Monday, January 16, 2023

****శరీరం కేవలం గూడు. అది ఆత్మకు ఆవాసం మాత్రమే..!

 160123a1823.   170123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀741.
నేటి…

                *ఆచార్య సద్బోధన:*
                   ➖➖➖✍️

*శరీరం కేవలం గూడు. అది ఆత్మకు ఆవాసం మాత్రమే..!*

*మానవజన్మ కర్మబద్ధం. కనుక ప్రపంచంలో కర్మనిష్ఠతో ఉండాలి. కానీ అంతరంగంలో బ్రహ్మనిష్ఠలో ఉండాలి. ఇదే మానవ జన్మకున్న విశిష్టత.* 

*సమ్యక్‌ దృష్టితో ప్రాపంచిక కర్తవ్యాలు నిర్వర్తించాలి. మేను మాత్రమే నేను కాదు. ఉన్నది ఒక్క నేనే. మూడు అవస్థలలో వున్న నేను అనే చైతన్యమే.*

*హృదయం వెన్న వలె ఉండాలి.  కాఠిన్యంతో  కాకుండా…  కారుణ్య హృదయంతో ప్రపంచంలో సంచరించాలి.* 

*సిద్ధాంత రాద్ధాంతాలు, వాదోపవాదాలు లేకుండా మనీషతో వుండాలి. మనీష అంటే స్థిరప్రజ్ఞ, స్థిమిత బుద్ధి.  ఇది కాదు,ఇది కాదంటూ మనసును ఖాళీ చేసుకుంటూ పూర్ణ చైతన్యంతో ప్రవర్తించాలి.*

*శాస్త్రాధ్యయనంతో మనసును పరిమళ భరితం చేసి, స్వాదువుగా తీర్చిదిద్దుకోవాలి. జడాత్మక దేహం అనుభవించే ఏ వికారమూ నీది కాదు. ఎరుకతో ఉండాలి.*

*దేనికీ అంటక, దేనినీ అంటించుకొనక కాంతి కటకం వలె, తామరపత్రం మీద నీటి బిందువువలె, తెరమీద బొమ్మవలె ఉండాలి. అంతా బ్రహ్మమే అనుకో గలగటమే అసలైన ముక్తి!!*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment