Thursday, September 29, 2022

సహనం... సద్గుణం....సాధన.

 సహనం... సద్గుణం....సాధన. 
🌹🍁🍁🍁🍁💐🌻💐🍁🍁🍁🍁🌹

💐 చాలా మందిలో సహజంగా వచ్చే ప్రశ్న .. దేన్నయినా జయించాలన్నా, దోషాలను పరిహరించాలన్నా ముందు నేనేమి చేయాలి...??

💐 మొదట నీలోని దుర్గుణాలను జయిస్తే సమాజంలో దేన్నైనా జయించటానికి అర్హత లభిస్తుంది. ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటే అదే. జీవనంలో ధర్మాచరణ ద్వారానే మనం దోషాలన్నింటిని పరిహరించగలం.

💐 పురాణాలు, ధర్మశాస్త్రాలు, అవతార పురుషుల జీవితాలు మనకు సహనాన్ని బోధిస్తున్నాయి. భారతీయ హృదయానికి ఆయువు పట్టులాంటి సహనాన్ని వదిలి ధ్యానం మాత్రమే చేయాలను కోవటం అత్యాశే అవుతుంది.

💐 శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. తన 12వ ఏటనే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు. బ్రహ్మకు సైతం అంతు చిక్కని శక్తిని ప్రదర్శించాడు. అయినా ఆయన వచ్చిన పనులన్నీ పూర్తి చేయటానికి 120 సంవత్సరాల కాలం జీవించాల్సి వచ్చింది.

💐 మన జీవన పరమార్థమేమిటో, వచ్చిన పనేమిటో, మనకు తెలియకపోవచ్చు.. కానీ.. అవతరించిన దైవానికి అన్నీ తెలుసు. సహనం నేర్పటం కూడా అవతార రహస్యంలో భాగం కాబట్టి వారు కూడా కాలానుగుణంగానే వ్యవహరించారు.

💐 శ్రీరాముడు, శ్రీకృష్ణుడి మనసులు వేరైనా అనుసరించిన ధర్మం, ఆచరించి చూపిన సచ్ఛీలం ఒక్కటే. 

💐 శ్రీరాముని పూజించడం అంటే ఆయన సద్గుణాలను అలవర్చుకోవటం. సద్గుణ సంపత్తితో దేన్నైనా జయించవచ్చు...

💐 సమయాన్ని సాధన కొరకు ఉపయోగించండి...

💐 సాధన ద్వారా విశ్వశక్తిని పొందినపుడు కంటి చూపుతోటే కావాల్సిన పనులన్నీ చేయవచ్చు.. ఆ మాత్రం నమ్మకం, విశ్వాసం లేకుంటే ఎదుగుదల ఉండదు.. 

💐 ఇన్నిరోజుల సాధన ద్వారా కొంతైనా అవగాహన రావాలి.. పొందాలి... ఆ దిశగా ఆలోచించండి.. ప్రచారం కన్నా (సాధన )ప్రయత్నం గొప్పది.. 

💐 గురువు చుట్టూ తిరగడం మానేసి గురువు చెప్పిన, చూపించిన మార్గంలో ప్రయాణం కొనసాగించాలి.. అపుడే గురువుకి ఆనందం... అదే గురుదక్షిణ... ప్రచారంలో కొంత ఎదుగుదల... సాధనలో సంపూర్ణ ఎదుగుదల... 

💐 ధ్యాన ప్రచారం చేస్తున్నామని సాధన చేయకుండా ఉంటారు కొందరు.. కొండకు వెంట్రుక కట్టి లాగినట్లు.. సాధన చేస్తున్నామని ఆచార వ్యవహారాలను మూఢ నమ్మకాలుగా ప్రచారం చేయవలసిన అవసరం లేదు.. 

💐 ఆచారాలలో ఆరోగ్య రహస్యాలు, సైన్స్ గుర్తించని రహస్యాలు ఎన్నో ఉన్నాయి... చెప్పవలసింది చెబితే సరిపోతుంది... దేనిమీద ముసుగులు కప్పవలసిన పనిలేదు... 

సాధనలో అద్భుతమైన సత్యాలు సాధకులు తెలుసుకుంటారు...


సేకరణ: 
🌹🍁🍁🍁🍁💐🌻💐🍁🍁🍁🍁🌹 

మనసు మిమ్మల్ని గెలిస్తే మీరు పిచ్చి వారవుతారు.. మనసును మీరు గెలిస్తే యోగి అవుతారు

 🙏🏽🙌🏿 లక్ష్మిశ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం రేణిగుంటరోడ్డు.తిరుపతి 
వ్యవస్థాపకులు .ధర్మఛారౄ            
'తిరుపతి' శ్రీనివాసరావు
కర్మయోగి..ప్రధాన నిర్వహకులు
9390216263..9550804092                                                   🙏🏽🙌🏿🌹🙊🙉🙈      🌹నేటి ఆత్మ విచారం. 🌹

భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వ వరం మనసు. 

కంటికి కనిపించని మనసు- కనపడనంత దూరతీరాల అద్భుతాలను చూపిస్తుంది. 

ఆనందమయమైన మరో లోకంలో విహరింపజేస్తుంది. 

మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మనసు తుంటరిదై అల్లరి చేస్తుంది. గాలిమేడలు కట్టేస్తుంది. బికారిని కోటీశ్వరుణ్ని చేసి అందలమెక్కిస్తుంది. 

మనసు మాయలాడి. మనిషిని మయసభలో చిందులేయిస్తుంది. బజారులో అడుగులేస్తుంటే కనపడినవన్నీ కొనమంటుంది. 

ఆడంబరాలు రుచిచూపిస్తుంది. మనసు మాట విన్న మనిషి అప్పుల ఊబిలో కూరుకుపోతాడు.

దేవాలయంలో అడుగుపెట్టగానే ధ్యానంపై ధ్యాస నిలవదు. మనసు దారి మళ్లిస్తుంది. కోర్కెల చిట్టా విప్పుతుంది. భగవంతుడు నవ్వుకుంటాడు. మనసు కవ్విస్తుంది. మురిపిస్తుంది. ఆవేశం రగిలిస్తుంది. దురాశలో ముంచుతుంది.

రోషాలు-ద్వేషాలు, పంతాలు-పట్టింపులు, కక్షలు-కార్పణ్యాలు, హత్యలు-ఆత్మహత్యలు- అన్నింటికీ మూలం మనసు. 

మనసు చేసే అల్లరికి మనిషి బానిస. జీవితం భ్రమ అన్న సత్యాన్ని మరపించి, జీవితం సత్యమన్న భ్రమలో ముంచుతుంది.

మనసు మల్లెలా సుతిమెత్తన. చిన్నదెబ్బకు పెద్దగా రోదిస్తుంది. ఎదుటివారి కష్టాలకు కన్నీళ్లు కారుస్తుంది. అయినవారు పరమపదిస్తే పదిరోజులు పరితాపం చెందుతుంది. 

అది బండరాయిలా అతి కఠినం. కష్టాన్ని దిగమింగుతుంది. దుఃఖాన్ని భరిస్తుంది. ఉపద్రవాన్ని తట్టుకుంటుంది. మనసుకు మరపించే శక్తి లేకుంటే మనిషి మనుగడ అసాధ్యం.

మనిషి సామర్థ్యం మనసే. మనిషి ఎదుగుదలకు బాటలు పరుస్తుంది. జీవితంలో పైకి రమ్మని పోరుతుంది. సుఖంగా సంతోషంగా జీవించడానికి సన్నాహాలు చేస్తుంది. అవకాశాలు అందిపుచ్చుకోమని సతాయిస్తుంది. మనసు చేసే మాయ నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు.

’నేను మనసు మాట వినను. స్థిర చిత్తుడను’ అని పలికేవాడే ఆ మాయలో పడుతుంటాడు.
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు నిలయం మనసు.
కోప తాపాలకు మూలం మనసు. 

ధ్యానంతో మనసును జయించవచ్చు. ఉదయం వీలైనంతసేపు భగవంతుడి యందే దృష్టి నిలిపి ధ్యానం చేయడం అలవరచుకుంటే, మనసు రోజంతా నిర్మలంగా ఉంటుంది. 

మనసును అదుపు చేయగల శక్తి భగవన్నామ స్మరణకే ఉంది. అందుకే పూజా నియమం. పూజ చేసే సమయంలో మనసులో వేరే ఆలోచనలు రానీయక భగవంతుడియందే మనసు లగ్నం చేస్తే ఏకాగ్రత అలవడుతుంది.
మనసును అదుపు చేస్తే అసూయ, అసంతృప్తి, అసహనం, అహంభావాలు దరికిరావు. 

కోరికలను అదుపు చేసుకుంటే … సంతృప్తికర జీవితం సుఖమయం  ఔవుతుంది. మనిషి తన హద్దులను దాటకూడదు. నేల విడిచి సాము చేయడం మంచిది కాదు.

ఉన్నతమైన మానవజన్మ లభించినందుకు మానవత్వాన్ని మరచిపోకూడదు. మనసు వెళ్ళినంత దూరం మనిషి వెళ్ళకూడదు. 

నీతి నియమాల కళ్ళెం వేసి మనసును లొంగదీయగలిగేది భక్తి ఒక్కటే...ఆ భక్తి వంటబట్టిందా... జీవితం ఆనందభరితమే!                   ఆరోహణ, అవరోహణ  అంతా మనిషి స్వయంకృతమే.

మనసు మిమ్మల్ని గెలిస్తే మీరు పిచ్చి వారవుతారు.. మనసును మీరు గెలిస్తే యోగి అవుతారు 
 మీ మనసును నియంత్రించండి  అప్పుడు మీరు ఈ ప్రపంచాన్నే జయించేయచ్చుఅంటాయి మన శాస్రాలు 
ఆశ ఏదో మాములుగా బతికిస్తే చాలు అనుకుంటాడు సామాన్యుడు. 
మనసును జయించడం అనే మాటను చిన్నప్పటి నుంచీ వింటుంటాం.  మనం నిజానికి మనసు ను కంట్రోల్ చేయడం ఏమైనా సామాన్య విశయమా? 
మాటే కంట్రోల్ చేసుకోలేని మనుషులు  మనసుని కంట్రోల్ చేసుకో గలరా? 
మనసు ను కంట్రోల్ చేయడం అంటే జీవితం మొత్తం మార్చేసు కోవడమే..☝
            

గురువు ఎలా వుండాలి???

 గురువు ఎలా వుండాలి???

బ్రహ్మ సాక్షాత్కారానికి భగవన్నామమే చాలు, కానీ   భక్తి లేనిదే నామస్మరణ వల్ల లాభం లేదు...
భగవంతుని గురించి ఆలోచించాలి, సిరి సంపదలు, పేరు ప్రతిష్ఠలు, ఇవన్నీ అల్పమైనవిగా తెలుసుకోవాలి... 

త్రికరణ శుద్ధి గా దైవాన్ని నమ్మాలి... 
రామకృష్ణ పరమహంస, రాణీ రాసమణీ దేవిని, తమ ఉపన్యాసము శ్రధ్ధగా విన లేదని, సభలోనే, చెంపదెబ్బ కొడతారు... "ఇక్కడ నీ కోర్టు విషయాలు ఆలోచించకూడదు" , ఇక్కడ కూర్చుని వింటున్నట్లు నటిస్తున్నావని ఆమెను మందలిస్తారు...
రాసమణీదేవి తన తప్పు తెలుసుకుంది, ఆయన తన అతీంద్రియ శక్తితో తన మనస్సును పుస్తకంలా చది వారని తెలుసుకుంది...
తనలో పరివర్తన కలిగించడం కోసమే, ఈ చర్య తీసుకున్నారని గ్రహించింది...

" ఈనాడు గురువుల చేత ఆధ్యాత్మిక ఉపన్యాసము లిప్పించడం, వారి విద్వత్తును ప్రశంసించి సన్మానించడం పరిపాటి ఐపోయింది...
ఈరోజు పండితులు తమగ్రంధపాండిత్యము ద్వారా కేవలం " ఇన్ఫర్మేషన్ " అందిచ్చవచ్చు, కానీ ఇది ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు, అని ఎవరూ చూడడం లేదు...

అయితే, రామకృష్ణ పరమహంస వంటి జ్ఞానికి" ట్రాన్సఫర్ మేషన్ " కలిగించే శక్తి కూడా ఉంది..." ఈ యుగంలో ఇలాంటి గురువుల అవసరం ఎంతో వున్నది..

ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి?

 అహం అనే భావన నాశనమైపోయినప్పుడు శ్రేష్ఠం, అఖండం అయిన సత్‌ స్వరూపం ‘నేను, నేను’ అంటూ హృదయంలో స్వయంగా ప్రకాశిస్తుంది’ అని ఈ శ్లోక భావం. భగవాన్‌ రమణ మహర్షి రచించిన 31 శ్లోకాల ఆత్మజ్ఞాన గ్రంథం.. ‘ఉపదేశ సారం’లోని 20వ శ్లోకమిది. మనో నాశనం కావాలంటే ‘నేను’ అనే భావన తొలగిపోవాలని తెలిపిన రమణులు.. ఆ భావన పోయాక మిగిలి ఉండే స్థితి గురించి ఇందులో వర్ణించారు. అహం భావన పడిపోయాక మిగిలే ‘నేను’.. సత్యమైనది. అది జ్ఞాన స్వరూపం. సత్‌ రూపం. అఖండం, పరిపూర్ణం అయిన శాశ్వత వస్తువు. ఈ ‘నేను’నే రమణ మహర్షి ‘తాను’ అని వ్యవహరించేవారు. మనం సుషుప్తిలో ఉన్నప్పుడు అన్ని భావనలు, మనస్సు అంతమైనా కూడా ప్రకాశిస్తూ ఉండేది ఇదే. కాకపోతే మనస్సు ఆ ‘నేను’లో లయమైందే తప్ప నశించలేదు కనుక..
మెలకువ రాగానే మళ్లీ మనసు, దాంతోపాటు ఈ జగత్తు, సుఖదుఃఖాలు అన్నీ పుట్టుకొస్తున్నాయి. ప్రయత్నపూర్వకంగా, విచారణతో ‘అహం’ భావనను నాశనం చేస్తే ఆ స్థానంలో తాను (ఆత్మ) ‘నేను నేను’ అని స్వయంగా ప్రకాశిస్తుంది. అదే ఆత్మసాక్షాత్కారం. ఆత్మ దర్శనం. అయితే.. ఆత్మదర్శనం అనే మాట నిజానికి పెద్ద తప్పు. ఎందుకంటే.. ఆత్మ అనేది ఒక వస్తువు కాదు. దర్శించడానికి అది దృశ్యమూ కాదు. అది మనచే చూడబడే వస్తువే అయితే.. అది పరిమితమైనదే అవుతుంది. పరిమితమైనది నశిస్తుంది. అలా నశించేది ఆత్మ కాదు. అది ఏకం, అద్వయం, సర్వవ్యాపకం. అది మనకన్నా వేరు కాదు. కనుక మనం దాన్ని వేరుగా దర్శించలేం. ఆత్మ దర్వనం అంటే.. అది ‘నేనే’ అని అనుభవం కలుగుతుందంతే.
ఆత్మదర్శనం కేవలం విచారణ వల్ల మాత్రమే కలుగుతుంది. పూజ, యజ్ఞం, దానధర్మాలు మొదలైన కర్మల వల్లగానీ, జపం, ధ్యానం మొదలైన సాధనల వల్లగానీ, ప్రాణాయామం మొదలైన ప్రక్రియల వల్ల గాని ఈ ‘అహం’భావన తొలగిపోదు. ఈ సాధనలన్నీ కొన్ని ప్రక్రియలు మాత్రమే. ‘అహం’ పుట్టుక ఎక్కడో వెతకడం (విచారణ) వల్లనే అది పడిపోతుంది. అప్పుడే ఆత్మదర్శనం. అయితే, దీనికి ఒక మినహాయింపు ఉంది. సాధకుడు సాధన చతుష్టయ సంపన్నుడై తగిన శ్రద్ధ చూపిస్తే సద్గురువు ద్వారా వేదాంత బోధ వింటూ ఉండగానే అతడికి ఈ స్థితి సద్యోఫలంగా లభిస్తుంది. ఆ అర్హత లేనివారు దాన్ని సంపాదించడానికే జపధ్యానాదులు. వాటి ద్వారా అర్హత సంపాదిస్తే అప్పుడు విచారణ చేసి, అజ్ఞానాన్ని తొలగించుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. 
ఆత్మ ఎక్కడి నుంచో రాదు. అది స్వయం వ్యక్తం. అందుకే రమణులు ‘స్ఫురతి హత్‌ స్వయం’ అన్నారు. వర్షాకాలంలో సూర్యుడు మబ్బుల వెనుక ఉండడం వల్ల వెలుగు కనిపించదు. అంతమాత్రాన సూర్యుడు లేనట్టు కాదు. ఆయనెప్పుడూ జ్వాజ్వల్యమానంగా వెలుగుతూనే ఉంటాడు. ఆత్మ కూడా అంతే. అజ్ఞానమనే మేఘాలు కప్పివేయడం వల్ల మనకు కనిపించడం లేదంతే. జ్ఞానమనే గాలి వీచినప్పుడు అజ్ఞానపు మబ్బులు తొలగి ఆత్మదర్శనమవుతుంది. అందుకే.. ‘నేనడంగిన చోట నేను నేననుచు తానుగా తోచును తాను పూర్ణంబు’ అన్నారు రమణ మహర్షి.
ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి?
ఈ మధ్య చాలమంది గురువులు కొంచెం పేరు సంపాదించి మీడియాలలో tvలలో కనిపిస్తూ ఆత్మసాక్షాత్కారం కలిగింది అని చెప్పుకుంటూనే పరమాత్మ ఎవరు అనే విషయాన్ని మరుగున పరచి శైవ వైష్ణవ శాక్తేయ గొడవలు సృష్టిస్తున్నారు కొందరైతే గ్రంథ రచనచేసి మరింత ప్రచారము చేసుకుంటున్నారు.
మనస్సు ఆత్మతో లయం చేయడమే ఆత్మసాక్షత్కారము అని ఒక tvగురువు ఈమధ్యనే ఒకగ్రంధంలో వ్రాశారు.
మనస్సు ని ఆత్మతో లయం చేస్తే ఇంద్రియనిగ్రహం వస్తుంది కాని ఆత్మసాక్షాత్కారం ఎలా వస్తుంది.
ఆయనచెప్పినది ఏమిటంటే ఆదినారాయణుడు వేరు సదాశివుడు వేరు శివుడువేరు విష్ణువు వేరు శంకరుడు వేరు మహేశ్వరుడు వేరు పరాశక్తి వేరు అని
శివుడే పరబ్రహ్మం అని సెలవిచ్చారు.
అత్మసాక్షాత్కారం పొందిన వాడు చెప్పే మాటలేనా ఇవి.
అత్మసాక్షాత్కారం అంటే సర్వం ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకోవడం.
ఆత్మసాక్షాత్కారం అంటే ఆత్మని పరమాత్మతో ఒక్కటి చెయ్యటం.
ఆత్మసాక్షాత్కారం అంటే మూలాధారచక్రంలో ఉన్న కుండలిని శక్తిని
మేల్కొలిపి ఆప్రాణశక్తిని ఆజ్ఞాచక్రం దాటి సహస్రారమునకు చేర్చడం.
ఆత్మసాక్షాత్కారం పొందినవాడికి సర్వము ఒక్కటే అంతా నిరాకార నిర్గుణ నిర్వికల్ప నిర్లింగ సర్వాతీత పరబ్రహ్మస్వరూపమే ఉన్నదని తెలుసుకోవడం.
ఆ పరబ్రహ్మస్వరూపానికి ఎలాంటి పేరు లేదు ఏలాంటి గుణములు లేవు నిరాకారుడు సర్వానికి అతీతుడు లింగరహితుడు ఆపరబ్రహ్మమునే ఆదినారాయణుడు అని పరమశివుడని ఆదిపరాశక్తి అని ఎవరికి నచ్చినట్లువారు పూజిస్తారు.
ఎవరిని పూజించినా చేరేది ఒక్కరికే.
ఎవరిని స్మరించినా అది ఒక్కరినే.
నారాయణుడు శివుడు బ్రహ్మ విష్ణువు శంకరుడు వేరు వేరు కాదు ఒక్కటే ఒకేపరబ్రహ్మస్వరూపులు.
నిరాకారము(పరమాత్మ)
సాకారము(జీవాత్మ)
ఒక్కటే.
పరమాత్మ యోగమాయచే శూన్యస్థితి నుండి జీవాత్మగా మారుతున్నాడు.
జీవాత్మ యోగసాధనతో పరమాత్మలో లయమయ్యి ఆశూన్యస్థితిని చేరి పరమాత్మగా మారుతున్నాడు.
సృష్టి స్థితి లయములో స్థితి శాస్వతమైనది అదే పరబ్రహ్మస్వరూపమైన శూన్యస్థితి.
అంటే నీరాకారపరబ్రహ్మమే శాశ్వతమైన స్థితి ని పొందుతున్నాడు మిగిలినది అది ఏదైనా సరే అశాశ్వతమే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నిజమైన ఆత్మసాక్షాత్కారము.
ప్రతీ జీవి పరమాత్మ(నీ యొక్క) స్వరూపమే అనే సత్యాన్ని తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారము...

సేకరణ. మానస సరోవరం 

భయం...ఇది చదివి భయాన్ని పొగట్టుకోండి.

 ...... .....భయం.......
    మనందరం గతంలో భయ పడ్డాము . భయ పుడుతూ వున్నాము.  భవిష్యత్ లో పడతాము కూడా.
     ఇది చదివి భయాన్ని పొగట్టుకోండి.
   భయం ఒంటరిగా వుండదు. ఇది ఒక సంఘటనతోనో,ఒక విషయంతోనో , సంబంధంతోనో, వ్యవహారంతోనో ముడి పడి వుంటుంది.
   భయం లో 5 అంశాలు వున్నాయి.
1) గందరగోళం.పైన చెప్పిన సంఘటన, వ్యవహారం, మొదలగు వాటి పట్ల మనకు కన్ఫ్యూషన్ వుండి స్పష్టత లోపిస్తుంది.
2) అయిష్టత.జరిగే విషయాల పట్ల అయిష్టంగా వుంటుంది .
3) అపాయం లాగా కనపడుతూ వుంటుంది.
4) మనం బలహీనులం  అని అని పిస్తుంది
5) పారిపోదామనే ఆలోచన వుంటుంది
    ఈ భయం మనలను ఏమి చేస్తుంది.
1) సమస్యకు పరిష్కారం వున్నా, మనకు తట్టనివ్వదు.
2) మనలను బలహీన పరుస్తుంది
3) తప్పులు చేయిస్తుంది.
     ఎలా బయటపడాలి
1) సంఘటనని సరిగ్గా అంచనా వేసి స్పష్టంగా అర్ధం చేసుకోవాలి.
2) ఎల్ల వేళలా అన్నింటికి సన్నిధులై వుండాలి.ఇది ఇష్టాఇష్టాలను తొలగిస్తుంది.
3) ఊహించని సంఘటనలు జరుగుతాయి. అప్రమత్తతగా వుండాలి.
4)  దేనినైనా ఉన్నది ఉన్నట్లుగా దర్శించాలి.
   అర్థం అయితె భయం పోయినట్లే.
ఇట్లు
భయస్తుడు  లేని భయం

నేటి యువతరం వింత పోకడలకు తల్లిదండ్రులే భాద్యులా

 నేటి యువతరం వింత పోకడలకు తల్లిదండ్రులే భాద్యులా. చదవండి. 

అమ్మ నాన్నలూ .. బాధ్యత ఉన్న పౌరులు
పెంచుదామ పిల్లలను పద్దతిగా 
ఆధునికత పేరుతోటి వెర్రి చేష్టలు 
మానిపించి తీర్చి దిద్దుదామ మనుషులుగా 
అతి గారంతో మనం చెడగొడుతుంటే 
మతి తప్పిన యువత భవిత చెదపడుతుందే...

అమ్మ, నాన్న, గురువులపై లేదు గౌరవం 
అతిథులు, బంధువులంటే ఆమడ దూరం 
ఇంటి పనులు చేయుటన్న తమకవమానం 
సొంత బరువు మోయలేని శరీర భారం 
మంచి మాట చెపితె చెప్పలేని కోపము 
తప్పు చేసి ఒప్పుకొనుటకెంతో రోషము 
వింతగ మారింది నవతరం 
ఇందుకు కారణ మయ్యాము తల్లిదండ్రులం

తెల్లవారు దాక సెల్లుతోటి ఆటలు 
తల్లి, తండ్రి వినకూడని చాటు మాటలు 
అమ్మ చేతి వంట అంటె ఏవగింపులు 
అడ్డమైన ఫాస్టు ఫుడ్స్ ఆరగింపులు
వికారమగు జుట్లు, టాటూలు, డ్రెస్సులు 
సంస్కారం మాటెత్తితే కస్సుబుస్సులు...!
వింతగ మారింది నవతరం 
ఇందుకు కారణ మయ్యాము తల్లిదండ్రులం

అమ్మ భాష అంటె వీరు ఆమడ దూరం 
ఇంగిలీషు లోన వొలకబోయు వయారం 
పబ్బు, క్లబ్బు కల్చరుతో దుమ్ము దుమారం 
విచ్చలవిడి తనము తోటి వీర విహారం
బెట్టింగులు, రేసుల మునిగే వ్యవహారం   
(చైన్) స్నాచింగుల నేరాలతో తేలు యవారం...!
వింతగ మారింది నవతరం 
ఇందుకు కారణ మయ్యాము తల్లిదండ్రులం

***
మారాలంటే యువతరం 
ముందుగ మారాలి మనం తల్లిదండ్రులం. 

ఇంగ్లీష్ చదువుల పై మోజెంత ఉన్ననూ 
ఇంటి లోన సంస్కృతి అలవాటు క్షేమము 
బాధ్యత, మర్యాద, మంచి, ఓర్పు, సహనము, 
ప్రేమ, గౌరవాలు నేర్పితేనె విజయము 
దైవ భక్తి, దేశభక్తి, సేవా గుణము 
అలవరచక యువత భవిత అంధకారము
మారాలంటే యువతరం 
ముందుగ మారాలి మనం తల్లిదండ్రులం. 

అమ్మమ్మలు, నానమ్మలు, తాతల కథలు
పండించును మన పిల్లల బంగరు కలలు
మన పూర్వులు, మహనీయుల మంచి పలుకులు 
చిందించును యువత భవిత లోన వెలుగులు  
ధర్మమార్గ మును విడువని తల్లిదండ్రులు 
యువతకు ఉత్తమ జీవనమిచ్చు దాతలు
మారాలంటే యువతరం 
ముందుగ మారాలి మనం తల్లిదండ్రులం. 
*** 
సేకరణ. మానస సరోవరం 

గురువు ఎప్పుడూ పరమ ప్రేమ స్వరూపమే. అందులో సందేహం లేదు. ఎల్లప్పుడూ శిష్యుని అభ్యున్నతిని కోరుతాడు గురువు. అందులోనూ సందేహం లేదు.

 *అమృతం గమయ*

*కృష్ణం వందే జగద్గురుం.*

గురువు ఎప్పుడూ పరమ ప్రేమ స్వరూపమే. అందులో సందేహం లేదు. ఎల్లప్పుడూ శిష్యుని అభ్యున్నతిని కోరుతాడు గురువు. అందులోనూ సందేహం లేదు.

అయితే గురువు ప్రసరించే ప్రేమ శక్తిని అందుకునే స్థాయి శిష్యునికి వుండాలి. అదెలా వస్తుంది?
గురువు మాత్రమే తనను ఉద్ధరించ గలడు అనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి వుండటమే ఆ స్థాయిని అందిస్తుంది. కానీ మనం ఏమి చేస్తున్నాం?

ఏదో ఒక సమస్య పరిష్కారానికి గురువును ఆశ్రయంచి ఉంటున్నాం. ఆ సమస్య తీరితే ఆ గురువు గొప్పవాడు. తీరకపోతే మరో గురువు.

ఇలా కొట్టుకు పోతున్నాం.గురువు నీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఆ శక్తి గురువులో వుందని నువ్వు మనసా, వాచా, కర్మణా నమ్మాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది. సేవాభావం వల్లనూ మరియూ సర్వస్వ శరణాగతి వల్లనూ గురువు ప్రసన్నుడు అవుతాడు.

కనుక నువ్వు ఎప్పుడు గురువే సర్వస్వం అని నమ్ము అప్పుడే నీ గురువు నీ చేతిని పట్టుకుని నడిపిస్తాడు. నమ్మకం అచంచలంగా వుందా నీలో? ఆ ప్రశ్నకి ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి.

గురువు మార్గాన్ని చూపిస్తాడు.ఆ మార్గంలో నడవటం నీ పని. గురువు జ్ఞానాన్ని అందిస్తాడు.ఆ జ్ఞానాన్ని జీవితంలో భాగం చేసుకోవటం నీ పని. గురువు ప్రేమని ప్రసరిస్తాడు.ఆ ప్రేమని నీలో నింపుకోవడం నీ పని. 
గురువు దగ్గరకి వెళ్ళేటప్పుడు నీ బుద్ధిని, నీ తెలివితేటలను పక్కనపెట్టి వెళ్ళాలి. గురువుతో వాదన పనికిరాదు.

గురువు చెప్పే మాటలను చెవులతో కాదు.మనసుతో వినాలి. గురువును నమ్మినప్పుడు కళ్ళు మూసుకొని, ఇతర చింతనలు లేకుండా నమ్మాలి...

గురువుకు నిన్ను నువ్వు సమర్పించుకోవడం అంటే నీ హృదయాన్ని పూర్తిగా తెరచి సమర్పించాలి. గురువు ఉపదేశాన్ని వినేటప్పుడు నోరు మూసుకొని వినాలి. ఇవన్నీ చేయగలిగితే గురువు నీవాడు అవుతాడు.

నువ్వు లౌకికంగా అత్యున్నత విద్యావంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు అనుక్షణమూ నీకు అక్షరాభ్యాసమే
నువ్వు సమాజంలో గురువు కన్నా ఉన్నత స్థాయిలో వుండవచ్చు. కానీ గురువు ముందు నువ్వు కేవలం ఒక సేవకుడివే.

నువ్వు గురువు కన్నా అత్యధిక ధనవంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు నిరుపేదవే. నువ్వు గురువు కన్నా అధిక లౌకిక జ్ఞానం కలవాడివి కావచ్చు. కానీ గురువు ముందు పరమ అజ్ఞానివే.
నీ లౌకిక విద్య గురువు ముందు నిరక్షరాస్యత గా మిగులుతుంది. సమాజంలో నీ స్థాయి గురువు ముందు నిష్ప్రయోజనం గా మిగులుతుంది.
నీ ధన సంపద అంతా గురు చరణ ధూళిని కూడా తాకలేదు. నీ లౌకిక జ్ఞానం సమస్తం గురువు అలౌకిక జ్ఞానం ముందు గుడ్డి గవ్వకు కూడా పనికిరాదు
ఈ విషయాన్ని మనస్సులో స్థిరంగా నిలుపుకో గలిగితే గురువు నీ వాడు అవుతాడు.
*ఓం శ్రీ గురుభ్యోనమః*

మోక్షం అంటే ఏమిటి?

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                       మోక్షం
                   ➖➖➖✍️

మోక్షం అంటే ఏమిటి?

ప్రతీ ప్రాణీ కూడా పాపమో, పుణ్యమో ఏదో ఒక కర్మ శేషం ఉంటేనే ఈ భూమి మీద పుడతాడు.

మోక్షం  అంటే  పాపము  మరియు పుణ్యము లేని స్థాయిని చేరడం. 

ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ భూమి మీద జన్మ ఎత్తవలసినన అవసరం ఉండదు.

మతం ఏదైనా మతంలో, మోక్షం అనేది ధ్యానం ద్వారా మానవులు సాధించగల ఆనందం మరియు శాంతి స్థితి.

బౌద్ధమతం,  జైన మతం మరియు హిందూ మతం యొక్క అతి ముఖ్యమైన సూత్రాలలో ఇది ఒకటి , ఎందుకంటే ఇది చేరుకోగల గరిష్ట స్థితిని సూచిస్తుంది.

మతంలో, మోక్షం అనేది అత్యున్నత స్థానంగా భావించబడుతుంది, దీనిలో మీరు మీ భుజాలపై మోసిన అన్ని బాధలకు మీరు వీడ్కోలు పలుకుతారు.

ఈ జన్మలోనే మోక్షం పొందడానికి మనకున్న కర్మ క్షయం అవ్వాలి. అంటే ఎన్నో పూర్వ జన్మలలో చేసిన పాపపు కర్మ మరియు పుణ్యపు కర్మల యొక్క ఫలం మొత్తాన్ని ఈ జన్మలోనే అనుభవించాలి.

మోక్షం పొందడానికి   సత్య  త్రేతా ద్వాపర యుగాలలో తపస్సు, యజ్ఞాలు, అతికష్టమైన దీక్షలతోనూ, సద్గురువు యొక్క అనుగ్రహంతోనూ మోక్షాన్ని పొందేవారు.  దానికి వారి ఆయుష్షు, శరీరం, మనస్సు, ఆ కాల పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండేవి.

ఇవి కలియుగ మానవులకు సాధ్యం కాని పని. దానికి మన ఆయుర్దాయం సరిపోదు. ఇలా జన్మ జన్మలలో చేసిన కర్మలకు ఫలాన్ని అనేక జన్మలు ఎత్తుతూ అనుభవిస్తాడు.    మళ్ళీ ఎత్తిన ఈ జన్మలలో కూడా పాపాలు, పుణ్యాలు చేస్తూ ఉంటాడు. మళ్ళీ వీటి కోసం ఎత్త వలసిన జన్మల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. 

ఇలా జీవి జనన మరణ చక్రాలలో ఇరుక్కుంటాడు. చేసిన పాపపుణ్యాల ఫలితాలను కాసేపు దుఖం రూపంలో, మరికాసేపు సుఖం రూపంలో అనుభవిస్తూ ఈ సంసారం అనే సాగరంలో ఈదుతూ, ఒడ్డుకు చేరలేక మునిగిపోతూ ఉంటాడు.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

అధర్మం అంటే ఏమిటి? ఏవి దుష్కర్మలు?

 🧘‍♂️24-కర్మ - జన్మ🧘‍♀️

అధర్మం అంటే ఏమిటి? 

ధర్మానికి విరుద్ధమైనదంతా అధర్మమే. మనం చేసే అనేక దుష్కర్మలన్నీ అధర్మాలే.


ఏవి దుష్కర్మలు? 

మన సమాజంలోని దుష్కర్మలని మహాత్మా గాంధి - యంగ్ ఇండియా పత్రికలో 1924లో ఇలా ఏడుగా విభజించాడు.


1. ఆదర్శాలు లేని రాజకీయాలు.
2. ఇతరులకి ఉపకరించని ఆస్థి పాస్తులు.
3. నీతి లేని వ్యాపారం.
4. శీలం లేని విద్య.
5. ఆత్మ ప్రబోధం లేని సుఖం.
6. మానవత్వం లేని శాస్త్రం.
7. త్యాగం లేని పూజ.


మనమంతా దుష్కర్మలు చేస్తున్నాం!!!!

మనం నిత్యం పాపాలైన అనేక దుష్కర్మలు చేసి వాటి బంధంలో చిక్కుకుంటున్నాం, అంటే మనలో చాలామంది అందుకు ఒప్పుకోరు. 'నేను ఒక్క పాపం కూడా చేయకుండానే జీవిస్తున్నాను' అంటారు. పాపం అంటే వారి ఉద్దేశ్యంలో సాధారణంగా బ్యాంకు దొంగతనం, హత్య , బలాత్కారం లాంటివే అని భావన. నిజానికి మనం చేసేది ఏదైనా అది చేయాల్సిన విధంగా, సరిగ్గా చేయకపోతే పాపంలో చిక్కుబడతాం.


మనం నిత్యం వ్యాపారంలో, వృత్తిలో, ఆఫీసుల్లో లేదా ఇంట్లో చేసే వివిధ పనుల్లో అనేక దుష్కర్మలు మనకి తెలీకుండానే చేస్తూంటాం. మనం శ్రద్ధగా, సమయానికి చేయని, మనకి అప్పగించిన పని వల్ల మనం దుష్కర్మలో చిక్కుకుంటాం.


నిత్య జీవితంలో మనమంతా సాధారణంగా చేసే ఎనిమిది దుష్కర్మలివి.


1. నివారించని ఇతరుల దుష్కర్మ బంధమే 

దుష్కర్మ అంటే మనం చేసే చెడు కర్మలే కావు. మనం నివారించని దుష్టుల చర్యలు కూడా మనకి బంధమై చుట్టుకుంటాయి. అప్పుడు ఆ దుష్టులతో పాటు మనమూ ఆ కర్మ ఫలాన్ని పొందాల్సి వస్తుంది.


1964లో కిట్టీ జెనొవెసె అనే మహిళ న్యూయార్క్ లోని క్వీన్స్ అనే చోట తన అపార్ట్మెంట్ బయట దుండగుల చేత దాడి చేయబడింది.


గంట సేపు ఆమె సహాయం కోసం అరుస్తూనే ఉంది. చుట్టుపక్కల గల ముప్పై ఎనిమిది మంది ఇరుగు-పొరుగు వారు ఆ అరుపులని విన్నారు. కాని, ఆమె సహాయానికి ఎవరూ ముందుకు రాలేదు. కనీసం పోలీసులకి ఫోన్ కూడా చేయలేదు.


కొందరు సహాయానికి వెళ్తే తమకి ఏదైనా అవచ్చన్న భయంతో మిన్నకుంటే, మరి కొందరు అందులో జోక్యం చేసుకోవడం మంచిది కాదని ఊరుకున్నారు. ఇంకొందరు ఎవరో ఒకరు సహాయానికి వెళ్తారని పట్టించుకోలేదు. మొత్తానికి వారంతా ఇలా వివిధ కారణాల వల్ల కిట్టీ జెనొవెసె సహాయానికి వెళ్ళనే లేదు.


ఈ సంఘటన దుర్మార్గులని ఎదుర్కోక పోవడానికి సింబల్ గా ఈనాటికీ అమెరికన్స్ భావిస్తూంటారు. రౌడీలు, గూండాలు, దుర్మార్గులు, దుష్టుల దుశ్చర్యని అడ్డుకుంటే. తనకి ఏదైనా అవచ్చన్న స్వార్ధం అడ్డుపడుతుంది.


'ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టం కాదో అలాంటి పనిని ఇతరుల విషయంలో నువ్వు చేయద్దు' అన్న ధర్మాన్ని అనుసరించి దుర్మార్గులు చేసే మోసాలని, దౌష్ట్యాన్ని ప్రజలు పట్టించుకోకుండా ఉదాశీనంగా ఉంటే అది దుష్కృతం అయి మెడకి చుట్టుకుంటుంది.


తమ ఉద్యోగాన్ని కాపాడుకోడానికో, పై అధికారితో పేచీ రాకూడదనో లేదా తన బాధ్యతని విస్మరించినా మంచివాళ్ళకి కూడా ఆ దుష్కర్మల్లో భాగం ఉంటుంది. దానికి ఫలం లభించినప్పుడు వీరు కూడా ఆ దుష్కృతాన్ని చేసినవారితో పాటు తమ భాగాన్ని అనుభవించాల్సి ఉంటుంది.


ఏకం పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః!
భోక్తారో విప్రముచ్చన్తే కర్తా దోషేణ లిప్యతే!!

భావం:- 

ఒకరు చేసే పాపాల ఫలాన్ని ఆ వ్యక్తితో పాటుగా అనేకమంది అనుభవించాల్సి ఉంటుంది. వారి సమీప బంధువులు, మిత్రులు, అవకాశం ఉండీ నిరోధించని పెద్దలకి ఆ పాప ఫలం సోకుతుంది. అందువల్ల పాపాన్ని చేసేవారిని అడ్డుకోవడం కర్తవ్య కర్మగా భావించి తదనుగుణంగా మసలుకోవాలి.

జీవనంలో ఉంటూ ఆలోచనలు ఆపకుండా బాధలను అధిగమించటం ఎలా ?

      💖💖 *""* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     

*"జీవనంలో ఉంటూ ఆలోచనలు ఆపకుండా బాధలను అధిగమించటం ఎలా ?"*
*****

*"మనకి ఏ ఆలోచన లేనప్పుడు ఏ బాధ కలగటంలేదు. బాధకు ప్రాధమిక కారణం ఆలోచన. ఏ ఆలోచన లేకపోతే హాయిగా నిద్ర సుఖాన్ని అనుభవిస్తాం. అలాగని అసలు ఆలోచన లేనిదే జీవనమేలేదు. మరి అలాంటప్పుడు ఆలోచనలను ఆపడం ఎలా సాధ్యం ? అందుకు భగవాన్ శ్రీరమణమహర్షి చూపిన తరుణోపాయం ఆలోచనలకు మూలం ఏమిటో అన్వేషించటం. సాధారణంగా తన ముందున్న ప్రపంచాన్ని మనసు గమనిస్తుంది. ఆ గమనింపుతోనే జీవనాన్ని కొనసాగిస్తుంది. అందుకు పరిమితమైన ఆలోచన సరిపోతుంది. కానీ మనసుకు కోరిక కలిగినప్పుడు దాన్ని తీర్చుకోవటం కోసం అదనపు ఆలోచన మొదలు పెడుతుంది. ఎప్పుడో నాటిన మామిడి టెంక కాలంలో వృక్షమై సంవత్సరాల తరబడి పంట ఇచ్చినట్లే కోరిక అనే ఒక విత్తనం మనలో నిరంతరంగా వర్తమానంలో అవసరంలేని ఆలోచనలను పుట్టిస్తూనే ఉంటుంది. మూలంలో ఉన్న ఆ విత్తనాన్ని పెకలిస్తే తప్ప ఈ ఆలోచనల పరంపరను అరికట్టలేము !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
            

Wednesday, September 28, 2022

నిరాడంబరత గొప్ప ఐశ్వర్యం అది ఎలాగో తెలుసుకుందాం.

 నిరాడంబరత గొప్ప ఐశ్వర్యం అది ఎలాగో తెలుసుకుందాం. 

సాంకేతికాభివృద్ధి వల్ల మన భౌతికమైన సుఖాన్ని పెంచే వస్తువులు ఇబ్బడిముబ్బడి గా మనకి అందుబాటులోకి వచ్చాయి. మన అవసరాలు పెరుగుతున్నాయి. పెరిగిన కొద్దీ వాటిని సమకూర్చుకోగలిగే స్థాయిలో మన ఆదాయాన్ని పెంచుకోవలసి వస్తోంది. సాంకేతిక–రంగ నిపుణులు అందించే ఫలాలను తప్పనిసరిగా పొందాల్సిందే. ఇక్కడే మన ఔచితి వ్యక్తమవ్వాలి. ప్రాధాన్యతలను తెలుసుకోవాలి. అసలు అవసరముందో లేదో వివేచన చెయ్యాలి. ఇది పరిశీలించి అప్రమత్తులమైతే నిరాడంబరతకు దగ్గరగా ఉన్నట్టే.
అసాధారణ ప్రతిభ చూపిన తరువాత వచ్చే ప్రశంసలకు చిరునవ్వుతో స్పందించటం నిరాడంబరత. అద్భుతమైన ప్రతిభను ఓ కవి తన గీతంలో గాని, గాయకుడు పాటలో గాని, నర్తకి తన నాట్యంలోగాని లేదా ఏ ఇతర లలిత కళల్లో గాని చూపినపుడు ప్రజలు హర్షధ్వానాలు చేసిన క్షణాన ఎగిరెగిరి పడకుండా ఉండటం నిరాడంబరుల లక్షణం. నిరాడంబరతలో ఉన్న అనేక కోణాలలో ఇక్కడ మనకు స్ఫురించవలసింది నిగర్వం.
అసామాన్యులైనా సామాన్యులవలే వర్తించటం, అందరితో కలుపుగోలుగా ఉంటూ అరమరికలు లేకుండా మాట్లాడటం నిరాడంబరుల వ్యక్తిత్వంలోని ఒక పార్శ్వమే. వారి లోని విద్వత్తు గాని, అద్వితీయమైన కళానైపుణ్యాన్ని గాని, విశేషమైన ప్రజ్ఞను గాని ఎక్కడా అసందర్భంగా.. అనుచితంగా ప్రదర్శన చేయరు. వారి వైఖరి నిండుకుండే. అట్టహాసం.. హడావిడి. వెంపర్లాట లేకుండా ఉండటమే వీరి విశిష్టత. ఆడంబరం లేకపోవటమే నిరాడంబరం.

నిరాడంబరత ఇహ ప్రపంచానికే కాక ఆంతరంగిక జగత్తుకు అవసరం. నిజానికి అత్యంత ఆవశ్యకం. ఎందుకు..? నిరాడంబరత్వాన్ని మాటల్లో.. చేతల్లో చూపించే వారెందరో ఉన్నారు. అది నిస్సందేహంగా మెచ్చుకోదగ్గ విషయమే. వీరికి మనస్సు లో కూడ అదే భావన ఉండాలి. మనస్సు ఆడంబరపుటూయలలూగరాదు. ఐహిక సుఖాల వైపు మొగ్గు చూపకూడదు. నిగ్రహశక్తి కావాలి. అపుడే అద్భుత సుఖజగత్తును త్రోసిరాజనగలం. దానిని గురించి ఎవరు మాట్లాడినా.. ఎన్ని ఆకర్షణలు చూపినా అణుమాత్రమైన చలించం. ఇవి సుఖాన్ని మాత్రమే ఇస్తాయి. వీటి ప్రభావం తాత్కాలికం.
శాశ్వతమైన.. అలౌకిక ఆనందాన్నిచ్చే ఉన్నతమైన ఆలోచనాసీమలో మీ మనస్సు విహరిస్తున్న వేళ ఈ బాహ్యప్రపంచపు సుఖం గురించి చింతన ఉండనే ఉండదు. అవి పొందలేకపోతున్నామనే  స్పృహే ఉండదు. ఈ స్థితిలో మాట.. చేత.. మనస్సు ఏకమై నిరాడంబరత గంభీర ప్రవాహమవుతుంది. ఆ స్థితికి చేరుకున్నవాళ్లు నిస్సందేహం గా మహానుభావులే. అందుకే నిరాడంబరత అలవడటం.. వ్యక్తిత్వంలో ఓ భాగమవ్వటం చాలా కష్టమైనదని పెద్దలంటారు. అయితే, అసాధ్యం కాదు. కాని ఎంతో సాధన చేస్తేగానీ పట్టుబడని విద్య. నిరాడంబర జీవితం.. ఉన్నత ఆలోచన అనే సిద్ధాంతాన్ని పథంగా తమ జీవితాన్ని పయనింపచేసుకున్నవారు అత్యంత నిరాడంబరులు. ఆదర్శప్రాయులు.. ప్రాతః స్మరణీయులు.
నిరాడంబరత కొందరికి స్వాభావికం. కాని కొందరికి అభ్యాసం వల్ల అలవడుతుంది. ఈ ప్రపంచంలో ప్రతిభావ్యుత్పత్తులు.. ప్రజ్ఞ... చాలామందిలో ఉండచ్చు. మనకన్నా ప్రతిభావంతులు ఉండచ్చు. జ్ఞానంలో.. నైపుణ్యంలో అత్యద్భుత శక్తి సామర్థ్యాలున్నవారు అనేకులు ఉండవచ్చు. ఇది మదిలో పెట్టుకోవాలి. ఈ నిరంతర స్ఫురణ మనల్ని నిరాడంబరులుగానే ఉంచుతుంది. అతిశయం.. ఆవేశ కావేశాలు.. అతి విశ్వాసం మనల్ని నిరాడంబరతకు దూరం చేస్తాయి.

నిరాడంబరత్వం మన ఆహార్యానికీ వర్తిస్తుంది. మనం వేసుకునే దుస్తులు మన ఆలోచనా తీరును చెపుతాయి. సమయానికి.. సందర్భానికి ఏ రకమైన ఉడుపులు వేసుకోవాలో నేర్పుతాయి. ఎంత విలువైన దుస్తులు ధరిస్తే మనకంతటి విలువ అనుకునే వారందరూ ఆడంబరులే. శుభ్రమైన... సాధారణమైన దుస్తులు ధరించి కూడ గొప్ప వ్యక్తిత్వం, ప్రజ్ఞ కలవారు లోకంలో మన్నన పొందుతారు. గొప్ప విద్యావేత్త... మేధావి ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ సాధారణ దుస్తులు ధరించి  తను ప్రసంగించవలసిన సభకు విచ్చేసినపుడు  ఆయనకు జరిగిన అనుభవం... ఆయన దానికి  స్పందించిన తీరు మనకందరకు తెలుసు. మనిషికి జ్ఞానం... ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రధానం. వాటికే  విలువివ్వాలి.

నిరాడంబరులను చూస్తే కొంతమందికి చిన్న చూపు. ఒక రకమైన ఏవగింపు. వారు పిసినారులని, జీవితాన్ని, దానిలోని సుఖాన్ని అనుభవించటం తెలియదని ఆలోచన.. మితిమీరిన పొదుపు తో ఈ దేహాన్ని కష్టపెడతారని వారి భావన. నిజానికి వీరే నిరాడంబరతలోని అందాన్ని.. ఆనందాన్ని  చూడలేక అలా విమర్శ చేస్తుంటారు. ఐహిక సుఖం అశాశ్వతమైనది. అస్థిరమైనది. చంచలమైనది. నిరాడంబరత ఇచ్చేది ఆనందం. ఇదే శాశ్వతమైనది.. నిజమైనది.
మనకవసరమైన వాటినే ఉంచుకోవాలి. మనం ఉపయోగించని వస్తువులను అవసరార్థులకు ఇచ్చే అలవాటు చేసుకోవాలి. అనవసరంగా  కొనే అలవాటు మానుకోవాలి. ఈ పొదుపరితనమే ఒకరకమైన నిరాడంబరత్వం.
నిరాడంబరత అలవరచుకోవటం వల్ల మనం సమయాన్ని వృధా కానీయం. మనకెంతో సమయం మిగులుతుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన జీవనగమనాన్ని పరిశీలించి లోపాలను సరిదిద్దుకోవచ్చు. చేయతగ్గ మంచిపనులను చేసేందుకు సమయం కేటాయించవచ్చు. చావు పుట్టుకల చట్రం నుండి బయటపడే మార్గాన్ని అన్వేషించవచ్చు. మనలోని మానవీయతను మన జీవనం లో చూపి ఈ సృష్టిలో మనిషి సర్వోన్నతుడన్న గొప్పవారి మాటలను రుజువు చేయచ్చు. మానవుడు మహనీయుడు కాగలడని వెల్లడి చేయవచ్చు. లేనివారికి.. యోగ్యులైనవారికి మన శక్తిమేరకు దానం చేయవచ్చు. ఆపన్నులకు చేయూతనివ్వవచ్చు. నిరాడంబరతను అలవరచుకుంటే దానిలో నిబిడీకృతమైన ఐశ్వర్యాన్ని పొందవచ్చు.

ఏమిటా ఐశ్వర్యం..!?
పొదుపరితనం.. నిర్మలత్వం... పవిత్రత..« దార్మికత...అద్భుతమైన ఆత్మసంతృప్తి...ఉన్నత ఆలోచన... సాధన... సత్యశోధన ఇలా ఎన్నో ఎన్నెన్నో. పారమార్థిక దృష్టిలో మనమెంత నిరాడంబరులమైతే అంతటి ఐశ్వర్యవంతులం.
ఎవరికి తృప్తి ఉంటుందో వారే ధనవంతులు. ఈ తృప్తికి.. అంతులేని సంపద కలిగి ఉండటానికి సంబంధమే లేదు. ఈ తృప్తి ఎలా వస్తుంది.. ఎవరికి ఉంటుంది? నిరాడంబరత వల్ల... ఆ విధమైన జీవితం గడపగలిగే వారికుంటుంది. అంటే సాదాసీదా జీవన శైలి. దీనివల్ల తృప్తి వస్తుంది. ఇదే మానసిక ప్రశాంతతనిస్తుంది. ఇది గొప్ప ఆనందస్థితి. దీన్ని సాధించటానికే యోగుల దగ్గర నుండి సామాన్యుల  వరకూ  ప్రయత్నం చేస్తూనే ఉంటారు... వారి వారి జీవిత నేపథ్యం.. ఆలోచనా విధానం... వారికి తోచిన మార్గాలననుసరించి. గమ్యాలు వేరు, కాని లక్ష్యం ఒకటే.

సేకరణ. మానస సరోవరం

చిదానంద రూపః శివోహమ్!! - 2వ భాగము.

 చిదానంద రూపః శివోహమ్!! - 2వ భాగము. 
- శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).

ఒక లక్ష్యం అంటూ లేకుండా ఎవరైతే ఊరికే పనులు చేసుకుంటూ పోతారో వారు బాధలకు గురి అవుతారు. అలాగే లోకం దృష్టిలో పడటంకోసం, లోకులు తనను పొగడడం కోసం ఎవరైతే ధ్యానము, భక్తి మొదలగు వాటిని ప్రదర్శిస్తారో వారు ఇంకా ఎక్కువ బాధలు పడతారు.

జ్ఞానం ద్వారా ఒక ఫలితం, కర్మల ద్వారా మరొకరకమైన ఫలితం లభిస్తాయి. అయితే జ్ఞానం, కర్మలు రెండింటినీ కలిపి తెలుసుకొన్నవాడు కర్మల ద్వారా మరణాన్ని దాటి, జ్ఞానం ద్వారా అమర్త్వాన్ని పొందుతాడు.

జీవుడు బ్రతకాలంటే పనులు చేయక తప్పదు. పనులు మాత్రమే చేసుకుంటూ పొతే భగవంతుని గురించి తెలుసుకోలేము. కాబట్టి పనులు భగవదర్పితం అయ్యుండాలి, మనస్పూర్థిగా ఉండాలి. జ్ఞానం, పని రెండింటినీ సమన్వయంతో సాధించినవాడికే ఆత్మానుభూతి అని చెప్పబడింది. అయితే ఇక్కడ పేర్కొన్న సత్యాన్ని పరిశీలిస్తే, అంతా భగవంతుని సంపదే అనుకున్నప్పుడు, అన్ని కర్మలు భగవంతునికి అర్పిస్తూ చెయ్యాలి. ఇలా నిష్కామబుద్ధితో కర్మలు ఆచరిస్తే ఆత్మానుభూతి తప్పక లభిస్తుంది.

ఆత్మ స్థిరమైనదని, మనస్సు కంటే వేగవంతమైనది! ఇంద్రియాలు దాన్ని పొందలేవు! అంటే విశ్వమంతా వ్యాపించియున్న ‘ఆత్మ’ సత్యం! ఈ మనసు, శరీరం కూడా ఆత్మవిభూతే కదా! మనస్సు ఒక చోటుకి చేరకముందే, ఆత్మ అక్కడ వుంటుంది! 

జ్ఞానేంద్రియాలైన చెవి, చర్మము, నాలుక, కన్ను, ముక్కు ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడానికే సృష్టింపబడ్డాయి! ఇవి పనిచేయాలి అంటే కదలని వస్తువు ఒకటి ఆధారంగా వుండాలి కదా! ఒక వాహనం కదలాలంటే కదలని రోడ్డు, అలానే ఒక చలనచిత్రం చూడాలంటే ఒక కదలని తెర వుండాలికదా! అంటే ప్రాణం అనేది ఆత్మను ఆధారముగా చేసుకొని ఇంద్రియాలు పనిచేసేటట్టు చేస్తుంది.

ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కాబట్టీ, అది అందరికీ చాలా దగ్గరగా ఉందన్నమాట, కాని ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించనప్పుడు అది మనకు దూరంగా వుంటుందని అర్థం! ఆత్మగా అది మనలో వుండి, పరమాత్మగా విశ్వమంతా వుంటుందన్న విషయాన్ని మనమందరం స్పష్టంగా అర్థంచేసుకోవాలి! 

*తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము.

🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺

Tuesday, September 27, 2022

విజయం అంటే ఏమిటి?

 ఇది అదృష్ట వంతులు మాత్రమే చదవగలరు!

మన దేశం నుండి ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ లో విద్యార్థులతో మాట్లాడుతూ…. “విజయం అంటే ఏమిటి?” అని అడిగితే ఒక యువతి “విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం!”అన్నది.
అపుడు ఆ ప్రొఫెసర్ “అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో చెప్పండి?” అంటే ఎవరూ చెప్పలేదు.

 [ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి]

బ్రతకడానికి కొంత డబ్బు కావాలి కానీ , డబ్బే బ్రతుకు కాదు! అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట. 
   
మరో యువకుడు లేచి “విజయం అంటే బలం / శక్తి” అన్నాడు. 

అలా అయితే అలెగ్జాండర్ , నెపోలియన్, ముస్సొలిని, హిట్లర్ , స్టాలిన్ , బిన్ లాడెన్ ... వీళ్ళంతా బలవంతులు, ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా, వీళ్ళు జీవితం లో సంతోషంగా వుండగలిగారా ? వీళ్ళ జీవితాలు ఎలా గడిచి , ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా ! తన బలంతో , తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్ , తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు. అయితే విజయమంటే బలం / శక్తి సంపాదన కాదు అన్నమాట. 

మరో యువతి “విజయమంటే ప్రఖ్యాతి, అందం!” అంది. అయితే కేట్ మోస్ , జీన్ ష్రింప్టన్ , సోఫియాలారెన్ , మార్లిన్ మన్రో ...లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు. భారత్ విషయానికొస్తే , పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే , అమితాబ్ బచ్చన్ తో సహా , ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని హిందీ సినిమా హీరో నే లేడు. డానీ, కబీర్ బేడీ , మహేష్ భట్ లతో ఆమె ప్రేమ , పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర , రాజేష్ ఖన్నా , అమితాబ్ బచ్చన్ .. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి , నమ్మిన వాళ్ళు మోసం చేస్తే , తాగుడుకు బానిస అయ్యి , ఒక దశలో కాలికి కురుపు లేచి , అది ఒళ్ళంతా ప్రాకి , ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో , అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే , ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని , జనం ఆమెను తాళ్ళతో కట్టి , ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే , కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు. అయితే అందం , ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట!

మరోసారి మరొకరు “విజయమంటే అధికారం” అని అన్నారు. 

”అయితే కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి!” అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు. 

అనంతపురంలో ఒకప్పుడు రాష్ట్రపతి గా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి , పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట.

చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీ లో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు - “విజయం అంటే ఏమిటి?” అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు , “మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా?” అందరూ 'తెలుసు’ అన్నారు. “వాళ్ళ అవ్వ , తాతల పేర్లు తెలుసా?” అని అడిగితే అయిదారుమంది “తెలుసు” అన్నారు. “వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా?”‘తెలియదు’ అన్నారు.

అపుడు ప్రొఫెసర్ గారు “శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , బుద్ధుడు , ఆదిశంకరుడు , అందరూ…?” ”ఓ , తెలుసు!” అని ముక్తకంఠం తో బదులిచ్చారు. 

”మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు?”అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి , ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అంది : “సార్ , మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం , రాముడు , కృష్ణుడు , బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే…. తమ కోసం కాకుండా సమాజ హితం కోసం తపించిన ఋషులు, మునులు చిరంజీవులైనారు.
  తమ కోసం , తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది , ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే!” అన్నప్పుడు చప్పట్లతో హాలు దద్దరిల్లిపోయింది. 

 మిత్రులారా”నా గురించి నేను దు:ఖించక పోవడమే నా ఆనందానికి కారణం!” అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట అక్షర సత్యం , “ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు , అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క '' [ Only they live who live for others , the others are more dead than alive] అని వివేకానంద 1896 లో అన్న మాట ఇదే కదా.

….సేకరణ. మానస సరోవరం 👏 

మౌనం - శక్తిసామర్థ్యాలు

 మౌనం - శక్తిసామర్థ్యాలు
✍️ డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ 
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

❇️ మౌనం అనేది దైవభాష. లిపి లేని విశ్వభాష. ధార్మిక దివ్యత్వానికి ద్వారం. సనాతన భాషా స్రవంతి. మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు. నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు.  

✅ మౌనమంటే - అంతరింద్రియ విజ్రుంభణను ఆపడం.
 (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణములను అంతరింద్రియమంటారు.) 

✳️ మౌనమంటే - ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోశములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం. 

❇️ మౌనమంటే - నిరంతర భాషణ. చింత, చింతన లేని తపస్సు. అఖండ ఆనందపు ఆత్మస్థితి. విషయశూన్యావస్థ. 

యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః 
అన్నారు శ్రీ శంకరులు. 

✳️ మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది. 

❇️ పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదు శాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహం వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనం అంటారు.

✅ ఈ మౌనం మూడు రకాలు.

1. వాజ్మౌనం : 
🌈 వాక్కుని నిరోదించడం. ఈ రకమైన మౌనం వలన కటువుగా మాట్లాడుట, అసత్యమాడుట, పరనింద చేయుట, చాడీలు చెప్పుట, అసందర్భ వ్యర్ధ ప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి. 

2. అక్షమౌనం : 
🌈 కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక ఏకాగ్రనిష్టలో ఉండుట. ఈ మౌనం వలన ఇంద్రియాల నియంత్రణ ద్వారా ధ్యాన వైరాగ్యాలు బాగా అలవడుతాయి. 

3. కాష్ఠ మౌనం : 
🌈 దీనిని మానసిక మౌనం అంటారు. మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠమౌనం అంటారు. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. దీనినే 40 సంవత్సరములు మౌనదీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా గారు ఇలా తెలిపారు - 

'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది. మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'. 

🌈 మౌనం 

✅ దక్షిణామూర్తి మౌనం సత్యబోధ. 
✅ గురువు మౌనం జ్ఞానానుగ్రహం. 
✅ జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ. 
✅ భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన. 

✳️ ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది. అంతర్యామిని దర్శింపజేస్తుంది. మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది. ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది. 

మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధ సంభాషణ -  అని శ్రీ రమణులు అంటారు. 

❇️ మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష. అనేక సంవత్సరములు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు ఉంటాయి కానీ మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞాన స్రవంతి. మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనులే అని మహాత్ములు పేర్కొంటారు. 

పలుకుల కందక భావమునంటక భాసిలు బ్రహ్మము దానగుచుం 
బలుమరు బల్కగ పల్కినచో నవి పల్కితినంచు దలంపక యే 
తలపులు లేక నిరంతర సౌఖ్యసుధారస మానుచు నుండుట ని 
ర్మలమగు మౌనము మారుత నందన! మానక దీవి భజింపదగున్. 
(శ్రీ సీతారామాంజనేయ సంవాదం.) 

✳️ ఓ వాయుపుత్రా! అవాజ్మానసగోచరమైన బ్రహ్మమే స్వరూపభూతమైనదని నిశ్చయించి యెప్పటికైనను ఏ మాటలనైనను మాటలాడక యోగి సదా యాత్మానుభవనిష్ఠుడై యుండును. ఒకవేళ మాట్లాడినను 'నేను మాట్లాడితిని' అని తలంపడు. ఇంత యేల? అతనికి సంకల్పములే ఉండవు. ఇట్టి స్థితిగలిగి సర్వకాలములయందును స్వస్వరూపానందానుభావమును చెందుచుండుటయే మౌనం. 

'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' 

❇️ వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. 

🙏 భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధ ప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం. ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే మోక్షం.


సేకరణ:

అప్పుడే మనసు అదుపులో ఉంటుంది. ప్రశాంతత లభిస్తుంది. బయట ప్రపంచంలో ఉన్న శీతోష్ణములు, సుఖదుఃఖాలు, సన్మానము అవమానము మనల్ని బాధించవు. అన్నిటినీ సమానంగా చూచే శక్తి లభిస్తుంది.

 ఎవరితే తన మనసును అదుపులో పెట్టుకుంటారో, అటువంటి వారు ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉంటారు. అటువంటి వారికి చలి, వేడి, సుఖము, దుఃఖము, సన్మానము, అవమానము అన్నీ పరమాత్మ అనుగ్రహాలుగానే కనిపిస్తాయి. అన్నిటినీ సమానంగా చూచే శక్తి లభిస్తుంది.

మానవులు సామాన్యంగా ద్వంద్వాలకు లోనవుతుంటారు. సుఖదుఃఖాలు, లాభనష్టాలు, రాగద్వేషాలు, మానావమానాలు, శీతోష్ణాలు మొదలైన వాటికి లోబడి ప్రవర్తిస్తుంటారు.

ఈ ద్వంద్వాలను సమానంగా చూడటం ఎవరికీ సాధ్యం కాదు. సుఖం కలిగినపుడు పొంగి పోవడం, దుఃఖం వచ్చినపుడు కుంగిపోవడం మానవ లక్షణం. ఎవరైనా తనను పొగిడితే పొంగిపోవడం, ఎవరైనా తిడితే కోప్పడటం, దిగులు పడటం, కుంగిపోవడం సామాన్యంగా జరిగేదే.
ఎవడైనా మనకు సన్మానం చేసి పొగిడితే పొంగిపోతాం. అదే సభలో ఎవడైనా తిడితే కుంగి పోతాం. వేసవి కాలంలో ఎండను తిట్టుకుంటాం, వానాకాలంలో చిత్తడి వర్షాన్ని తిట్టుకుంటాం. చలికాలంలో చలిని తిట్టుకుంటాం. వాటి వల్ల వాతావరణం ఆహ్లాదంగా ఉంటే పిక్నిక్కులకు వెళ్లి ఎంజాయి చేస్తాం. ఇలా ద్వంద్వాలకు లోబడి ప్రవర్తించడం మానవ లక్షణం.

ఈ ప్రకారంగా ద్వంద్వాలకు లోబడిన మనసు ఎల్లప్పుడూ అశాంతితో, చంచలంగా ఉంటుంది. నిలకడ ఉండదు. అలా కాకుండా మనసును జయించిన వాడు, మనస్సును నిలకడగా ఉంచుకోగలిగినవాడు, ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అతనిని శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానము, అవమానము ఏమీ ప్రభావితం చేయలేవు. సర్వకాల సర్వావస్థలయందు నిర్వికారంగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటాడు. 

పెద్ద పర్వతమును ఎంతటి గాలి అయినా చలింపచేయలేదు. అలాగే మనస్సును జయించిన వాడికి ఈ ద్వంద్వములు ఏమీ చేయలేవు. అతడు నిశ్చలంగా ద్వంద్వాలకు అతీతంగా పరమ శాంతితో ఉంటాడు.

కాబట్టి ప్రతి వాడూ అభ్యాసం చేతా, వైరాగ్యం చేతా, వివేకం చేతా మనసును తన అదుపులో పెట్టుకోడానికి ప్రయత్నం చేయాలి.
అందుకే పరమాత్మా..
"సమాహితః" అన్నారు అంటే మన మనసును పరమాత్మయందు లగ్నం చేయాలి. అంటే మనకు సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా దాన్ని పరమాత్మకు అర్పించాలి. ఆ సుఖదుఃఖాలను పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడే మనసు అదుపులో ఉంటుంది. ప్రశాంతత లభిస్తుంది. బయట ప్రపంచంలో ఉన్న శీతోష్ణములు, సుఖదుఃఖాలు, సన్మానము అవమానము మనల్ని బాధించవు. అన్నిటినీ సమానంగా చూచే శక్తి లభిస్తుంది.

majority of people having Heart Attack are less than 50 years old.

 Dear Friends!

I am Dr. Bhawna I am working as Councillor for paediatric surgery (PGI).
I would like to make a small request to you.
Before that, I would like to share a small piece of information with you.
Many of you might have read today's newspapers that
EMRI results say, majority of people having Heart Attack are less than 50 years old.
*You will be surprised to know the culprit is Palm Oil. It's far far more dangerous than Alchol and Smoking put together.*
*India is the highest importer for Palm oil in this world.*
The Palm oil mafia is very very big.
*Our children, who are the future, are at a big risk.*
There is no fast food available in this country without Palm Oil.
If you *go to our grocery store, try to pick up a children's edible food without Palm oil - you will not succeed.*
You will be interested to know *even Biscuits of big companies are made from it, and similarly all chocolates*. We are made to believe they are healthy, but we never knew about *the killer Palm oil or Palmitic acid*
The big companies like *Lays use different oil in Western Countries and Palm oil in India* just because it is Cheap.
Each time our child eats a product with Palm Oil, the brain behaves inappropriately and signals to secrete fat around and in the Heart *This leads to Diabetes at a very young age.*
The World Economic Form has projected that 50 percent of people who Die at young age will die of Diabetes and Heart Disease.
*The Palm Oil mafia has made our Children addicted to Junk Food, leaving the fruits and Vegetables aside, which are Heart protective.*
Next time you buy something for your child, see the label of the product. If it has Palm oil or Palmolienic oil or Palmitic acid, avoid buying it! 
We, have written to our Hon'ble Prime Minister and are also in the process of making similar letters from 1 Lakh Doctors across India to take some action to secure our future generations.
Once again I want to emphasize on impending danger to our children.

Pls protect our Children. They are the future of our Country! Please forward this message.

Don't forget to forward this to your close friends and family members. Please note to send. as many persons as possible.

P. S: please share without editing. 🙏🙏 

మంచి మాట..లు(26-09-2022)

మంగళవారం --: 26-09-2022 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
డబ్బును ఎంతైనా సంపాదించు ఎంతైనా పోగొట్టు కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది ,

తనకు కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం, తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని కోరుకోవడం మానవత్వం,సమస్యలతో తనలాగ ఇంకెవరు బాధ పడకూడదని ఆలోచించడం మహాత్ముల తత్వం.

ప్రయత్నం ఎన్నటికీ వృధా కాదు,,వైఫల్యం ఎప్పటికి శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్న0 నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది,ఓ గొప్ప ప్రయత్నం విఫలం కూడా కావొచ్చు, అయిననూ ఎక్కడ నిరాశ చెందకుండా దృఢమైన మనస్సుతో ముందుకెళ్లడం ఉత్తమమైన లక్షణం.

వేలెత్తి చూపే వాడెవడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు, అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు అది కష్టమైనా సుఖమైన బాధ అయినా సంతోషమైనా.

నీ జీవితం నీది ఎంతటి కష్టాల్లో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు, ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నిన్ను ఓదార్చరు.. లోకం తీరు గమనించి మేసులుకో.నేస్తమా జాగ్రత్త

కురిసే వానకు లేదు స్వార్థం, పండే పంటకు లేదు స్వార్థం, నింగికి నేలకు లేదు స్వార్థం, మధ్యలో ఉన్న మనిషికి మాత్రమే స్వార్థం ఎందుకో

పుట్టినప్పుడు ఏమి తీసుకురాము, పోయేటప్పుడు ఏది పట్టుకుపోవు, మూడు నాళ్ళ ముచ్చట కోసం ఎందుకు మోసాలు, ఎందుకు ద్వేషాలు

విజయాలనుండి వినయాన్ని పరాజయాల నుండి గుణపాఠన్ని నేర్చుకునే వాడే గొప్పవాడు, పుట్టడం గొప్పకాదు బతకడం గొప్ప, ముంచి బతకడం గొప్పకాదు మంచినిపంచి పెంచి బతకడం గొప్ప, నీకు నువ్వే గొప్ప అనుకోకు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే అది గొప్ప.
✍️ AVB సుబ్బారావు

బరువు తగ్గాలంటే డైటింగ్, వ్యాయామాల్లో ఏది ముఖ్యమైనది? మీరు బరువు తగ్గిలి అంటే నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం

 *బరువు తగ్గాలంటే డైటింగ్, వ్యాయామాల్లో ఏది ముఖ్యమైనది? మీరు బరువు తగ్గిలి అంటే నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం*
 *అధికబరువు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవొచ్చు :*

Gym కి వెళ్లకుండా
ఖరీదైన ఆహారపదార్దాలు లేక మందులు అవసరం లేకుండా
సులువుగా మరియు శాశ్వితంగా
అధిక బరువు అసలు ఎలా వస్తుంది

బరువు తగ్గాలి అంతే ముందు అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. మనం అవసారిణికి మించి తిన్నపుడు, ఆహారం క్రొవ్వు రూపములో శరీరంలో భవిషత్ అవసరాలకోసం భద్రపరచబడుతుంది. దీనివలన మనం బరువు పెరుగుతాం. మనం అవసరానికన్నా తక్కువ తిన్నపుడు, ఈ క్రొవ్వు కరిగి శరీర అవసరాలకు వాడబడుతుంది. అప్పుడు మనం బరువు తగ్గుతాం.

*బరువు తగ్గాలి అంటే మన అవసరానికంటే కొంచం తక్కువ తినాలి మరియు కొంచం శారీరక శ్రమ పెంచాలి.*

*1.-బరువు ఎలా తగ్గాలి?*

మీ బరువు ప్రతి ఉదయం check చేసుకోవాలి

ప్రతిఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత కాళీ పొట్టతో వున్నపుడు, బరువు check చేసుకోవాలి. ఈ క్రింది చిట్కాలవల్ల ప్రతి వారం కొంచం బరువు తగ్గుతారు. ప్రస్తుత బరువుని గత వారం బరువుతో పోల్చి చుడండి. ఒకవేళ తగ్గట్లేదు అంటే మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో కనుక్కోండి.

*2.- మీ పొట్ట (stomach) పరిమాణం తగ్గిచుకోండి*

తినేటప్పుడు, మీ stomach పూర్తిగా నిండటానికి కొంచం ముందే తినటం ఆపాలి, మరలా ఆకలి వేస్తే కొంత సమయం తరవాత తినాలి.

సాధారణంగా stomach 100% నిండుతున్నపుడ మన మెదడు గ్రహించి తినటం ఆపమనే సందేశాన్ని మనకు పంపిస్తుంది. కానీ మీరు తినటం అలాగే కొనసాగిస్తే, stomach వ్యాకోచిస్తుంది.

మీరు ఎప్పడూ 10% అధిక ఆహారం తీసుకోవటానికి అలవాటు పడితే, మీ stomach వ్యాకోచించి 110% అవుతుంది. మీ మెదడు కూడా ఇది గ్రహించి ఎప్పడూ 110% ఆహారం తీసుకున్నాకే తినటం ఆపమనే సందేశాన్ని పంపిస్తుంది. అంటే ప్రతిసారి మీరు 10% ఎక్కువు ఆహారం తిని బరువు పెరుగుతుంటారు.

*ఉదాహరణకు మీ స్టొమక్ capacity 4 చపాతీలు అనుకోండి, కానీ మీరు ఎప్పుడు 5 చపాతీలు తింటారు. అంటే మీ మెదడు 5 చపాతీలు తీసుకున్నాకే తినటం ఆపమనే సందేశాన్ని పంపిస్తుంది. అంటే ప్రతిసారి మీరు 10% ఎక్కువు ఆహారం తిని బరువు పెరుగుతుంటారు.*

సినిమా hero, heroines బరువు తగ్గటానికి bariatric surgery చేయించుకుంటారు. అదికూడా ఈ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సర్జరీ లో పొట్టపరిమానాన్ని staples మరియూ bands వాడి 25% కు తగ్గిస్తారు. దీనిద్వారా కొంచం ఆహారం తీసుకోగానే వారి stomach నిండి ఇంకా తినలేరు. తక్కువ ఆహారం తినటం వలన వారు బరువు తగ్గుతారు. ఈ సర్జరీ చాల ఖర్చుతో కూడినది మరియూ ప్రమాదం. కానీ మన stomach capacity సహజంగా తగ్గించుకొని బరువు తగ్గించుకోవచ్చు

మీ stomach 85% నిండగానే తినటం ఆపివేయాలి. మిగిలిన ఆహారం 30 నుండి 40 నిమిషాల తరువాత అవసరం అయితే తీసుకోవాలి. పైన చెప్పిన చపాతి ఉదాహరణ మల్లి తీసుకోండి. ఒకేసారి 5 ఛాతీలు తినకుండా, 3 చపాతీ తిని ఆగండీ . మీ stomach 75% నిండుతుంది. మీకు కొద్దిగా ఆకలి అనిపిస్తుంది ఎందుకంటే మీ stomach capacity కంటే 1 చపాతీ తక్కువ మరియూ మీ అలవాటుకంటే 2 చపాతీలు తక్కువ తిన్నారు కనుక. కానీ మీ stomach పూర్తి కాళీ లేదుకనుక మీరు తట్టుకోగలరు. ఒక 30 నుండి 40 నిమిషాల తరువాత ముందు తిన్న చపాతీలు కొద్దిగా అరిగిపోయి పొట్ట కొద్దిగా కాళీ అవుతుంది. ఇప్పుడు అవసరమనుకుంటే మిగిలిన 1 లేక 2 చపాతీలు తినండి. అయినాకూడా మీ stomach 85% మించి నిండదు.

ఇలా కొన్ని రోజులు అలవాటుపడితే మీ stomach 85% నిండగానే మీ మెదడు, తినటం ఆపమనే సందేశాన్ని పంపిస్తుంది. అందువలన మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు మరియూ బరువు తగ్గుతారు.

చాలామందికి రెండవసారి ఆహారం తీసుకోవటం వీలుపడదు. అందుకని 40 నిమిషాల తరువాత 1 లేదా 2 చపాతీలకి బదులు కొన్ని పండ్లు లేదా కూరగాయలు తినటం అలవాటు చేసుకోండి (bananas, apples ,carrots, cucumbers etc.) .

*4.-మీ stomach ని తెలివిగా నింపండి*

    ఒక apple తింటే మీ స్టొమక్ నిండుతుంది, దానికి బదులు రెండు apples తీసుకునో ఒక glass juice చేసి తాగినా stomach నిండుతుంది. కానీ juice కి రెండు ఆపిల్స్ వాడటం వలన మీకు రెండు రేట్లు calories లభిస్తాయి మరియూ బరువు త్వరగా పెరుగుతారు. juices liquid form లో ఉండటం వలన త్వరగా జీర్ణం అయ్యి మీకు తిరిగి త్వరగా ఆకలి వేస్తుంది.

అలాగే 3 చపాతీలకు బదులు, 2 1/2 చపాతీలు ఎక్కువ curry తో (vegetables, pulses, beans తో చేసిన) తినవచ్చు. మూడు సాదా దోసెలకు బదులు రెండు onion దోసెలు తినండి. ఉప్మా లాంటి అల్పాహారం లో vegetables మరియూ meal makers వంటివి కలిపి వండండి.

ఇలాంటి tricks ప్రతి వంటకానికి అమలు చెయ్యవచు. ఇలా చెయ్యటం వలన మీరు తీసుకునే ఆహార పరిమాణం తగ్గించకుండానే బరువు తెగ్గించుకోవచ్చు . ఇందువల్ల తక్కువ calories మరియూ ఎక్కువ proteins మరియూ పీచుపదార్థం లభిస్తుంది.
https://t.me/HelathTipsbyNaveen

*5.-పీచు పదార్థం ఎక్కువగా తెస్కుకోండి*

చాలా vegetables మరియూ fruits (bananas, apples, carrots etc.) పీచు పదార్థం లభిస్తుంది. పీచూ పదార్థం వలన మన stomach నిండుతుంది కానీ మన శరీరం దానిని జీర్ణించుకోదు. అంటే పీచు పదార్థం వలన మీకు ఎటువండి calories రావు మరియూ బరువు పెరగరు కానీ ఆకలి తగ్గుతుంది. అందువలన ఇది బరువు తగ్గటానికి చాల బాగా పనిచేస్తుంది. పూర్తిగా polish చేసిన బియ్యం కి బదులు, తక్కువ polish చేసిన బియ్యం, మరియి చిరు ధాన్యాలు తినండి (ఊడలు, అరికెల, కొర్రలు లాంటివి )

పీచు పదార్థం blood sugar ని కంట్రోల్ చెయ్యటానికి కూడా సహాయ పడుతుంది. అలాగే మలబద్దకాన్ని(constipation) కూడా నివారిస్తుంది.


*6.-శారీరక శ్రమ పెంచండి*

శారీరక శ్రమ వలన శరీరంలో వున్నా క్రొవ్వు కరిగి ఆరోగ్యంగా వుంటారు.

lift కి బదులు మెట్లని వాడండి.
తక్కువ దూరానికి నడిచి వెళ్ళండి లేదా సైకిల్ వాడండి, బైక్ / కార్ కి బదులు
ఈత మరియూ డాన్స్ నేర్చుకోండి
ఇష్టమైన ఆటలు ఆడండి (badminton, cricket, tennis, volleyball etc.)
మీరు వృత్తిరీత్యా ఎక్కువసేపు ఒకేచోట కూర్చొనే వారు అయితే. ఎక్కువగా నీరు త్రాగండి. దీని ద్వారా ప్రతి 40 నిమిషాలకి ఒకసారి automatic గ లేసి washroom కి వెళ్తుంటారు.
ఫోన్ మాట్లాడే సమయంలో వీలుంటే walking చేస్తూ లేదా నిలబడి మాట్లాడటం నేర్చుకోండి. మీరు ఒకరోజు లో 30 నిముషాలు phone మాట్లాడే వారు అయితే ఆ సమయంలో చక్కగా walking చేస్తూ ఎక్కువ సద్వినియోగము చేసుకోవచ్చు
ఇంకా కొన్ని నవీన్ రోయ్ సలహాలు 

*7.-ఒక kg బరువు తగ్గటం వలన మీ మోకాలుమీద 3 నుండి 4 కేజీల బరువు తగ్గుతుంది*

8.-అధిక బరువు BP మరియూ diabetes వంటి దీర్ఘకాలిక జబ్బులకు దారితీస్తుంది

9.-ఆకలి లేనప్పుడు ఎప్పుడు తినకూడదు.

10.-Snacks ఏవైనా చిన్న size వి కొనండి. ఉదాహరణకు large pizza కి బదులు small pizza . అలాగే small chocolate, small burger. (Diminishing marginal utility for food చదవండి)

11.-భోజనం లేదా అల్పాహారం చేసిన వెంటనే tea / coffee / ice cream / fruits / juice లాంటివి తినకూడదు. కనీసం 30 నుండి 40 నిమిషాల విరామం ఇవ్వండి. లేకపోతె stomach పరిమాణం పెరుగుతుంది

*12.-చిన్న plate లో తినటం వల్లనా తక్కువ ఆహారం తింటారు*

13.-మీ ఇంట్లో ఎవరైనా అధిక బరువుంటే మీరుకూడా అధిక బరువు ఉండటానికి అవకాశం ఎక్కువ. కొన్నిసార్లు genes దీనికి కారణం. కానీ చాల సందర్భాలలో మీ జీవన విధానం, ఆహార అలవాట్లు మీ కుటుంబంలో వారికీ similar గా ఉండటం దీనికి కారణం. అంతే గాని ఇది వంశపారంపర్యం కాదు.

14.-కొన్ని weight-loss programs లో మిమ్మల్ని ఆహరం చాలా తక్కువ తీసుకోమని support గా nutrition powder /tablets ఇస్తుంటారు. ఇటువంటి వాటివలన బరువు తాత్కాలికంగా తగ్గుతారు కానీ ప్రమాదకరమైన side-effects ఉంటాయి.

*15.-శాశ్వితంగా బరువు తగ్గటానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకోవటం, శారీరక శ్రమ పెంచటం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం
మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి.టెలిగ్రామ్ గ్రూపులో మీ థైరాయిడ్ pcod రిపోర్ట్ పెట్టండి గ్రూపులో డాక్టర్స్ సలహాలు తీసుకోండి

*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.

https://t.me/joinchat/L0NFDxIWFfKwzpAYwRV5sA

నేటి సినిమాలు…!

 V. i. 2-7.    270922-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

               నేటి సినిమాలు…!
                  ➖➖➖✍️

ఇప్పుడు వచ్చే సినిమాల్లో 90% ప్రేమ, కామం తప్ప ఇంకేమీ లేవు. ఇలాంటి సినిమా తీసేవాల్లని, వాటిల్లో నటించే వారిని అభిమానించడం అవసరమా? నేటి సమాజం ఏమి నేర్చుకోవాలి ఈ సినిమాల నుండి?

1). పెద్ద వాళ్ళని వెటకారం చేయటం పంచులతో…!

2). చిన్న వాళ్ళని పాడు చేయటం..!

3). హిందూ సంస్కృతిని పాడు చేయటం..!

4). హిందూ దేవుళ్ళను ఆట పట్టించడం, వెటకారంగా చూపటం..!

5). జుగుప్స కలిగించే సీన్స్..!

6). టీచర్స్ ని వెదవల్లాగ చూపించటం..! 

7).కళాశాలలను ప్రేమాలయాల లాగ వాడుకోవటం..!

8). చరిత్రని తప్పుగా చిత్రీకరించడం..!

9). సెక్యులర్ భావాలు పెంచడం..!

10).రౌడీలు దోషుల పేర్లన్నీ దాదాపు హిందూ పేర్లతో చిత్రీకరించడం..!

11). కుటుంబంతో చూసే కథలు తీయక పోవడం..!

12). అపరిమిత శృంగారం, కామం..!

13). దేశాన్ని ద్వేషించడం, విదేశాలను గొప్పగా చూపటం..!

14). స్త్రీని ఆటబొమ్మ లాగా చూపటం..!

15). స్త్రీ వస్త్ర ధారణ, వేష ధారణ పాశ్చాత్య పద్దతుల్లో చూపడం..!

16). మన కట్టు బొట్టులో సంప్రదాయం కరువు.

17). స్వామీజీ లను దోషులుగా చూపటం..!

18).కుటుంబ కలహాలు సృష్టించటం..!

19). వావి వరసలు లేని ప్రేమాయణాలు..!

20). డబ్బే సర్వస్వం అన్నట్లు చూపటం..!

21). ప్రేమ వివాహం కరెక్ట్,  పెద్దలు కుదిర్చిన వివాహం వద్దు అన్నట్లు చూపటం..!

22).బూతు పాటలు..!

23). కులాలమధ్య కుంపట్లు..!

24).తల్లిదండ్రులను ఎదిరించడం..!

25). డ్రగ్స్, సిగరెట్, మందును విపరీతంగా ప్రోత్సహించడం..!

ఇవి తప్పితే నేటి సినిమాల నుండి నేర్చుకునేది ఏమీ లేదు.. చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో..✍️
                                ….సేకరణ.
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇది ప్రసిద్ధమైన కృష్ణ శతకంలోని పద్యం.

 Xx6. X2. 1-5.  270922-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


”నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!”
                    ➖➖➖✍️


ఇది ప్రసిద్ధమైన కృష్ణ శతకంలోని పద్యం. 

ఇందులో నీవే (భగవంతుడే-కృష్ణుడే) అన్నీ అని చెప్పడమే కాదు, ‘అన్ని మానవ సంబంధాలుగా కూడా నిన్నే భావించవచ్చు!’ అన్న భావనా ఉంది.

అంతేకాదు, ఎవరికి నచ్చిన సంబంధంతో వాళ్లు అలా పిలుస్తూ                 ఆ బంధం భగవానునితో దృఢపరుచుకోవడం మంచిదని, అప్పుడే చివరికి పరమగతి చేరగలమని కవి హృదయం. 

పద్యం చిన్నదే కానీ, అందులోని అంతరార్థం నిరుపమానమైనది.

మానవుడు జన్మించింది మొదలు ఎన్నో బంధుత్వాలు చకచకా అల్లుకుంటాయి. అది సహజమే! అందులో కనిపించనివి జాతి, కులం, మతం మొదలైనవి. 

ఇవొక రకంగా బంధాలే!                          కనిపించే బంధుత్వాలు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, భార్యాపిల్లలు, అత్తమామలు ఇంకా ఎన్నో వావి వరుసలు. 

ఇవిగాక పరిచయస్థులు, మిత్రులు, గురువులు, శిష్యులు, యజమానులు, సేవకులు, సహోద్యోగులు తదితరులు. అజాగ్రత్తగా ఉంటే ఇవీ బంధాలే!

మానవుడు ఈ చుట్టరికాలతో రమిస్తూ ఎంతోకొంత ప్రయోజనం పొందుతూ జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నంత మాత్రాన ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయని భ్రమ పడవలసిన పనిలేదు. 

ఎందుకంటే సాన్నిహిత్యం అధికమయ్యే కొద్దీ వ్యర్థమైన భ్రమ కూడా అధికమవుతుంది.
భ్రమ ఎక్కువయ్యే కొద్దీ దుఃఖానికి ఆస్కారం ఎక్కువ అవుతుంది. 
ఎలాగంటే ఒక మానవుని జీవిత కాలంలో ఎంతోమంది బంధువుల, మిత్రుల తదితరుల మరణాలను ఇష్టమున్నా లేకున్నా చూడవలసి వస్తుంది. తప్పనిసరిగా బాధపడవలసీ వస్తుంది. 

కన్నుమూసిన వారిలో బంధుత్వాలు బలపడిన వారూ ఉండవచ్చు. ఆ మానవుని జీవితకాలం కొనసాగుతూ ఉండగానే మధ్యలోనే బంధుత్వాలు తెగదెంపులు చేసుకొని దూరమైపోయిన వారూ ఉండవచ్చు. ఇవన్నీ ‘ఆప్త వియోగం’ కిందకు వస్తాయి. అంటే ‘దగ్గరివారిని కోల్పోవడం’ అన్నమాట.ఈ బంధాలన్నీ దుఃఖ సన్నివేశాలై అతని మనసులో స్థిరపడి కుంగి, కృశింపజేయడానికి కారణాలవుతాయి. బంధం బిగించుకోవడం ఎంత కష్టమో తొలగించుకోవలసి వచ్చినప్పుడు గాని తెలిసిరాదు. అప్పటికే కాలాతీతం కావడం వల్ల ఆప్త వియోగ విషాదం అనుభవించకతప్పదు. ‘ఈ బంధం ఆదిలోనే బిగించుకోకుండా ఉండవలసింద’ని అప్పుడనిపిస్తుంది.

మరి ఈ శోకాన్ని తప్పించుకునే మార్గం లేదా! 

లేకేం.. పైన పేర్కొన్న బంధుత్వాలన్నీ భగవత్‌ పరం చేయడమే! దానిని కృష్ణ శతకం మొదట్లోనే తెలియజేశారు. ‘నీవే తల్లివి దండ్రివి..’ అని భగవంతుడినే తల్లిగా, తండ్రిగా, గురువుగా, సఖునిగా ఎందుకు భావించాలి? అంటే మనిషికి ఇదొక్క జన్మమే కాదు..
ఎన్నో జన్మలుంటాయి. జన్మజన్మలో తల్లిదండ్రులు, భార్యాపిల్లలు మొదలైన వారంతా మారిపోతూ ఉంటారు. కానీ, ప్రతి జన్మలోనూ తోడునీడగా ఉండేది భగవంతుడొక్కడే! అదీ యథార్థం. దాన్ని గుర్తెరిగినవాడి తీరు వేరుగా ఉంటుంది. ఎందుకంటే భగవానుడు మారిపోయేవాడు, దూరమయ్యేవాడు, చేతగానివాడు కాదు కదా! అందువల్ల మనిషికి జీవించి ఉన్నంతవరకూ పై చుట్టరికాలన్నీ ఇష్టం కాబట్టి వీటన్నిటిని దైవం వైపు మరలించడం ఎంతో శ్రేయస్కరమన్నారు సంప్రదాయజ్ఞులు. అలా భగవానుడి వైపు మరలించగలిగిన ధన్యాత్ముడికి ఆప్త వియోగ దుఃఖాల తాకిడి మిగతావారికి ఉన్నట్టు ఉండదు. ఉన్నా ఏదో పేరుకు మాత్రమే! ఎందుకంటే అలాంటి ధన్యాత్ముడే ఆప్తుల మరణాలు కావు, ఆప్తుల యందు మనకున్న మమకారాలే దుఃఖానికి కారణమన్న యథార్థాన్ని గమనించగలడు.
దీన్ని మరో కోణంలో పరికిస్తే.. లోకంలో తల్లిదండ్రులు లేనివారెందరో! ఉన్నా పోషించలేని, పట్టించుకోలేని వారెందరో! మిత్రులు లేని వారుంటారు. ఉన్నా మంచివారన్న నమ్మకం లేదు. గురువులు దొరకని వారుంటారు. దొరికినా ఫలాపేక్ష లేకుండా విద్యాదానం చేస్తారనీ లేదు. భగవంతుడికి ఇవన్నీ వర్తించవు. ఆయన ప్రేమ స్వరూపుడు. కరుణామయుడు. కాబట్టి ఈ చిన్నపద్యాన్ని మాటిమాటికీ మననం చేసుకుందాం! పరమగతి అయిన పరమాత్ముడిని చేరుకుందాం.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

పొగడ్తల మత్తు తలకెక్కి.

 X7.x2.  1-5.  270922-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


       పొగడ్తల మత్తు తలకెక్కి.
               ➖➖➖✍️

వినే మాటల్లో కొన్ని పొగడ్తలు కూడా ఉంటాయి. పొగడ్తకు లొంగని వారు చాలా అరుదుగా ఉంటారు. అది మన బలహీనతయితే    దాని వల్ల  మనం నష్టపోతాం. సకాలంలో గుర్తించకపోతే దారుణంగా దెబ్బతింటాం.

కాకినోట్లో మాంసం ముక్కమీద కన్నేసిన నక్క ఒకటి "కాకిబావా, కాకిబావా నీవు చాలా బాగా పాడతావు గదా.. ఏదీ ఒక పాటపాడు” అంటే మురిసిపోయిన కాకి పాడడానికి నోరు తెరవగానే మాంసం ముక్క జారి కిందపడడం, నక్క దానిని నోట కరుచుకుని     వెళ్ళిపోవడం చిన్నప్పుడు కథల రూపంలో పిల్లలకు చెబు తుంటాం. అవి కాలక్షేపం కథలు కావు. జీవిత సత్యాలు. 

పొగడ్త మత్తు తలకెక్కితే విచక్షణ ఉండదు. చెయ్యకూడనివి చాలా చేస్తారు... తీరా అది గ్రహించేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

ఈ విషయంలో మహాభారతంలో శల్యుడికి మించిన ఉదాహరణ మరొకటి దొరకదు. నకుల సహదేవులకు మేనమామ.     కాబట్టి పాండవులకు మేనమామ.     కృష్ణ పరమాత్మతో సమానంగా రథ సారథ్యం చేయగల నేర్పరి.

కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు సహాయపడదామని బయల్దేరాడు.                 ఈ విషయం గూఢచారుల ద్వారా తెలుసుకున్న దుర్యోధనుడు మార్గమధ్యంలో   అద్భుత స్వాగత సన్నాహాలు చేసాడు. అది పాండవులే చేశారనుకున్నాడు శల్యుడు.

తీరా దుర్యోధనుడని తెలుసుకుని పిలిపించాడు.. అతని పొగడ్తలకు, మర్యాదలకు శల్యుడు మురిసి పోయి ఏం కావాలో కోరుకో... అన్నాడు.

“మీరు నా పక్షాన యుద్ధం చేయాలి" అన్నాడు దుర్యోధనుడు.

పొగడ్తల మత్తులో సరేనని శల్యుడు మాటిచ్చాడు.   అయినా ఒకసారి ధర్మారాజును చూసి వస్తా అని అటు వెళ్ళాడు. అక్కడ ధర్మరాజు కూడా వేగుల ద్వారా అప్రమత్తమై ఉన్నాడు.

ధర్మరాజాదులు కూడా శల్యుడిని ఆకా శానికి ఎత్తేసారు, పొగడ్తలతో. “మీకేం కావాలో చెప్పండి తీర్చేస్తా" అని వారికీ మాటిచ్చాడు.

"అర్జునుడికి కృష్ణుడు సారథ్యం వహిస్తాడు కాబట్టి దుర్యోధనుడు నిన్ను కర్ణుడికి రథసారథ్యం చేయమంటాడు. నువ్వు రథం ఎక్కిన దగ్గరనుంచి అతనిని మానసికంగా హింసించు, నిందించు, అప్పడు బాణ ప్రయోగంలో ఏకాగ్రత కోల్పోతాడు. మేం అతనిని పడగొట్టేస్తాం!” అని పాండవులు అంటారు.

అంటే సరేనని శల్యుడు వారికీ మాటిచ్చాడు. కర్ణుడి చావుకు తానూ ఒక కారణమయ్యాడు.

ఇటువంటి అనుభవాలూ మనం నిత్యజీవితంలోనూ చూస్తూ ఉంటాం.

అటువంటి బలహీనతల నుండి మనల్ని మనం కాపాడుకోవడమే కాదు... ఇతరులను కూడా కాపాడుతూ ఉండాలి.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

నిజమైన క్షమాపణ, కోపంతో ఊగిపోతూ గౌతమ బుద్ధునిపై ఉమ్మి వేశాడు…

 (H16.) x2.i. 2-4.   270922-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కోపంతో ఊగిపోతూ గౌతమ బుద్ధునిపై 
ఉమ్మి వేశాడు…

           నిజమైన క్షమాపణ
                ➖➖➖✍️

ఒకసారి, గౌతమ బుద్ధుడు తన శిష్యులతో సమావేశమై కూర్చునియుండగా, చాలా కోపంతో ఒక వ్యక్తి వచ్చాడు.

అతను బుద్ధుడు తప్పు చేస్తున్నట్లుగా భావించేవాడు. కేవలం ప్రజలను ధ్యానం చేయమని చెప్తేనే, ప్రజలు పెద్ద సంఖ్యలో అయన వైపుకు ఆకర్షించ బడుతున్నారు అని అనుకున్నాడు!

అతను ఒక వ్యాపారవేత్త, అతని పిల్లలు వ్యాపారంలో ఎక్కువ డబ్బు సంపాదించడంలో, మంచి జీవనోపాధిని పెంచుకోవడంలో నిమగ్నమై ఉండకుండా, బుద్ధుడితో ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆందోళనపడ్డాడు.

ఎప్పుడూ కళ్లు మూసుకుని కూర్చుని ఉండే వారి ప్రక్కన, రోజులో నాలుగు గంటల సమయం గడపడం పూర్తిగా  వృధా అని భావించాడు.

దీనితో కలత చెంది, విసిగిపోయి,"నేను ఈ వ్యక్తికి గుణపాఠం చెప్పాలి!", అని అతను నిర్ణయించుకున్నాడు. మనసు నిండా కోపంతో బుద్ధుడి వైపు ధైర్యంగా నడిచాడు.

బుద్ధుని దగ్గరికి రాగానే అతనిలోని ప్రతికూల ఆలోచనలన్నీ మాయమైపోయాయి, కానీ అతనిలోని కోపం మాత్రం చల్లారలేదు. కోపంతో ఊగిపోతున్నాడు కానీ మాట్లాడలేక పోతున్నాడు.

తన భావోద్వేగాలను మాటల్లో చెప్పలేక బుద్ధుని ముఖంపై ఉమ్మివేసాడు.

బుద్ధుడు బదులుగా నవ్వాడు.

బుద్ధునితో పాటు కూర్చున్న శిష్యులకి                ఆ వ్యక్తిపై చాలా కోపం వచ్చింది. వారు అతని మీదకు దూకడానికి సిద్ధమయ్యారు, కానీ బుద్ధుని ఎదురుగా వారు ఏమీ చేయలేక ఆగిపోయారు.

బుద్ధుడితో ఎవరైనా అంత  అవమానకరంగా ప్రవర్తించగలరని వారు నమ్మలేకపోయారు! కానీ వారు ఏమీ అనలేకపోయారు.

అతను చేసిన పనికి చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి ఎటువంటి ప్రతిచర్య రాలేదు, పైగా బుద్ధుడు కూడా ప్రతిగా చిరునవ్వు నవ్వాడు అంతే.  ఇంక అక్కడ అతను ఎక్కువసేపు ఉండలేడని గ్రహించాడు.
"ఇంక ఎక్కువసేపు ఉంటే, బహుశా నేనే ప్రేలిపోతానేమో!", అని అనుకుని వెళ్ళిపోయాడు.

ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా, తన మనస్సు నుండి గౌతమ బుద్ధుని చిరునవ్వుతో ఉన్న ముఖ చిత్రాన్ని చెరిపేయలేకపోయాడు. తాను చేసిన లాంటి అగౌరవమైన చర్యకు అసాధారణంగా స్పందించిన ఒక వ్యక్తిని తన జీవితంలో మొదటి సారి కలుసుకున్నాడు.
ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. అతని హృదయం పూర్తిగా పరివర్తన చెందింది. వణుకుతూ, కంపించిపోతున్నాడు, చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం కూలిపోతున్నట్లుగా భావించాడు.

మరుసటి రోజు, వెళ్లి బుద్ధుని పాదాలపై పడి, "దయచేసి నన్ను క్షమించండి!నేనేం చేస్తున్నానో నాకు తెలియలేదు." అని వేడుకున్నాడు.

దానికి బుద్ధుడు, "నేను నిన్ను క్షమించలేను!" అని సమాధానమిచ్చాడు.

అది విన్న శిష్యులందరూ అవాక్కయ్యారు. తన జీవితమంతా, బుద్ధుడు చాలా దయాగుణంతో గడిపాడు. అందరినీ, వారి గతంతో సంబంధం లేకుండా ఆశ్రమంలోకి అంగీకరించాడు. ఇప్పుడు ఈ వ్యాపారితో క్షమించలేనని చెబుతున్నాడా..?" అని అనుకున్నారు.

బుద్ధుడు చుట్టుపక్కల చూసి, అందరూ ఆశ్చర్యపోయినట్లు గమనించాడు.

బుద్ధుడు ఇలా వివరించాడు, "మీరు ఏమీ చేయనప్పుడు నేను నిన్ను ఎందుకు క్షమించాలి?
నేను నీ ప్రవర్తనను క్షమించడానికి నువ్వు చేసిన తప్పేంటి?".

వ్యాపారవేత్త బదులిస్తూ, "నిన్న నేను వచ్చి, కోపంతో మీ ముఖం మీద ఉమ్మివేసాను. ఆ వ్యక్తిని నేనే!".

గౌతమ బుద్ధుడు, "ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ లేడు, మీరు ఉమ్మి వేసిన వ్యక్తిని నేను ఎప్పుడైనా కలిస్తే, మిమ్మల్ని క్షమించమని చెబుతాను." అని అన్నాడు.

“నాకు - ఈ క్షణంలో ఇక్కడ ఉన్న వ్యక్తివి నీవు. నీవు అద్భుతమైనవాడివి. నువ్వు ఏ తప్పూ చేయలేదు."

జీవితంలో ఒక వ్యక్తిని మనం నిజంగా ఎప్పుడు క్షమిస్తాము?

నిజమైన క్షమాపణ అంటే ఎవరినైనా మనం క్షమించినప్పుడు, ఆ వ్యక్తి క్షమింపబడ్డాడని కూడా ఎవరికీ తెలియకూడదు. ఆ వ్యక్తికి తాను చేసిన పనికి అపరాధభావాన్ని కూడా కలిగించకూడదు.
అదే సరైన క్షమాపణ!

మనం ఎవరినైనా క్షమించి, వారి తప్పులు వారికి గుర్తుచేస్తూ, వారికి ఎల్లవేళలా అపరాధ భావాన్ని కలిగిస్తే, నిజానికి, మనం వారిని ఇంకా క్షమించలేదని అర్ధం.

ఒక వ్యక్తికి తాను తప్పు చేసినట్లు గ్రహించడమే, ఆ వ్యక్తికి తగిన శిక్ష.

                       ♾️

మనకు ఎవరితోనైనా చేదు అనుభవాలు ఎదురైనప్పుడు, వారిని మనం క్షమించినప్పుడే మన మానసిక భారం తొలగిపోతుంది. ✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

అశాశ్వతమైన ప్రాపంచిక వాంఛలను విడచి దైవమే కావాలని కోరుకొని చూడండి. మీ హృదయంలో నిత్యమూ కొలువై ఉంటూ మిమ్మల్ని ఆనంద సాగరంలో మునకలు వేయిస్తాడు. ప్రయత్నించి చూడండి...

 నేటి…

              ఆచార్య సద్బోధన:
                 ➖➖➖✍️

దేవుని నిమిత్తం ఎక్కడెక్కడికో తిరిగి, ఏవేవో చేసే బదులు ఇంటిలో ఒక మూలన కూర్చుని సరియైన చిత్తముతో దేవుని ఏదో ఒక రూపమును ధ్యానం చేసి చూడండి, చక్కగా కనిపిస్తాడు.

ప్రార్థనలో ఏవేవో కోర్కెలు కోరే బదులు మౌనముగా ఉండి చూడండి, మనతో సంభాషిస్తాడు. 

పుణ్యం వస్తుందని గుడులు, గోపురాలు కట్టించడం, వాటి చుట్టూరా తిరగడం చేసే బదులు అవసరంలో ఉన్నవారికి చేతనైనంత ఆదుకోండి, మీ ఖాతాలో లెక్కించనంత పుణ్యం జమ అవుతుంది.

మీ జీవనం బాగుంటుందని పూజలు, పుష్కరాలకు, మొక్కులకు హుండిలలో  వేలాది రూపాయలు వేసేకన్నా 'ఆకలి' అన్నవాడికి పట్టెడన్నం పెట్టి చూడండి, మీ తరతరాలకు సరిపోయేలా పంచభక్ష్య పరమాన్నాలను ఇస్తాడు.

అశాశ్వతమైన ప్రాపంచిక వాంఛలను విడచి దైవమే కావాలని కోరుకొని చూడండి. మీ హృదయంలో నిత్యమూ కొలువై ఉంటూ మిమ్మల్ని ఆనంద సాగరంలో మునకలు వేయిస్తాడు. ప్రయత్నించి చూడండి...✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

నీకర్మ నీచేత ఆపని చేయిస్తుంది! ➖➖➖✍️

  నీకర్మ నీచేత ఆపని చేయిస్తుంది!
                ➖➖➖✍️

ధర్మరాజును జూదంవైపు నడిపించింది ఏది?

స్వభావరీత్యా మనిషి తనకు ఇష్టంలేని పనులు ఎందుకు చేస్తాడో భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం వివరించింది. 

ఒక పనిని ఆచరించడంగాని, నిరాకరించడంగాని మనిషి చేతిలో లేదని, ప్రకృతిశక్తి లేదా విధికి లోబడి తనకు తెలియకుండానే మనిషి దానికి పూనుకొంటాడని 60వ శ్లోకం చెబుతోంది.

ధర్మజుడు ధర్మాధర్మ విచక్షణ బాగా తెలిసిన ధర్మమూర్తి.         పైగా యమధర్మరాజు అంశతో జన్మించినవాడు.   అంతటి వివేకి- చెడ్డదని తెలిసీ, వ్యసనమని ఎరిగీ జూదం విషయంలో నిగ్రహం ఎలా కోల్పోయాడు? 

ఇదే సందేహం జనమేజయుడికీ వచ్చింది. వ్యాసమహర్షిని అడిగాడు. 

దానికి వ్యాసుడు “ప్రకృతి చేయిస్తుంది నాయనా! దానిముందు నీ నిగ్రహం చాలదు... ఇష్టంలేకపోయినా నీ స్వభావం, నీ కర్మ నీచేత ఆ పని చేయిస్తాయి!” అని బదులిచ్చాడు. 

జనమేజయుడికి సంతృప్తి కలగలేదు. కాని, మౌనం వహించాడు.

రాజు అసంతృప్తిని ఋషి గమనించాడు. మాట మారుస్తూ “ఓ రాజా! రేపు నీ దగ్గరకు కొన్ని గుర్రాలు అమ్మకానికి వస్తాయి. వాటిలో నల్లదాన్ని మాత్రం కొనవద్దు! కొన్నా, దానిమీద స్వారీ చెయ్యకు... చేసినా ఉత్తర దిక్కుకు మాత్రం పోనేవద్దు. పోయినా అక్కడుండే సుందరితో మాట కలపకు..! కలిపినా ఆమెను పెళ్ళి మాత్రం చేసుకోకు. చేసుకున్నా, ఆమె మాటకు లోబడి ఆమె ఆడించినట్టు ఆడకు... జాగ్రత్త!” అని హెచ్చరించాడు.

మర్నాడు కొందరు వర్తకులు మేలుజాతి అశ్వాలను అమ్మకానికి తెచ్చారు. వాటిలో నల్లగుర్రమే చాలా ఆకర్షణీయంగా ఉంది. ‘దీనివల్ల ఈ గుర్రపుశాలకే కాదు, ఈ రాజ్యానికే శోభ’ అనిపించింది రాజుకు. ఆయనకు వ్యాసమహర్షి మాట వెంటనే గుర్తుకొచ్చింది. ‘ఎక్కవద్దన్నాడు కాని కొనవద్దని చెప్పలేదుగా!’ అని సమాధానపడి పెద్ద ధరకు దాన్ని కొనేశాడు. 

రోజూ అశ్వశాలలో దాని సొగసు చూసి మురిసిపోయేవాడు. క్రమంగా ఇష్టం పెరిగిపోయింది. ‘ఉత్తర దిక్కుకు పోవద్దనే కదా మహర్షి హెచ్చరించింది... ఎక్కవద్దని కాదు..!’ అని సరిపెట్టుకొని తక్కిన మూడు దిక్కుల్లో హాయిగా స్వారీ చేయడం ఆరంభించాడు. 

కొన్నాళ్లు గడిచాయి. ‘ఉత్తర దిశగా పోదాం... అక్కడి సుందరితో మాట్లాడకుండా తిరిగొచ్చేస్తే ఫరవాలేదు’ అని నిశ్చయించాడు. ఉత్తరం వైపు గుర్రాన్ని నడిపించాడు.

అక్కడొక అందమైన యువతి కనిపించింది. ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఆ తరవాత ‘ఇంతటి సౌందర్యరాశిని సొంతం చేసుకోకుంటే ఈ జన్మ వృథా!’ అనిపించింది. ‘ఆమె ఏం చెప్పినా పట్టించుకోవద్దు... కేవలం పెళ్ళి మాత్రమే చేసుకొందాం... ఆమె చెప్పినట్లు మాత్రం చేయవద్దు’ అన్న గట్టి నిర్ణయంతో గాంధర్వ వివాహం చేసుకొన్నాడు. అంతఃపురానికి తీసుకొచ్చాడు. 

ఒకరోజు ఆ సుందరి ‘దేశంలోని సాధువులను పొలిమేరల్లోని మునులను పిలిచి సంతర్పణలు, సత్కారాలు చేయాలని ఉంది’ అని రాజును కోరింది.

అది భార్య తొలి కోరిక. పైగా చక్కని సత్కార్యం. కాదనడం దేనికనుకొన్నాడు జనమేజయుడు. అన్న సమారాధనకు భారీ ఏర్పాట్లు చేశాడు. వడ్డిస్తుండగా ఆమె లోకోత్తర సౌందర్యాన్ని గమనించిన ఒక యువసాధువు మోహపరవశుడై ఆమెను కామదృష్టితో పరికించాడు. 

ఆమె ఏడుస్తూ రాజుకు ఫిర్యాదు చేసింది. దాంతో రాజు పట్టరాని కోపంతో కత్తిదూసి ఆ సాధువు తల నరికేశాడు. 

మరుక్షణమే ‘అయ్యో బ్రహ్మహత్యాపాతకానికి ఒడిగట్టానే’ అంటూ వలవల ఏడ్చాడు.

వ్యాసమహర్షి నవ్వుతూ ప్రత్యక్షం అయ్యాడు. తన మాయను ఉపసంహరించాడు. 

జనమేజయుడికి కల చెదిరినట్లయింది. మబ్బు విడిపోయింది. ఈ కథలో గ్రహించడానికే తప్ప ఇక చెప్పడానికి ఏమీలేదు!✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

ధనం,జనం,యవ్వనం… అన్నీ అశాశ్వతమే!

 ధనం,జనం,యవ్వనం…
                అన్నీ అశాశ్వతమే!
                    ➖➖➖✍️

ఆత్మజ్ఞానం కావాలంటే అందుకు అనువైనది మానవ జన్మయే!

అలాంటి మానవజన్మ లభించి కూడా ఆత్మజ్ఞానాన్ని అలక్ష్యం చేసి లౌకిక సంపదలు, భోగాలే ప్రధానం అనుకొని జీవితం గడిపినవారి గతి ఏమవుతుందో శంకరాచార్యులవారు ఇలా వివరించారు:
 
మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్‌ కాలః సర్వం
మయామయమిదమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా
 
ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యవ్వనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిమిషంలో హరించిపోతుంది.
ఈ ప్రపంచం అంతా భ్రమతో కూడుకున్నదని, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో, ఆత్మానుభూతిని చెందు! అని దీని అర్థం.

ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి. 

ఈ క్షణికమైన సంపదలను చూసుకొని మనిషి గర్విస్తాడు,అహంకరిస్తాడు. 

కొందరికి ధనగర్వం, 
కొందరికి తన కోసం ఏదైనా చేయగలిగే అనుచరులున్నారనే గర్వం, 
కొందరికి తమ యవ్వనాన్ని చూసుకుని గర్వం.

కానీ ఒక్కసారి భూకంపం వస్తే ఇళ్లు,ఆస్తులు నేలమట్టమై పోతాయి. 
నాకేం? కోట్ల ఆస్తి ఉంది. బ్రహ్మాండమైన భవనం ఉంది అని గర్వించినవాడు మరుక్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది. ఆ క్షణంలో ధనం, జనం ఏవీ రక్షించవు. 

అలాగే యవ్వనం కూడా శాశ్వతంగా ఉండదు.వృద్ధాప్యం వెక్కిరిస్తూ మన నెత్తిమీదకు వచ్చికూర్చుంటుంది. 
కాబట్టి ఇదంతా మాయాజాలమని, క్షణికమైనవని భావించాలి. 
అలాగని అన్నీ వద్దనుకోవాల్సిన పని లేదు. వాటిని అనుభవించడంలో తప్పు లేదు. కానీ, వాటితో అటాచ్‌మెంట్‌ పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే, అవి పోయినప్పుడు భరించలేని దుఃఖం తప్పదు. 

జీవితంలో అతి ముఖ్యమైనవిగా భావించాల్సినవి ఇవి కావు. 

శాశ్వత ఆనందప్రాప్తికి బ్రహ్మపదంలో ప్రవేశించాలి.

ఆ పరమానందం, నిత్యానందం లభించాలంటే చలించే మనస్సును బ్రహ్మంలో నిలిపి, 
ఆ బ్రహ్మంలో మనస్సును ప్రవేశపెట్టి బ్రహ్మంగా ఉండిపోవాలి. 

పరమాత్మలో ఐక్యం కావాలి.✍️

                   🌷🙏🌷

  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

అనంత ఫలదాయకం… అర్ఘ్య ప్రధానం...!!

 అనంత ఫలదాయకం…

               అర్ఘ్య ప్రధానం...!!
                 ➖➖➖✍️

మన తల్లిదండ్రులు, తాతముత్తాతలు మన చిన్నతనం నుండి ఉదయమే లేవటం మరియు సూర్యుడికి అర్ఘ్యం వదలటం వంటి ఆచారాలను నేర్పుతూ వొస్తున్నారు. 

నేటి సమాజంలో మనం వ్యవహరించే ఆచారాలు, విశ్వాసం మరియు నమ్మకం ఉన్న సూర్యుడికి నీరుని సమర్పించటం వంటివి నిజంగా మనకు సహాయపడుతున్నాయా లేదా కేవలం ఇది మరొక పురాణంలాగా వింటున్నామా!

సూర్యునికి దోసిలిలో నీరుని సమర్పించటానికి అనేక పరిశోధనలు మరియు అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.

రెండు చేతులు దోసిలిగా పెట్టి, ఆ దోసిలిలో నీరు తీసుకుని రెండు చేతులను సూర్యదేవుని దిశగా పైకెత్తి పెట్టి, సన్నని ధారతో దోసిలిలోని నీరు వొదలాలి,   మరియు   ఆ సమయంలో సూర్యుని నుండి వొచ్చే బలమైన కిరణాల వలన మనం సూర్యుని వైపు చూడలేము, మన పూర్వీకులు సూర్యభగవానుడికి ప్రాతఃకాలంలో విస్తృత అంచు కలిగి ఉన్న ఒక గిన్నెతో అర్ఘ్యం అందించేవారు.

వారు నీటిని రెండు చేతులను సూర్యభగవానుని దిశగా పైకి ఎత్తి నీరుని సమర్పించేటప్పుడు వారి కళ్ళ ముందు ఆ సన్నని నీటి ధార దేవుడి దిశగా వెళుతున్నట్లుగా అనుభూతి చెందేవారు మరియు మన పూర్వీకులు (ఋషులు, సాధువులు) ఆ ప్రవహిస్తున్న నీటి చిత్రం ద్వారా  సూర్యభగవానుని చూసేవారు.

సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్న కిరణాలు(నీటి ప్రవాహం చిత్రం) వారి కళ్ళను మాత్రమే కాదు, వారి మొత్తం శరీరం మరియు ఆత్మను కూడా ఉత్తేజపరుస్తాయి.

శాస్త్రవేత్తలు ఉదయాన్నే సూర్యుని  కిరణాలు సోకటం మానవునికి మంచిదని చెబుతారు.  

మానవ శరీరమే ఒక అద్వితీయమైన శక్తితో కూడుకున్నది.   మానవ శరీరం ఐదు అంశాలతో చేయబడింది, గాలి(వాయు), నీరు (జల), భూమి(పృథ్వి) , అగ్ని(శక్తి) మరియు అంతరిక్షము(ఆకాశము) మరియు శరీరంలోని అన్ని రోగాల నివారణ ఈ ఐదు అంశాల వలన మాత్రమే సాధ్యమవుతుంది మరియు ఉదయిస్తున్న సూర్యుని కిరణాలలో ఈ అంశాలు ఉండటం ఒక విశేషం. 

పలు వ్యాధులు సూర్యుని కిరణాలను ఉపయోగించి నయం చేయవచ్చు!    ఉదా:- గుండె జబ్బులు, కళ్ళు, కామెర్లు,  కుష్టు మరియు బలహీనమైన మెదడు. 

మనల్ని నిద్ర నుండి మేల్కొలిపేలా చేసేది సూర్యభగవానుడు అని ఋగ్వేదం చెపుతున్నది.

సూర్యుని కారణంగా అన్ని పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

జీవకోటి సృష్టి అంతా సూర్యుడి మీద ఆధారపడి ఉన్నది. సూర్యుడు అనేక భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక బలహీనతలను తొలగిస్తాడు మరియు ఆరోగ్యకరమైన , దీర్ఘాయువును ఇస్తాడు. 

సూర్యుడి ఏడు రంగులు ఆరోగ్యానికి చాలా మంచివి మరియు ముఖ్యమైనవి. ఎవరయితే ప్రాతః కాలాన్నే స్నానం ఆచరించి మరియు సూర్య దేవుడిని ప్రార్థించటం చేస్తారో మరియు వారి శరీరానికి సూర్యుని కిరణాలు తాకుతాయో, వారి శరీరం అన్ని రుగ్మతల నుండి విముక్తి పొందుతుంది మరియు వారి యొక్క మేధస్సు పెరుగు తుంది.

ప్రతీ రోజు సూర్యుడు ఉదయించక ముందే అంటే ఉదయం 5 నుండి 6 లోపున సూర్యునికి అర్ఘ్యం అంటే మన రెండు చేతులతో దోసెడు నీళ్ళు తీసుకుని

”సిందూరవర్ణాయ సుమండలాయ సువర్ణవర్ణాభరణాయ తుభ్యమ్‌ |

పద్మాభనేత్రాయ సపంకజాయ బ్రహ్మేంద్రనారాయణకారణాయ ||

సురత్నపూర్ణం ససువర్ణతోయం సకుంకుమాద్యం సకుశం సపుష్పమ్‌॥

ప్రదత్తమాదాయ సహేమపాత్రం ప్రశస్తమర్ఘ్యం భగవన్‌ ప్రసీద ||

అని నీళ్లను సూర్యుణ్ణి చూస్తూ విడిచి పెట్టాలి, కొద్దిసేపు సూర్యునికి నమస్కారం చేసుకుని,  పూజ గదిలో స్వామి వారి మూర్తికి దీపారాధన చేయటం ముఖ్యం, నమస్కారం చేస్తే చాలు సర్వ సౌఖ్యాలు ఇస్తాడు.

అటువంటిది మనం ఇంకా శ్రద్ధగా సూర్య దీక్ష చేస్తే మనకు వచ్చే ఫలితం ఎంతో ఉంటుంది! ఆలోచించండి.

దీక్షలో ప్రతీ ఆదివారం స్వామి వారికి ఆవుపాలతో చేయబడిన పాయసాన్ని నివేదన చేసి ఆదిత్య హృదయం చదువుకోవాలి.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀.🙏

ప్రార్ధన అనేది దేవుని నిర్ణయాన్ని మార్చకున్నా అది మన మనస్సును ప్రభావితం చేయగలదు.

 నేటి…

              ఆచార్య సద్బోధన:
                  ➖➖➖✍️

బాహ్య విషయాలతో ఎప్పుడూ భగవంతుని అనుసందానం చేయకూడదు. 

వాటి అవసరాల కోసం భగవంతుని ప్రార్ధించకూడదు.

చెడుకు దూరంగా, మంచిగా బ్రతికేలా చేయమని ప్రార్ధించాలి. 

ఈ దేహమూ, ప్రాణమూ భగవంతునిదే కనుక ఈ జీవితాన్ని ఆయనకు ఇష్టం వచ్చిన రీతిగా మలచుకొమ్మని ప్రార్ధించాలి.

ఆయన మనకు ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి ఉంటూ పదిమంది మంచికోసం ప్రార్ధించాలి. 

నిత్యమూ ఆయన సృహలోనే ఉండేలా చేయమని ప్రార్ధించాలి.

ప్రార్ధన అనేది దేవుని నిర్ణయాన్ని మార్చకున్నా అది మన మనస్సును ప్రభావితం చేయగలదు.

కనుక జీవితంలో ప్రార్ధన అనేది ఒక బాగమైపోయేలా చూసుకోవాలి.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ప్రాణమున్నంత కాలం శివం... ప్రాణం పోయినంతనే శవం..

 ప్రాణమున్నంత కాలం శివం...

ప్రాణం పోయినంతనే శవం..

ఎంత సులువుగా మనుషులు వారి ఆలోచనలు మారిపోతాయో కదా.

 అప్పటిదాకా మనముందు మాట్లాడుతూ ఉన్న మనిషి,
మనకు బాగా కావలసినవారు, ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు...

 కన్నుమూయగానే ఒక శవం..
ఒక శరీరంగా కనిపిస్తారు.

 మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయంగా ఉన్న వ్యక్తి ప్రాణం పోయినంతనే భయం కలుగుతుంది.

 అమ్మో అంటారు.
 మైల అంటారు.

కోట్లకు అధిపతైనా మంచంమీదనుండి నేలమీద పడుకోబెట్టేస్తారు.
లేదా ఐస్ పెట్టెలో.. 

అయ్యో..
మన మనిషి... చనిపోయాక కూడా మనవారే అని అనిపించదా.. దూరంగా నిలబడతారు.

కనీసం వారింట మంచినీరు కూడా తాగరు..

దినాల భోజనం కూడా అందరికీ పడదు, నచ్చదు. వద్దు అంటారు.

 శుభకార్యంలో భోజనానికి,
దినాలకి పెట్టే భోజనానికి తేడా ఏముంటుంది.

చనిపోయిన వ్యక్తి సంస్మరణలో తినే భోజనం ప్రసాదం లాంటిది.

 శుభకార్యాలు ఎంతో ఈ దినాల కార్యక్రమాలు, భోజనాలు వాటి ప్రాముఖ్యత కూడా అంతే.. 

రేపు లేదా ఎల్లుండి మనం కూడా పోయేవాళ్లమే.
పోయేటప్పుడు కట్టుకపోయేదేమీ లేదు..

అందుకే పెద్దవాళ్లని,
మనవాళ్లని అందరినీ అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండండి.

ఏమో...ఎప్పుడు మాయమవుతారో....!!

మీ... సూర్య మోహన్ 🌞

కోరిక గుణాన్ని ఎప్పుడు ? ఎలా తొలగించాలి ??

       💖💖 *"343"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
    
*"కోరిక గుణాన్ని ఎప్పుడు ? ఎలా తొలగించాలి ??"*
**************************

*"బాహ్య ప్రపంచంతో ఉన్నప్పుడే అంతరంగంలో కోరికను తొలగించుకోవాలి. అంతేగాని ప్రపంచం నుండి దూరంగా పారిపోతే అది కోరికను కప్పిపెట్టినట్లే అవుతుంది. ఎప్పుడైనా వస్తువును వాడుతూ దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచడం కోసం దాచితే ఆ వస్తువుకు ప్రయోజనమేమీ ఉండదు. మన మనసుకు అనేక గుణాలు వచ్చి చేరాయి. అవి లేకపోతే మన మనసు పరిశుభ్రంగా ఉంటుంది. మామిడి పండు చుట్టూ ఉన్న తొక్క, గుజ్జు, పీచులను ఒక్కొక్కటిగా తొలగిస్తే చివరికి టెంకె ఎలాగైతే మిగులుతుందో అలాగే మన మనసుకు నిత్యజీవితంలో ఎదురయ్యే గుణాల సంగమాన్ని ఒక్కొక్కటిగా తొలగించుకోవాలి. అన్ని క్రియల్లో ఉంటూనే, మనసు సుగుణాన్ని కాపాడుకునే నిజమైన స్థితిని సాధనతో సాధ్యం చేసుకోవాలి !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*

భగవంతునికి - భక్తులు - అనే అర్హత ఎప్పుడు పొందగలము?

 *భగవంతునికి - భక్తులు - అనే అర్హత ఎప్పుడు పొందగలము?*

భగవంతుని గుర్తించి మనము స్వీకరిస్తే ఆయన ఉంటాడు, కనబడుతాడు... 
ఆయనను తిరస్కరిస్తే ఆయన ఉండడు, కాక కనబడడు కూడా.... 
హిరణ్యకశిపుడు హరి ఎక్కడా లేడన్నాడు, కనుక ఎక్కడా కనబడలేదు, అతనికి...
అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు విశ్వసించాడు... 
కాబట్టి స్తంభము నుండి వెలిసి, ప్రహ్లాదుని విశ్వాసం సత్యమని నిరూపించాడు...
అంతే కానీ, హిరణ్య కశిపుని సవాలు ఎదుర్కోవడం కోసమని స్తంభములో  ప్రవేశించడం కాదు...

అన్నిటా, అంతటా నిండి ఉన్నట్లే, ఆ స్తంభములో కూడా ఆయన ఎప్పుడూ ఉన్నాడు... 
ఆ క్షణంలో తన ఉనికి ప్రదర్శించాడు, అంతే!...

సాధు సత్పురుషులు, మహర్షులు, ఆర్తితో ప్రార్ధించినపుడు, భగవంతుడు అవతరిస్తాడు...

*ఆయన కర్తవ్యాలు మూడు...!!!*

వేద రక్షణ, 
ధర్మ రక్షణ, 
భక్త రక్షణ...

నిశ్చలమైన విశ్వాసము, నిర్భయం, నిరహంకారం, సద్గుణం, ఇవి లేకుండా, ఆడంబరంగా పూజ చేస్తే, వ్యర్థమే... కాలము, శక్తీ, అన్నీ వృధా అవుతాయి...

ఇలాంటి సందర్భంలో మనము పవిత్ర గ్రంధాల నుండీ, పురాణముల నుండి, ఉపనిషత్తులనుండి, ప్రసంగాల నుండీ మనము పొందుతున్న లాభమేమిటి?...

వీటి మూలంగా మనమైనా బాగు  పడ్డామా? లేక చదివితేనే పుణ్యము వస్తుంది, అనుకొంటే మనకన్నా ముందు టేబురికార్డులకు, మన సెల్లులకు ముందుగా పుణ్యం వస్తుంది, అవి నిత్యం పటిస్తున్నాయి కాబట్టి...

భగవంతుని దర్శన భాగ్యం పొందిన మనము ఎంతవరకు పురోగమించాము? 
దర్శనమాత్రమునే పుణ్యము వస్తుంది, మోక్షానికి అర్హత వస్తుంది అనుకుంటే, మనకన్నా ముందు, నిత్యం ఆయన కోవెలలో ఉన్న చీమలకు, దోమలకు, కీటకాలకు వస్తుంది...
ఎందుకనగా అవి నిత్యం ఆయనను అంటిపెట్టుకుని ఉంటున్నాయి కాబట్టి...

ఆయన దగ్గర నుంచి పారమార్థిక జీవిత రహస్యం , తెలుసుకున్న దానికి  నిదర్శనంగా మన జీవన సరళిలో ఏదైనా మంచి మార్పు కన పడాలి...
మనలోనుండి మధుర భాషణం, విజయ, పరాజయాలకు పొంగని, కృంగని ఆత్మ నిగ్రహం మనము ప్రదర్శించాలి...
ఇవన్నీ మన భక్తికి సంకేతాలు, లేశమైన అహంభావము లేకుండా, భగవంతుని శరణాగతి పొందాలి...  
అప్పుడే మనము భక్తులు అని పించుకోగల అర్హత పొంద గలుగుతాము. 

భగవాన్ ! ప్రపంచం క్లిష్ట సమయంలో ఉంది. దీనికి పరిష్కారం సూచించండి...

 || భగవాన్ ! ప్రపంచం క్లిష్ట సమయంలో ఉంది. దీనికి పరిష్కారం సూచించండి ||

రమణ మహర్షి ధ్యాన సంపత్తిని సముద్రాలు దాటించి 
మహర్షిని విశ్వర్షిగా మలిచిన తొలి పాశ్చాత్య భక్త వరేణ్యుడు పాల్ బ్రంటన్. పాల్ బ్రంటన్ ఇంగ్లండులో ప్రముఖ జర్నలిస్టు. 
మంచి రచయిత, సాహితీపరుడు. ఆంత్రోపాలజీ, మతం వంటి విషయాలపట్ల ఆసక్తి కలవాడు. చేస్తున్న ఉద్యోగం వదిలి 1930 లో భారతదేశం వచ్చాడు. 

భారతదేశంలోని యోగులు,మహర్షులపైన పరిశోధన చేయాలన్నది అతని సంకల్పం. భారతదేశం వేదభూమి, కర్మభూమి, తపోభూమి. ఇక్కడ అడుగడుగునా యోగులుంటారని, 
ఇది అంతా కీకారణ్యమని పాశ్చాత్యుల భావన.పాల్ బ్రంటన్ తన తత్వజిజ్ఞాసలో భాగంగా చాలా దేశాలు పర్యటించాడు. 

ఈజిఫ్టులో రహస్య స్థావరాలలో ఉండే మాంత్రికుల్ని, తాంత్రికుల్ని కలిశాడు. ముంబాయిలో మహమూద్ బే అనే సూఫీ యోగి ని కలిశాడు. నాసిక్ లో మెహర్ బాబాను, ఆయన గురువును దర్శించాడు. పూనేలో బాబాజాన్ ని పరిచయం చేసుకున్నాడు. సుఖానంద రాజగోపాలస్వామిని, కాంచీపురంలో శంకరాచార్యను కలుసుకున్నాడు.

కంచి శంకరాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామిని సేవించి తనకు జ్ఞానమార్గం చూపమని అర్థించాడు. ఆయనే పాల్ బ్రంటన్ ను రమణ మహర్షివద్దకు వెళ్లమని సలహా చెప్పాడు. తన శిష్యుడు వెంకటరమణిని బ్రంటన్ కు తోడుగా పంపారు. 

తాను దేశ పర్యటనలో వున్నానని, తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పమని మరీ చెప్పి పంపారు. కంచి శంకరాచార్య రమణ మహర్షిని తన హృదయస్థ గురువుగా భావించేవారు.

పాల్ బ్రంటన్ మద్రాసు నిండి తిరువణ్ణామలై చేరుకున్నాడు. ఆశ్రమం చేరి మహర్షికి నమస్కారం చేసి ఎదురుగా కూర్చున్నాడు. మహర్సి సన్నిధిలో చాలా మంది భక్తులున్నారు. అందరూ నిశ్శబ్దంగా, ధ్యానంలో ఉన్నారు. మహర్షి ఎంతో నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నారు. భక్తుల తృప్తికోసం అలా కూర్చున్నారేమో అనిపించింది. అంత నిబ్బరంగా, ప్రపంచ, పరిసరాలు ఏవీ పట్టనట్లు ఉండడం ఎలా సాధ్యం !

అలా అనుకున్న మరుక్షణంలో అతని మనస్సు శూన్యమైంది. నిరామయమైంది. లోపల ఒక్క భావం కదలడం లేదు. తనలో చకచక వస్తున్న మార్పులకు ఉక్కిరిబిక్కిరైనాడు. తన చూట్టూ కాంతి ప్రవాహాలు, తనలో శాంతి తరంగాలు. ఆలోచనలతో కలవరపడే మనస్సు క్షణంలో నిర్మలమైంది. ఇది ఎలా సాధ్యం? 

ఆ క్షణంలో అనిపించింది 'మనిషి వివేకమే సమస్యల్ని సృష్టిస్తుందని '. ఆ వివేకమే తను సృష్టించుకున్న సమస్యలకు పరిష్కారం వెదుకుతుంది. రెండింటికీ మనసే మూలం, ఆధారం. 
తనలో అంతటి శాంతికి, ప్రశంతతకి కారణం మహర్షి దర్శనం, 
మహర్షి వీక్షణం. ఆ విషయం తెలుసుకోడానికి క్షణకాలం పట్టలేదు బ్రంటన్ కు.

ఆ తర్వాత పాల్ బ్రంటన్ భగవాన్ తో చాలాసార్లు సంభాషణలు జరిపాడు. వాటిల్లో కొన్ని

'ప్రపంచ భవిస్యత్తు ఎలా ఉంటుంది? 
ప్రపంచం క్లిష్ట సమయంలో ఉంది. దీనికి పరిష్కారం సూచించండి!'

'భవిష్యత్తు గురించి ఇప్పుడెందుకు ఆలోచన. ప్రపంచం గురించి మీరెందుకు విచారిస్తారు? మీకు వర్తమానం తెలియదు. వర్తమానం గురించి తెలియనివారు భవిష్యత్తును ఏం బాగు చేస్తారు? మీరు ప్రస్తుతాన్ని చక్కదిద్దుకోండి. భవిష్యత్తు తన పని తను చూసుకుంటుంది.'

'భగవాన్ ! ప్రపంచ దేశాల మధ్య ఇకనైనా మైత్రి నెలకొంటుందా? లేక ఇలాగే వినాశం వైపు పరుగులు తీస్తుందా?'

'పాల్! లోకాన్ని పాలించే వాడొకడున్నాడు. తను చూసుకుంటాడు ప్రపంచం సంగతి. ఈ ప్రపంచం బాధ్యత ఆయనది, ఆ పని నీది కాదు.'

'ఏమిటో భగవాన్ ! చుట్టూ చూస్తుంటే అంతా అయోమయం. ఎక్కడ సహాయానుభూతి కనిపించదు.'

'నీవు ఎంతో ప్రపంచమూ అంతే. నిన్ను నీవు అర్థం చేసుకోకుండా ప్రపంచాన్ని ఏం అర్థం చేసుకుంటావు! అయినా అది సత్యాన్వేషుల పని కాదు. అలాంటి ప్రశ్నలతో కాలాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దు. ముందుగా నీ వరకు సత్యాన్ని అన్వేషించు. సత్యాన్ని తెలుసుకో. తర్వాత నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ప్రాపంచిక సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చు. 

ప్రపంచంలో ఉన్నది నీవొక్కడివే కాదు. 
ప్రపంచం నీ వొక్కడితో లేదు. 
అసలు ప్రపంచానికి నీవు భిన్నం అని ఎందుకనుకుంటున్నావు?' 

అలా కాకుండా తాను ఆర్జించిన జ్ఞానాన్ని, ఆచరణలో పెట్టిన వాడే అసలైన జ్ఞాని. అటువంటి వాడు తనకు ఉన్న దానితో తృప్తి చెందుతాడు. లేని దాని కొరకు పాకులాడడు. తనకు ఎంత కావాలో అంతే సంపాదించుకుంటాడు. జీవితం తృప్తిగా, ప్రశాంతంగా గడుపుతాడు.

 శాస్త్రాలను చదివి సంపాదించిన జ్ఞానంతో ఆ జ్ఞానాన్ని ఆచరించి ఆర్జించిన విజ్ఞానంతో తృప్తి చెందిన మనసు కలవాడు, చలించని మనసు కలవాడు, ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకున్నవాడు, తన ఎదురుగా కనపడుతున్న బంగారం, రాయి, మట్టిబెడ్డలను ఒకేవిధంగా భావిస్తాడు. అటువంటి వాడిని యుక్తుడు అయిన యోగి అంటారు. 

యోగి అంటే ప్రాపంచిక విషయాలలో మునిగి ఉన్న జీవాత్మను వెనుక్కు మళ్లించి, తన నిజస్వరూపమైన ఆత్మ స్వరూపంతో, పరమాత్మలో కలపడానికి ప్రయత్నించేవాడు యోగి.
యోగము అంటే కలయిక. మనకు యోగులు చాలామంది కనపడతారు. కాని యోగులలో యోగయుక్తులు కొంతమందే ఉంటారు. అటువంటి 

యోగులు వేదాలు, శాస్త్రాలు అధ్యయనం చేసి అపారమైన జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెడతారు. దానినే విజ్ఞానం అంటారు. ఆ జ్ఞానవిజ్ఞానాల చేత తృప్తి పొందుతారు. 

జ్ఞానం అంటే వేదాలులు, శాస్త్రాలు, పురాణాలు చదివి సంపాదించినది. గురువుల వలన ఉపదేశము పొందినది, పెద్దల ద్వారా విన్నది. జ్ఞానం. విజ్ఞానం అంటే తానుపొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం. కొంత మంది శాస్త్రాలు వేదాలు చదివి తమకు అంతా తెలుసు అనుకుంటారు, అది తప్పు. నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినపుడే అది విజ్ఞానం అవుతుంది. 

పుస్తకాలు చూసి, తన తల్లి, అత్తగారు ఇతర పెద్దవారు చేస్తూ ఉండగా చూచి వంట చేయడం నేర్చుకోవడం జ్ఞానం, తానే స్వయంగా వంటచేసి, అందరికీ వడ్డించడం విజ్ఞానం. రెండూ అవసరమే. 

అలాగే ముందు పరమాత్మ గురించి, ఆయన తత్వము గురించి, ఆయనను పొందే మార్గం గురించి తెలసుకోవడం జ్ఞానం. తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించి పరమాత్మలో ఐక్యం కావడం విజ్ఞానం. వీటివలన ఆత్మతత్వాన్ని తెలుసుకొని తృప్తిపడిన వాడు యోగయుక్తుడు. 
తృప్తి అంటే తనకు లభించిన దానితో తృప్తి చెందడం. లేని దాని కొరకు ఆరాటపడకపోవడం.

కొంత మంది వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత చదువుతూనే ఉంటారు. వల్లెవేస్తుంటారు. వారికి తృప్తి అంటూ ఉండదు. కాని వాటిని ఆచరణలో పెట్టడం శూన్యం. వారికి కేవలం శాస్త్ర జ్ఞానం తప్ప వేరే ఉండదు. తృప్తి అనేది అసలే ఉండదు. తృప్తి లేని వాడికి ఎంత జ్ఞానం ఉన్నా ఏం లాభం లేదు. పైగా చదివింది చాలదు, ఇంకా ఇంకా చదవాలి అని నిరంతరం అశాంతితో బాధపడుతుంటాడు. అలా కాకుండా తాను ఆర్జించిన జ్ఞానాన్ని, ఆచరణలో పెట్టిన వాడే అసలైన జ్ఞాని. అటువంటి వాడు తనకు ఉన్న దానితో తృప్తి చెందుతాడు. లేని దాని కొరకు పాకులాడడు. తనకు ఎంత కావాలో అంతే సంపాదించుకుంటాడు. జీవితం తృప్తిగా, ప్రశాంతంగా గడుపుతాడు.
.