ఒక చిన్న పిల్లాడు తన అనుమానాన్ని తల్లితండ్రుల దగ్గర అడిగాడు
వారు వారికి తెలిసిన అన్ని విధాల వివరించినా ఆ పిల్లాడికి అర్థం కాలేదు
వారు ఆ అబ్బాయిని రమణమహర్షి దగ్గరకు తీసుకు వెళ్ళారు
ఆ అబ్బాయి మహర్షిని చూసి
అయ్యా ధ్యానం అంటే ఏంటి అని అడిగాడు
ఆయన నవ్వుతూ
ఆ పిల్లాడి ముందు అరిటాకు పరిచి అందులో ఒక దోశ వేశారు
నేను మ్ అని ఎప్పుడు అంటానో అప్పుడు తినడానికి మొదలు పెట్టాలి
రెండవసారి మ్ అని అన్నప్పుడు నీ ఆకులో ఏమీ ఉండకూడదు అన్నారు
ఆ పిల్లాడు మహర్షి ఎప్పుడు మ్ అని అంటారా అని వేచిచూసాడు
కాసేపు తరువాత రమణ మహర్షి మ్ అని అన్నారు
ఆ పిల్లాడు తినడం మొదలుపెట్టాడు
ఎక్కడ వెంటనే మ్ అని మళ్ళీ అనేస్తారేమో అని త్వరత్వరగా తినడం మొదలు పెట్టాడు
దోశ అయిపోతున్నది కానీ మహర్షి మ్ అని అనలేదు
ఆ పిల్లాడు మహర్షిని దోశ ను మార్చి మార్చి చూస్తున్నాడు
చివరగా మ్ అని అనగానే ఆకులోని చివరి ముక్కను ఆ పిల్లాడు తినేసాడు
ఇప్పుడు మహర్షి పిలిచి
నేను మొదటి సారి మ్ అన్నప్పటి నుండి రెండవసారి మ్ అనేవరకు నువ్వు ఉన్నావే అదే ధ్యానం అంటే అని వివరించారు
ఏకాగ్రత్త అది
ఎక్కడ వినిపించకుండా పోతుందో అని ధ్యాస మొత్తం ఆ శబ్దం పైన ఉంచడం
ఆ ఏకాగ్రత్త నీ ప్రతి పనిలోనూ ఉంటే నీలో లోపం ఉండదు అని వివరించారు
మొదటి మ్ జననం అయితే
రెండవ మ్ మరణం
వాటి మధ్యలో ఉన్నదే జీవితం అన్నారు ఆయన
ఎన్నో అనుమానాలకు ఒక్క చర్యతో అర్థమయ్యేలా వివరించారు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment