ఈ ఆర్టికల్ జీవితాంతం సేవ్ చేసి పెట్టుకోండి - Sridhar Nallamothu
ఇప్పుడు రాస్తున్న ఆర్టికల్ ఏదో పైపై చదివేసి వదిలేసేది కాదు. వీలైతే ఓ అరగంట దీని గురించి ఆలోచించండి. జీవితాంతం హృదయంలోకి ఇంకించుకోండి. దీని విలువ మీ వైబ్రేషన్స్ మారే కొద్దీ స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది.
"అన్ కండిషనల్ లవ్", "కంపాషన్" అనే పదాలను జనాలు అర్థం తెలీకుండా విచ్చలవిడిగా ఉపయోగిస్తుంటారు. దురదృష్టవశాత్తు డిక్షనరీలో కూడా తప్పుడు అర్థాలే కనిపిస్తుంటాయి.
అన్ కండిషనల్ లవ్ అంటే ఏంటి? ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇతరుల్ని ప్రేమించడం అని డిఫైన్ చేస్తుంటాం కదా! మొత్తం సొసైటీ నమ్ముతున్న ఈ డెఫినెషన్ శుద్ధ తప్పు. ఈ రాంగ్ ఇంటర్‌ప్రెటేషన్ వల్లనే.. నాకు హాని చేసే వాడిని నేనెలా ప్రేమిస్తాను అని రీజనింగ్‌కి అర్థం కాక, కన్విన్స్ అవక కేవలం కొటేషన్స్గా షేర్ చేసుకోవడానికి మాత్రమే "అన్ కండిషనల్ లవ్" అనే పదాన్ని వాడేస్తూ ఉంటారు.
యూనివర్శల్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీలో ఒక ప్యూర్ కాన్షియస్నెస్ అన్ కండిషనల్ లవ్ అనేది ఎలా వ్యక్తీకరిస్తుంది అన్నది వైబ్రేషనల్ ఎనర్జీ ఫార్మేట్లో నేను లోతుగా స్టడీ చేసినప్పుడు.. ET (ఎగ్ట్రా టెర్రిస్టీరియల్) చేత వాటిని ఛానలైన్ చేసే కొంతమందికి క్లారిఫై చెయ్యబడిన విషయం ఇది.
అసలు అన్ కండిషనల్ లవ్ అంటే ఇతరుల్ని ప్రేమించడం కాదు.. తన ప్రొజెక్షనే ఇతరులు అన్న సత్యాన్ని గుర్తించి.. తనని తాను అన్ని ప్రొజెక్షన్స్‌లో ఎలాంటి మానసిక గాయాలూ చేసుకోకుండా ప్రేమించుకోవడం! తన పట్ల తాను అపరిమితమైన ప్రేమని కలిగి ఉన్నప్పుడు ఆ సోల్ యొక్క హార్ట్ సెంటర్ ఓపెన్ అయి అది విశ్వంలోని హైయ్యర్ లెవల్ ఆఫ్ ఎనర్జీని వెదజల్లుతుంది. అప్పుడు ఆ వ్యక్తి సమక్షంలో ఉన్న ప్రతీ ఇతర ఎనర్జీ (ఇతర వ్యక్తులు, జీవులు.. అన్నీ) ఆ ఎక్కువ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ నుండి ఉత్ప్రేరితం అయి తామూ ఆ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా మారతాయి.
నువ్వు నిరంతరం నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ (స్వార్థం లేకుండా, స్వచ్ఛంగా), నీ సోల్‌ని తెలుసుకుంటూ బ్లిస్‌ని ఆస్వాదిస్తున్నప్పుడు అదే అన్ కండిషనల్ లవ్ అని అర్థం చేసుకోవాలి. నేను ఫలానాది సాధిస్తేనే నన్ను నేను ప్రేమించుకుంటాను, నాకు వెయ్యి లైకులు వస్తేనే నేను వర్తఫుల్.. ఇలా రకరకాల కండిషన్స్ పెట్టుకుని నిన్ను నువ్వు కండిషన్స్‌తో ప్రేమించుకోవడం మొదలుపెడితే నీ హార్ట్ సెంటర్, బ్రెయిన్ కోహరెన్స్ రెండూ అదుపు తప్పి నీ సమక్షంలో ఎలాంటి హైయ్యర్ ఎనర్జీ లేకుండా పోయి జస్ట్ ఆకారానికి లావుగానో, సన్నగానో ఉన్న ఓ శరీరంగా మాత్రమే నువ్వు మిగులుతావు. నీలో ఎలాంటి మాగ్నటిక్ పవర్ మిగిలి ఉండదు.
అలాగే కంపాషన్ అంటే.. ఇతరుల పట్ల జాలి చూపించడం అని తప్పుడు అర్థంలో చెప్పబడుతోంది. చేసే పని పట్ల పాషన్ కలిగి ఉన్న వ్యక్తి ఎనర్జీస్ పీక్‌లో ఉంటాయి. ఆ పాషన్ మన సమక్షంలోకి వచ్చే ప్రతీ ఒక్కరికీ ప్రసారం అవుతూ ఉంటుంది. ఎవరైతే చాలా స్వల్ప స్థాయిలో ఎనర్జీని (విచారంలో ఉండడం గానీ, బాధల్లో ఉండడం గానీ) కలిగి ఉంటారో వారికి ఈ ఎక్కువ వైబ్రేషనల్ ఎనర్జీ కలిగి ఉన్న వ్యక్తుల సమక్షంలో లభించే ఊరటా, మోటివేషనే కంపాషన్.
ఈ రెండూ విషయాలూ జీవితాంతం గుర్తుంచుకోండి. జీవితంలో కొత్త డైమెన్షన్ పరిచయం అవుతుంది.
- Sridhar Nallamothu
#nSridharWritings
No comments:
Post a Comment