Wednesday, July 24, 2024

***శ్రీ రమణీయం - 34🌹 👌వదలాల్సింది కర్తృత్వాన్ని - కర్మలను కాదు👌

 [7/24, 15:20] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 34🌹
👌వదలాల్సింది కర్తృత్వాన్ని - కర్మలను కాదు👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

🌈 *34. వదలాల్సింది కర్తృత్వాన్ని - కర్మలను కాదు* 🌹

✳️ వేదాంతం - లౌకిక జీవితంలో దేన్నీ వద్దని చెప్పటంలేదు. మితంగా ఉండమంటుంది. మితాహార వ్యవహారాల ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతికి సాధన సులభం అవుతుంది. రోజులో నాల్గవవంతు నిద్రతో సరిపెట్టుకోగలిగితే నిద్రను జయించినట్లే. ప్రతిపూట అర్థాకలితో భోజనాన్ని పూర్తి చేయగలిగితే ఆకలిని జయించినట్లే. ఏదైనా పనిచేస్తూ మధ్యలో అన్నంతింటే తిరిగి వెంటనే ఆ పని కొనసాగించగలిగేలా ఉండాలి. తినిఎవరింటికైనా వెళ్తే మళ్ళీ భోజనం చేయ గలిగేంత మాత్రం తింటే అది నిత్యోపాసనే అవుతుంది. మనం ప్రధానంగా రుచికి, నిద్రకి లొంగిపోతున్నాం. అది తగ్గించుకోవాలి. ఉపవాసం పేరుతో అన్నం మానేస్తే దేవుడికేం లాభం?

✳️ మనసును అవసరమైనప్పుడే అదుపులో ఉంచుకోవడం మనో నిగ్రహం అవుతుంది. అంతేగానీ మనసును అసలు కదలకుండా చేయడం ఎవరివల్లా కాదు. బాధైనా, కోపమైనా మితంగా ఉండే సందర్భాలున్నాయి. శ్రీరాముడు, ఆంజనేయుడు కూడా సీతామాత విషయంలో బాధపడకుండా ఉండలేదు. సీతాదేవి కనిపించలేదని హనుమంతుడు చనిపోదామని అనుకున్నాడు. కష్టాలు, విఘ్నాలు ఎవరినీ వదలవు. వాటిని తట్టుకోవడంలోనే మన మనోనిగ్రహం తెలుస్తుంది. రాముడు సీతాదేవికోసం దుఃఖించాడేతప్ప చింతిస్తూ కూర్చుండి పోలేదు. అంత బాధలోనూ తన కర్తవ్యాన్ని విస్మరించనంత ధీరత్వంలో ఉన్నారు. రాముడు విజయంకోసం వెంపర్లాడలేదు. కేవలం ధర్మంగా తనపని తానుచేస్తూ వెళ్ళాడు. 

✳️ *మనం ఎప్పుడూ విజయాన్ని కోరుకోవడంచేతనే అధిక బాధకు లోనౌతున్నాం. ఎవరికైనా సరే రోజూ కష్టాలే ఉండవు. కాకపోతే వాటినే ఎక్కువగా గుర్తుంచుకొని స్మరించడంచేత అలా భావిస్తూ ఉంటాం. మనకి లభించిన సంతోషాలను గుర్తుంచుకోవడంలేదు, లేదా అత్యాశ వల్ల పట్టించుకోవడంలేదు. మన విధానం ఎలాఉండాలో, అందులో ఎలా ఉండాలో తెలియచెప్పటమే అవతార పురుషుల ఆంతర్యం.*

✳️ ఎవరికి వారు తమ గురువునే అందరూ పూజించాలనుకుంటారు. మనం చూస్తున్న మతఘర్షణలన్నీ దీనివల్లే. జీవితంలో వివేకవంతమైన ప్రయాణం అవసరం. జీవితం గురించిన పరిపూర్ణ అవగాహనకోసమే ఈ సత్సంగం. మంచి మనసు అంటే సున్నితమైన మనసు. జీవితంలో అన్నీ సుకుమారంగా ఉండాలి. జ్ఞానులు ఫలానా పనే చేస్తామని భీష్మించుకోరు. తమముందుకు వచ్చిన పని పూర్తిచేస్తూ ముందుకు వెళ్తారు. 

✳️ శ్రీరమణభగవాన్ ఒకసారి గోశాలలో పనివారినే తదేకంగా పరికిస్తూ తన్మయత్వం చెందుతున్నారు. ఇంతలోనే ఎవరో వచ్చి భక్తులు ఎదురు చూస్తున్నారని చెప్పగానే ఏమాత్రం విసుగు చెందకుండా లేచి వెళ్ళారు. రాజ్యం ఇస్తానన్నప్పుడు రాముడు ఎలా ఉన్నాడో అరణ్యవాసానికి వెళ్లమన్నప్పుడుకూడా అలానే ఉన్నారు. మహాత్ముల ప్రతి కదలికలోనూ ఆ సుకుమారం ఉంటుంది. హిందూ సంస్కృతి పరమసత్యం కోసం దేన్నైనా త్యాగం చేయమంటోంది. బుద్ధభగవానుడు, శ్రీరాఘవేంద్రుల వారు సత్యం కోసం సంసారాలే త్యాగం చేశారు.

✳️ మనసుకి స్పందన, ప్రతిక్రియ అనే రెండు లక్షణాలు ఉన్నాయి. కాలులో ముల్లుగుచ్చుకుంటే అబ్బా అనటం స్పందన. అది నాకే గుచ్చుకోవాలా! అనుకోవడం, మళ్ళీ గుచ్చుకోకుండా జాగ్రత్తపడటం ప్రతిక్రియ. ఎవరైనా తిట్టినప్పుడు మనకు బాధ కలగడం స్పందన. వాళ్ళు ఎదురు పడగానే కలిగే క్రోధం ప్రతిక్రియ. మన ప్రతిక్రియలకు జ్ఞాపకాలే కారణం. అనవసర జ్ఞాపకాలు తగ్గటమే మన మనసుకు బలం. మనసుకు బలాన్నివ్వడమే దివ్యత్వం. దానికి నిరంతరం నామజపమే సులభ సాధన. దీనివల్ల జ్ఞాపకాలు పూర్తిగా పోవు. నీరసించిపోతాయి.

✳️ ఆలోచనలను పూర్తిగా ఆపటం సాధ్యంకాదు. అనవసరమైన ఆలోచనలు తగ్గించడమే మన ముందున్న సాధన. జపంలో కూర్చున్నప్పుడు పొయ్యిమీద పెట్టిన పాలు పొంగుతాయేమోనని గుర్తుకు వస్తే తప్పేమిటి? అనవసరమైన ఆలోచనలు ఆపాలంటే తప్పుకాదు. 

✳️ శ్రీ రమణభగవాన్‌కికూడా కళ్ళలో నీళ్ళు తిరిగిన ఒక్కటే కిటుకు. అవి అనవసరమైనవని గుర్తిస్తే అవే ఆగిపోతాయి. నిర్వర్తించాల్సిన కర్మలకోసం మనమే ఎదురు వెళ్ళనక్కర్లేదు. అవే మనకి ఎదురు వస్తాయి. కాకపోతే మనకి అంతటి సహనం ఉండాలి. సాధకుడు తనకి ఎదురైన కర్మలను నిర్వర్తిస్తూ వెళ్తేచాలు. వాస్తవాన్ని పరిశీలిస్తే... ఏ కర్మ అయినా మనం అనుకుంటేనో లేదా ఎదురుచూస్తేనో రావటంలేదని అర్థం అవుతుంది. మన కర్మలన్నీ ముందు తయారుచేసి పెట్టుకున్నవే కదా! ఈ జన్మలోనో, గతజన్మలోనో వాటిని కోరుకొని ఆహ్వానించాం. తీరా అవి చెంతకు వచ్చేసరికి కొన్నింటిని స్వీకరించి మరికొన్ని తిరస్కరిస్తున్నాం. *చిన్నపిల్లలు అక్షరాభ్యాసానికి ముందు పుస్తకాలు, పలకలు పట్టుకొని ఆడుకుంటారు. తీరా స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేసరికి ఏడుస్తూ వెళ్తారు. మనం కూడా అంతే.* పైగా మనం తయారుచేసుకున్న కర్మలకు దేవుడే కారణమని భావించి నిందిస్తాం. కలలో వచ్చే కర్మలకైనా సరే మనమే కారణం. కలలో కూడా దేహం ఉందని బలంగా నమ్ముతున్నాం కనుకనే ఆ కర్మలు వస్తున్నాయి. 

✳️ ఒకసారి రమణ భగవాన్‌తో ఒక చిన్నపాప సంభాషణ ఇలా సాగింది.

ప్రశ్న:
దుఃఖం ఎందువల్ల వస్తుంది?’ 

శ్రీరమణభగవాన్:
'మనం చేసే కర్మలవల్ల.'
[7/24, 15:20] +91 73963 92086: ప్రశ్న:
'మరి ఆ కర్మలు మనతో చేయించేది ఎవరు?’  

శ్రీరమణభగవాన్ :  'దైవం' 

ప్రశ్న :
మరి దైవమే కర్మలు చేయిస్తున్నప్పుడు మనకి దుఃఖం ఎందుకు?

శ్రీరమణభగవాన్ :

'ఆ పనులు మనం చేస్తున్నామని అనుకోవడం చేత'. అంటే... *మనం వదలాల్సింది కర్తృత్వాన్నేగానీ కర్మలను కాదని భగవాన్ బోధ.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment