Saturday, November 12, 2022

మెలకువతో ఉన్నప్పుడు అదీ ఆలోచనతో ఉన్న మనసు మాత్రమే నాకు తెలుస్తుంది.. ఆలోచన లేని మనసు స్వరూపం ఎలా ఉంటుంది.. దాన్ని ఎలా తెలుసుకోవాలి ?

 💖💖💖
       💖💖 *"380"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
    

*"మెలకువతో ఉన్నప్పుడు అదీ ఆలోచనతో ఉన్న మనసు మాత్రమే నాకు తెలుస్తుంది.. ఆలోచన లేని మనసు స్వరూపం ఎలా ఉంటుంది.. దాన్ని ఎలా తెలుసుకోవాలి ?"*
**************************

*"జపం అంటే ఇతర తలుపులను వదిలి మనసు ఒకదాన్ని పట్టుకోవటం. అలా చూసే జపం ధ్యానానికి దారితీస్తుంది. ధ్యానస్థితి ఆత్మ భవానికి కారణమవుతుందని శ్రీరమణమహర్షి చెప్పారు. నిద్రలేచిన తర్వాతనే ఎవరికైనా ఆలోచన మొదలవుతుంది. మనకు తెలిసింది ఆలోచనలతో ఉన్న మనసు మాత్రమే ! అందుకే ఆలోచనే మనసు స్వరూపం అని మనం అనుకుంటున్నాం. మనసు యొక్క మరో (స్వ) స్వరూపం మనకి తెలియటంలేదు. దీపానికి వెలుతురు, వేడి రెండూ ఉంటాయి. చంటి పిల్లవాడికి వెలుతురు మాత్రమే తెలుసు. దాని వేడి తెలియదు. ఒక సారి పట్టుకుంటేనో, తల్లి చెప్తేనో అది తెలుసుకుంటాడు. మనసు విషయంలో మన పరిస్థితి కూడా అంతే. ఆలోచనలు లేని మనసు ఎలా ఉంటుందో మనకి తెలియదు. పిట్టగోడలేని మేడపై చంటి పిల్లవాడు అంబాడుతూ అంచువరకు వరకు వస్తాడు. అక్కడి నుండి పడితే ప్రమాదమని అతనికి తెలియదు. ఒకసారి పడినా, లేక ఎవరైనా వాడికి తెలియజేసినా అతనికి ఆ బుద్ధి కలుగుతుంది. ఈ ప్రపంచం అశాశ్వతమని, మన బుద్ధికి తెలియాలంటే మనమే దాన్ని స్వయంగా కనుక్కోవాలి. లేదా ఎవరైనా దర్శించినవారు చెప్పేది విని విశ్వసించాలి !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
            🌼💖🌼💖🌼
                  🌼🕉️🌼
                

No comments:

Post a Comment