[7/31, 15:51] +91 73963 92086: జీవుడు - మోక్ష మార్గాలు
["ఆర్షవిజ్ఞాన సర్వస్వం" అను గ్రంధం నుంచి గ్రహించబడినది.]
🙏🌹🪷🌹🪷🕉️🌹🪷🌹🪷🙏
🪷 జ్యోతిష్యశాస్త్రపరంగా తారామండలంలోని నక్షత్ర వీధులు, వాటివలన ఏర్పడే మార్గాలు, మరణించిన తరవాత జీవుడు పయనించే మూడు ముఖ్యమైన ఉత్తర, దక్షిణ, మధ్య [ మోక్ష] మార్గాల గురించి ఆసక్తి ఉన్న వాళ్ళు తెలుసుకోండి♪.
🪷 ఈ భూమ్మీద జీవుడు మరణించాక సూక్ష్మ దేహాన్ని ధరించి అంతరిక్ష మార్గం ద్వారా పరలోకానికి వెళ్తాడు అని మనపురాణాలు చెప్తున్నాయి♪. జీవుడు చేసుకున్న కర్మల ప్రకారం అతడి సూక్ష్మశరీరం ఏ మార్గం గుండా వెళ్తుంది, అంతరిక్షంలో ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి అన్నది వాయు పురాణంలో విపులంగా చెప్పబడింది♪. దీనికి జ్యోతిష్య శాస్త్రంతో సంబంధం ఉండటం విశేషం♪.
👉 అదేంటో ఎలాగో ఇప్పుడు చూద్దాం♪.!!!!!
🪷 మన భారతీయ వేదాంగాలలో ప్రముఖమైనదిగా చెప్పబడే జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, తారామండలాన్ని గణిత సౌలభ్యం కోసం మన ఋషులు మొత్తం 27 నక్షత్రాలు గా విభజించారు♪. వాటిల్లో మూడేసి నక్షత్రాలని ఒక జట్టు చొప్పున పెడితే అది ఒక *“వీధి”* అవుతుంది♪. అలాంటివి మూడు వీధులు కలిపి ఒక *“మార్గం”* అవుతుంది♪. ఆ విధంగా అంతరిక్షంలో మూడు మార్గాలు ఉన్నాయని శాస్త్రం చెపుతోంది♪. ఇక్కడ “మార్గము” అంటే జీవుడు మరణించిన తరవాత సూక్ష్మ దేహాన్ని ధరించి తన కర్మానుసారం పరలోకాలకు వెళ్ళే మార్గం అని అర్ధం♪.
🪷 సూర్యమండలం ద్వారా అంతరిక్షంలోకి ఉత్తర, దక్షిణ, మధ్య అనే మూడు మార్గాలున్నాయి♪. పైన చెప్పినట్టు మూడేసి నక్షత్రాలని ఒక జట్టుగా పెడితే అది ఒక వీధి అవుతుంది♪. అలా మూడు వీధులు కలిస్తే ఒక మార్గం అవుతుంది♪. ఆ విధంగా 27 నక్షత్రాలని మూడేసి చొప్పున ఒక జట్టుగా చేస్తే ..
🪷 మొదటి మూడు నక్షత్రాలు అయిన *అశ్వని, భరణి, కృత్తిక* ఈ మూడు కలిపితే దాన్ని “నాగవీధి” అంటారు♪. *రోహిణి, మృగశిర, ఆరుద్ర* ఈ మూడు కలిపితే దాన్ని “గజవీధి” అంటారు♪. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ మూడు కలిపితే దాన్ని “ఇరావతవీధి” అంటారు♪.
✅👉 అలా, పైన చెప్పిన మూడు నక్షత్ర వీధులని కలిపితే దాన్ని “ఉత్తరమార్గం” లేదా “దేవయానమార్గం” అని అంటారు♪.
🪷 తరువాత నక్షత్రాలు అయిన *మఖ, పుబ్బ, ఉత్తర* ఈ మూడు కలిపితే దాన్ని “ఆర్షతీవీధి” అంటారు♪. హస్త, చిత్త, స్వాతి ఈ మూడూ కలిపితే దాన్ని “గోవీధి” అంటారు♪. విశాఖ, అనురాధా, జ్యేష్ఠ ఈ మూడూ కలిపితే దాన్ని “జారద్గవీవీధి” అంటారు♪.
✅👉 అలా పైన చెప్పిన మూడు నక్షత్ర వీధులని కలిపితే దాన్ని “మధ్యమమార్గము” అంటారు.
🪷 తరువాత నక్షత్రాలు అయిన మూలా, పూర్వాషాడ, ఉత్తరాషాడ ఈ మూడు కలిపితే దాన్ని “అజవీధి” అంటారు. శ్రవణ, ధనిష్ట, శతభిషం ఈ మూడు కలిపితే దాన్ని “మృగమార్గం” అంటారు. *పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి* ఈ మూడు కలిపితే దాన్ని “వైశ్వానరీవీధి" అంటారు.
✅👉 అలా పైన చెప్పిన మూడు నక్షత్ర వీధులని కలిపితే దాన్ని “దక్షిణామార్గం” లేదా “పితృయానం” అంటారు.
🪷 గగనమండలంలో ఉన్న అగస్త్యముని నక్షత్రానికి ఉత్తరంగా “అజవీధికి” దక్షిణంగా ఉన్నది “దక్షిణమార్గం” లేదా “పితృయానం” మార్గం. ఈ దక్షణమార్గంలో అగ్నిహోత్రాదులని చేసే మహాత్ములైన ఋషులు బ్రహ్మదేవుని ఋజ్మంత్రములతో స్తుతిస్తూ ఉంటారు♪. ఈ మార్గమే చలనము [ వినాశన స్వభావము ] కలది అవటం వలన ప్రతి యుగంలోనూ బ్రహ్మ దీన్ని మళ్ళీ పునఃసృష్టి చేస్తూ ఉంటాడు♪.
🪷 ప్రతిఫలాపేక్షతో ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళే ఈ దక్షిణమార్గం నుంచి వెళ్తారు♪. చేసిన కర్మలు వాటి ఫలాలు మళ్ళీ అనుభవించడం కోసం వాటికి తగ్గట్టుగా మళ్ళీ వాళ్ళ వాళ్ళ సంతతికి చెందిన కుటుంబాల్లోనే పుడతారు♪. అలా మితిలేని కోరికలతో పుడుతూ చస్తూ రాక పోకలు చేసేవాళ్లకే ఈ దక్షిణమార్గం అని చెప్పబడింది♪.
🪷 తరువాత, “ఉత్తరమార్గము” లేదా "దేవయానమార్గము”. ఇది కూడా అగస్త్యముని నక్షత్రానికి ఉత్తరముగానూ, “నాగవీధి” దేనికి ఉత్తరమవుతుందో, సప్తఋషీమండలము దక్షిణమవుతుందో అదే సూర్యునికి కూడా ఉత్తర మార్గము అవుతుంది. దానినే “ఉత్తరమార్గము” లేదా “దేవయాన మార్గము” అని అంటారు♪.
🪷 పరమ సిద్ధులు, బ్రహ్మచారులే ఈ “దేవయానమార్గం” లోకి ప్రవేశిస్తారు. సంతానాన్ని ఎవరైతే నిరసిస్తారో [ అంటే ఇంకా ఏ విధమైన మమతానురాగబంధాలు లేకుండా] వాళ్ళే మృత్యువుని కూడా జయిస్తారు అని చెప్పబడింది♪.
🪷 ఈ దేవయాన మార్గానికి ఎనభైవేల మంది ఊర్ధ్వరేతస్కులైన [ అస్కలన ]మునులు రక్షణగా ఉంటారని చెప్పబడింది♪. ఆభూతసంప్లవము వరకూ [ సమస్త వాసనలు అణు మాత్రమూ కూడా మిగలకుండా నశించే వరకూ ] వాళ్ళు అక్కడే ఉంటారు♪.
🪷 ఎందుకంటే, కామలోభోపహతులు కాకుండా కేవలం మైధునాన్ని వర్జించిన వాళ్ళు మళ్ళా అటువంటి వాటిపైకి తిరిగే అవకాశం ఉండటం వలన. కేవలం పరిశుద్ధాంతఃకరణులైన వాళ్ళే శాశ్వతమైన అమృతత్వాన్ని, జన్మరాహిత్యాన్ని పొందుతారు గనక వాళ్ళు ఆభూతసంప్లవము వరకూ [ సమస్త వాసనలు అణు మాత్రమూ కూడా మిగలకుండా నశించే వరకూ ] వాళ్ళు ఈ మార్గంలోనే ఉంటారు అని చెప్పబడింది•.
[7/31, 15:51] +91 73963 92086: 🪷 తరువాతది, “మధ్య మార్గము’. సప్తఋషి మండలానికి పైన ఉత్తరంగా ఎక్కడ ధృవనక్షత్రం స్థిరంగా ఉంటుందో అది మూడవ మార్గమైన “మధ్యమార్గము”. ఇది గగనమండలంలో చాలా దేదీప్యమానంగా ఉంటుందని చెప్పబడింది. దీన్నే “విష్ణుపదం” “మోక్షపదం” అంటారు. ఈ పదం పరమపదం.
🪷 ఇది నిర్దోషులైన సంయతాంతఃకరణులైన యతులకు వాళ్ళ పుణ్యపాపములు సమూలంగా నాశనమవ్వడం వలన లభిస్తుంది♪. అశేషమైన పుణ్యపాపాలు నశిస్తే గానీ పూర్తిగా దుఃఖం నశించదు♪. ఎక్కడ దుఃఖం ఉండదో అదే విష్ణుపదం♪. అదే పరమపదం♪. ఇది మామూలు కంటికి ఎంత మాత్రమూ కనపడనిది♪. ఎవరు జ్ఞానయోగంలో తన్మయులవుతారో కేవలం వాళ్ళ జ్ఞాన నేత్రాలకు మాత్రమే అది కనపడుతుంది♪. అలాంటి వాళ్ళందరూ అక్కడ సుఖంగా ఉంటారు•.
🪷 ఇలాంటి అనేక విషయాలతో కూడిన జ్యోతిష్య శాస్త్రం అనంతమైన కాలపరిజ్ఞానానికి ఎంతో ఉపయుక్తమైంది. “అప్రత్యక్ష్య మన్యశాస్త్రం ప్రత్యక్ష్యం జ్యోతిషంస్కృతం” అన్న ప్రమాణం నిజంగా నిజమైనది♪! -
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు
సేకరణ:
🙏🪷🌹🪷🌹🕉️🌹🪷🌹🪷🙏
No comments:
Post a Comment