Wednesday, July 24, 2024

***( 23rd July ) చంద్ర శేఖర్ ఆజాద్ జయంతి




 * ( 23rd July ) చంద్ర శేఖర్ ఆజాద్ జయంతి*
🌸🪷🌸
కేవలం *ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే జీవించి* భారత దేశం స్వాతంత్ర్యం  కోసం *15 సంవత్సరాల చిన్న వయసు నుండే* ఉద్యమాలు చేసి  *దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన చంద్రశేఖర్ ఆజాద్ జన్మదినం నేడు ( 23.7.1906 ).*  ఈయన అసలు పేరు చంద్రశేఖర్ తివారి.  తల్లిదండ్రులు ఈయనని సంస్కృత పండితుడిని చేద్దామనుకున్నారు. ఈయన దేశం కోసం బ్రతకాలి అనుకున్నాడు. దేశం కోసమే చనిపోవాలని కూడా అనుకున్నాడు.  *కేవలం దేశం కోసమే ప్రాణాలు త్యాగం చేశాడు.*  (ఎవరో ఎక్కడో ఎందుకో చనిపోతే, లేదా ఎవరి చేతిలోనో ప్రతీకార దాడులలో కానీ లేక ఇంకా ఎందుకో చనిపోతే,  అది ఈదేశం కోసం త్యాగం అంటూ ఇప్పట్లో లాగా డప్పు కొట్టుకునే దిక్కుమాలిన రాజకీయాల లాగా కాదు.)

15 సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర్యం కావాలి అంటూ నినాదాలు చేసినందుకు బ్రిటిష్ పోలీసులు ఈ కుర్రవాడిని అరెస్ట్ చేసి  బ్రిటిష్ జడ్జి ముందు నిలబెట్టారు.  నీ పేరు ఏంటి అని అడిగితే,  *ఆజాదీ ఆజాదీ* అని సమాధానం చెప్పాడు. మీ నాన్న గారి పేరు ఏమిటి అంటే *స్వతంత్ర* అన్నాడు. నివాసం ఎక్కడ అని అడిగితే *జైలు* అని బదులిచ్చాడు.ఉక్రోషం తట్టుకోలేని జడ్జి ఈ కుర్రవాడికి పదిహేను కొరడా దెబ్బలు శిక్ష విధించాడు. కొరడా దెబ్బతిన్న ప్రతిసారీ కూడా *భారత్ మాతాకీ జై* అని  నినాదం చేశాడు.  అప్పటినుంచి చంద్రశేఖర్  తివారి కాస్తా  చంద్రశేఖర్ ఆజాద్ గా  పేరు సంపాదించాడు.  
అ హింసామూర్తి, మహాత్మా నాయకుడు గాంధీ గారు *1921 లో ప్రారంభించిన   సహాయ నిరాకరణ ఉద్యమం* దేశ ప్రజలందరినీ ఆకర్షించింది.  చంద్రశేఖర్ ఆజాద్ కూడా 15 సంవత్సరాల వయసులోనే ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. బ్రిటిష్ వారిపై భారతదేశ ఉద్యమకారులు గట్టిగా తిరగబడ్డారు. బ్రిటిష్ వారిపై  హింసాత్మక సంఘటనలు పెరుగుతుండటంతో తీవ్రంగా ఆందోళన పడిన  అ హింసామూర్తి మహాత్మా గాంధీ గారు  సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తక్షణమే రద్దు చేసి నిలిపి వేసారు.  గాంధీగారి ఈ చర్య  ఆనాటి చాలామంది ఉద్యమకారులలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.  చంద్రశేఖర్ ఆజాద్ కూడా అదేవిధంగా అసంతృప్తితో  గాంధీ గారి బాట కాకుండా  తన స్థాయిలో స్వంత ఉద్యమాన్ని నిర్మించారు. 
👇👇👇
 షరా మామూలుగా  ఇటువంటి వారినందరిని టెర్రరిస్టుగానో , దోపిడీ దొంగ గానో ముద్రవేసి సామాన్య ప్రజలకు దూరం చేసేందుకు శాయశక్తులా కృషి చేసేవారు కాంగ్రెస్ పార్టీలో ని *మితవాద నాయకులు*. 
👆👆👆
👇👇👇

వెంటపడి అరెస్టు చేసి శిక్షించడానికి సిధ్ధంగా ఉండేవారు *బ్రిటిష్ దోపిడీ పాలకులు.* 
👆👆👆

భారత ప్రధమ ప్రధానమంత్రి నెహ్రూ తన ఆత్మ కధలో  ఒక టెర్రరిస్టు తనను కలవడానికి వచ్చాడని, కలిసి మాట్లాడినట్లు  వ్రాసుకున్నారు.  అతని పేరు చంద్రశేఖర్ ఆజాద్ అని కూడా నెహ్రూ రాసుకున్నారు.  చంద్రశేఖర్ ఆజాద్ Hindustan Republic Association ( *HRA* ) ను  అనుచర మిత్రులతో కలిసి ప్రారంభించారు.  దీనిలో సభ్యులుగా రామ్ ప్రసాద్ బిస్మిల్ , అష్ఫకుల్ ఖాన్ ,  రాజేంద్ర లహరి, హరిచంద్ర బక్షి ,సచీంద్ర బక్షి , కేశవ చక్రవర్తి, బన్వరి లాల్,మురారి లాల్ గుప్తా , 
ముకుంద్ లాల్  గుప్తా , మన్మధ నాథ్ గుప్తా తదితరులు అనుచరులుగా ఉన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో *9.8.1925 తేదీ న  కకోరి రైలు దోపిడీ ప్రయత్నం* జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నో నగరానికి దగ్గర్లో కకోరి అనే ఊరు ఉంది. అనేక ప్రాంతాల నుంచి *పన్నుల రూపంలో బ్రిటిష్ దోపిడీ పాలకులు వసూలు చేసి తెచ్చుకున్న ఎనిమిది వేల రూపాయల నగదు* ఆ ట్రైన్ గార్డ్ క్యాబిన్ లో ఉన్నాయి . 

👇👇

ఆ నగదు ప్రస్తుత విలువ సుమారుగా *పదిహేను వందల కోట్ల రూపాయలు ఉండవచ్చు*. 
👆👆👆

ఆ డబ్బు దోపిడీ చేసి ఆయుధాలు సమకూర్చుకొని బ్రిటిష్ వారిపై సాయుధ పోరాటం చేసి  స్వాతంత్రం సంపాదించాలని ఈ ఉద్యమకారుల ఆలోచన.  దోపిడీలో  పాల్గొన్న ,ప్రణాళిక రచించిన  వారిని అందరిని *బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు*. నలుగురిని *ఉరి తీశారు*. కొందరికి అండమాన్ నికోబార్ లో సెల్యులర్ జైలులో కఠిన జైలు శిక్ష (  *కాలాపాని* ) విధించారు. మరికొందరికి వివిధ రకాల జైలు శిక్షలు విధించారు.

👇👇👇
*(ఆ రోజుల్లో నిజమైన స్వాతంత్ర్య సమరయోధులు అంటే వాళ్లకి ఉరిశిక్ష గాని, బర్మా జైలుకు పంపించి కఠినమైన శిక్షలు కానీ, అండమాన్ జైలుకు పంపించి ఇంకా కఠినమైన శిక్షలు కానీ వేసేవాళ్లు.)*
👆👆👆


 *చంద్రశేఖర్ అజాద్ మాత్రం ఎప్పటికీ బ్రిటిష్ దోపిడీ పాలకులకు దొరకకుండా తప్పించుకుంటూ  తిరిగాడు*.
👆👆👆

చాలామంది సహచర సభ్యులను పోగొట్టుకోవడం తో  చంద్రశేఖర్ ఆజాద్ HRA సంస్థని భగత్ సింగ్ , సుఖ్ దేవ్ , జోగేష్ చంద్ర ఛటర్జీ లతో కలిసి Hindustan Socialistic Republican Army అనే సంస్థ గా మార్పు చేశాడు. రాబోయే రోజుల్లో బ్రిటిష్ వారు తాము తెచ్చిపెట్టే చట్టాలని గురించి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో  కొన్ని సార్లు చర్చించేవారు. 

ఈ విషయం మీద  చర్చించడానికి  నెహ్రూతో చంద్రశేఖర్ అజాద్  అత్యంత రహస్యంగా సమావేశమైనట్లు గా తెలుస్తోంది. తీవ్రవాదులు గా ముద్రపడిన స్వాతంత్ర సమరయోధులకు భారతదేశం లో సముచిత గౌరవం దక్కే అవకాశం ఉందా అని  చంద్ర శేఖర్ ఆజాద్  నెహ్రూ ని ప్రశ్నించడం జరిగినట్లు  తెలుస్తోంది. అప్పటికే జైలులో ఉన్న భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు  బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఉరిశిక్ష గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది.  నెహ్రూ ఆత్మకథ లో చంద్రశేఖర్ ఆజాద్ కు ఎటువంటి హామీ కూడా ఇచ్చినట్లుగా తెలియడం లేదు.  ( *చంద్రశేఖర్ ఆజాద్ ప్రాణత్యాగం తర్వాత 24 రోజులకు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లను 23 మార్చి 1931 తేదీన  బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయడం జరిగింది* )  చాలా సంవత్సరాలు బ్రిటిష్ *పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరగగలిగాడు చంద్రశేఖర్ ఆజాద్* , 

 కానీ, నెహ్రు తో జరిగిన *రహస్య సమావేశం*    
 తర్వాత  అలహాబాద్ లోని ఆల్ఫ్రెడ్ పార్క్  (. *ప్రస్తుతం ఇది చంద్రశేఖర్ ఆజాద్ పార్క్* ) లో  అనుచరులతో   *రహస్యసమావేశం* లో
ఉండగా  భారీగా బ్రిటిష్ పోలీసులు ఆ పార్కును చుట్టుముట్టారు.
👇👇

*బ్రిటిష్ పోలీసులకు చంద్రశేఖర్ ఆజాద్ యొక్క కదలికలు పక్కాగా ఎలా తెలిసాయో మరి.*
👆👆
 ఎదురుకాల్పుల్లో *కొంతమంది పోలీసులని  హత మార్చి* ,  
 పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగడం ఇష్టం లేని  చంద్రశేఖర్ ఆజాద్ *చివరి బుల్లెట్* తో  తనకు తానుగా తుపాకితో కాల్చుకుని దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడు (  *27 .2. 1931* ). 

*చంద్రశేఖర్ ఆజాద్ కి నేడు జయంతి సందర్భంగా నివాళులు*
😰🙏😰🙏😰

*వ్యాస కర్త.*
*V.Srinivasulu.*

No comments:

Post a Comment