Thursday, February 2, 2023

ప్రశ్న:: _"మనస్సు" అంటే ఏమిటి? "హృదయం" అంటే ఏమిటి? వాటి సమన్వయం వల్ల ఏం జరుగుతుంది ??_* (Or) _*"కుండలినీ శక్తి" యొక్క అవసరం ఏమిటి? ఈ శక్తి జాగృతం అవ్వడం ద్వారా జరిగేది ఏమిటి??

 *అవతార పురుషుడు సృష్టికి కేంద్రమై ఉండడము అంటే...*
*Avatar, Being the Center of the Universe means...*
*~~~*
       -  సద్గురు శ్రీ మెహెర్
          చైతన్యజీ మహరాజ్

(Part -  8)

*(ప్రశ్న:: _"మనస్సు" అంటే ఏమిటి? "హృదయం" అంటే ఏమిటి? వాటి సమన్వయం వల్ల ఏం జరుగుతుంది  ??_*
            (Or)
_*"కుండలినీ శక్తి" యొక్క అవసరం ఏమిటి? ఈ శక్తి జాగృతం అవ్వడం ద్వారా జరిగేది ఏమిటి??*_

*గురుదేవులు::   ఏమిటీ "మనస్సు"? ఏమిటీ "హృదయము"? అంటే–*
  "భగవంతుణ్ణి ఆశ్రయించాను,
  ఆయన ఆశ్రయములో
  నేను
  అనుగ్రహింపబడుతున్నాను"
  అనేటువంటి
  ఎరుకతో కూడినటువంటి
  ఏ మనస్సు కలిగినటువంటి
  వ్యక్తి ఉంటాడో, 
  అది మనస్సు.  
      "ఏ వ్యక్తికి
       నేను సహాయము చేసి
       నా యొక్క ప్రేమానుగ్రహాన్ని
       అనుగ్రహించాను"
       అనేటువంటి ఎరుక
       అవతార పురుషునికి
       ఉంటుందో,
       అది హృదయము.
*ఈ విధముగా, ఒక వ్యక్తిలో (అంటే)– అవతార పురుషుణ్ణి ఆశ్రయించుకొని, ఆరాధిస్తూ ఉండేటువంటి వ్యక్తిలో– ఈ రెండూ, (అంటే) మనస్సూ హృదయమూ సంగమిస్తవి.*
          _మనస్సూ, హృదయమూ సంగమిస్తున్నవి అంటే, ఐక్యమౌతున్నవి అంటే– జీవుడు-బ్రహ్మము లేదా జీవుడు-దేవుడు ఏకమౌతున్నారు అని అర్థము._

*తాంత్రికోపాసనలో కూడా, శ్రీవిద్యోపాసనకు సంబంధించినటువంటి తాంత్రికోపాసనలో కూడా, ఇదే చెప్పబడుతుంది::*
           _పరిమిత అనుభవం కలిగినటువంటి జీవుడు, దేవునితో ఐక్యమవ్వాలి అంటే_
    జీవుని యొక్క స్థితి
    అధోముఖములో
    ఉన్నటువంటిది; 
        అంటే
        సంస్కార
        భూయిష్టమైనటువంటి
        కర్మానుభవాన్ని
       అనుభవిస్తున్నటువంటిది,
        జీవుని యొక్క స్థితి.
_(మరి) భగవంతుని యొక్క స్థితియో?_
     అనంతమైనటువంటి
     దివ్యానందములో
     ఓలలాడుతుండేటువంటి
     స్థితి, భగవంతుని యొక్క
     స్థితి. 
_ఈ జీవుని యొక్క స్థితి "మూలాధారం" దగ్గర ప్రతిష్ఠితమై ఉన్నదనిన్నీ, భగవంతుని యొక్క స్థితి "సహస్రారము"లో ప్రతిష్ఠితమై ఉన్నదనిన్నీ, వారి యొక్క తత్వము._
         _అందుచేత ఈ జీవునకు, దేవునకు ఎరుక కావాలి అంటే– ఈ వ్యక్తిలోనే, ఆ జీవునిలోనే ఉన్నటువంటి ఒక శక్తిని, అంటే "కుండలినీ" అని చెప్పబడేటువంటి ఒక శక్తిని జాగృత పరచడం ద్వారా, మేల్కొల్పడము ద్వారా– ఇటు జీవునకు, అటు దేవునకు "ఎరుక" కలిగి, ఉభయులూ ఏకస్థులౌతారట. అంటే జీవ బ్రహ్మైక్యానుసంధానము అనేటువంటిది సిద్ధిస్తుందట._

*(ప్రశ్న:: _"జీవుని యొక్క స్థాయి" అత్యంత నిమ్న స్థాయి అంటారు ఎందుకని??_)*

*గురుదేవులు:: ...*
     

To be contd.....

No comments:

Post a Comment