1811. 1-8. 291222-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*విశ్వాసం!*
➖➖➖✍️
---చాగంటి వారి ప్రవచనం నుండి.
*విశ్వాసం గురించి రామకృష్ణ పరమహంస ఒక కథ చెపుతారు...*
*వెనుకటికి దక్షిణ సముద్రం దగ్గర ఒక భక్తుడు నిలబడి ‘ఈ సముద్రమును దాటి భారత దేశమునకు వెళ్ళాలి.’*
*’ఓడ వెళ్ళిపోయింది. ఎలా.,.. ‘అని కంగారుపడుతున్నాడు.*
*ఆ సమయంలో అటుగా ఒక సిద్ధ పురుషుడు వెళ్ళిపోతున్నాడు.*
*’ఏమి నాయనా... అలా కంగారు పడుతున్నావు...’అని అడిగాడు.*
*’అంటే ఏమి లేదండి... సముద్రం మీద ఓడ వెళ్ళిపోయింది…. ఇపుడు నేను ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. మళ్ళీ రేపటి వరకు ఓడ లేదు! అందుకని కంగారు పడుతున్నాను.’ అన్నాడు.*
*అపుడు సిద్ధుడు ‘నీవేమి కంగారుపడకు.’ అని ఒక కాగితం మీద రాసి, మడిచి చేతిలో పేట్టి... ‘ఇది విప్పి చూడకు. చూడకుండా చేత్తో పట్టుకో. పట్టుకుని ఈ సముద్రం మీద నడిచి వెళ్ళిపో. నువ్వు వెళ్లిపోతావు. నీళ్ళల్లో పడవు. వెళ్ళు...’ అన్నాడు.*
*సిద్ధపురుషుడు అంటే మాటలు కాదు కదా..! ‘ఈయన ఇచ్చాడు కాబట్టి ఇది నన్ను రక్షించి తీరుతుంది.... నేను మునగను..’ అనుకున్నాడు.*
*అంటే ఆ నీళ్ళమీద పరుగెత్తడం మొదలుపెట్టాడు.*
*అందులో దిగిపోకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకా కొద్ది దూరంలో ఒడ్డు కనిపించింది. అపుడు ఆశ్చర్యం వేసింది.*
*ఇంతలా నన్ను నీటిమీద పరుగెట్టించిన ఈ కాగితంలో ఉన్న రహస్యం ఏమిటి..?’ అని అనుకున్నాడు.*
*ఒకసారి ఆ కాగితంలో ఏమి రాసి ఉన్నదో చూడాలని అనుకున్నాడు.*
*అనుకుని ఆ కాగితం విప్పాడు. ఆ కాగితంలో 'శ్రీరామ' అని రాసి ఉంది.*
*’ఈ నామమా నన్ను పరుగెత్తించింది' అన్నాడు.*
*వెంటనే మునిగిపోయాడు. విశ్వాసం పోయింది. కొట్టుకుపోయాడు.*
*విశ్వాసం ఉన్నంతసేపు వాడు మహా జ్ఞానితో సమానమై పోయాడు.*
*అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామం చెప్పగలిగితే జ్ఞానితో సమానమైపోతావు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment