Wednesday, November 8, 2023

దానం యొక్క మహిమ!!!

 0802.  2-8.  050323-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


       *దానం యొక్క మహిమ!!!*
                ➖➖➖✍️

*తెలిసి చేసినా , తెలియక చేసినా దానం యొక్క ఫలితం ఉంటుంది,               అది ఎలానో ఒకసారి పరిశీలిద్దాం...*

*ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతులవారు భూదానము యొక్క గొప్పతనమును గూర్చి వివరిస్తూ ఈ కథ చెప్పారు…*

*మాళవ దేశములో ఒక ఘోరారణ్యమున్నది, సూర్యరస్మి కూడా చొచ్చుకు పోలేనంత దట్టమైన అడవి,                 ఆ మహారణ్యములో ఒక పెద్ద బూఱుగు చెట్టు ఉన్నది.*

*శాఖోపశాఖలతో బాగా విస్తరించి ఉన్న ఆ శాల్మలీవృక్షం ఎన్నెన్నో పక్షులకు జంతువులకు సమాశ్రయాన్ని కల్పిస్తున్నది.*

*కొన్ని చిలుకల కలకలారావాలతో జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉన్నది ఆ అడవి.*

*ఆ బూఱుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచిలుక కాపురముండేది.*
*ఆ శుకం తన పిల్లలకు నివ్వరిపైరు ఆహారముగా పెట్టేది...*
*తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలు, అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేశేది తామ్రతుండం, ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు క్రింద పడేవి.*
*కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి కాలక్రమేణ ఒక చిన్న వరిపైరు తయాఱయింది!*

*ఒకరోజు ఎక్కడా సరి అయిన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలిదప్పికలతో అలసి ఆ శాల్మలీ వృక్షం దగ్గరకు వచ్చినది, తామ్రతుండం ముక్కునుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళిపోయింది...*

*తరువాత ఆ గోవు తినగా మిగిలిన యవలతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు...*
*అలా దైవికంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది, కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది...*

*ఓడవ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది, అజ్ఞానవశః తన ముక్కునుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించినందుకే తనకి ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన  ఆ ధనికుడు ఎన్నో ఫలవంతాలైన మంచి మాగాడి భూములను లేనివారికి దానము చేశాడు, ఆకలిగొన్న వారికి అన్నపానాదులను అందించాడు, ఆ పుణ్యఫలముతో ఇహములో సర్వభోగాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment