" ఈ జీవితం తీరు నీకు తెలుసా? "
నీవు సంతోషంగా, నవ్వుతూ వుండాలి అని నిశ్చయించుకోగానే, నీచుట్టూ వున్న ప్రపంచం నిన్ను ఏడిపించడానికి కుటిల ప్రయత్నం చేస్తుంది. ఇది జీవితం అంటే !
నీకు బాధ కలిగించిన వ్యక్తులు, అనుభవాలను క్షమించి, సహనంతో వుండాలి అని నీవు అనుకొన్న మరు నిమిషం నుండే, ఆ వ్యక్తులు మరింత కఠినంగా మారడం మొదలుపెడతారు. ఇది జీవితం అంటే!
చాలా తరచుగా మనం ఇతరుల మాటలకు, పనులకు మానసిక వేదనకు గురి అవుతుంటాము.ఆదిత్యయోగీ.
కానీ అవతలి వ్యక్తుల అలాంటి ప్రవర్తన, " నేను దయతో వుండాలి " అనే నీ నిర్ణయం పై ప్రభావం చూపకుండా నీవు దయతోనే వుండాలి.
ఇతరులు వారికి తోచినట్టు ప్రవర్తించనీ గాక ! నీవు నీ ఉన్నతమైన నిర్ణయానికే కట్టుబడి జీవించు.
నీకు కావాల్సింది (తరచు అవసరం కొద్దీ మారే ) మనుషుల ప్రశంస కాదు, సత్యము, శాశ్వతము అయిన భగవంతుడు నీకు ఇచ్చే ధ్రువపత్రమే ముఖ్యమైనది. అదే నీకు కావాల్సింది..*🙏🏻💐
No comments:
Post a Comment