Thursday, May 11, 2023

****అబ్బాయి రమణమహర్షిని చూసి అయ్యా ధ్యానం అంటే ఏంటి అని అడిగాడు

 ఒక  చిన్న పిల్లాడు తన అనుమానాన్ని తల్లితండ్రుల దగ్గర అడిగాడు
వారు వారికి తెలిసిన అన్ని విధాల వివరించినా ఆ పిల్లాడికి అర్థం కాలేదు
వారు ఆ అబ్బాయిని రమణమహర్షి దగ్గరకు తీసుకు వెళ్ళారు

ఆ అబ్బాయి మహర్షిని చూసి 
అయ్యా ధ్యానం అంటే ఏంటి అని అడిగాడు
ఆయన నవ్వుతూ 
ఆ పిల్లాడి ముందు అరిటాకు పరిచి అందులో ఒక దోశ వేశారు

నేను మ్ అని ఎప్పుడు అంటానో అప్పుడు తినడానికి మొదలు పెట్టాలి
రెండవసారి మ్ అని అన్నప్పుడు నీ ఆకులో ఏమీ ఉండకూడదు అన్నారు

ఆ పిల్లాడు మహర్షి ఎప్పుడు మ్ అని అంటారా అని వేచిచూసాడు

కాసేపు తరువాత రమణ మహర్షి మ్ అని అన్నారు
ఆ పిల్లాడు తినడం మొదలుపెట్టాడు
ఎక్కడ వెంటనే మ్ అని మళ్ళీ అనేస్తారేమో అని త్వరత్వరగా తినడం మొదలు పెట్టాడు

దోశ అయిపోతున్నది కానీ మహర్షి మ్ అని అనలేదు
ఆ పిల్లాడు మహర్షిని దోశ ను  మార్చి మార్చి చూస్తున్నాడు 
చివరగా మ్ అని అనగానే ఆకులోని చివరి ముక్కను ఆ పిల్లాడు తినేసాడు

ఇప్పుడు మహర్షి పిలిచి 
నేను మొదటి సారి మ్ అన్నప్పటి నుండి రెండవసారి మ్ అనేవరకు నువ్వు ఉన్నావే అదే ధ్యానం అంటే అని వివరించారు

ఏకాగ్రత్త అది 
ఎక్కడ వినిపించకుండా పోతుందో అని ధ్యాస మొత్తం ఆ శబ్దం పైన ఉంచడం 
ఆ ఏకాగ్రత్త నీ ప్రతి పనిలోనూ ఉంటే నీలో లోపం ఉండదు అని వివరించారు

మొదటి మ్ జననం అయితే 
రెండవ మ్ మరణం 
వాటి మధ్యలో ఉన్నదే జీవితం అన్నారు ఆయన

ఎన్నో అనుమానాలకు ఒక్క చర్యతో అర్థమయ్యేలా వివరించారు 


 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment