Saturday, January 11, 2025

 “”“”శంకరవిజయము””””
  
                 ( ఎపిసోడ్ 2 )

""దుర్లభం  త్రయ  మేవైతత్  దైవానుగ్రహ హేతుకమ్,
మనుష్యత్వం  ముముక్షత్వం  మహాపురుష  సంశ్రయ"""

ఎంత ప్రయత్నించినా మూడు విషయాలు లోకములో అత్యంత దుర్లభాలని మనం గ్రహించాలి. వాటిలో మొదటిది  'మానవజన్మ', రెండవది ఆ జన్మలోనే  ముక్తి కావాలనే తృష్ణ కు లోనవడము, ఇక చివరిది మూడవది మహాత్ములను ఆశ్రయించడము.ఇవి మనం  కావాలనుకున్నా సాధకులుగా మనకి లభించాలన్నా  కేవలము కఠినమైన సాధన కాకుండగ భగవదనుగ్రహము కూడ మనకి  లభించాలి.

శంకర భగవత్పాదులవారు తమ వివేక చూడామణిలో ఈ విషయాన్ని పై విధముగ స్పష్టపరిచారు.

""" భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం  భజ మూఢమతే,
సంప్రాప్తే  సన్నిహితే  కాలే,  నహి నహి రక్షతి డుకృఞ్ కరణే""

సాధకుడు తనసాధించదలచుకున్న గమ్యాన్ని చేరాలనుకున్నప్పుడు వృధ్దాప్యపర్యంతం ఎదో  నేర్చుకునే  క్రమములో వ్యాకరణ సూత్రాలు వల్లించడము సరికాదంటు  భగవదనుగ్రహము కోసము అహర్నిశం శ్రమించాలని చెప్పబడుతున్నది.

శంకరులవారు ఒకరోజు ఒకానొక వృధ్దుడు వ్యాకరణం  వల్లేవేస్తు  శ్రమిస్తు అలసిపోతుండటము గ్రహించి ఆ ముదుసలిని నిమిత్తముగ చేసుకొని పై శ్లోకాన్ని మనకి అందచేసారు.

భజ గోవిందం అంటే అందరుకూర్చుని భజన చేయటము కాదంటు సాధకుడు తన మనస్సును పరమాత్మలో ఆత్మార్పణ చేసుకోవాలని సూచించడము జరిగింది.గోవింద గోవింద యని పరమాత్మను భజిస్తు మానవ జన్మకు సార్థకత చేకూర్చుకోవాలి.అంతేగానీ లౌకిక వ్యవహారాలలో జీవిత కాలాన్ని దురిన్వియోగపర్చుకోరాదని ఈ శ్లోకము ద్వారా మానావాళికి  సందేశమిస్తూ,

''ఓ మందబుధ్దులారా!  మరణమాసన్న మయ్యే సమయములో మనము వల్లె వేస్తున్న వ్యాకరణ సూత్రాలు మనలని రక్షించలేవు.సద్గతులను కలిగించలేవు. కనుక ఈ క్షణము నుండి పరమాత్మ నామస్మరణలో మునిగి తేలండి నాయనా యని శంకరభగవత్పాదులు మనలని హెచ్చరిస్తున్నారు
తస్మాత్ జాగ్రత.

హర హర మహా దేవ శంభో శంకర.

No comments:

Post a Comment