*సనాతన ధర్మం*
*"బొట్టు"* లేకుండా ఒక హిందువు ఉన్నారంటే అది వారి *దౌర్భాగ్యం* అనుకోవాలి. పుట్టిన 11 వ రోజునుండి చనిపోయిన 11 వ రోజువరకూ బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయాక *శవాని* కి కూడా బొట్టు పెడతారుగా! నువ్వు ఏ రకం బొట్టు ఆయినా పెట్టుకో! కానీ, నీ నుదురు *స్మశానం* లా ఉండకుండా చూసుకో!
❔ నీ నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి *'Fashion'* అనే పేరుపెట్టి మరీ ఆహ్వానిస్తున్నా వని అర్థం.
🟡చందనం గుండ్రంగా పెట్టుకుంటావా? పెట్టుకో! అది *పూర్ణత్వాని* కి చిహ్నం!
🇦🇷 విభూతి పెట్టుకుంటావా? పెట్టుకో! అది *ఐశ్వర్యాని* కి ప్రతీక! ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందేగా!
🩸నామం పెట్టుకుంటావా? పెట్టుకోండి! అది నువ్వు ఉన్న స్థితినుండి, నిన్ను *ఉన్నతస్థితి* కి చేరుకోమనీ అంటోంది!
🔴కుంకుమ పెట్టుకుంటావా? పెట్టుకో! ఇది *సౌభాగ్యాని* కి సోపానం!
🟤 సింధూరం పెట్టుకుంటావా? పెట్టుకో! హనుమంతుడి *ఆశీర్వాదం* లభిస్తుంది.
🕉️కనుబొమ్మల మధ్యనుండేది ఆజ్ఞాచక్రం. 72000 నాడులకది నిలయం. అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టుపెట్టు!
బొట్టుపెట్టుకుంటే నీలో *భక్తి భావన* కలుగు తుంది. బొట్టుపెట్టుకున్న నీముఖంచూసినవారికి నీ గురించి ఒక *పవిత్రమైన* భావన కలుగుతుంది. నీకు కీడు చేయాలన్నా చేయలేరు. మంచిని నువ్వు అడగకపోయినా చేసిపెడతారు.
🕉️సనాత ధర్మం కు చెందిన, పురుషులు కాని, స్త్రీలు కాని వారు తమ *కర్తవ్యం* గా భావించి నుదుటి న బొట్టు పెట్టు కోవడం *ప్రధాన (ప్రథమ) ధర్మం.*
🪷🌺🌸🍎🍈🍓🌻🥀
No comments:
Post a Comment