Saturday, November 11, 2023

సందర్భం; తల్లి పాల వారోత్సవాల.ముగింపు: శీర్షిక . "" ఆలోచనలో శిశువు ""

 సందర్భం; తల్లి పాల వారోత్సవాల.ముగింపు:
శీర్షిక
  .  "" ఆలోచనలో శిశువు  ""

అమ్మతనంలోని కమ్మదనమును
ఆస్వాదిస్తూన్న జంతురాజం
అమ్మపాలను గ్రోలుచు
అనుభూతిస్తున్న  పిల్లరాజం!
మాతాశిశువుల అనుబంధానికి ప్రతీకం
ఆ శిశువు తిలకిస్తున్న దృశ్యము!
అమ్మపాలు అమృతతుల్యమని 
రోగ నిరోధక శక్తిని పెంచి
ఆరోగ్యాన్ని అందిస్తుందని
తెలుసుకున్న తన అమ్మ మాత్రం
తన స్తన్యపు అమృతధారాలను  అందించక
కృత్రిమ డబ్బాపాలను 
అమ్మ ఎందుకు పడుతున్నదనేది
ఆ పసికందు ఆలోచనం
దానికి బదులు  చెప్పి తీరాలి మాతృలోకం!
అంత: సౌందర్యం కన్నా
బాహ్య సౌందర్యానికి ప్రాముఖ్యత నిస్తూ
బిడ్డ ఆరోగ్యం కన్నా తన శరీరాకృతే మిన్నగా భావించి
అమ్మతనానికి తలవంపులు తెస్తూ
నేటి నవీన మహిళామణులు
సహజసిద్ద అమృతధారలను
ముద్దులొలికే శిశివులకు మురిపాల ముర్రుపాలను అందించక
కృత్రిమ డబ్బాపాలను పడుతూ
శిశువులను అనారోగ్యానికి గురిచేస్తున్నారు
వారి ఆరోగ్యదాయకమైన ఉజ్వల భవితను హరిస్తున్నారు!
..........................................
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు....జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాని. 7416638823
.........................................
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.

No comments:

Post a Comment