🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏼
🚩నమః శుభోదయం 🚩🚩
విమలానంద బొడ్ల మల్లికార్జున్
గతానికి వర్తమానంలో మనుగడ లేదు.
జ్ఞాపకంలోనే గతం జీవిస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా వర్తమానానికి అనుసంధానం చేస్తుంటుంది.
పగిలిన కళ్లద్దాల ద్వారానే భవిష్యత్తును చూడటం అలవాటు చేస్తుంది. ఎప్పుడూ గతం గురించి ఆలోచించడానికి అలవాటుపడితే కొత్త క్షణాల్ని కోల్పోతాం. మునుపటి జ్ఞాపకాలతో జీవించేవారిని నిరుపయోగమైన భావనలు అనుక్షణం నిర్వీర్యం చేస్తుంటాయి. ప్రతి అనుభవం ఉందో లేదో తెలియని రేపటి భవిష్యత్తుకు మేలుకొలుపు కావాలి అన్నారు. వివేకానంద. పిల్లనగ్రోవి పాత గాయాల గురించే ఆలోచిస్తే మధుర వేణునాదం వినిపించగలదా? కాంతులు చిమ్మే వజ్రం ఒకప్పుడు ఎవరూ గుర్తించని రాయి!
ప్యూపా దశలో రెక్కలు, కాళ్లు ముడుచుకున్న గతాన్ని తలపోస్తూ కూర్చుంటే సీతాకోకచిలుక అవధులు లేని ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరగలదా?
గత జ్ఞాపకాల దగ్గరే ఆగిపోతే గౌతమబుద్ధుడు, వివేకానందుడు చిరంజీవులయ్యేవారా?ఎప్పటికప్పుడు గతాన్ని వదిలేసి, వర్తమానంలో మేల్కొని ఉండేవారి జీవితమే సజీవంగా ఉంటుంది.
వర్తమానంలో మెలకువగా ఉండటమే ఆధ్యాత్మికత అన్నారు మన పెద్దలు.....
జై గురుదేవ్...👏🏼👏🏼
No comments:
Post a Comment