Friday, June 28, 2024

 *దేవుడికి కొబ్బరికాయ కొట్టేముందు చుట్టూ పీచు తీస్తారు ఏందుకు....???*

కొబ్బరికాయకు చివర్లో కొంత పీచు అలా ఉంచేస్తారు. 
ఇలా కొంత పీచును ఉంచడం వెనుక కారణం ఉంది.

కాయకు నిలువుగా మూడు చారలు కనిపిస్తాయి. 
ఆ మూడు భాగాలకూ మూడు కళ్ళు ఉంటాయి.

కొబ్బరికాయకు ఉండే ఈ మూడు కళ్ళను దృష్టిలో ఉంచుకుని ''ముక్కంటి'' అంటారు.
కుడివైపు భాగాన్ని సూర్యనాడి అని ,
ఎడమవైపు భాగాన్ని చంద్రనాడి అని 
రెండు భాగాలకు మధ్య ఉన్న పెద్ద భాగాన్ని బ్రహ్మనాడి అని అంటారు.

సూర్య, చంద్ర, బ్రహ్మ నాడులు కలిసినప్పుడే జ్ఞానం కలుగుతుంది. 
బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు ఆత్మ, పరమాత్మలో కలిసిపోతుంది. 

అంటే మోక్షం కలుగుతుంది.  ఈ విషయం తెలియ చేయటానికే పీచు తీసివేయమని చెబుతారు.

అంటే మానవుని గమ్యం మోక్షమని ప్రబోధం... 🙏

No comments:

Post a Comment