Thursday, February 2, 2023

గురుదేవులు:: అసలు "బాధానుభవం" అనేటువంటిది జీవుని యొక్క పురోగమనకు సహాయం చేస్తుందని గదా సిద్ధాంతం! ఈ "బాధానుభవం" ద్వారానే జీవుడు ఉద్ధరింపబడతాడని గదా సిద్ధాంతం! అటువంటప్పుడు, అలా నలుగుడు లేకుండగా– ఆ బురుజు దగ్గరకు చేరినటువంటి గింజలకు ఏమి వినియోగం ఉంటుంది అంటే, బాబా తెలియజేసారు:

 *అవతార పురుషుడు సృష్టికి కేంద్రమై ఉండడము అంటే...*
*Avatar, Being the Center of the Universe means...*
*~~~*
       -  సద్గురు శ్రీ మెహెర్
          చైతన్యజీ మహరాజ్

(Part - 10 )

*గురుదేవులు::   అసలు "బాధానుభవం" అనేటువంటిది జీవుని యొక్క పురోగమనకు సహాయం చేస్తుందని గదా సిద్ధాంతం! ఈ "బాధానుభవం" ద్వారానే జీవుడు ఉద్ధరింపబడతాడని గదా సిద్ధాంతం! అటువంటప్పుడు, అలా నలుగుడు లేకుండగా– ఆ బురుజు దగ్గరకు చేరినటువంటి గింజలకు ఏమి వినియోగం ఉంటుంది అంటే, బాబా తెలియజేసారు:*
   "అది కేవలము 
    నీకు అర్థమవ్వడం కోసము
    ఉదాహరణగా చెప్పిందే
    గానీ, అది పారమార్థిక
    సత్యం కాదు"
*అని తెలియజేసారు.*

*ఎవరైతే సృష్టికి కేంద్రమై ఉన్నటువంటి అవతార పురుషుణ్ణి చేరి ఉంటారో, వారికి-*
  -  ఏ విధమైనటువంటి
     సాధన గానీ,
 -   ఏ విధమైనటువంటి
     నలుగుడు గానీ, అంటే
     నలిగి ఆ పొల్లు
     పోగొట్టుకోవలసినటువంటి
     అవసరము గానీ
     లేదనిన్నీ,
*ఆయనను చేరడము ద్వారానే, చేరడము కారణముగానే "సంస్కారములు" అన్నీ వాటంతట అవి రహితమైపోతవనిన్నీ తెలియజేసారు బాబా.*

*ఆ విధముగా, సృష్టికి కేంద్రమైనటువంటి అవతార పురుషుణ్ణి చేరినటువంటి ఆత్మలు– సంస్కార భూయిష్టమైనటువంటివా, కర్మ భూయిష్టమైనటువంటివా అని విచారించనవసరం లేదు.*
        _రోగగ్రస్థుడైనటువంటి వ్యక్తి, సమర్థమైనటువంటి ఒక వైద్యుని దగ్గరకు చేరితే, ఇంక ఆ రోగమేం చేస్తుంది ఆ వ్యక్తిని? అదే విధముగా,_ 
    _*సమర్ధుడైనటువంటి*_
    _*ఈ అవతార పురుషుణ్ణి*_
    _*ఆశ్రయించుకున్నటువంటి*_
    _*వ్యక్తులకు,ఈ కర్మలు,*_
    _*ఈ సంస్కారములు*_
    _*ఏమి చేస్తవి?*_  
   _*ఏమి చేయగలవు?*_
_(ఏమీ చేయలేవు!) అందుకు కూడా కారణమున్నది అని చెప్పారు బాబా._

*(ఏమిటంటే,) జీవుడు అనుభవించడానికి కారణమైనటువంటి "సంస్కారము" తనే కనుక, అంటే అవతారుడే గనుక– ఎందుకని (కారణము) అవతారుడయ్యాడు? ఏం డాక్టరుగారూ! ఆయన ఎందుకు కారణమయ్యాడు? సంస్కారమే తానై ఎందుకు ఉన్నాడు? (అంటే)*
  _ఆదిలో తానే యిది_
  _ఊహించుకున్నాడు_
  _గనుక,_
      _(తాను)_
      _ఊహించుకున్నటువంటి_
      _"ఊహే"- చివరకు_
      _సంస్కారమై,_
      _ఈ జీవితంగా_
      _వ్యక్తమవ్వడం,_
      _ఈ జీవులు_
      _ఈ విధమైనటువంటి_
      _జీవితానుభవాల్ని_
      _అనుభవించడం_
      _అనేటువంటిది_
      _జరుగుతున్నది కనుక,_
   _"సంస్కారము" కూడా_
   _తానే గనుక,_ 
       _తనను తాను_
       _ఏమి చేసుకోగలడు_
       _గనుక?_
*అందుచేత, ఆయనను ఆశ్రయించినటువంటి జీవులకు ఈ సంస్కారములు, కర్మలు ఏమీ చేయవు.*

*మరి మానవులందరూ ఏదో రూపంలో ఆయనను ఆశ్రయించినటువంటి వారే కదా? అవతార పురుషుడైనటువంటి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారే గదా? మరి వారికి ఈ కష్టములు, నష్టములు ఎందుకు సంప్రాప్తమౌతున్నవి? ఈ "కర్మానుభవం" అనేటువంటిది ఎందుకు తప్పడం లేదు అంటే–...*
   
     
To be contd.....

No comments:

Post a Comment