Saturday, January 11, 2025

****రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే...

 *_🔱🔥👍🧭⚖️👏⏰👑⚜️_*
 
*_"రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే..."_*

*_👉🏼నోరు, అన్నవాహిక, ఉదరం లేదా జీర్ణకోసం, చిన్న పేగు, పెద్ద పేగు.. జీర్ణ వ్యవస్థలోని ముఖ్య భాగాలు. వీటన్నిటిని కలిపి ఆంగ్లంలో "గట్" అంటారు._*

*_👉🏼 మన జీర్ణ వ్యవస్థలో మేలుచేసే బాక్టీరియా, వైరస్, ఫంగస్ క్రిములుంటాయి._*

*_👉🏼 తక్కువంటే కోటి కోట్ల బాక్టీరియాలు: మొత్తం కోటి కోట్ల బాక్టీరియాలు.. మన గట్ లో ఉంటాయి._* 

*_వీటి మొత్తం బరువు ఎంతో తెలుసా? సుమారుగా రెండు కిలోలు._* 

*_అవునండీ.. మీ జీర్ణ వ్యవస్థలో రెండు కిలోల దాకా బాక్టీరియాలు ఉన్నాయి._*

*_వైరస్లు..  పరిమాణంలో బాక్టీరియాల కంటే చిన్నవి. మన శరీరంలో బాక్టీరియాల లాగే కోట్ల సంఖ్యలో వైరస్లు ఉంటాయి. ఫంగస్ జాతి మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటాయి._*

*_✅ “గట్ హెల్త్" అనేది ఆధునిక ప్రపంచంలో అతి ముఖ్యమయిన అంశం అయిపోయింది._*

*_👉🏼 మనిషి అడవిలో పుట్టాడు. పట్టణవాసం మొదలయ్యేదాకా...  అంటే నిన్న మొన్నటి దాక ప్రకృతి ఒడిలో జీవనం సాగించాడు. ప్రకృతి అందించిన సహజ ఆహారాన్ని తీసుకొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో పెద్దగా ప్రయత్నం చేయకుండానే "గట్ హెల్త్" సాధ్యపడింది._* 

*_❌ ఆధునిక జీవనం ఈ మొత్తం పరిస్థితిని తలకిందులు చేసేసింది._*

*_"గట్ హెల్త్" అంటే ?‼️_*

*_మన జీర్ణ వ్యవస్థలో ఉన్న సూక్ష్మ జీవులు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. "జియో ఔర్ జీనే దో"..._*

*_1. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే ఈ సూక్ష్మ జీవులు అవసరం. ఆహారం చిన్న భాగాలుగా విభజన, పోషకాల శోషణ, మలిన పదార్థాలు నిర్మూలన.. ఇలా మొత్తం వాతాపి జీర్ణం ప్రక్రియలో ఈ సూక్ష్మ జీవులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి లేకపోతే తిన్న తిండి అరగదు.. మూత్రం, మలం సరిగా బయటకు పోదు._* 

*_2. ప్రతి మనిషికి ఇమ్మ్యూనిటి వ్యవస్థ ఉంటుంది. ఇమ్మ్యూనిటి వ్యవస్థ అంటే మన శరీరంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్._*

*_3. త్రివిధ దళాలు దేశానికి ఎలా రక్షణ కల్పిస్తాయో అలా మన శరీరానికి ఇమ్మ్యూనిటి కణాలు రక్షణ కల్పిస్తాయి. శత్రువులు అంటే హాని చేసే సూక్ష్మ జీవులను చంపేస్తాయి. ఈ ఇమ్యూన్ కణాలు ఎక్కువగా గట్ లో ఉంటాయి. గట్ ఆరోగ్యంగా లేకపోతే ఇమ్మ్యూనిటి బలహీన పడుతుంది._*

*_ఇప్పుడు మీకో డౌట్ రావాలి._*
*_గట్ లో కోట్ల సంఖ్యలో సూక్ష్మ జీవులుంటాయి కదా? అక్కడే ఇమ్యూన్ సెల్స్ కూడా ఉంటాయి. ఈ ఇమ్యూన్ సెల్స్ మంచి చేసే  బాక్టీరియా, వైరస్, ఫంగస్ ను చంపేయవా?_*

*_బ్రహ్మానందం భాషలో చెప్పాలంటే "అదే మేజిక్"._*
*_మన దేహంలోని ఇమ్యూన్ సెల్స్ కు చాలా విచక్షణా జ్ఞానం  ఉంటుంది. శత్రువులెవరో మిత్రులెవరో వాటికి తెలుసు. దీని వెనుక పెద్ద సైంటిఫిక్ ప్రక్రియ ఉంది. టూల్ లైక్ రిసెప్టార్స్. ఈజీయే ఆంటీబాడీస్, గ్గాల్ట్.. ఈ ప్రక్రియ మొత్తం వివరించాలనంటే ఒక ప్రత్యేక  పోస్ట్ పెట్టాల్సిందే._* 

*_4. మన గట్...  అదేనండి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే శరీరంలో వాపు ఏర్పడదు. ఇది అనారోగ్యానికి గురైతే ఒంట్లో వివిధ భాగాల్లో వాపు వస్తుంది._*

*_5.జీర్ణ వ్యవస్థకు, మెంటల్ హెల్త్ కు అవినాభావ సంబంధం ఉంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మూడ్ బాగుంటుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా లేకపోతే మానసిక కుంగుబాటు, వ్యాకులత తప్పదు._*

*_6. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా లేకపోతే ఊబకాయం, చక్కర వ్యాధి, హృద్రోగం, ఆటో ఇమ్యూన్ డిసార్డర్, ఎలర్జీ, కే విటమిన్, బి విటమిన్ లోపం, అల్సర్, ఇర్రిటబిల్ బోవెల్ సిండ్రోమ్ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శరీరం రోగాల పుట్టగా మారిపోతుంది._*

*_గట్ హెల్త్ ను కాపాడుకోవాలంటే.. :_*

*_1. జంక్ ఫుడ్ అంటే... డబ్బాల్లో, ప్యాకెట్లలో, సీసాల్లో వచ్చే కృత్రిమ ఆహారానికి, మైదాకు దూరంగా ఉండండి. సహజ ఆహారం అంటే కాయగూరలు, పళ్ళు లాంటివి తీసుకోండి. తెల్లనం కంటే ముడి బియ్యం, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు ఊదాలు లాంటివి ఎన్నో రెట్లు ఉత్తమం._*

*_2. పెరుగు {మరీ పుల్లగా కాదు కానీ కాస్త పుల్లగా ఉండాలి} అంబలి, చద్దన్నం లాంటివి కనీసం అప్పుడప్పుడు తీసుకోండి. ఇలాంటి పులియబెట్టిన ఆహార పదార్థాలు మన శరీరంలోని మంచి చేసే సూక్ష్మ జీవులు స్థిరంగా ఉండేలా చేస్తాయి._*

*_3. పురుషులు నాలుగు లీటర్లు, స్త్రీలు మూడు లీటర్ల నీరు ప్రతి రోజు తాగాలి. అన్నం తింటున్నప్పుడు నీరు తాగడం మంచిది కాదు. భోజనానికి అర గంట ముందు, భోజనం అయ్యాక గంట తరువాత నీరు తాగండి._*

*_4 .స్ట్రెస్.. అంటే మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి._**

*_5. బాగా నిద్ర పోండి._*

*_6. మరీ అవసరం అయితే తప్ప అంటి బయోటిక్స్ వాడొద్దు._*

*_7. అతి శుభ్రత పాటించొద్దు. కాస్త మరక మంచిదే._*

8. *_పిల్లలని గడ్డిలో, బంక మట్టిలో, ఇసుకలో అప్పుడప్పుడు ఆడుకొనేలా అలవాటు చెయ్యండి._**

*_మన శరీరంలోని ఇమ్మ్యూనిటి కణాలకు ఏది మంచి, ఏది చెడు తెలుసుకొనే విచక్షణా జ్ఞానం ఉంది._*
 
*_‼️ ఔషధాలు లేని జీవితం‼️_*

*_1.త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం._*

*_2.ఓం జపించడం ఔషధం._*

*_3.యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం._*

*_4.ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం._*

*_5.ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం._*

*_6. సూర్యకాంతి కూడా ఒక ఔషధం._*

*_7. కుండ నీరు తాగడం కూడా ఔషధమే._*

*_8.చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే._*

*_9. ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే._*

*_10.ఆహారంలాగే, నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం._*

*_11. ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం._*

*_12. సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం._*

*_13.కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం._*

*_14.నవ్వు మరియు జోకులు ఔషధం._*

*_15.సంతృప్తి కూడా ఔషధం._*

*_16.మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం._*

*_17.నిజాయితీ మరియు సానుకూలత ఔషధం._*

*_18.నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం._*

*_19.అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే._*

*_20. ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం._*

*_21. అందరితో కలిసి జీవించడం ఔషధం._*

*_22. తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే._*

*_23. మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్._*

*_24. సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి, ఇది కూడా ఔషధం._*

*_25. ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే._*

*_26.చివరగా...  ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం._*

*_🪷 ప్రకృతి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఔషధం._*

*_*ఈ  ఔషధాలు అన్ని మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి._*

No comments:

Post a Comment