“”””శంకర విజయము”””””
(ఎపిసోడ్ 3),
""శరీరంసురూపం తథా వా కళత్రం,
యశశ్చారురూపం ధనం మేరు తుల్యం,
మనశ్చే న్న లగ్నం గురో రంఘ్రిపద్మే,
తతః కిం? తతః కిం? తతః కిం?తతః కిం?"'
శరీర సౌందర్యమా అద్భుతము, సత్కీర్తితో బాటు అందమైన భార్య, ధనమా గణించలేనంత, కానీ మానవునకు ఇన్ని యున్నా ""గురువు"" పాదపద్మముల సన్నిది లేకపోయినట్లయితే పైన పేర్కొన్న సిరులన్నియు నిష్పయోజనాలే యని గ్రహించాలని
శంకరభగవత్పాదుల వారు తాము రచించిన గుర్వష్టకములో మనకి హితవు పలుకుతున్నారు.
"" మూఢ! జహీహి, ధనాగమతృష్ణాం, కురు సద్బుద్దిం మనసి వితృష్ణాం,
యల్లభసే నిజకర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తం"""
శంకరులవారు తమ భజగోవింద శ్లోకము (2) లో "" ఒరే! మూఢుఢా! ఎంతకాలము ఈ ధనార్జనలో పడి సతమతమవుతావు.ఆ ధనార్జన యనే అభిప్రాయాన్ని నీ మనసు నుండి పారద్రోలలేవా! ఆ విధమైన మితి మీరిన ధనార్జన కోరికని వదిలి సద్భుధ్దితో కూడిన మంచి ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేయి.ఓ దుర్మతీ ! సద్భుద్దీయనగా మనసును పరమాత్మ వైపు సమర్పించి తనువును సత్కర్మల వైపు నీ దృష్టిని మరల్చటమేనయ్యా! యంటు ""కురు సద్భుధ్దిం మనసి వితృష్ణాం"" యని చెప్పి వాటివల్ల వచ్చే విత్తము అనగా ప్రతిఫలము నీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని గ్రహించమని స్వామి మనకి హితవు పలుకుతున్నారు.
స్వామికేమయ్యా ఎన్నైనా చెపుతారు.ధనార్జన లేకపోతే మానవుని జీవనము ఎలా సాగుతుందని ప్రశ్నకి శంకరులు ""యల్లభసే నిజకర్మోపాత్తం , విత్తం తేన వినోదయ చిత్తం"" యని మార్గము సూచించారు.ఏమిటది? సద్భుద్దితో స్వయం కృషితో లభించిన ఫలాన్ని ఆస్వాదించడములో సంతృప్తి యున్నదని గ్రహించమని శంకరులు చెపుతున్నారు.కారణము నిత్యతృప్తుడు ఏ పరిస్థితిలో దైన్యతకి లోనవడు.కనుక మానవుడు తృష్ణను బహిష్కరించి గురుపాదాలని ఆశ్రయించి స్వయంకృషితో నిత్యానందములో ఆత్మధ్యానములో మునిగి తేలాలని శంకరభగవత్పాదుల వారు""భజ గోవిందం భజ గోవిందం"" యనే రాజమంత్రముతో మానవాళిని మేల్కొలుపుతున్నారు.
తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త.
హర హర మహాదేవ శంభోశంకర.
No comments:
Post a Comment