🪷🙏🏻🪷🙏🏻🪷
🙏 *రమణోదయం* 🙏
*ఇహ పరాల్లో పొందే అల్ప సుఖానుభవాలపై ఆశలు పెంచుకొని దుఃఖిస్తున్న ఓ మనసా! నీవు ఎటువంటి తలపులు లేకుండా నీ సహజ స్థితిలో ఉంటే ఇహపరాలని దాటిన బ్రహ్మానంద ముక్తిని నిశ్చయంగా పొందుతావు.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.379)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🌹🌹🙏🙏 🌹🌹
*శ్రీ గురుభ్యోనమః*
నీ హృదయంలో ఒక నిజం ఉంది ! నీ హృదయంలో ఒక సత్యం ఉంది ! చావులేని ఆ పదార్థం గురించి తెలుసుకుంటేనే గాని, చావులోంచి నువ్వు బయట పడలేవు. పుట్టినవాడు చనిపోతూ ఉంటాడు, చనిపోయినవాడు పుడుతూ ఉంటాడు. ఇది సంసారం. కోరికలతోనే నువ్వు పనులు చేస్తావు, కోరికతో పని చేయటం మానవు, కోరిక వల్లే సంసారం కూడా వస్తుంది.
*భగవద్గీతలో చెప్తాడు .. కామ్యకర్మలు చేసినంతకాలం .. మనిషివెంట నీడ ఏవిధంగా అయితే వెంటాడుతుందో, అదేవిధంగా కోరికలు కోసం పనిచేసేవాడికి, సంసారం ప్రతీజన్మలో నీడలా వెంటాడుతుంది.*
కొంతమంది ఉంటారు .. మీరు మాకేమీ ఉపకారం చెయ్యద్దు, మా ముఖంవంక చూసి కొంచెం నవ్వుండి చాలు అంటే నవ్వరు. నవ్వితే మాకేం కలిసి వస్తుందని ! వాళ్ళకి నవ్వటం వల్ల కూడా కలిసి రావాలి. మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు ? మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు ? ఇదీ .. ఇప్పుడు సిద్ధాంతం ! వీళ్ళకి సంసారం ఏం విడిచిపెడుతుందన్నాడు భగవవద్గీతలో భగవంతుడు ! కృష్ణుడంటే .. ఊరికే వసుదేవుడు గారి అబ్బాయి అయి చెప్పలేదు. ఆయన పరబ్రహ్మమై చెప్పాడు, పరిపూర్ణుడై చెప్పాడు, ఈశ్వరుడై చెప్పాడు, సర్వజ్ఞుడై చెప్పాడు, నారాయణుడై చెప్పాడు అది *భగవద్గీత !!*
*శంకరాచార్యులవారు అన్నారు ..* ఎన్ని పుస్తకాలకైనా వ్యాఖ్యానం వ్రాయచ్చు కానీ, *భగవద్గీత* కు వ్యాఖ్యానం రాయటం కష్టం. భగవంతుడు చెప్పిన మాటకు లోతు ఎంతుందో నాకు తెలియటం లేదు అన్నారు ఆచార్య స్వాములవారు.
*శ్రీ నాన్నగారి అనుగ్రహ భాషణం -*
*మురమళ్ళ :* 2005 / 02 / 09
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment