Saturday, January 11, 2025

 “”శంకర విజయము “””

 (ఎపిసోడ్  01)

"""నమామి  భగవత్పాద శంకరం  లోక  శం  కరం"'"

"""" శం  సుఖం  కరోతీతి శంకరః ""'

ఆర్యాంబా శివగురువులకు జన్మించినవారే శంకర భగవత్పాదులు. పరమేశ్వరుడు శివగురువుకు కలలో కనపడి "" సర్వజ్ఞుడు సద్గుణ సంపన్నుడై అల్పాయష్కుడైన ఒకే కుమారుడు కావాలా? అజ్ఞానులు దుర్మార్గులైన అనేకములైన సంతతి కావాలా? యని ప్రశ్నించగా దానికి శివగురువు

""" పుత్రో~స్తు మే బహు గుణః ప్రథితాను భావః,
సర్వజ్ఞతా పద మితీరిత అబభాషే""

హే జగత్పితా! ఎందుకయ్యా! నన్ను పరీక్షిస్తావు.""సంఖ్యకన్నా  గుణమే మిన్న కదా"" 
అల్పాయుష్కుడైనప్పటికి సుగుణవంతుడైన పుత్రుని ఒక్కడినే ప్రసాదించవయ్యా! అనగా పరమేశ్వరుడు తథాస్తు అని మాయమయ్యాడు.

అలా శంకరభగవత్పాదుల జననం జరిగింది. దీనికి ముందు ఇంద్రాది దేవతలు కైలాసానికి వెళ్లి పరమేశ్వరుని ప్రార్థించారు.

""'పాషాండైః  కర్మ సంన్యస్తం ,
   కారుణ్యమివ దుర్జనైః""
  
స్వామీ! బుద్ధుని అనుయాయలైన బౌద్ధులు వేదాన్ని వైదికులను వైదికధర్మాలను ద్వేషిస్తున్నారు.నాస్తికత్వం ప్రబలకుండగ వైదికమతాన్ని పునః సంస్థాపితమయ్యేటట్లుగ అనుగ్రహించమని కోరగా 

పరమేశ్వరుడు వారితో భయపడకుడు. నేను స్వయంగ భూలోకములో అవతరిస్తాను,వ్యాసమహర్షిచే రచించబడ్డ బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాస్తాను.""అద్వైత సిధ్దాంత స్థాపన చేస్తానని చెప్పి""కుమారస్వామిని కుమారిలభట్టుగ, సాక్షాత్తు బ్రహ్మ దేవుని  మండనమిశ్రునిగ, సరస్వతి దేవిని ఉభయభారతిగా,దేవేంద్రుని సుధన్వ మహారాజుగ మరియు వాయుదేవుని అంశలతో తోటకాచార్య గ భూలోకములో అవతరించమని చెప్పి, విష్ణుమూర్తిని వారి అంశతో సనందునిగ జన్మించమని ప్రార్థించి తాను ఆర్యాంబా శివగురువులకు శంకరుడు అన్న పేరుతో జన్మించాడు.ఇదీ క్లుప్తంగా శంకరభగవత్పాదుల జనన రహస్యం
మరి రేపటి నుండి శంకర విరచిత "" భజగోవింద శ్లోకాల "" రహస్య వివరాలు తెలుసుకొన ప్రయత్నం చేద్దాము.

హర హర మహాదేవ  శంభో శంకర.

No comments:

Post a Comment