*Experience the Sweetness in Talking Less | Excerpts from The Divine Discourse | July 19, 1997 |*
*భగవాన్ ఉవాచ!!!*
*శాంతి ఎక్కడుంది? భౌతికంగా చూస్తే శాంతి, గాధ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాది. ఇక రెండోది ఏ దాంట్లో సంకల్ప రహితుడైనపుడు శాంతి లభిస్తుంది. కానీ సంకల్పములు అంత త్వరగా మనకు అరికట్టుకోడానికి వీలుకాదు.*
*కనుకనే, మనము సాధ్యమైనంతవరకును దినమునకు ఒక గంటైనా కూడను మౌనాన్ని వహించాలి. మాట్లాడి..మాట్లాడి..మాట్లాడి..మాట్లాడి..మాట్లాడి.. బ్రెయిన్ లో ఉన్నటువంటి నరములంతా బలహీనమైపోతాయి. ఆ TALK లోపలను పవిత్రమైనటువంటి TALK గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జి అవుతుంటాది. అపవిత్రమైనటువంటి పర నిందలు కానీ, పర ధూషణ కానీ, పర చెడ్డలు కానీ మనం పలుకుతూ ఉంటే మన జీవితం మరింత అధోగతి పాలవుతుంది.*
*కనుక ఈ నాటి యువకులంతా, మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి. అందులో ఉండినటువంటి మాధుర్యమును ఎంతనో మీరు అనుభవించగలరు.*
ఎక్కడైనా సమాజములో చూస్తే, ఆ పిల్లవాడు చాలా మంచి వాడు, ఎవ్వరితోను మాట్లాడడు, చాలా QUIET గా ఉంటాడు అని సత్కీర్తిని పొందుతాడు. మాటలెక్కువగా మాటాడేవాడుగా ఉంటే, నిరంతరము కూడను వడవడవడగా వాగుతుంటారు. అలాంటి వారిని చూస్తే కొంత మంది సమాజములో కూడను వస్తున్నాడురా ఈ వాయావి అంటూ వెళ్ళిపోతుంటారు. ఈ బోరుగా ఉండేటివంటివాడు వస్తున్నాడు అని తప్పించుకుని పోతారు. కనుక నిన్ను తప్పించుకోవడమే కాకుండా ఒక చెడ్డపేరు కూడా వస్తుంది.
*మిత భాష అతి హాయి! అతి భాష మతి హాని !*
No comments:
Post a Comment