[3/17, 15:01] +91 73963 92086: *"నిజమైన శిష్యరికము" మనల్ని 'బానిసలు'గా కాదు, 'దేవుళ్ళు'గా మారుస్తుంది. ఎప్పుడు, ఎలాగ?*
*"True discipleship" makes us Gods not slaves. When & How?*
*~~~~~~*
- సద్గురు శ్రీ మెహెర్
చైతన్యజీ మహరాజ్
(Part -1)
*(ప్రశ్న:: _విభిన్నమైన మార్గాలలో ప్రయాణిస్తూ, దేవుడు ఒక్కడే అని చెప్పినా, ఆచరణలో మాత్రం భిన్నత్వాన్ని వ్యక్తం చేస్తారు చాలా మంది. అటువంటి వారు ఏ విధమైన దృక్పథం కలిగి ఉంటే, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలరు ??)_*
*గురుదేవులు:: ఈ రోజు మెహెర్ బాబా వారి ప్రవచనమైనటువంటి "True Discipleship"ని గురించి విచారణ చేద్దాం. "శిష్యరికము"ను గురించి బాబా ఇచ్చినటువంటి ఒక ప్రవచనాన్ని గురించి మనము ఈ రోజు విచారణ చేద్దాము.*
*"శిష్యరికము" అనేటువంటిది– గురుశిష్యులు ఉభయుల మధ్య ఉండేటువంటి ఒక ఆధ్యాత్మిక సంబంధము. ఈ సంబంధమును*
- అవతార పురుషులతోనూ,
- సద్గురువులతోనూ,
- సాధారణ గురువులతోనూ
*పెంపొందింపచేసుకుంటూ ఉంటాడు, మానవుడు.*
_*ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగి– 'ఆధ్యాత్మిక మార్గములో పురోగమించి నిజ గమ్యము చేరాలి' అనేటువంటి జిజ్ఞాస కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి– తనకు ఆధ్యాత్మిక మార్గములో మార్గదర్శకత్వము వహించడానికీ, సుగమముగా "గమ్యము" చేర్చడానికీ అవసరముగా ఒక గురువును నిర్ణయించుకుంటాడు.*_
- సాధారణమైనటువంటి
మంత్రోపదేశములు
ఇచ్చేటువంటి
గురువుని గానీ, లేదా
- సద్గురువులలో ఒకరిని
గురువుగా గానీ, లేదా
- అవతార పురుషుణ్ణి
గురువుగా గానీ
*_స్వీకరించి, వారి యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాగుతూ ఉంటుంటుంది._*
*➢* _మెహెర్ బాబాను అవతార పురుషునిగా విశ్వసించి, ఆయనను ప్రేమిస్తుండేటువంటి వారు ఉన్నారు, "ప్రేమికులు"గాను._
*➢* _అవతార పురుషుడైనటువంటి మెహెర్ బాబాను "గురువు"గా స్వీకరించి– ఆయన నుండి ఆదేశాలు పొంది, ఆయన ఆదేశానుసారము ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వారూ ఉన్నారు._
*➢* _అదే విధముగా మెహెర్ బాబా సమకాలికులైనటువంటి ఆ కాలపు ఐదుగురు సద్గురువులు, వారికి సంబంధించినటువంటి శిష్యవర్గము కూడా ఉంటూనే ఉన్నది. (అంటే)_
* *షిర్డీ సాయిబాబా* వారిని
"భగవంతుడు"గనూ
విశ్వసిస్తారు,
"గురువు"గనూ
విశ్వసిస్తారు;
ఆయనను ఆరాధిస్తారు.
ఆరాధించడం ద్వారా,
వారి యొక్క
ఆధ్యాత్మికమైనటువంటి
మార్గములో వారికి
"వెలుతురు"ను, అంటే
మార్గమందు
పురోగమించడానికి
అవసరమైనటువంటి
సహాయాన్ని పొందుతూ
ఉంటుంటారు.
అదే విధంగా,
వారికి సంబంధించినటువంటి
'శిష్యులు', 'ప్రేమికులూ'
(కూడా) ఉన్నారు.
* అదే విధముగా
*ఉపాసనీ మహరాజ్* ని
"గురువు"గా స్వీకరించి,
ఆయన యొక్క
ఆదేశానుసారము
జీవిస్తుండేటువంటివారూ
ఉన్నారు.
* *నారాయణ మహరాజ్* కీ
శిష్యులున్నారు. వారి
మార్గానుసారముగానే,
ఆధ్యాత్మికముగా
కృషి సలుపుతున్నారు.
* అదే విధముగా
*బాబాజాన్* కీ
శిష్యులున్నారు;
*తాజుద్దీన్ బాబా* కూ
శిష్యులున్నారు.
*ఈ విధముగా ఎవరెవరు, వారి వారి జిజ్ఞాసను పురస్కరించుకొని, వారు విశ్వసించినటువంటి రీతిలో ఈ మహాత్ములను (అనగా)– అవతార పురుషుల్ని గానీ, సద్గురువుల్ని గానీ గురువులుగా స్వీకరించి, ఆధ్యాత్మికముగా పురోగమించడానికి కృషి చేస్తున్నారు, వారి యొక్క సహాయము ద్వారా.*
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందీ, విచారణ చేసి ఇప్పుడొక నిర్ణయానికి రావాల్సిందీ ఏమిటంటే::
_*"భగవంతుడు ఒక్కడేను" అని అందరూ చెప్తున్నారు. అదే విధముగా "భగవంతుణ్ణి చేరు మార్గం కూడా ఒక్కటే" అనీ చెప్తున్నారు. తరువాత, "ఈ మార్గములో ప్రయాణము చేసి, గమ్యము చేరిన తరువాత– ఈ 'ఆధ్యాత్మిక గమ్యము' కూడా ఒక్కటేను" అనీ చెప్తున్నారు.*_
_*ఇటువంటప్పుడు ఈ మహాత్ముల వెనుక, ఈ అవతార పురుషుల వెనుక, ఈ సద్గురువుల వెనుక, ఈ*_
- ప్రత్యేకమైనటువంటి
పద్ధతులు,
- ప్రత్యేకమైనటువంటి
సాంప్రదాయములు,
- ప్రత్యేకమైనటువంటి ఈ
ఆధ్యాత్మిక
సాధనా విధానములు,
_*ఇవన్నీ కల్పింపబడడము చేత, ఒక్కడై ఉన్నటువంటి భగవంతుణ్ణి అన్వేషిస్తుండేటువంటి సాధకుడు– ఒక్కడై ఉన్నటువంటి, అవిభాజ్యుడై ఉన్నటువంటి భగవంతుణ్ణి పొందడానికి బదులుగా, ఏదో ఒక పాక్షికమైనటువంటి భగవంతుని స్థితిని మాత్రమే పొందేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటున్నాడు*._
_*దీని నుండి తప్పించుకోవడానికి, (అంటే) ఈ పాక్షికమైనటువంటి ఈ భగవంతుని స్థితి నుండి తప్పించుకుని– ఒక్కడై, ఆవిభాజ్యుడై ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి తాను చేరడానికి తాను అన్వేషిస్తూ, తాను విశ్వసిస్తూ పురోగమిస్తున్నటువంటి ఈ మార్గములో– వ్యక్తి అవలంబించవలసినటువంటి మెలకువలు ఏమిటి? ఏ పద్ధతుల ద్వారా, ఏ విధమైనటువంటి అవగాహన ద్వారా– తన యొక్క భావనలో ఏ విధమైనటువంటి భిన్నత్వమూ లేకుండా, "ఏకత్వ"
[3/17, 15:02] +91 73963 92086: సంబంధమైనటువంటి అనుభూతితో పురోగమించి గమ్యము చేరగలడో, ఆ విషయమై మెహెర్ బాబా యొక్క ప్రవచనాన్ని ఈ రోజు మనము పరిశీలిద్దాము.*_
To be contd ....
No comments:
Post a Comment