Friday, July 26, 2024

పాంచ భౌతిక తత్వాలు

 🕉🕉🕉  🕉🕉🕉  
                            
*పాంచ భౌతిక తత్వాలు*
   
*ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం...... శబ్దం*     

    *వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ*.

 *అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు*.

  *జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు*
    *భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు*.

    *ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం*.

   *జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము*.

  *అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది*
    *వాయువు‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది*

  *ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది*.

 *ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…,*
 
 *ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు?* 

 *అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి.* 

 *దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి.* 

 *అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు.* 

 *అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు.* 

 *నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే.* 

 *‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే.* 
 *అదే దైవ సాక్షాత్కారం అంటే...** 🙏🏼
🕉🔯🔯🕉☸☸🕉⚛⚛

No comments:

Post a Comment