*సత్సంగం* 🚩
*భక్తుడికి - భగవంతుని పై ఎలాంటి విశ్వాసం వుండాలి???*
*మన దృష్టి ఎట్టిదో సృష్టి అలాంటిది.*
*మనం చూసే విధానం...పట్టి భగవంతుని అనుగ్రహము కూడా వుంటుంది.*🙏🙏🙏
ఒక చిన్న సంఘటన ద్వారా పరిశీలిద్దాం!!!...
ఒక భారతీయుడు, ఒక ఆంగ్లేయుడు, ఇరువురూ గోదావరి నదిలో మునిగి స్నానం చేశారు.
*భారతీయుడు, తాను శారీరకంగానూ, మానసికంగానూ, పరిశుధ్ధుడనయ్యానని ఆ అవకాశం లభించడం తన అదృష్ట మని ఎంతో ఆనందించాడు.*
అది చూసి ఆంగ్లేయుడు, ఓరి పిచ్చోడా అని నవ్వి ...
*" ఇది కేవలం రెండు పాళ్ళు హైడ్రోజన్, ఒక పాలు ఆక్సిజన్ ల కలయిక, దీనిలో మునిగితే, నీకు చెప్పలేని ఆనందం ఎలా కలుగుతుంది"?* అన్నాడు.
సందేహించిన ఆంగ్లేయునికి బాహ్య శుభ్రత మాత్రమే కలిగింది.
నమ్మిన భారతీయునికి ఆంతరంగిక శుభ్రత కూడా కలిగింది...
*ఎలా!!*
*అంతఃశుధ్ధికి కావలసినది భక్తి, విశ్వాసము అని తెలుసుకోవాలి, దైవం అనే విశ్వాసము హృదయానికి, సంబంధించినది.*
*అది మానవతా విలువల రూపంలో ... అంటే శాంతి, ప్రేమ, ధర్మ , సత్యం రూపంలోనూ వ్యక్త మౌతుంది.*
అవిశ్వాసము, లోభము మత్సరము , కామము, క్రోధము ఇవి శిరస్సు కు సంబంధించినవి.
ఈ అరిషడ్వర్గాలున్న మనిషి ముఖం కూడా ప్రశాంతంగా కనపడదు.
దైవం ఉంది అన్న వానికి ఉంది...
లేదు అన్న వానికి లేదు.
నమ్మిన వాడికి సొమ్ము - నమ్మని వాడికి దుమ్ము.
*కానీ వారిని చూసి మనం మోస పోవద్దు, అప్పుడే భగవంతుడి అనుగ్రహానికి పాత్రులమవుతాము.*
🕉️ *సర్వేజనా సుఖినోభవంతు* 🕉️
No comments:
Post a Comment