Saturday, July 27, 2024

****నాకు జీవితం లో ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు మరియు దేనిమీదా ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి?

 💝 *నాకు జీవితం లో ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు మరియు దేనిమీదా ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి?* 


❤️ *జీవితంలో కొన్ని రోజులు మీ అన్నీ పనులు పక్కన పెట్టీ ఈ ఒక్క పని చెయ్యండి*…

💖మొదటి రోజు..ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ పీ వార్డ్ కి వెళ్లి ఓ. పి రాయించుకుని కూర్చోండి.ఏమీ చెయ్యొద్దు.అక్కడ ఉన్నవారిని గమనించండి. రోగాలతో బాధ పడేవారూ, వారి ఆర్థిక స్థితిగతులు,అక్కడి చుట్టూ పరిసరాలు చూడండి.మాట కలిపే మనసు మీకు ఉంటే వారి వ్యధనంతా మీ ముందు ఉంచుతారు.అన్నీ విని ఏం చేయకుండా వెళ్ళిపొండి.

💖రెండో రోజు…ఒక పూట అనాథ శరణాలయానికి మరో పూట వృద్ధాశ్రమానికి వెళ్ళండి. ఒకరు ఎవరికి పుట్టామో తెలియని వారు మరొకరు ఎవరి కోసం ఇంత కాలం బ్రతికామో తెలియని వారు.జీవితానికి మొదటి పుటలో ఒకరుంటే చివరి మజిలీ దగ్గరలో మరొకరు ఉన్నారు.వాళ్ళ అవసరాలు తెలుసుకోండి,సాధకబాధకాలు వినండి.ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కో కథ!!కళ్ళ నీళ్ళు పెట్టకుండా ఇంటికి వెళ్లగలరేమో వెళ్ళండి.

💖మూడో రోజు…డబ్బులు,మొబైల్ లేకుండా ఒక కొత్త చోటుకు వెళ్ళి ఒక రోజంతా మొత్తం తిరగండి,తినండి!!.డబ్బు లేకుండా ఎలా అన్న అనుమానం వచ్చింది కదా…సహాయం అడగండి ఆకలి వేస్తుంది తినడానికి ఏదైనా పెట్టండి అని ప్రాంక్ వీడియోలు చూస్తూ ఉంటాం కదా అలా ఏ అరటి పళ్ళ బండి వాడినో,టిఫిన్ బండి వాడినో అడిగి తినండి.మీ జీవితంలో అంత రుచికరమైన భోజనం ఎప్పుడూ చేసి ఉండరు.ఉచితంగా వచ్చినందుకు కాదు..మంచి మనసుతో పెట్టినందుకు!!.

💖నాలుగవ రోజు…శ్మశానం దగ్గరకు వెళ్ళండి.భారంగా చేరుకున్న ఒక(రి) అంతిమ యాత్ర ఎదురవుతుంది.మాట కలపాలన్నా గొంతు నుండి బయిటికి ఏమీ రాదు.అప్పటికే ఒకలాంటి స్మశాన వైరాగ్యం మిమల్ని చుట్టుకుని ఉంటుంది కనుక మౌనంగా ఇంటికి వెళ్ళిపొండి.

💖ఐదవ రోజు ఎక్కడికైనా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్న చోటుకి వెళ్ళండి.మనుషులు, కాలుష్యానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉండే చోటుకి వెళ్ళి మౌనంగా మీతో మీరు ఉండండి.

💖ఆరవ రోజు….మొదటి ఐదు రోజులు మీకు కలిగిన అనుభవాన్ని ఒక పుస్తకంలో రోజుల వారీగా రాయండి.వీలైతే రోజు మొత్తం మౌనంగా ఉండండి.మీ మనసులో ఉన్న సందేహాలు,బాధ,సంశయం ఏదైనా మొత్తం అక్షర రూపంలో పెట్టండి.

💖ఏడవ రోజు…గుడికి వెళ్ళండి..108 ప్రదక్షిణలు చేసి దైవ దర్శనం చేసుకోండి,ఆ గుడి ప్రాంగణంలో మౌనంగా కూర్చుని ధ్యానం చేయండి.మీరు బ్రతుకుతున్న సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞత తెలపండి.

💓 ~ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం అని మీకు అనిపించవచ్చు.కానీ ఈ ఏడు రోజుల ప్రయాణంలో మీరు తెలుసుకున్న, చూసిన ప్రపంచానికి ..మీరు బ్రతుకుతున్న ప్రపంచానికి మధ్య తేడా ఏమిటో తెలుస్తుంది.అప్పటి వరకూ మీరు చూసిన ప్రపంచంలో మీరు చూడలేకపోయిన మరో కొత్త,అందమైన ప్రపంచం ఉందని తెలుసుకుంటారు.ఏది విలువైనదో ఏది కాదో తెలుస్తుంది.మీ దగ్గర ఉన్నది ఏమిటో అర్థమౌతుంది.మీ వంతుగా లేని వారికి ఏం చెయ్యాలో అర్థం అవుతుంది.జీవితం మిమల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది.మీ అస్తిత్వానికి అర్దం తెలుసుకుని అది ప్రపంచానికి తెలిసేలా చేయాలన్న సంకల్పం పుడుతుంది.మీలో ఇటువంటి ఆలోచన పుట్టినప్పటి నుండీ మీ జీవితం మీద మీకు శ్రద్ధ,ఆసక్తి పెరుగుతుంది.ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితి నుండి ఇదీ చెయ్యాల్సింది అన్న ఆశయం పుడుతుంది. చేసి పని నచ్చుతుంది..నిజానికి మీ పనినీ,జీవితాన్ని,మీ చుట్టూ ఉన్న వారిని కూడా ప్రేమించడం మొదలు పెడతారు.

🙏🏼🌼🌼🙏🏼
Forwarding 
Good Msg Recd.from a group

👏🙏🌼🤝🤝🌼🙏👏

No comments:

Post a Comment