24. ఒకరు: ఈ లోకంలో ఎలా నడచుకోవాలి?
జ్ఞానశిశువు: ఒకడు అద్దె ఇంట్లో ఉంటాడు...
కానీ ఇల్లు తనది అనుకోడు...
బ్యాంక్ క్యాషియరు వద్ద అపారమైన డబ్బు వుంటుంది...
అదంతా తనది అనుకోడు...
అలానే ఉండు నీవు ఈ తనువులో...ఈ జగత్తులో...
25. ఒకరు: గాఢనిద్రలో ఉన్న హాయి నుంచి ఎందుకు మెలకువలోకి జారిపడ్డాను...?
జ్ఞానశిశువు: మాయకు సృష్టి చేయడం, లయం చేయడం స్వభావం.
అదే మన మనసుకు మెలకువగా, నిద్రగా అనుభవంలోకి వస్తోంది...
మాయ యొక్క కల పేరు - లీల.
మనసు యొక్క లీల పేరు - కల.
లోకవత్ లీలా లీలా కైవల్యం...అంటోంది బ్రహ్మసూత్రం...
ఇంతకు మించి ultimate truth లేదు నిజంగా...
మన చిన్న బుర్ర అందుకోగలిగే చిట్టచివరి సమాధానంగా కనుగొన్నారు ఈ వాక్యాన్ని ఋషులు...
* * *
గాఢనిద్ర - స్వరూపస్థానము.
మెలకువ - విహార స్థానము.
మళ్లీ తిరిగి మనం స్వంతగూటికి చేరుకుంటాం
అన్న జ్ఞప్తిలో ఉంటే జాగ్రదవస్త కూడా హాయే...
పక్క ఊరిలో జాతర చూడడడానికి వెళ్లడం లాంటిదే ఈ జాగ్రదవస్త...
జాతరను ఎంజాయ్ చేయండి...
ఎలాగూ తిరుగుప్రయాణం తప్పదు...
స్వంతగూడైన నిద్రలోకి వెళ్లడం తప్పదు...
ఇదీ కాసేపు...అదీ కాసేపు...
ఈ క్రీడ మాత్రమే శాశ్వతం...
బ్రహ్మ మిథ్య...జగత్తు మిథ్య...క్రీడ సత్యం.
* * *
"ఎందుకు" అన్న ప్రశ్నను వదిలి...
జీవితాన్ని ఎంజాయ్ చేయండి...
కళాత్మకంగా...రసాత్మకంగా...
26. ఒకరు: భగవంతుని మీద విశ్వాసం ఎలా కలుగుతుంది?
జ్ఞానశిశువు: జీవితం మీద విశ్వాసం పోయినప్పుడు...
27. ఒకరు: నమస్తే గురువుగారూ!
మన గురువుగారిలా...మెలకువలో ఉంటూనే...
గాఢనిద్రలో ఉన్న విశ్రాంతిని పొందడం ఎలా?
జ్ఞానశిశువు: ఆ సశరీర గురువు కూడా నీ స్నప్నంలో భాగమే...
వారు అనుభవించే విశ్రాంతి స్థితిని కూడా...
నీవు ప్రసాదించిందే...
వారు ప్రబోధించే మాటలన్నింటినీ...
నీవు అప్పుగా ఇచ్చినవే...
వారు నీకు తిరిగి అప్పజెబుతున్నారు...
నీ దానిని నీవు "ఉపదేశం"గా తీసుకుంటున్నావు...
అన్నీ నీదే...
అన్నీ నీవే...
మరిచావు అంతే...
ఆ మరపు కూడా ఉద్దేశపూర్వకమే...
మళ్లీ ఉద్దేశపూర్వకంగా జ్ఞప్తికి తెచ్చుకోవడమే సాధన...
సాధనా-సిద్ధీ...రెండూ నీ కేళీవిలాసములే...
మరపు-జ్ఞప్తి...రెండూ నీ లీలా విశేషములే...
దేవుడు సృష్టి చేయడం కాదు...
దేవుణ్ణి కూడా నీవే సృష్టించావు...
* * *
"గాఢనిద్ర" అనే ఉన్నతమైన ఆధ్యాత్మికస్థితి నుండి జారి...
మెలకువలోకి...ద్వంద్వంలోకి వచ్చిపడ్డావు...
మళ్లీ ఈ మెలకువలో గాఢనిద్రానుభవం పొందడం ఎలా?
అనే పిచ్చిప్రశ్న యెందుకు?
ఎలా? అన్న ప్రశ్నను వదిలేయ్...
అదే మోక్షం...
ఆ ప్రశ్నే కాదు...
అన్ని ప్రశ్నలూ వదిలేయ్...
ప్రశ్న లేకుండడమే గాఢనిద్రానుభవము...
ప్రశ్నలు వేయడం - విజ్ఞానం.
ప్రశ్నలు వదిలేయడం - సుజ్ఞానం.
ఒక్క మనిషి తప్ప మిగతా ఏ జీవరాశీ...
ఏ ప్రశ్నా లేకుండా హాయిగా జీవిస్తున్నాయి...
ప్రశ్నే ఆటంకం సమాధానానికి...
ప్రశ్న లేకుంటే సమాధానం అక్కడే ఉంటుంది...
ప్రశ్నే మనస్సు...
ప్రశ్న పరిత్యాగమే చిత్తపరిత్యాగము...
ప్రశ్న లేకుంటే మనసు చచ్చి ఊరుకుంటుంది...
అదే "సుమ్మా ఇరు"...
గురువు అంటే "కేవల సమాధానము"...
అందుకే గురుసన్నిధి విశ్రాంతిగా ఉంటుంది...
గురుసన్నిధిలో గడపడమే గొప్ప సాధన....
గురుసన్నిధిలో గడపడమే గొప్ప సమాధి...
గురున్నిధి అంటే కేవలం వారి దేహం దగ్గర కూర్చోవడం మాత్రమే కాదు...
వారి తత్త్వానికి దగ్గరగా గడపడం కూడా...
28. ఒకరు: ముక్తి పొందటం ఎలా?
జ్ఞానశిశువు: ముక్తి పొందటం అనేది...
నీ ప్రయత్న-అప్రయత్నాలతో సంబంధం లేదు...
నీ ఇష్టా-అయిష్టాలతో నిమిత్తం లేదు...
చచ్చినట్టు ప్రతి ఒక్కడూ ముక్తి పొంది తీరుతాడు...
మోక్షం ప్రతి ఒక్కని జన్మహక్కు...
ఈలోపుగా తొందరపడి...
బాధగురువుల బారిన పడకండి...
ఆధ్యాత్మికవ్యాపారవలలో చిగులుకోకండి...
కాయలన్నింటికీ చెట్టే ఆధారం...
కాయకు మరో కాయ ఆధారం కాదు...
ఏ గురువూ, ఏ బోధకుడూ నీకు ఆధారం కాదు...
"అందరికీ శ్రీహరే అంతరాత్మ" అన్నాడు అన్నమయ...
భగవంతుడు నీకు కేటాయించిన పనిని...
నిరామయంగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే...
గొప్పసాధన...
* * *
నదికి ప్రవహించడమే సాధన...
జీవికి జీవించడమే సాధన...
* * *
ప్రతి భావం ప్రయాణం అభావంలోకే...
ప్రతి మాట ప్రయాణం మౌనంలోకే...
ప్రతి కర్మ ప్రయాణం అకర్మలోకే...
ప్రతి చలనం ప్రయాణం అచలంలోకే...
ప్రతి జీవి ప్రయాణం దైవంలోకే...
29. రవి: గురువుగారూ...
జీవితం నశ్వరమా?
జ్ఞానశిశువు:
బోగీల వైపు నుంచి చూస్తే...
ఒకడు ఒక బోగీలో నుంచి...
మరో బోగీలోకి వెళ్లినట్టు ఉంటుదేగానీ....
రైలుతో పోలిస్తే వాడు ఎక్కడికీ వెళ్లడం లేదు...
వాడు రైల్లోనే ఉన్నాడు...
* * *
ప్రదేశాల వైపు నుంచి చూస్తే...
రైలు ఒక ప్రదేశం నుంచి...
మరొక ప్రదేశానికి వెళ్లినట్టు ఉంటుందేగానీ...
భూమితో పోలిస్తే...
No comments:
Post a Comment