160123a1823. 170123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀741.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*శరీరం కేవలం గూడు. అది ఆత్మకు ఆవాసం మాత్రమే..!*
*మానవజన్మ కర్మబద్ధం. కనుక ప్రపంచంలో కర్మనిష్ఠతో ఉండాలి. కానీ అంతరంగంలో బ్రహ్మనిష్ఠలో ఉండాలి. ఇదే మానవ జన్మకున్న విశిష్టత.*
*సమ్యక్ దృష్టితో ప్రాపంచిక కర్తవ్యాలు నిర్వర్తించాలి. మేను మాత్రమే నేను కాదు. ఉన్నది ఒక్క నేనే. మూడు అవస్థలలో వున్న నేను అనే చైతన్యమే.*
*హృదయం వెన్న వలె ఉండాలి. కాఠిన్యంతో కాకుండా… కారుణ్య హృదయంతో ప్రపంచంలో సంచరించాలి.*
*సిద్ధాంత రాద్ధాంతాలు, వాదోపవాదాలు లేకుండా మనీషతో వుండాలి. మనీష అంటే స్థిరప్రజ్ఞ, స్థిమిత బుద్ధి. ఇది కాదు,ఇది కాదంటూ మనసును ఖాళీ చేసుకుంటూ పూర్ణ చైతన్యంతో ప్రవర్తించాలి.*
*శాస్త్రాధ్యయనంతో మనసును పరిమళ భరితం చేసి, స్వాదువుగా తీర్చిదిద్దుకోవాలి. జడాత్మక దేహం అనుభవించే ఏ వికారమూ నీది కాదు. ఎరుకతో ఉండాలి.*
*దేనికీ అంటక, దేనినీ అంటించుకొనక కాంతి కటకం వలె, తామరపత్రం మీద నీటి బిందువువలె, తెరమీద బొమ్మవలె ఉండాలి. అంతా బ్రహ్మమే అనుకో గలగటమే అసలైన ముక్తి!!*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment