Wednesday, December 25, 2024

 నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు
 గాల మందు చిక్కి గూలినట్లు
 ఆశ బుట్టి మనుజు డారీతి చెడిపోవు
 విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: నీళ్ళలోని చేప కొంచెం మాంసానికి ఆశపడి గాలానికి చిక్కినట్టు, మనిషి ఆశ పుట్టి చెడిపోతాడు.

 ఆశ పాపజాతి యన్నింటికంటెను
 ఆశచేత యతులు మోసపోరె
 చూచి విడుచువారె శుద్ధాత్ములెందైన
 విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఆశ చాలా పాపమయినది. అశచే మునులు సహితము చెడిపోయిరి. ఆ ఆశను విడిచినవారే నిష్కల్మషమయిన మనసు గలవారు.

 అన్నిదానములను నన్నదానమె గొప్ప
 కన్నతల్లికంటె ఘనములేదు
 ఎన్న గురునికన్న నెక్కుడులేదయా
 విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: అన్ని దానములకంటె అన్నదానము గొప్పది. కన్నతల్లి కంటే మించినదిలేదు. గురువుకంటె గొప్పదిలేదు.     

No comments:

Post a Comment