సగర్భ జపం ఉత్తమోత్తమం.
ప్ర: 'సగర్భప్రాణాయామం,' 'సగర్భజపం' - అంటే ఏమిటి. రెండు ఒకటేనా?
జ: ప్రాణాయమం చేసేటప్పుడు ఉచ్ఛ్వాసనిశ్వాసలతో మంత్రాన్ని కలిపి మౌనంగా జపించడమే సగర్భ ప్రాణాయామం. సగర్భ జపమన్నా అదే.
ఉచ్ఛ్వాసతో ఒకమారు, నిశ్వాసతో ఒకమారు మంత్రాన్ని మౌనంగా జపించాలి. శ్వాస, మంత్రం ఏకమవడమే గొప్ప సాధన. రేచక, పూరకల్లోనే కాక కుంభకంలో మంత్రాన్ని జపించడాన్ని కూడా సగర్భ జపమనే అంటారు.
మంత్రాన్ని బయటకు ఉచ్చరిస్తే అధమం, పైకి వినబడకుండా పెదవి కదుపుతూ చేయడం మధ్యమం, మనస్సుతో జపించడం ఉత్తమం. సగర్భ జపం ఉత్తమోత్తమం.
No comments:
Post a Comment