హరిఓం ,
"*సృష్టిలో దైవము తప్ప ఏదీ శాశ్వతము కాదు..
సృష్టిలో అన్నింటికన్నా విలువైనది కాలము..
అట్టి కాలము కూడా శాశ్వతం కానపుడు, ఇంకా విలువలేనివి
ఏ విధముగా శాశ్వతము అవుతాయి?*
ఈనాడు మీకు జీవనము భారముగా ఉన్నదంటే కారణము కుటుంబ సమస్యలు కానే కాదు!
కేవలము మీరు శాశ్వతములు అనుకున్నటువంటి అశాశ్వతములు వలనే మీకు దుఃఖములు, కష్టములు!
రోగికి టానిక్కులు బలాన్ని ఇస్తాయని జీవితమంతా టానిక్కులే తీసుకుంటారా?
లేదు కదా!!
శరీరమునకు మంచి ఆహారము వలనే ఆరోగ్యము.
అది శరీరము పుష్టికి శాశ్వతము.
అలానే వస్తు విషయాలు, బందు మిత్రులు మొదలగు అందరూ అశాశ్వతము..
అశాశ్వతములు వలన కలిగే ఆనందం అత్యల్పమే అగును.
కానీ భగవంతుడు శాశ్వతుడు. కనుక ఆయన వలన కలిగే ఆనందము శాశ్వతము.
ఇట్టి శాశ్వత ఆనందమును పొందాలంటే దైవమును విడువక పట్టుకోవాలి. విషయాల పట్ల వాంఛలను వదులుకోవాలి."``........`
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*........ - - ****** - *"ధైర్యం"*
"మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవడు?" అని యక్షుడు ధర్మరాజును అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్య అనో భర్త అనో, పిల్లలు, పేరు ప్రతిష్ఠలు అనో సమాధానం చెబుతారు.
కానీ ధర్మరాజు మాత్రం “మనిషికి జీవితాంతం తోడుండే వారు ఎవరూ లేరు. అలా ఉంటారనుకోవడం భ్రమ. అన్ని రకాల అనుబంధాల్లోనూ ఎవరి అవసరాలు వారికుంటాయి. అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు"అని చెప్పాడు.
ప్రపంచంలో తెలివైన వారెవరైనా అంగీకరించకుండా ఉండలేని విషయమిది. మనిషిని నిజంగా కాపాడేది భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూడిన గుండె ధైర్యమే............... - - 🙏🙏 ....... - వలిశెట్టి లక్ష్మీశేఖర్ ... - 30 .07 .2024..... - 98660 35557 ...
No comments:
Post a Comment