(శంకరవిజయము )
(ఎపిసోడ్ ),
""భోధో~న్య సాధనేభ్యో హి, సాక్షా న్మోక్షస్య సాధనమ్,
పాకస్య వహ్నివత్ జ్ఞానం వినా మోక్షో న సిధ్యతి""
మానవుడు మోక్షాన్ని సాధించాలనే వెంపర్లాటలో ఎన్నో రకములైన సాధనలు చేస్తుంటాడు. కానీ ఇలా చేసే మోక్షసాధనలన్నిటిలో ""జ్ఞానసాధన"' అత్యంత ఉత్తమమైన సాధనము. అగ్నిని ప్రజ్వలింపచేయకుండగ శాకపాకములు చేయుట అసాధ్యమైనట్లు , ఈ ఉత్తమమైన జ్ఞాన సాధన లేకుండగ మోక్షము అనేది అసాధ్యమని శంకర భగవత్పాదులవారు తమ ఆత్మభోధ లో పై విధముగ ప్రవచిస్తున్నారు.
""నారీస్తనభర నాభీదేశం, దృష్ట్వా మాగా మోహావేశం,
ఏతన్మాంసవసాది వికారం, మనసి విచింతయ వారం వారం||,
శంకర భగవత్పాదులవారు తమ భజగోవిందం శ్లోకము(3) లో,
ఒరేయ్ నాయనలారా! స్త్రీల వక్షస్థల శోభలను చూస్తు వారి నాభీస్థల ప్రదర్శనల ఆకర్షణలో పడిపోయి మోహావేశాలకి గురియై అసభ్యకరములైన తృష్ణలకు గురికావద్దని హెచ్చరిస్తు ఓరి మూఢులారా! ఏ ఆకర్షణలకి గురియై వ్యామోహాలకి దాసులవుతున్నారో అవన్నియు దేవ నిర్మితమైన శరీరభాగాలే కదా! అవన్నియు ఆ శరీరములోని మాంసముతో బాటు వివిధరకములైన క్రొవ్వు పదార్థల సమ్మిళితాలని అటువంటివాటితో ఏర్పడిన స్త్రీల ఆకారాల విషయము తెలుసుకొనలేక మోహావేశాలకి గురియై సత్యాన్ని గ్రహించలేక పోతున్నారని హెచ్చరిస్తు ఆ సత్యాన్ని మాటిమాటికి గుర్తుతెచ్చుకొని చరించమని భోధిస్తున్నారు.
చాలా మంది ఈ శంకరులు స్త్రీల అవయవాలను పేర్కొంటు సాధకులను స్త్రీలను వేరుచేసే ప్రయత్నములో స్త్రీలను కించపరుస్తున్న విధానము తప్పనే భ్రమలో వాదిస్తున్నారు.వ్యామోహ విషయములో స్త్రీ పురుష భేధము లేదు.ఇద్దరు పరస్పరముగ మోహావేశాలకి గురియవటములో సమానమే. కానీ స్త్రీ తన సహజమైన సహనగుణము వల్ల తాను ఇటివంటి విషయాలలో త్వరగా బయటపడదు.పురుషుడు మాత్రము అహంభావ,ఆవేశాలతోకూడి నిగ్రహము కోల్పోయి తన మోహావేశాన్ని అసందర్భముగ బహిర్గతం చేస్తాడు కనుక పురుషులకు హెచ్చరికలు అవసరమని ఆ రీతిగ స్వామి ఈ శ్లోకాన్ని స్త్రీల పరంగ మన ముందుంచారని విజ్ఞతతో గ్రహించాలి.
భగవత్పాదులవారు తమ రెండవ శ్లోకములో ధనాగమతృష్ణ ను గురించి హెచ్చరించి , స్వామి ఇక్కడ స్త్రీ వ్యామోహమునకు పురుషులు గురికావద్దని హెచ్చరించటానికి కారణము ఈ కామినీ కాంచనాల కోసమే సాధకులు ఇంద్రియాల సంఘర్షణలో జీవిత లక్ష్యాలు మరిచి రాజ్యాలు కోల్పోయి రక్షణ కోల్పోయి భ్రష్టత్వము చెందిన ఉదాహరణలు అనేకములుగ చరిత్రలో కనబడుతున్న విషయాలు చరిత్రలో చర్విత చర్వణాలు.
కనుక స్వామి తమ భజగోవింద శ్లోకములో ఈ కామినీ కాంచనాల వ్యామోహాలకి దూరముగ యుంటు అను నిత్యము గోవింద నామస్మరణలో మునిగి తేలాలని "" భజ గోవిందం భజ గోవిందం"" అనే నామాన్ని ఆశ్రయించి వ్యామోహాలకి దూరముగ యుండాలని హెచ్చరిస్తున్నారు.
హర హర మహాదేవ శంభో శంకర.
No comments:
Post a Comment