Saturday, November 11, 2023

భగవంతునికి ప్రీతి పాత్రుడు కావాలంటే ఏమి చేయాలి???*

నీకు ఏది కావాలో దేవుడినే నిర్ణయించనివ్వు. 
ఆయన నీకు మంచిదైన దానినే ఇస్తాడు! ఆ నమ్మకం కలిగి వుండాలి!!!

దేవుడు నీకు కష్టాల్ని ఇస్తున్నది నీపై కోపంతో కాదు!  
ఆ విధంగా నీ కర్మ ఫలశేషం త్వరగా ముగించి నిన్ను ఉద్ధరిద్దామని అనేది గ్రహించు!!

భగవంతుడు ప్రతీక్షణం నిన్ను, నీ ఆలోచనలను గమనిస్తూనే ఉంటాడు. 
ఆయన దగ్గర ఏదీ దాచలేవని తెలుసుకో, జవాబుదారి తనం కలిగి ఉండు! 

మనిషి జీవితంలో తరువాత అంటూ ఏదీలేదు, ఉన్నదంతా ఈ క్షణమే. 
కనుక ఇప్పుడే నీకున్న సమయాన్ని మంచి పనులు చేయుటకు ఉపయోగించుకో!
ఆయనకు నచ్చుతుంది అనే పనులు చేస్తుండు...

నిన్ను చెడు త్రోవ పట్టించే శక్తులు నీ దగ్గరే, నీ చెంతనే ఉన్నాయి. 
వాటి మాయలో చిక్కుకొనకు, దీని నిమిత్తం ఎల్లప్పుడు దేవున్ని శరణువేడు!

ఎన్ని బాధలైనా భరించు కానీ దేవుని మాత్రం మరువకు, మనలను ఉద్ధరించగలవాడు ఆయన ఒక్కడే అని మరువకు,
నీకు వీలైనప్పుడల్లా సమాజ సేవలో పాల్గొని తరించు,
నిత్యం భగవన్నామ స్మరణ లో వుండు...
అప్పుడే ఆయనకు ప్రీతి పాత్రుడవుతావు ...

                *_🍃శుభమస్తు🍃_*

No comments:

Post a Comment