో తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. నిజానికి త్యాగమంటే అందరినీ వదులుకోవడం కాదు. అందరి కోసం తననే వదులుకోగలగాలి. తనకు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవాలి. మన పురాణేతిహాసాల్లో త్యాగధనులైన మహాపురుషుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. అవి నేటి తరానికి స్ఫూర్తిని కలిగిస్తాయి. తండ్రి సుఖసంతోషాల కోసం తన వశం కాబోయే హస్తినాపుర సామ్రాజ్యాన్ని త్యాగం చేసిన మహామహుడు భీష్మపితామహుడు. భీష్ముడు అంతటి త్యాగం చేయకపోతే, మహాభారత కథ మరోవిధంగా ఉండేది.
త్యాగంలోనే శాశ్వతానందం ఉందని, సర్వజనుల హితంలోనే నిజమైన సౌఖ్యం ఉందని స్వర్గసుఖాలను సైతం త్యజించిన భారతంలోని ముద్గలుడి వృత్తాంతం చెబుతోంది. ముద్గలుడు వ్యవ సాయం చేయగా వచ్చిన ధాన్యాన్ని పేదలకు, పక్షులకు పంచి మిగిలిన ధాన్యాన్ని తన కుటుంబ పోషణకు ఉపయోగించేవాడు. ముద్గలుడి త్యాగనిరతిని మెచ్చి దేవతలు అతణ్ని స్వర్గానికి తీసుకు వెళతారు. అక్కడికి వెళ్ళిన తరువాత తాను ఏం చేయాలో చెప్పమని దేవతల్ని అడిగాడు ముద్గలుడు. 'స్వర్గసుఖాలను అనుభవించు, హాయిగా జీవించు' అని చెప్పారు. దేవతలు.
అంతర్యామి
అది విన్న ముద్గలుడు 'ఇక్కడ సుఖాలను అనుభవిస్తూ సోమరిగా ఉండటం కన్నా, కష్టించి పనిచేస్తూ నలుగురికి సాయం చేయడంలోనే ఆనందం ఉంది. ఈ స్వర్గంకన్నా నా భారతావనే మిన్న' అని చెప్పి తన మాతృభూమికి వెనుతిరిగాడు. మన పూర్వీకులు దదీచి మహర్షి, శిబిచక్రవర్తి వంటి మహాత్ములు అసమాన త్యాగనిరతిని ప్రదర్శించి ఆదర్శమూర్తులుగా నిలిచారు. దధీచి మహర్షిలాగా ఇతరుల కోసం ప్రాణాలను ఆర్పించకపోయినా పరులను హింసించకుండా ఉండే సహృదయతను ప్రతి మనిషి అలవరచుకోవాలి. శిబిచక్రవర్తిలా పక్షికోసం శరీరాన్ని పణంగా పెట్టకపోయినా పరులకు హాని తల పెట్టకుండా ఉండాలి. మనిషి మహాత్ముడిలా ప్రవర్తించాలనే నియమం లేదు. నిర్భందం లేదు. కాని మంచి మనిషిగా బతికితే చాలు సమాజానికి ఉపకారం చేయకపోయినా అపకారం చేయకూడదు.
ఉన్నచోటు నుంచి కదలలేని వృక్షాలు జీవించినప్పుడే కాదు, మరణించినా మనుషులకు మేలు చేస్తాయి. ప్రకృతి సర్వం అంతే. మనిషి కూడా ప్రకృతిని ఆదర్శంగా తీసుకుని పరోపకారంతో ముందుకు సాగాలి.
స్వార్ధ రాహిత్యంతో కూడిన ప్రతికార్యం మనిషిని ధార్మికత్వం వైపు నడిపిస్తుంది. అలాంటి త్యాగగుణం మనిషిని మహానుభావుడిగా మారుస్తుంది. గౌతమబుద్ధుడు, గాంధీ మొదలైన వారంతా తమ ఆదర్శాలతో, త్యాగనిరతితో కీర్తికాయులై అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటివారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి. పరోపకార బుద్ధి ప్రదర్శిస్తూ, దైవచింతన కలిగి సాధు వర్తనంతో జీవించడమే నిజమైన త్యాగగుణం. అదే ఒక యోగం. ఆ త్యాగమే. అమృతంతో సమానం. అదే దైవీ సంపద. -
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment