*అవతార పురుషుడు సృష్టికి కేంద్రమై ఉండడము అంటే...*
*Avatar, Being the Center of the Universe means...*
*~~~*
- సద్గురు శ్రీ మెహెర్
చైతన్యజీ మహరాజ్
(Part - 8)
*(ప్రశ్న:: _"మనస్సు" అంటే ఏమిటి? "హృదయం" అంటే ఏమిటి? వాటి సమన్వయం వల్ల ఏం జరుగుతుంది ??_*
(Or)
_*"కుండలినీ శక్తి" యొక్క అవసరం ఏమిటి? ఈ శక్తి జాగృతం అవ్వడం ద్వారా జరిగేది ఏమిటి??*_
*గురుదేవులు:: ఏమిటీ "మనస్సు"? ఏమిటీ "హృదయము"? అంటే–*
"భగవంతుణ్ణి ఆశ్రయించాను,
ఆయన ఆశ్రయములో
నేను
అనుగ్రహింపబడుతున్నాను"
అనేటువంటి
ఎరుకతో కూడినటువంటి
ఏ మనస్సు కలిగినటువంటి
వ్యక్తి ఉంటాడో,
అది మనస్సు.
"ఏ వ్యక్తికి
నేను సహాయము చేసి
నా యొక్క ప్రేమానుగ్రహాన్ని
అనుగ్రహించాను"
అనేటువంటి ఎరుక
అవతార పురుషునికి
ఉంటుందో,
అది హృదయము.
*ఈ విధముగా, ఒక వ్యక్తిలో (అంటే)– అవతార పురుషుణ్ణి ఆశ్రయించుకొని, ఆరాధిస్తూ ఉండేటువంటి వ్యక్తిలో– ఈ రెండూ, (అంటే) మనస్సూ హృదయమూ సంగమిస్తవి.*
_మనస్సూ, హృదయమూ సంగమిస్తున్నవి అంటే, ఐక్యమౌతున్నవి అంటే– జీవుడు-బ్రహ్మము లేదా జీవుడు-దేవుడు ఏకమౌతున్నారు అని అర్థము._
*తాంత్రికోపాసనలో కూడా, శ్రీవిద్యోపాసనకు సంబంధించినటువంటి తాంత్రికోపాసనలో కూడా, ఇదే చెప్పబడుతుంది::*
_పరిమిత అనుభవం కలిగినటువంటి జీవుడు, దేవునితో ఐక్యమవ్వాలి అంటే_
జీవుని యొక్క స్థితి
అధోముఖములో
ఉన్నటువంటిది;
అంటే
సంస్కార
భూయిష్టమైనటువంటి
కర్మానుభవాన్ని
అనుభవిస్తున్నటువంటిది,
జీవుని యొక్క స్థితి.
_(మరి) భగవంతుని యొక్క స్థితియో?_
అనంతమైనటువంటి
దివ్యానందములో
ఓలలాడుతుండేటువంటి
స్థితి, భగవంతుని యొక్క
స్థితి.
_ఈ జీవుని యొక్క స్థితి "మూలాధారం" దగ్గర ప్రతిష్ఠితమై ఉన్నదనిన్నీ, భగవంతుని యొక్క స్థితి "సహస్రారము"లో ప్రతిష్ఠితమై ఉన్నదనిన్నీ, వారి యొక్క తత్వము._
_అందుచేత ఈ జీవునకు, దేవునకు ఎరుక కావాలి అంటే– ఈ వ్యక్తిలోనే, ఆ జీవునిలోనే ఉన్నటువంటి ఒక శక్తిని, అంటే "కుండలినీ" అని చెప్పబడేటువంటి ఒక శక్తిని జాగృత పరచడం ద్వారా, మేల్కొల్పడము ద్వారా– ఇటు జీవునకు, అటు దేవునకు "ఎరుక" కలిగి, ఉభయులూ ఏకస్థులౌతారట. అంటే జీవ బ్రహ్మైక్యానుసంధానము అనేటువంటిది సిద్ధిస్తుందట._
*(ప్రశ్న:: _"జీవుని యొక్క స్థాయి" అత్యంత నిమ్న స్థాయి అంటారు ఎందుకని??_)*
*గురుదేవులు:: ...*
To be contd.....
No comments:
Post a Comment