Monday, July 29, 2024

శ్రీ రమణీయం - 37🌹 👌 మనజీవితమే దేవుని పూజగా మారాలి👌

 [7/29, 15:10] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 37🌹
👌 మనజీవితమే దేవుని పూజగా మారాలి👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

37. మనజీవితమే దేవుని పూజగా మారాలి

✳️ కేవలం దేవుని పూజమాత్రమే కాదు శ్రద్ధాభక్తులతో చేస్తే ప్రతిపనీ ధ్యానమే| అవుతుంది. నిద్రలో అందరికీ లభిస్తున్న శాంతి మనిషికి శ్రద్ధగా చేసే పనిలోకూడా లభిస్తుంది. ఎన్ని మార్గాల్లో దేవుణ్ణి పూజించినా వివేకం లోపిస్తే ఆ సాధన వ్యర్థమౌతుంది. ఏ మార్గాన్ని మనం వద్దని చెప్పనక్కరలేదు. విచారణ, విశ్లేషణలతో ఆ సాధనను పరిపూర్ణం చేసుకోవాలి. మనకు పెద్దలు సూచించిన నామజపం మనసును ఖాళీగా ఉంచకుండా చేసేందుకే. శ్రద్ధగా చేసే పనిలో ఎలాగూ మనసు ఖాళీగా ఉండదు. శ్రద్ధ లోపించినప్పుడే మంత్రజపం మన మనోచాంచల్యానికి ఔషధంలాగా పనిచేస్తుంది.

✳️ ఎంతటి మహానుభావులైనా జీవనవిధానంలో మనతో సమానంగానే ఉన్నారు. సాక్షాత్తు అవతారమూర్తులైన రాముడు, కృష్ణుడు కూడా మనలాగానే నిద్రాహారాలతోనే జీవించారు. వీటికీ అతీతంగాలేరు. వారి దివ్యత్వం అంతా వారి మనోనిర్మలత్వమే. ఏ వెంపర్లాట, ఆరాటం లేకుండా జీవించడమే వారు ఆచరించి చూపించిన ఆదర్శం. మహానుభావులు తమకు ఏది ఉన్నా, లేకున్నా సరిపెట్టుకొని జీవించారు. మనకిమాత్రం ఫలానాది ఉంటేనే జీవించగలమనే బలహీనత ఉంది. రాకుమారుడిగా వెలుగొందిన శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసాన్ని ఆనందంగా అంగీకరించిన సహనమే ఆయనను ఆదర్శపురుషుడ్ని చేసింది. రాముడ్ని పూజించడం అంటే ఆ పురాణ పురుషుడి గుణాలను గౌరవించి స్వీకరించడమే. జ్ఞాని ప్రపంచాన్ని దాటడు. ప్రపంచంపై ఉన్న బంధాన్ని అధిగమిస్తాడు. ప్రపంచాన్ని దాటటం అంటే దేహాఅవసరాలను దాటటమే. అది ఎవరికీ కుదరదు. ఏవో కొన్ని అవసరాలు అధిగమించినా అన్నింటినీ ఆపటం అసాధ్యం. విరాగులై చరించిన మహర్షులు కూడా చేతిలో కమండలంతోనే తిరిగారు. స్థిరంగా స్థాణువుగా ఉండటంకూడా ఒక వికారమే అవుతుంది. జ్ఞానులు అలా ఉండరు. మనతోనే, మనలాగానే సంచరిస్తారు. కాకపోతే వారికి ఏ కోరిక ఉండదు కనుక వారిని ఏదీ బాధించదు. వారి ప్రతి కదిలిక మనకు బోధగా ఉంటుంది. మంత్రదీక్షలు తీసుకోకపోయినా ఏ నష్టం లేదుగానీ, అవి తీసుకుని కూడా మనోశుద్ధి జరగకపోతే చాలా నష్టపోతాము. గురువునే ఈశ్వరుడిగా, ఆయన మాటలను భగవద్గీతగా భావించి అనుసరిస్తే ఆధారపడ్డ వస్తువే నీకు అన్నీ నేర్పుతుంది.

✳️ మనం దేవుడి వద్దకుకూడా స్వార్ధంతో వెళ్తాం. నాకోర్కెలు ఎన్ని తీరుతున్నాయని లెక్కించుకుంటున్నాంగానీ ఆ దైవసన్నిధిలో నామనసు ఎంత మారింది అని గుర్తించడంలేదు. కులం, మతం, పూజలు కాదు మనని ఉద్ధరించేది. దీక్షలు తీసుకుంటూపోతే ఏ ప్రయోజనం ఉండదు. అందులో దాగిన ధార్మిక జీవనాన్ని మనం అలవర్చుకోవాలి. మన తాత ముత్తాతలు ఎలా జీవించారో తరచిచూస్తే అర్ధమౌతుంది. వారంతా ధర్మం వల్లనే శాంతిగా ఉన్నారు. సచ్ఛీలంగురించి చెప్తే ఎవరికివారు అది తమకు కాదనుకుని తప్పించుకుంటున్నారు. మనిషిలో స్వార్థం రూపుమాపటం కోసం పెద్దలు పూజా పునస్కారాలను నిర్దేశిస్తే వాటిని కూడా స్వార్ధానికి వాడుకుంటున్నాము.

✳️ మన జీవితమంతా సద్గుణాలను నేర్చుకునే సాధనగా మారాలి. మనం మన పిల్లలను కూడా అలానే పెంచాలి. ఇంట్లో వృద్ధులు ఉంటే చిన్నపిల్లలకు వృద్ధాప్యం గురించి తెలుస్తుంది. వారికి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు తాతయ్యలు, బామ్మలనుండి కథల రూపంలో నేర్చుకుంటారు. ముసలివాళ్ళకు సేవచేయడం ద్వారా వాళ్ళకి పుణ్యం వస్తుంది. నేడు మనం వృద్ధులకు చేసే సేవచూస్తేనే రేపటి మన వృద్ధాప్యంలో మన పిల్లలు తిరిగి మనకు ఆ సేవ చేయగలుగుతారు. బడిలో అనేక పాఠ్యాంశాలు చెప్తారుగానీ జీవితపాఠాలు చెప్పరు. మనకట్టు, బొట్టు, సాంప్రదాయంగురించి భోధించే బామ్మలు తాతయ్య లను అనాథాశ్రమాల్లో చేరిస్తే వారు మన ఆత్మీయతను మాత్రమే నష్టపోతారు. మనం, మన పిల్లలు జీవితానికి అవసరమైన ఏన్నో మార్గదర్శ కత్వాలను కోల్పోతాం. మన వినోదానికి, టి.వి. సీరియళ్ళకు వృద్ధులు అడ్డమనుకుంటే రేపటి మన వృద్ధాప్యం ఏమిటి? వారి మాటలు చాదస్తాలుకావు. జీవితసత్యాలు. వృద్ధులులేని ఇంట్లో నేడు సుఖం పొందుతున్నామని భ్రమిస్తున్నాము కానీ రేపటి సుఖసంతోషాలనిచ్చే పుణ్యాన్ని కోల్పోతున్నామని తెలుసుకోలేక పోతున్నాం. 

✳️ జబ్బు వచ్చిందని తెలిస్తే వీధి చివర ఉన్న వారినైనా వెళ్ళి పలకరించే సంస్కృతి మనది. మంచానపడ్డ తల్లిని కూడా పలకరించే బాధ్యత లేని జీవితం విదేశాలది. మనందరం మనమన జీవన విధానాలను ప్రశ్నించుకోవాలి. విచారమార్గం అంటే భగవంతుడ్ని, ఆత్మను గురించిన విచారణ' మాత్రమే కాదు. మనజీవనంలో ప్రతిబింబించే మన మనస్తత్వాన్ని విశ్లేషించు కోవడం, ప్రతిక్షణం వివేకంతో మెలగటం, తెలివితో బుద్ధిగా వ్యవహరించడం ద్వారా జీవితమంతా విచారమార్గంగానే సాగాలి. 

✳️ జీవితంలో సబ్బుల్ని మార్చినంత సులభంగా మనసును మారుస్తూ వెళ్తేఎలా? మనసుకు దృఢత్వం నేర్పాలి. మనసు దృఢత్వాన్ని తగ్గించేవి మనలోని వాసనలు. వాసనలంటే మనను ఇష్టంరూపంలో ప్రేరేపించే వికారాలు. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. నాలుగునెలల పాప యోగాసనాలు వేస్తుంది. అలావేయటంలోని ఆంతర్యం ఆ జీవుడి పూర్వ సంస్కారంలోని వాసనలే.
[7/29, 15:10] +91 73963 92086: మనం వినే విషయంకూడా మన పూర్వ వాసనలను బట్టే మనకు అవగాహనలోకి వస్తుంది. బాధించే వాసనలను జయించడంతోపాటు. కొత్త వాసనలు ఏర్పడేటప్పుడే తగిన జాగ్రత్తలో ఉండాలి. మంచి మాటలు చెప్పే తల్లిదండ్రుల కన్నా తాయిలాలు పెట్టే పక్కింటివారినే పిల్లలు ఇష్టపడతారు. మన ప్రవృత్తికూడా అలానే ఉంది. ధర్మంచేప్పే గురువులకన్నా ఆశలుచూపే గురువులనే అధికంగా ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఒక మార్గంలో హాయిగా గడిపేవాడని తన మార్గంలోకి మార్చాలని మరొకడి ప్రయత్నం. తాను నమ్మిన దైవాన్ని నమ్ముకోమని చెప్పే అలాంటివాడి ఇంట్లో అప్పటికే అనేక కష్టాలు, రోగాలు ఉంటాయి. మన సాంప్రదాయాన్ని మరిచి తాను వ్యాపారంలో దివాళా తీసిన వ్యక్తికూడా తాను నమ్మిన మార్గాన్నే అందరికీ బోధించాలని చూస్తాడు. దైవం ఎడల విశ్వాసం ఉండాలిగానీ మార్గాలపై మూఢనమ్మకం కీడుచేస్తుంది.

✳️ మన గుణదోషాలను మనోవిశ్లేషణ ద్వారా మార్చుకోగలం గానీ తాయత్తులు, విబూదులతో మార్చుకోవాలనుకోవడం వివేకం కాదు. మన అహంకారాన్ని వివేకంతో దాటాలి. భార్యను తిట్టటం, భర్తను వేధించడం వ్యాధిలక్షణమని కొందరనుకుంటారు. అదే నిజమైతే వారు అందరి వద్ద అలానే ఉండాలి కదా! తన కూతురుకి అత్తగారు లేకుండా ఉంటే బాగుండని కోరుకునే తల్లి తన కోడలు మాత్రం తనమాట వినాలని అనుకుంటుంది. ఎవరి బలం అధికంగా ఉంటే వారి అహంకారం గెలవాలని చూస్తారు. బుద్ధికి మగ, ఆడ అని లేదు. పిల్లలకు బొమ్మలు కొనేటప్పుడు కూడా ప్రేమను మరిచి మన అహంకారమే గెలవాలని చూస్తాం. మనసుకు వివేకం, విశ్లేషణ, సత్యదృష్టి ఉంటే ప్రతివ్యక్తి మనకి జీవితాన్ని నేర్పే గురువే అవుతారు. జీవితంలోని అన్ని కోణాలను సన్మార్గంలోకి మార్చటం నిజమైన ఆధ్యాత్మికత అవుతుంది. అది మాత్రమే నిజమైన శాంతిని మనకి అందిస్తుంది. కేవలం పూజాసమయంలోనే మనసును నిగ్రహించాలనుకోవడం అవివేకం. మన జీవితమంతా వివేకదృష్టితో ఉంటేతప్ప దైవాన్ని దర్శించడం కష్టం.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment