Thursday, March 23, 2023

:::::: వెను తిరగడం. ::::::

 *:::::::: వెను తిరగడం. ::::::::::::::::*
      మనకి సమస్యలు వస్తాయి. ఇవి దారికి అడ్డంగా నిలబడి ముందుకు వెళ్ళనివ్వవు. అప్పుడు మనం వెనక్కో, ప్రక్కకొ వెళతాం.
      సరిగ్గా ఇలాగే మానసిక సమస్య ఎదురైనప్పుడు వెన్నక్కి వెళ్తాము. మన వెనుక ఏమి వుంది? .పశితనం వుంది.
           అనగా మానసిక సమస్య వచ్చినప్పుడు మనం వెన్నక్కి అనగా పశివాళ్ళం అవుతాము.
        పశివాడుగా ఆ సమస్యను చూస్తాం. అప్పుడది  మరింత పెద్దదిగా కనిపిస్తుంది. మన ఆలోచన ఆగి పోతుంది.
    అప్పుడు పశివాళ్ళలాగా దుఃఖిస్తాం, ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తాము. బుజ్జగింపు, సానుభూతి కై ఆరాట పడతాము.
      పెద్ద వాళ్ళంగా ఈ పనులు చేయ లేము కనుక  పశివాళ్ళలాగా అవుతాము.
       మన మనస్సు ఆధారపడటానికి, ఇతరుల సంరక్షణలో వుండటానికి,
అబాధ్యతగా వుండటానికి ఇష్ట పడుతుంది. తయారౌతుంది.
       ధ్యానం మనో వికాసాన్ని కలిగిస్తుంది.
*షణ్ముఖానంద 9866699774*

No comments:

Post a Comment