Saturday, January 11, 2025

(శంకర విజయము ) ఎపిసోడ్సు (5 మరియు 6) )

 (శంకర విజయము )

ఎపిసోడ్సు   (5  మరియు 6)  )

""" యోగినో  భోగినో వా~ పి, త్యాగినో  రాగిణో~ పిచ,
జ్ఞానా న్మోక్షో న సందేహః , ఇతి వేదాంత డిండిమః""""

సాధకులలో నాలుగు రకాలవారుంటారు. వారు వరుసగా యోగులు భోగులు, త్యాగులు మరియు విషయానురాగులు. ఈ నలుగిరిలో ఎవరికైనా  సరే   జ్ఞానము వలననే మోక్షము  సంప్రాప్తమవుతుంది.ఈ విషయములో ఎవ్వరికిని ఇసుమంతయు సందేహము యుండనక్కరలేదని ఆదిశంకరాచార్యులవారు తమ వేదసంత డిండిమః లో పై విధముగ తెలియచేస్తున్నారు.

"" నళినీదళ గతజలమతి తరళం,  తద్వత్  జీవిత  మతిశయచపలం,
విధ్ది, వ్యాధ్యభిమానగ్రస్తం  లోకం శోకహతం  చ  సమస్తం||

గ్రామాలలోని  చెరువు లలో సరస్సు లలో తామరాకులను మనము చూస్తుంటాము. ఆ తామరాకులమీద నీరు ఎంత తరళముగ అనగా అస్థిరముగ యుంటుందో మనము గమనిస్తునే యుంటాము.ఆ తామరాకులు  నీటిలో పుట్టి  నీటిలో పెరుగుచు అనునిత్యము నీటితోనే సహచర్యము చేస్తూ ఏ పరిస్థితులలో అదే నీటితో తడపబడక నిర్మలముగ పొడిగ ఎలా యుంటుందో సాధకుడైనవాడు తాను సంసార జీవితములో పుట్టి పెరిగి మెలుగుతున్నా  ఆ సంసార విషయాలపట్ల తామరాకుపై  నీరు వలె అంటీ ముట్టనట్లుగ వ్యవహరించాలని భగవత్పాదులవారు మనలకి హితవు పలుకుతున్నారు. కారణము ఈ సంసార బంధాలు తామరాకుపై నీరు వలె అస్థిరాలు, క్షణికాలు మరియు అశాశ్వతాలు. ఓ దుర్మతీ!   ఈ దుఃఖమయ  జీవితాలపట్ల  నీకెందుకురా  ఇంత ఆరాటము. నీవు ఎవరికోసము రకారకాలైన అన్యాయాలు చేస్తు డబ్బు సంపాదిస్తున్నావో  నీకు  వారికి యున్న సంబంధము ఎలాంటిదో గ్రహించగలవా ?  గ్రహించలేవు కారణము జీవాత్మ పరమాత్మల  వ్యత్యాసం నీవు గమనించలేవు.జీవాత్మ పరమాత్మనుండి  విడివడి కొంతకాలము సంసార బంధాలలో తేలియాడి జ్ఞాన సముపార్జనతో తుదకు తామరాకుపై  నీటి వలే అస్థిరత్వము చెందుచు  తాను పరమాత్మలో లీనమయిపోతుంది. అలాగే సాధకుడు ఈ సంసార మనే ఊబి నుండి విడివడి గమ్యమనే మోక్షాన్ని చేరాలి.దానికి కారణము నీ సంసార బంధాలే. నీకు  నీ సంసారానికి యున్న సంబంధమేమిటో చెపుతా విను  అంటూ భగవత్పాదులవారు,

"" యావత్  విత్తోపార్జన శక్తః  తావన్నిజ పరివారోరక్తః,
పశ్చాత్  జీవతి, జర్జరదేహే, వార్తాం  కో~పి న పృచ్చతి గేహే||

స్వామి తన  భజగోవిందం  ఐదవ శ్లోకములో ఒరేయ్ సాధకా!  నీలో ఆర్జన యనే ఆసక్తి ఉన్నన్నాళ్లు నీ సంసార సభ్యులు నీ మిత్రులు మరియు నువ్వనుకునే నీ యావత్తు పరివారము నీపట్ల  ప్రేమ ఆసక్తి చూపిస్తారు.
కానీ నీవు జవసత్వాలు కోల్పోయి ముసలివాడవయినప్పుడు పైన పేర్కొన్న వారెవరూ నీ గురించి శ్రద్ద చూపించరని హితవు చెప్పుచు,
ఈ లౌకిక సంపద లన్నియు క్షణికాలు మరియు అశాశ్వతమైనవి. సంపదలు అనగా కేవలము  ఆధ్యాత్మిక సంపద మాత్రమే. కనుక నీ పరివారాల క్షణికమైన ప్రేమలు గమనించుకొని ఈ భవబంధాలనుండి విడివడి జీవాత్మ పరమాత్మలో కలిసిపోయినట్లు మోక్షమార్గం కనుగొనటానికి మార్గం కనుగొనమని  దానికోసమై  భగవత్పాదులవారు  "" నిత్యం  భజ గోవిందం భజ గోవిందం"" అని  స్మరించమని మనకి హితవు పలుకుతున్నారు.

హర హర మహాదేవ  శంభో శంకర.
.

No comments:

Post a Comment