*అమృతం గమయ*
*21 అక్టోబర్ 2023 ఏడవ రోజు దుర్గా నవరాత్రి - ఏడవ దుర్గ అవతారము - కాళరాత్రి దుర్గ*
కాళరాత్రీ దుర్గాదేవి నవదుర్గల్లో ఏడవ అవతారం.కాళీ, మహాకాళీ, భధ్రకాళీ, భైరవి, మృత్యు, రుద్రాణి, చాముండా, చండీ, దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రీదేవి కూడా ఒకరు. నవరాత్రుల ఏడవ రోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ
సప్తమినాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. దేవి పురాణములో దుర్గా దేవిని సర్వాంతర్యామి , సర్వలోకాల్లో , సర్వజీవులలో ఆమె నివసిస్తుంది .
*రూపం*
స్వరూపము చూచటకు మిక్కిలి భయానకము, ఈమె నాసికా శ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను కలిగి ఉంటాయి . ఈమె వాహనము గాడిద ( గార్దభము), తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనుప ఆయుధమును ( వజ్రాయుధం ), మఱొక ఎడమచేతిలో ఖడ్గమును ధరించియుండును. ఈమె ఎల్లప్పుడును శుభఫలములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను శుభంకరి అని అందురు. కాళరాత్రి దుర్గ దుష్టులను అంతమొందించును. ఈమెను స్మరించినంత మాత్రముననే రాక్షసులు భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవును , ఈమె యనుగ్రహమున గ్రహబాధలు తొలగిపోవును. కాళరాత్రి దుర్గను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు, భయముగాని, శత్రువుల భయముగాని, ఏ మాత్రమును ఉండవు. భయవిముక్తులగుదురు. కాళరాత్రిమాత దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించువారికి కలుగు శుభములు అనంతములు. మనము నిరంతరము ఈమె స్మరణ ధ్యానములను, పూజలను చేయుట ఇహపర ఫలసాధకము.
*కాళరాత్రి దేవి యొక్క కథ*
దుర్గామాత రాక్షసుల దాడిని ఎదుర్కొన్నప్పుడు, ఆమె బంగారు చర్మం తొలగిపోయి హింసాత్మక, భీకర మరియు వికర్షణ రూపంతో ఉద్భవించింది ఈ "కాళరాత్రి దేవి అమ్మవారు." కాళరాత్రి అనగా చీకటి మరియు భయంకరమైనది అని అర్థం. అన్ని దుష్ట శక్తులను, దయ్యాలు, అన్ని ప్రతికూల శక్తులు మరియు భయాలను లొంగదీసుకునేటట్లుగా ఈ అమ్మవారు ఉంటుంది.
ఏదేమైనప్పటికీ, అమ్మవారు తన భక్తులకు ఆశీర్వాదం కలుగ చేయడమే కాకుండా భక్తులను రక్షిస్తుంది కూడా. ఆమె తన భక్తులను ఎల్లప్పుడూ అత్యధిక ఆనందం మరియు సఫలీకృతంతో ఉండాలని ఆశీర్వదిస్తుంది. అందువల్ల ఆమె శుభకరీ అని కూడా పిలుస్తారు.
*కాళరాత్రి దేవి ప్రాముఖ్యత :*
శని గ్రహాన్ని కాళరాత్రి దేవి పాలిస్తుంది. ఈ అమ్మవారు మంచి, చెడులను రెండింటిని సరిసమానంగా అమలు చేస్తుంది. చెడును శిక్షించి, మంచిని ప్రోత్సహిస్తుంది. అలాగే కృషిని నిజాయితీని ఈ అమ్మవారు గుర్తిస్తుంది. జాతక చక్రంలో శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఈ అమ్మవారిని ఆరాధించడమే ఖచ్చితమైన మార్గం.
*ధ్యాన శ్లోకం*
ఏకవెణి జపకర్ణ పుర నగ్న ఖరస్తిత
లంబోష్థి కర్నికాకర్ణి తైలభ్యక్త శారీరిని
వామపదోలసల్లోహ లతకంటకభుషన
వర్ధన ముర్ధాధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరీ
No comments:
Post a Comment