*వైకుంఠమంటే అసలైన అర్థమేమిటంటే...🤔*
🕉️🙏
(1) రామాయణ కాలంలో నేటి తక్షశిల ప్రాంతాన్ని గంధర్వదేశమనేవారు. సీతాదేవి తన తల్లిగర్భం చేరిన కొన్నాళ్ళకు, కేకయరాజు యుధాజిత్తు అయోధ్యకు వచ్చి శ్రీరాముడిని దర్శించి సింధునది ప్రాంతంలోని (నేటి పాకిస్థాన్ లో) గంధర్వరాజు యొక్క ఆగడాలను అంతమొందించాల్సిందిగా ప్రార్థించాడు. అంతట రామచంద్రుడు భరతుని కొడుకులైన తక్షకుడిని, పుష్కలుడిని పెద్దసైన్యం తోడుగా పంపాడు. వారిద్దరు ఆ గంధర్వుడిని జయించి, గంధర్వదేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు. తరువాత శ్రీరాముడు వారిద్దరిని ఆ ప్రాంతపు రాజులుగా చేశాడు. తక్షకుడు తక్షశిల నగరాన్ని, పుష్కలుడు పుష్కలావతి నగరాన్ని నిర్మించి తమ రాజధానులుగా చేసుకొన్నారు.
(2) లక్ష్మణుని ఇద్దరి కొడుకులెవరంటే ఒకరు అంగదుడు, రెండోవాడు, చక్రకేతు.
(3) ప్రాణికోటిని సృష్టించడం బ్రహ్మదేవుడి పని.ఆయనకు 12 గంటల సమయం మనకు 432 కోట్ల సంవత్సరాలతో సమానం.. బ్రహ్మవయస్సు (జీవితకాలం) 311 ట్రిలియన్ సంవత్సరాలు. జగత్పితామహుడైన ఈ బ్రహ్మ తదనంతరం సృష్టి మరలా కొత్త బ్రహ్మచే ప్రారంభమైతుంది.
(4) కశ్యప ప్రజాపతికి దితి అను భార్య వలన జన్మించినవారే దైత్యులు, వీరిది రాక్షస ప్రవృత్తి.
కశ్యప ప్రజాపతికి దాను అను భార్య వలన జన్మించినవారే దానవులు, వీరిది కూడా రాక్షస ప్రవృత్తై.
(5) సత్య,త్రేత, ద్వాపర, కలియుగాలను కలిపి ఒక మహా యుగమంటారు. ఈ నాలుగు యుగాల మొత్తం కాలం 43, 20,000 భూమండల సంవత్సరాలు. ఈ నాలుగు యుగాలలో కలియుగం చివరిది.
మహాయుగములోని నాలుగు యుగాలలో మొదటిది మరియు అత్యున్నతమైనది సత్యయుగం. మంచితనము, వివేకము, ధర్మము రాజిల్లి ప్రజలు 1,000 సంవత్సరాలదాకా జీవించిన స్వర్ణయుగం. ఈ యుగ కాలపరిమితి 17,28,000 సంవత్సరాలు.
త్రేతాయుగకాల 12 లక్షల 96 వేల సంవత్సరాలు. కలియుగం ప్రవేశించి ఇప్పటికి 5 వేల సంవత్సరాలు దాటింది. కలియుగ కాలపరిమితి 4, లక్షల 32 వేల భూమండల సంవత్సరాలు.
(6) వైకుంఠము అనగా చింతలు లేని ప్రదేశం. వైకుంఠం శ్రీమన్నారాయణుడి నివాసస్థానం.
(7) సీతమ్మతల్లి కుశలవులకు జన్మనిచ్చిన తరువాత వాల్మికి మహర్షి జాతకర్మలు నిర్వహించి, కవలులైన శిశువులకు మంచి యోగం, శరీరసౌష్ఠవం రావాలని, మొదట పుట్టిన శిశువు పైభాగంలోనూ ( కుశస్థానంలో), తరువాత పుట్టిన బిడ్డకు కింది స్థానం (లవస్థానం) లోనూ వృద్ధులచే బాగా మర్ధన చేయించాడు.అందుకే కవలలు కుశలవలనే సార్థక నామధేయులైనారు.🙏
॥సేకరణ॥
No comments:
Post a Comment