కనపడుట లేదు....👸👫
మాయమై పోతున్న తెలుగు అమ్మాయి,
ఏమండి ఈ మద్యన ఎవరైనా మా తెలుగు అమ్మాయిని చూసారా ? చూస్తే చెప్పండి *
అయ్యా ! మీకు పుణ్యం ఉంటుంది *
ఓహో ! మా తెలుగు అమ్మాయి గురించి మీకు తెలియదుకదూ ! ఆనవాలు చెపుతా, వినండీ *
✔️ మా అమ్మాయి అమాయకంగా ఉంటుంది *
✔️ చేతినిండా గాజులు వేసుకుని లక్ష్మీదేవి లాగ ఉంటుంది *
✔️ రెండు చేతులకూ గోరింటతో *(మెహెంది కాదు),* పాదములకు పారాణితో అందంగా ఉంటుంది *
✔️ మా అమ్మాయి నిండుగా పరికిణి కట్టుకుని ఓణి వేసుకుని ఉంటుంది *
✔️ తలకు చమురు రాసుకుని చక్కగా దువ్వి
రొండు జడలు వేసుకుంటుంది *
✔️ తలనిండా పూలు పెట్టుకుని, వాలు జడకు జడ కుప్పులు వేసుకుంటుంది *
✔️ చారడేసి కళ్లకు కాటుక పెట్టుకుని, నుదుటిన పావళా కాసంత చంద్రబింబం లాంటి *ఎఱ్ఱటి కుంకుమ బొట్టు* పెట్టుకుంటుంది (బొట్టు బిళ్ళ కాదు).
✔️ కాళ్లకు మువ్వల అందెలతో *
(కాలి పట్టీలు అనకూడదు)* ఘల్లుఘల్లు మంటూ ఇల్లంతా సందడిగా తిరుగుతుంది *
✔️ ముద్దబంతి పువ్వులా, చిదిమి
దీపము పెట్టుకునే లాగున, ఇంటికి కళగా ఉంటుంది *
ఇలాంటి అమ్మాయి మీకేక్కడైనా కనిపించిందా ? అగుపించినదా? మాకైతే గత పాతిక సంవత్సారాలుగా కనిపించడం లేదు.
పండక్కో, పబ్బానికో, అక్కడ్డక్కడ తళుక్కున
మెరిసి మాయమైపోద్ది అంతే !!!
😢
..........
దానికి నేను రాసిన సమాధానం ఇది 👇
ఆమె ఉంది కానీ కనిపించే పరిస్థితి లేదు.
ఎందుకంటే తెలుగబ్బాయిని వెతుకుతూ వెళ్ళి, ఇంతవరకూ రాలేదు *
తెలుగబ్బాయి ఎవరా అనా?
ఆనవాళ్ళు చెపుతాను *
ధైర్యంగా ముందుకు పోయే తత్వం *
ఠీవిగా, పంచె, లాల్చీ, కండువాలతో ఉంటాడు *
నడిచొచ్చే విష్ణుమూర్తిలా ఉంటాడు *
కోరమీసంతో, కోటేరు ముక్కుతో ఉంటాడు *
అందరినీ వరసలు కలిపి,
నవ్వుతూ పలకరిస్తుంటాడు *
తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడుతుంటాడు *
చక్కని కుంకుమబొట్టుతో మెరిసిపోతుంటాడు *
తల్లిదండ్రులను అమ్మా నాన్నా అని నోరారా పిలుస్తాడు. అత్తా, మామా, బాబాయ్ లాంటి భారతీయమైన పిలుపులే వాడుతాడు.
అనవసరంగా మ్లేచ్ఛభాష వాడడు *
అడగకుండానే తోటివారికి తోచిన విధంగా
సాయం చేస్తుంటాడు *
చూడటానికి రెండు కళ్ళూ, చెప్పటానికి
మాటలూ చాలవు అన్నట్టుగా ఉంటాడు *
చూసి చాలా కాలమైంది *
తననే వెతుకుతూ వెళ్ళి ఉంటుంది తెలుగమ్మాయి * ఒక్కటి మాత్రం నిజం. వస్తే ఎప్పటికైనా వీళ్ళు కలిసే వస్తారు. రావాలనే ఆశిద్దాం 👍🙏👌👍
సేకరణ
No comments:
Post a Comment