Tuesday, February 28, 2023

🍃🥀మన శరీరాన్ని ఎలా వాడుకోవాలి - నిత్య జీవితం లో మనమేమి చేయాలి *💦🎊

 *🍃🥀మన శరీరాన్ని ఎలా వాడుకోవాలి - నిత్య జీవితం లో మనమేమి చేయాలి *💦🎊


*🍃🥀ఈ శరీరం ఎప్పుడూ ఇలాగే ఉండేది కాదు, ఇప్పుడు అందంగా, బిగువుగా, ఆకర్షణీయంగా ఉన్న శరీరం కొంతకాలం గడిచేసరికి సడలిపోతుంది, కృశించిపోతుంది, అందవిహీనమౌతుంది, చివరకి రాలిపోతుంది.*
*ఈ విషయాన్ని మనం మరువరాదు, ఈ శరీరం నేను కాదు.*
*🍃🥀ఇది కేవలం నేను వాడుకొనే పరికరం మాత్రమే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.*
*నా వాచీని నేను ఎలా జాగ్రత్తగా వాడుకుంటున్నానో, దానిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నానో, అది చెడిపోతే ఎలా రిపేరు చేయించుకుంటున్నానో, కొత్త పార్టులు అమర్చుకుంటున్నానో, అలాగే ఈ శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచాలి.*

*🍃🥀దుస్తులు వేయాలి, పోషించాలి, అందంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, అవసరమైతే చెడిపోయిన అవయవాలను తొలగించి కొత్త అవయవాలను వేయాలి.*
  *అయితే ఒక ముఖ్య విషయాన్ని మాత్రం మరచిపోకూడదు.*
*🍃🥀ఇది మన కోసం వాడుకోవాల్సిన పరికరమని, ఒక ముఖ్యమైన పని కొరకు వినియోగించవలసిన సాధనమని, ఇది శాశ్వతంగా ఉండేది కాదని, కనుక తెలివిగా, జాగ్రత్తగా వినియోగించు కోవాల్సినదని జ్ఞాపకం ఉంచుకోవాలి.*

*🍃🥀సత్యశోధనకై, సమాజ శ్రేయస్సుకై, పరమాత్మ అనుగ్రహానికై దీనిని వినియోగించాలి. అంతే గాని శరీరాన్ని పోషించటమే మానవ జీవితం యొక్క పవిత్ర కర్తవ్యం కాదు.*
*ఏదైనా ఒక వస్తువును పనికి వచ్చినంత కాలం వాడుకుంటాం. పనికి రాకపోతే పారవేస్తాం...*

*🍃🥀అలా పనికిరాక పారవేసే చిత్తు కాగితాలను గాని, ప్లాస్టిక్ వస్తువులను గాని, ఇనుప ముక్కలను గాని, బల్బులను గాని ఎవరో ఒకరు కొంటారు.*

*🍃🥀అలాగే ఏ జంతువన్నా చనిపోతే వాటి మాంసాన్నో, వాటి చర్మాన్నో, దంతాలనో ఉపయోగించుకుంటాం.*

*🍃🥀కాని మనిషి శరీరం మాత్రం ఎవరూ కొనరు. ఎదురు డబ్బు ఇచ్చినా తీసుకోరు.*

*🍃🥀ఇలాంటి పనికిరాని మురికి మూట అయిన ఈ శరీరం కోసం బ్రతికినన్నాళ్ళు తపించి పోవటం, ఇతరుల నెత్తిన చెయ్యి పెట్టటం, గొంతులు కొయ్యటం, యుద్ధాలు చెయ్యటం, దారుణంగా హత్యలు చెయ్యటం జరుగుతుంటాయి...*

*🍃🥀ప్రాణం పోయిన తర్వాత దీనికి పైసా విలువలేదు. ఇంటిలో ఎవరూ దీని క్షేమాన్ని గురించి పట్టించుకోరు.*

*🍃🥀భార్య కూడా భయపడుతుంది. ఈ కట్టెను మండే కట్టెల మీదకు చేర్చి అడ్డం వదలించుకుంటారు.* 

*🍃🥀మరి ఇట్టి శరీరాన్ని చూసుకొని, దీని కోసం విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం, మానవ జీవిత పరమార్థాన్ని సాధించటానికి వినియోగించకపోవటం తెలివైనపనేనా...*

*🍃🥀కనుక ప్రాణం పోతే ఎందుకూ పనికిరాని ఈ శరీరాన్ని ప్రాణం ఉన్నంత కాలం ఎలా ఉపయోగించుకోవాలో, ఏమి సాధించుకోవాలో అనే విషయాన్ని నిరంతరం విచారణ చేసుకో. శరీరాభిమానం తగ్గించుకో, నిజంగా శరీరాభిమానమే మనకు బంధం అని గ్రహించాల్సి ఉంది.*

*🍃🥀 నిమ్మలంగా ఉండాలి. మనశ్శాంతిగా ఉండాలి అనుకునే వాళ్ళకే ఏదొక దరిద్రం వచ్చి పడుతుంది..*

*🍃🥀ఇక ఏదో గోడవైతే కాని నోరు దురదతో తిట్టే వాళ్లకు ఏదో కావాలి అనుకునేవాళ్ళకి లైఫ్ అంతా తృప్తి లేకుండా అశాంతితో ముగింపు చేసుకుంటారు.. కొందరికి జీవితంలో దేవుడు అన్ని ఇచ్చినా, ( ఉన్నా ) గందరగోళం చేసుకుంటారు కొందరు..*

*🍃🥀కొందరు వాళ్లు ఏనాడు ఒక్కరోజు అయిన ఎవరి గూర్చి ఆలోచించకుండా నేను నా ఇళ్ళు నా సంసారం అని తిని పడుకోవడంతోనే జన్మ అంతా గడుపుకుంటారు.. అది వారికి దేవుడిచ్చిన శాపమా లేక వీళ్లు చేసుకున్న పాపమో తెలియదు..*

*🍃🥀ఇంకా కొందరి జీవితాలు ఇతరులగూర్చి తెలుసుకోవడం వాళ్ళ జీవితాల్లో తొంగి చూసి ఏదో తెలియని ఈర్ష, కళ్ల ఎదుట మంచిని సంతోషాన్ని తట్టుకోలేరు..*

*🍃🥀అందుకే... దేవుడా ఈ మానవ జన్మని సార్ధకం చేసుకోవాలనే వరం అందరికి ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..*

No comments:

Post a Comment